ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన పట్టణం.
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పట్టణం | |
Coordinates: 13.55°N 78.5°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య జిల్లా |
మండలం | మదనపల్లె మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 14.20 కి.మీ2 (5.48 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 1,80,180 |
• జనసాంద్రత | 13,000/కి.మీ2 (33,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 987 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8571 ) |
పిన్(PIN) | 517325 |
Website |
మదనపల్లె చరిత్ర సా.శ. 907 వరకూ తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యపు భాగంగా తెలుస్తోంది. ఈ పట్టణంలో గల సిపాయి వీధి (సిపాయి గలీ), కోట గడ్డ (ఖిలా), అగడ్త వీధి (కందక్ గలీ),, పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానొకప్పుడు ప్రముఖ రాజులు పరిపాలించినట్లు తెలుస్తోంది.
మదనపల్లె ఒకప్పుడు విజయనగర పాలేగార్లయిన బసన్న, మాదెన్న లచే పాలింపబడినట్లు తెలుస్తోంది. వీరి పేర్ల మీద ఇక్కడ రెండు కొండలున్నాయి, ఒకటి మాదెన్న కొండ, రెండవది బసన్న కొండ. బహుశా మాదెన్న పేరుమీదే ఈ పట్టణానికి మదనపల్లె పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో కథనం ప్రకారం, ఈ పట్టణానికి మర్యాదరామన్న పురం అనే పేరు ఉండేదని, రాను రాను అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లుగా చెబుతారు. అలాగే ఒకానొకప్పుడు అరేబియాలోని మదీనా నగరం నుండి కొందరు ధార్మిక వేత్తలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వారి పేరున మదీనావారి పల్లె అనే పేరు ఉండేదని, తరువాత రూపాంతరం చెంది అది మదనపల్లెగా స్థిరపడిందని చెబుతారు.
907 – 955, మధ్యన యాదవనాయకులు, హొయసలులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఈ పట్టణం వారి ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1565 లో గోల్కొండ నవాబు ఆధీనంలో వెళ్ళింది. 1713లో కడప నవాబైన అబ్దుల్ నబి ఖాన్ మదనపల్లెని తన ఆధీనంలో తీసుకున్నాడు. ఆ తరువాతి కాలంలో ఇది బ్రిటిష్ వారి ఆధీనంలో వెళ్ళింది. సబ్-కలెక్టర్ బంగళా, కోర్టు, మొదలగు కట్టడాలు నేటికీ కానవస్తాయి. సర్ థామస్ మన్రో కడప యొక్క మొదటి కలెక్టరు. ఇతని కాలంలో ఇక్కడ కలెక్టరు బంగళా నిర్మించారు. 1850 లో మదనపల్లె సబ్-డివిజన్ గా ఏర్పడింది. ఎఫ్.బి.మనోలె మొదటి సబ్-కలెక్టరు.
2011 నాటి[update] జనగణన ప్రకారం, పట్టణ జనాభా 1,80,180. సగటు అక్షరాస్యత 81.40%. ఇది జాతీయ సగటు అక్షరాస్యత 73.00% కంటే అధికం.[2]
మదనపల్లె వాతావరణం వేసవిలో సైతం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే దీనికి ఆంధ్ర ఊటీ, పెన్షనర్ల స్వర్గం అని కూడా ప్రసిధ్ధి.
శీతోష్ణస్థితి డేటా - మదనపల్లె | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27.3 (81.1) |
30.2 (86.4) |
33.4 (92.1) |
34.9 (94.8) |
35 (95) |
32.1 (89.8) |
30.2 (86.4) |
30.1 (86.2) |
29.9 (85.8) |
28.6 (83.5) |
26.8 (80.2) |
25.7 (78.3) |
30.4 (86.6) |
సగటు అల్ప °C (°F) | 15.5 (59.9) |
16.8 (62.2) |
19.4 (66.9) |
22.2 (72.0) |
23.6 (74.5) |
22.8 (73.0) |
21.8 (71.2) |
21.8 (71.2) |
21.2 (70.2) |
20.2 (68.4) |
17.8 (64.0) |
15.6 (60.1) |
19.9 (67.8) |
సగటు అవపాతం mm (inches) | 4 (0.2) |
2 (0.1) |
3 (0.1) |
28 (1.1) |
61 (2.4) |
51 (2.0) |
81 (3.2) |
73 (2.9) |
111 (4.4) |
143 (5.6) |
54 (2.1) |
32 (1.3) |
643 (25.4) |
[ఆధారం చూపాలి] |
మదనపల్లి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
మేరీ లాట్ లైలెస్ హాస్పిటల్ (MLL Hospital, గోషా ఆసుపత్రి, గోషా హస్పతాల్ ), ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖమైనవి.
ముఖ్యంగా, టమోటా, వేరుశెనగ, వరి, మామిడి,, కూరగాయలు పండిస్తారు. నీరుగట్టువారిపల్లెలో వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డు ఉంది.
మదనపల్లె మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి వ్యాపార రంగ పట్టుగొమ్మ. ఈ మార్కెట్ యార్డ్లో టమోటా, మామిడి, సీతాఫలం, కూరగాయలు వ్యాపార వస్తువులు. దేశంలోని అనేక ప్రాంతాల వారు, టమోటా, మామిడి, సీతాఫలం, చింతకాయ కోనుగోలుకొరకు ఇచ్చటకు వస్తారు. గొర్రెల మార్కెట్ మదనపల్లె సమీపంలోని అంగళ్లులో ప్రతి శనివారం జరుగుతుంది. మదనపల్లెలో సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. పట్టణవాసులకు వారానికి కావలసిన కూరగాయలు ఈసంతే సమకూరుస్తుంది. అలాగే పట్టు పరిశ్రమలో తయారయ్యే ముడి పట్టు, పట్టు బట్టలు, నాణ్యతగల చీరల కోనుగోలు కొరకు ఇతరరాష్ట్రాల వ్యాపారస్తులు తరచుగా రావడం పరిపాటి.
35 ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారథి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరుకు చెందిన నెప్జా నాటక కళాపరిషత్, ప్రొద్దుటూరుకు చెందిన రాయల నాటక కళాపరిషత్ అనంతపురముకు చెందిన పరిత కళాపరిషత్, చిత్తూరుకు చెందిన ఆర్ట్స్ లవర్ అసోసియేషన్ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్టి హై స్కూల్లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
22 సంవత్సరాల క్రిందట అంజుమన్ తరఖి ఉర్దూ శాఖ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గులాందస్తగీర్, సయ్యద్ అబ్దుల్ అజీం, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖాదర్ హుసేన్ లు కీలక పాత్ర పోషించారు. ఖమర్ అమీనీ, జవాహర్ హుసేన్, అడ్వకేట్ నజీర్ అహ్మద్, షరాఫత్ అలీ ఖాన్, అడ్వకేట్ సికందర్ అలీ ఖాన్, హాజీ ముహమ్మద్ ఖాన్, ఖాజీ ముహమ్మద్ షాకిరుల్లా, మహమ్మద్ అక్రాలు తమవంతూ కృషి చేశారు. ఉర్దూ భాషాభి వృధ్ధికి, సాహిత్యపోషణకు ఎన్నో పోటీలను వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ముషాయిరాలు (కవిసమ్మేళనాలు), సెమినార్లు నిర్వహించారు. మదనపల్లెలో ముషాయిరాల సాంప్రదాయం సయ్యద్ అబ్దుల్ అజీం, గులాం దస్తగీర్ ఆధ్వర్యంలో ప్రారంభమయినాయి. నిసార్ అహ్మద్ సయ్యద్, ఖమీర్ అమీనీ ల ఆధ్వర్యంలో జీవంపోసుకున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.