ఆటాడిస్తా
రవికుమార్ చౌదరి దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఆటాడిస్తా 2008, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పతాకంపై సి.కళ్యాణ్, ఎస్. విజయానంద్ నిర్మాణ సారథ్యంలో రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, కాజల్ అగర్వాల్, జయసుధ, నాగబాబు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[2][3] ఇది నటుడు రఘువరన్ చివరి సినిమా. 2013లో డేరింగ్ గుండారాజ్ పేరుతో హిందీలోకి అనువాదం చేయబడింది.
Remove ads
కథా నేపథ్యం
జగన్ 'చిన్న' (నితిన్) పారిశ్రామికవేత్త లయన్ రాజేంద్ర కుమారుడు. సునంద (కాజల్ అగర్వాల్) తో ప్రేమలో పడతాడు. రాజేంద్ర ప్రత్యర్థి రఘునాథ్ వీరితో భాగస్వామ్యంలోకి రావాలనుకుంటాడు. జగన్ కు తెలియకుండా, అతని వివాహం రఘునాథ్ కుమార్తెతో నిశ్చయమవగా, ఆమె సునంద అని తెలుస్తుంది. కాని వాళ్ళ పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత కుటుంబాలు అంతగా బాగాలేవు. అపఖ్యాతి పాలైన ఎమ్మెల్యే బోనాల శంకర్ కు చెందిన పొగాకు వ్యాపారాలను రఘునాథ్ చూసుకుంటుంటాడు. తన ప్రాంతంలో పొగాకు బిజినెస్ పెట్టేందుకే రాజేంద్ర ఇష్టపడకపోవడంతో బోనాల శంకర్ వెళ్ళి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను బెదిరిస్తాడు. దాంతో జగన్ ఆ అవినీతి రాజకీయ నాయకుడిని ఎదుర్కోని, అతడి ఆట కట్టిస్తాడు. జగన్ శంకర్ ను కొట్టాడని పుకారు వస్తుంది.
Remove ads
నటవర్గం
- నితిన్ (జగన్ "చిన్నా")
- కాజల్ అగర్వాల్ (సునంద)
- రఘువరన్
- నాగబాబు (లయన్ రాజేంద్ర)
- జయసుధ
- జయలలిత
- నర్సింగ్ యాదవ్
- రవి ప్రకాష్
- తమ్మారెడ్డి చలపతిరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- నారమల్లి శివప్రసాద్
- అమిత్
- వేణుమాధవ్
- ముమైత్ ఖాన్
సాంకేతికవర్గం
- రచన, దర్శకత్వం: రవికుమార్ చౌదరి
- నిర్మాత: సి. కళ్యాణ్, ఎస్. విజయానంద్
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి
- కూర్పు: బస్వా పైడిరెడ్డి
- పాటలు: సాహితి, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి,
భాస్కరభట్ల రవికుమార్, చిర్రావూరి విజయ్ కుమార్ - పబ్లిసిటి డిజైనర్: ధని ఏలె
- డ్యాన్స్: శంకర్, అశోక్ రాజ్, ప్రేమ్ రక్షిత్
- పోరాటాలు: రామ్-లక్ష్మణ్
- నిర్మాణ సంస్థ: రేఖా కంబైన్స్
పాటలు
Remove ads
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads