సినీ నటి From Wikipedia, the free encyclopedia
కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.[3][4][5]
కాజల్ అగర్వాల్ | |
---|---|
జననం | కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19[1] |
వృత్తి | మోడల్, నటీమణి |
క్రియాశీల సంవత్సరాలు | 2005-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | గౌతమ్ కిచ్లు (30 అక్టోబరు 2020) |
ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్, అల్లు అర్జున్తో ఆర్య-2 లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటించింది.
కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లాడింది. వీరికి 2022 ఏప్రిల్ 19న మగబిడ్డ కలిగాడు.[6]
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాష | గమనికలు | |
---|---|---|---|---|---|
2004 | క్యూ....హో గయా నా | దియా స్నేహితురాలు | హిందీ | ||
2007 | లక్ష్మీ కళ్యాణం | లక్ష్మి | తెలుగు | ||
చందమామ | మహాలక్ష్మి | తెలుగు | |||
2008 | పౌరుడు | సంయుక్త | తెలుగు | ||
పళని | దీప్తి | తమిళ్ | భైరవ అనే పేరుతో తెలుగులో విడుదలైంది | ||
ఆటాడిస్తా | సునంద | తెలుగు | |||
సరోజ | పూజ | తమిళ్ | అతిథి పాత్ర, అదే పేరుతో తెలుగులో విడుదలైంది | ||
బొమ్మలాట్టం | అనిత | తమిళ్ | |||
2009 | మొధి విళయాదు | ఈశ్వరి | తమిళ్ | బినామీ వేల కోట్లు అనే పేరుతో తెలుగులో విడుదలైంది | |
మగధీర | యువరాణి మిత్రవిందా దేవి, ఇందిర | తెలుగు | ద్విపాత్రాభినయం, పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2009) | ||
గణేష్ | దివ్య | తెలుగు | |||
ఆర్య 2 | గీత | తెలుగు | |||
2010 | ఓం శాంతి | మేఘన | తెలుగు | ||
డార్లింగ్ | నందిని | తెలుగు | పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2010) | ||
నాన్ మహాన్ అల్లా | ప్రియ | తమిళ్ | నా పేరు శివ అనే పేరుతో తెలుగులో విడుదలైంది | ||
బృందావనం | భూమి | తెలుగు | |||
2011 | మిస్టర్ పర్ఫెక్ట్ | ప్రియ | తెలుగు | పేర్కొనబడింది, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి (2011) | |
వీర | చిట్టి | తెలుగు | |||
సింగం | కావ్య | హిందీ | పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి (2011) | ||
దడ | రియా | తెలుగు | |||
2012 | బిజినెస్ మేన్ | చిత్ర | తెలుగు | ||
మాట్రాన్ | అంజలి | తమిళ్ | బ్రదర్స్ అనే పేరుతో తెలుగులో విడుదలైంది | ||
తుపాకీ | నిషా | తమిళ్ | అదే పేరుతో తెలుగులో విడుదలైంది | ||
సారొచ్చారు | సంధ్య | తెలుగు | |||
2013 | నాయక్ | మధు | తెలుగు | ||
స్పెషల్ 26 | ప్రియ | హిందీ | |||
బాద్షా | జానకి | తెలుగు | |||
ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా | చిత్ర దేవి ప్రియ | తమిళ్ | |||
2014 | జిల్లా | శాంతి | తమిళ్ | అదే పేరుతో తెలుగులో విడుదల అయ్యింది | |
ఎవడు | దీప్తి | తెలుగు | అతిథి పాత్ర | ||
గోవిందుడు అందరివాడేలే | తెలుగు | ||||
2015 | టెంపర్ | తెలుగు | |||
2016 | సర్దార్ గబ్బర్ సింగ్ | తెలుగు | |||
కావలై వెండం \ ఎంతవరకు ఈ ప్రేమ | తమిళం \ తెలుగు | ||||
2017 | ఖైదీ నెంబర్ 150 | తెలుగు | |||
నేనే రాజు నేనే మంత్రి | రాధ | తెలుగు | |||
2018 | అ! | కాళీ | తెలుగు | ||
కవచం | సంయుక్త చాగంటి | తెలుగు | |||
2021 | మోసగాళ్ళు | అను | తెలుగు | ||
2022 | హే సినామికా | పరమేశ్వరి | తమిళ్ \ తెలుగు | ||
2023 | ఘోస్టీ \ కోస్టి | ఆర్తి | తమిళ్\ తెలుగు | [7] | |
కారుంగాపియం \ కార్తీక | కార్తీక | తమిళ్ \ తెలుగు | [8] | ||
భగవంత్ కేసరి | తెలుగు | నిర్మాణంలో ఉంది | [9] | ||
2024 | ఇండియన్ 2 | తమిళ్ | నిర్మాణంలో ఉంది | [10] | |
ఉమా | హిందీ | నిర్మాణంలో ఉంది | [11] | ||
సత్యభామ | ఏసిపి సత్యభామ | తెలుగు | నిర్మాణంలో ఉంది | ||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.