తెలుగు సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
రామ్ పోతినేని, తెలుగు సినిమా నటుడు.
రామ్ | |
---|---|
![]() రామ్ పోతినేని | |
జననం | పోతినేని రామ్ మే 15, 1987[1] |
ఇతర పేర్లు | రామ్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 నుండి ఇప్పటివరకు |
రామ్ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాదులో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు.[2]
నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[3] రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.[4]
2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి బి.గోపాల్ దర్శకత్వంలో మస్కా. ఇందులో హన్సికా మోట్వాని, షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో గణేష్. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.
2012 లో రామ్ ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే...ప్రేమంట! చిత్రంలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ పరాజయంగా నిలిచింది కానీ రామ్ మరియూ తమన్నాల నటనకు భారీ ఎత్తున ప్రశంసలు అందాయి.[5] 2013 లో రామ్ భాస్కర్ దర్శకత్వంలో ఒంగోలు గిత్త చిత్రంలో నటించాడు. ఇందులో కృతి కర్బంధ కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తరువాత రామ్ కె. విజయభాస్కర్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి హిందీ చిత్రం బోల్ బచ్చన్ తెలుగు పునః నిర్మాణం అయిన మసాలా లో నటించాడు. అది కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.2015 లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కో చిత్తం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరం శివమ్ అనే సినిమా తో భారీ ప్లాప్ అందుకున్నాడు.2016 లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజ సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా లో రామ్ నటన కి మంచి మార్కులు పడ్డాయి. మళ్ళీ అదే సంవత్సరం హైపర్ అనే సినిమా తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017 లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగి అనే సినిమా లో నటించాడు అది కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో హలొ గురు ప్రేమ కోసమే చిత్రంలో నటిస్తున్నాడు.[6]
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయిక | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
2006 | దేవదాసు | దేవదాస్ | ఇలియానా | విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు |
2007 | జగడం | శీను | ఇషా సహాని | |
2008 | రెడీ | చందు | జెనీలియా | పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు |
2009 | మస్కా | క్రిష్ | హన్సికా షీలా | |
2009 | గణేష్ | గణేష్ | కాజల్ అగర్వాల్ | |
2010 | రామ రామ కృష్ణ కృష్ణ | రామ కృష్ణ | ప్రియ ఆనంద్ బిందు మాధవి | |
2011 | కందిరీగ | శీను | హన్సిక అక్షా పార్ధసాని | పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు |
2012 | ఎందుకంటే...ప్రేమంట! | కృష్ణ రామ్ | తమన్నా | |
2013 | ఒంగోలు గిత్త | వైట్ | కృతి కర్బంద | |
2013 | మసాలా | రామ్ / రహ్మాన్ | షాజన్ పదాంసీ | |
2015 | పండగ చేస్కో | కార్తీక్ | రకుల్ ప్రీత్ సింగ్ | |
2015 | శివం | రాశి ఖన్నా | ||
2016 | నేను శైలజ | హరి | కీర్తి సురేష్ | |
2016 | హైపర్ | సూర్య | రాశి ఖన్నా | |
2017 | ఉన్నది ఒకటే జిందగీ | అభిరామ్ | అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి | |
2018 | హలో గురు ప్రేమకోసమే | అనుపమ పరమేశ్వరన్ | ||
2019 | ఇస్మార్ట్ శంకర్[7] | శంకర్ | ||
2021 | రెడ్ | సిద్ధార్థ \ ఆదిత్య | ||
రొమాంటిక్ | రామ్ | అతిధి పాత్రల్లో | ||
2022 | ది వారియర్ | సత్య ఐ.పి.ఎస్ | ||
2023 | స్కంద | భాస్కర్ రాజు & స్కంద | శ్రీలీల, సాయి మంజ్రేకర్ | ద్విపాత్రాభినయం |
2024 | డబుల్ ఇస్మార్ట్ | ఉస్తాద్ "ఇస్మార్ట్" శంకర్ / అరుణ్ | కావ్య థాపర్ | |
Seamless Wikipedia browsing. On steroids.