బిందు మాధవి

సినీ నటి, మోడల్ From Wikipedia, the free encyclopedia

బిందు మాధవి

బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి.[1] ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది. బిందు మాధవి 2022లో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో మొదటి సీజన్‌లో విజేతగా నిలిచింది.[2]

త్వరిత వాస్తవాలు బిందు మాధవి, జననం ...
బిందు మాధవి
Thumb
జననం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
మూసివేయి

వ్యక్తిగత జీవితం

బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లె లో జన్మించింది.[3] ఆమె తండ్రి వ్యాపార పన్నుల విభాగంలో ఉప కమీషనరుగా పనిచేసేవాడు. ఉద్యోగ రీత్యా ఆయన తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు[3] లాంటి ప్రాంతాలకు మారి చివరకు చెన్నైలో స్థిరపడ్డాడు. ఆమె చదువు అక్కడే సాగింది.[4] ఆమె 2005 లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

కెరీర్

ఆమె కళాశాలలో ఉన్నపుడే శరవణ స్టోర్స్ తరపున కొన్ని ప్రకటనలలో మోడల్ గా నటించింది. ఆమెకు సినిమాల్లో నటించాలని ఉండేది కానీ ఆమె తల్లిండ్రులు మొదట్లో అందుకు అంగీకరించలేదు. ఆమె తండ్రి ఏకంగా 8 నెలలపాటు మాట్లాడ్డం మానేశాడు. తల్లి కూడా అయిష్టంగానే ఉంది. చెన్నైలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన వెంకట్ రాం ఆమెకు ఫోటో షూట్ జరిపి ఆల్బం తయారు చేసి ఇచ్చాడు. బిందు మాధవి ఇప్పటికీ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటుంది.

ఆమె అలాగే మోడలింగ్ కొనసాగిస్తూ టీవీలో ప్రకటనల్లో నటించసాగింది. టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.[3][5] అదే సమయంలో దర్శకుడు చేరన్ పొక్కిషమ్ అనే సినిమాలో ఓ సహాయ పాత్రను ఇచ్చాడు. 2009లో ఆమె నటించిన మరో చిత్రం దర్శకుడుపూరి జగన్నాధ్ నిర్మాతగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ అనే సినిమా. 2010లో ఓం శాంతి అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం దిల్ రాజు నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో రాం సరసన నటించింది. తరువాత గౌతం మేనన్ శిష్యురాలైన అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో [5]వచ్చిన వప్పం అనే తమిళ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించింది.[6]

ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడంతో తన దృష్టి అక్కడనే కేంద్రీకరించింది.[7] తమిళంలో ఆమె తరువాతి చిత్రం 2012లో విడుదలైన కళుగు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.[8]

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2008ఆవకాయ్ బిర్యానీలక్ష్మి జంధ్యాలతెలుగు
2009పొక్కిషంఅంజలితమిళం
బంపర్ ఆఫర్ఐశ్వర్యతెలుగు
2010ఓం శాంతినూరితెలుగు
రామ రామ కృష్ణ కృష్ణనందుతెలుగు
ప్రతి రోజుభానుతెలుగు
2011వెప్పంవిజ్జితమిళం
పిల్ల జమీందార్అమృతతెలుగు
2012కళుగుకవితతమిళం
సట్టం ఒరు ఇరుత్తరైదియాతమిళం
2013కేడీ బిల్లా కిల్లాడి రంగామిత్ర మీనలోచనితమిళం
దేశింగు రాజాతామరైతమిళం
వరుదపడద వలిబర్ సంగంకల్యాణితమిళం
2014ఒరు కన్నియుం మూణు కలవాణియుంమలర్తమిళం
2015తమిళుకు ఎన్ ఒండ్రై అలుదవంసిమితమిళం
సవాలే సమాలిదివ్యతమిళం
పసంగ 2 \ మేమువిద్యా అఖిల్తమిళం \ తెలుగు
2016జాక్సన్ దురైవిజ్జితమిళం
మూసివేయి

వెబ్ సిరీస్

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.