Remove ads
2011 సినిమా From Wikipedia, the free encyclopedia
పిల్లజమీందార్ జి. అశోక్ దర్శకత్వంలో 2011 అక్టోబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. నాని, హరిప్రియ ఇందులో ప్రధాన పాత్రధారులు. 2006 లో వచ్చిన కొరియన్ సినిమా ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్ ఈ చిత్రానికి ప్రేరణ.[1][2] ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీతం అందించాడు. సాయి శ్రీరాం కెమెరా బాధ్యతలు నిర్వర్తించగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నిర్వహించాడు.
పిల్ల జమీందార్ | |
---|---|
దర్శకత్వం | జి. అశోక్ |
నిర్మాత | డి. ఎస్. రావు |
తారాగణం | నాని హరిప్రియ బిందు మాధవి రావు రమేష్ ఎమ్.ఎస్.నారాయణ తాగుబోతు రమేశ్ వెన్నెల కిశోర్ అవసరాల శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సెల్వగణేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శైలేంద్ర సినిమాస్ |
విడుదల తేదీ | 14 అక్టోబర్ 2011 |
సినిమా నిడివి | 147 ని. |
భాష | తెలుగు |
ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీజే (నాని) ఒక జమీందారు వంశానికి చెందిన వాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతే తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. గారాబం వల్ల ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తుంటాడు. కొంత కాలానికి తాతయ్య చనిపోతూ ఒక వీలునామా రాసి తన లాయర్ శరత్ చంద్ర (డా. శివప్రసాద్) కు ఇచ్చి చనిపోతాడు. ఆ వీలునామా ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన తరువాతనే అతని తాతయ్య ఆస్తి అతనికి దక్కుతుంది. అది కూడా సిటీలో కళాశాలలో కాకుండా ఎక్కడో దూరంగా సౌకర్యాలు సరిగా లేని సిరిపురం అనే ఊర్లోని ప్రభుత్వ కళాశాలలో మాత్రమే పూర్తి చేయాలని షరతులు విధిస్తాడు.
ఆస్తి మీద ఆశతో అయిష్టంగా ఆ కళాశాలలో చేరడానికి వెళతాడు పీజే. లాయర్ శరచ్చంద్ర సలహా మేరకు అక్కడ కళాశాల ప్రిన్సిపల్ రాజన్న (రావు రమేష్) ని కలుసుకుంటాడు. రాజన్న మంచి క్రమశిక్షణ గల మనిషి. అక్కడ హాస్టల్ కి వార్డెన్ కూడా ఆయనే. ఆయన పెట్టే షరతులేమీ పీజేకు రుచించవు. అయినా సరే అక్కడి స్నేహితుల (అవసరాల శ్రీనివాస్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు) సాయంతో ఎలాగోలా పరీక్ష పాసవుతాడు. కానీ అక్కడ డిగ్రీ చదివే మూడేళ్ళలో కనీసం ఒక్క సంవత్సరం అయినా విద్యార్థి నాయకుడిగా ఎన్నికవ్వాలనీ, లేకపోతే తన ఆస్తి తనకు దక్కదని లాయర్ తెలియజేస్తాడు. ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని విద్యార్థులను ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిస్తాడు. కానీ ఆ విషయం రాజన్నకు తెలిసి అక్కడ నుంచి వెలి వేస్తాడు. కానీ వెళ్ళిపోయే ముందు పీజే తల్లిదండ్రులను గురించి, వాళ్ళతో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి తెలియజేస్తాడు.
ఆయన మాటలతో పీజేలో మార్పు వస్తుంది. స్నేహితుల సాయంతో గ్రామంలో వారందరినీ ఆకట్టుకోవడానికి రకరకాల సామాజిక కార్యక్రమాలు చేపడతాడు. అందరి అభిమానాన్ని చూరగొని విద్యార్థి యూనియన్ నాయకుడవుతాడు. చివరికి తన ప్రాణ స్నేహితుడికి సాయం చేయడానికి ఆస్తి మొత్తం వదులుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు శరశ్చంద్ర వచ్చి తనలో మార్పు తీసుకురావడానికి అతని తాతయ్య తనతో ఆ నాటకం ఆడించాడని తెలుసుకుంటాడు.
ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో పాత తెలుగు సినిమా అప్పుచేసి పప్పు కూడు సినిమాలోని అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారు.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తలబడి" | కృష్ణ చైతన్య | శంకర్ మహదేవన్ | 4:56 |
2. | "చుట్టు చుట్టు" | కృష్ణ చైతన్య | సైంధవి, ప్రసన్న | 4:16 |
3. | "ఊపిరి" | కృష్ణ చైతన్య | కార్తీక్, చిన్మయి | 4:40 |
4. | "రంగు రంగు" | కృష్ణ చైతన్య | ముకేష్, ప్రియ హిమేష్ | 4:38 |
5. | "పి. జె. క్లబ్ మిక్స్" | కృష్ణ చైతన్య | రంజిత్, ప్రియ హిమేష్ | 4:34 |
6. | "హయ్యయ్యో" | శ్రీమణి | సోలార్ సాయి | 3:40 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.