From Wikipedia, the free encyclopedia
ముస్లిం ప్రపంచం లేదా ఇస్లామీయ ప్రపంచం అనగా ప్రపంచంలో నివసించే ముస్లిం సముదాయం లేదా ఉమ్మహ్.
|
ప్రపంచంలో 220 కోట్ల మంది క్రైస్తవులున్నారు.ముస్లిం జనాభా 157 కోట్లు. 232 దేశాల్లో ముస్లిమున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు ముస్లిం.లెబనాన్ కంటే జర్మనీలోనే ఎక్కువగా ముస్లింలు .సిరియాలో కంటే చైనాలోనే ఎక్కువ మంది ముస్లింలున్నారు. జోర్డాన్, లిబియా రెండు దేశాల్లో ఉన్న ముస్లింల కంటే రష్యాలోనే ఎక్కువమంది ముస్లింలు ఉన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నంతమంది ముస్లింలు ఇథియోపియాలోనూ ఉన్నారు.దీన్ని బట్టి ముస్లింలు అంటే అరబ్‌లు అనేదానికి ఇక అర్థం లేదు.మొత్తం ముస్లింలలో 60 శాతం మంది ఆసియాలోనే ఉన్నారు.మరో 20 శాతం మంది మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోనూ, 15 శాతం మంది ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోనూ, 2.4 శాతం మంది యూరప్‌లోనూ, 0.3 శాతం మంది అమెరికాలోనూ ఉన్నారు.ఆసియాలో ముస్లింలు అధికంగా ఉన్న దేశాలే ఎక్కువ.ఇస్లాం ప్రధాన మతంగాలేని దేశాల్లోనే సుమారు ఐదో వంతు ముస్లింలు (31.7 కోట్లు) ఉన్నారు.ముస్లింలను మైనారిటీలుగా పరిగణిస్తున్న ఐదు దేశాల్లోనే (భారత్‌లో 16.1 కోట్లు, ఇథియోపియాలో 2.8 కోట్లు, చైనాలో 2.2 కోట్లు, రష్యాలో 1.6 కోట్లు, టాంజానియాలో 1.3 కోట్లు) ప్రపంచ ముస్లింలలో 3/4 వ వంతుమంది ఉన్నారు.ఇండోనేషియాలో అత్యధికంగా 20.3 కోట్ల మంది ముస్లింలు ఉండగా, మూడోస్థానంలో ఉన్న భారత్‌లో 16.1 కోట్ల మంది ఉన్నారు. అయినప్పటికీ హిందూ దేశమైన భారత్‌లో వీరి జనాభా 13 శాతమే. మొత్తం ముస్లింలలో 2/3 వంతు మంది పది దేశాలలో కేంద్రీకృతమై ఉండగా, అందులో ఆరు దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. మిగిలిన మూడు ఉత్తర ఆఫ్రికాలో, ఒకటి ఆఫ్రికాలోని సబ్ సహారన్ ప్రాంతంలో ఉన్నాయి.ముస్లింలలో 10 నుంచి 13 శాతం మంది షియాలు ఉన్నారు. షియాల్లో 80 శాతం మంది నాలుగు దేశాలలో (ఇరాన్, పాకిస్థాన్, భారత్, ఇరాక్) ఉన్నారు.[2] దాదాపు 85% సున్నీ ముస్లింలు, 15% షియా ముస్లింలు.ఇస్లామీయ దేశాలు దాదాపు 50 గలవు. ముస్లింల జనాభాలో 20% వరకు అరబ్బులు గలరు. ఆసియా ఖండంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. అందులోనూ దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాలైన ఇండోనేషియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ముస్లింల జనాభా అధికంగా కానవస్తుంది. ఈ ఉదహరించిన దేశాలలో ప్రతిదేశంలోనూ 10 కోట్ల జనాభాకంటే అధికంగా ముస్లింలు కానవస్తారు.[3] అమెరికా ప్రభుత్వ 2006 లెక్కల ప్రకారం చైనాలో దాదాపు 2కోట్ల మంది ముస్లింలు గలరు.[4] మధ్య ప్రాచ్యములో అరబ్బేతర దేశాలైన టర్కీ, ఇరాన్ దేశాలు పెద్ద ముస్లింమెజారిటీ గల దేశాలు; ఆఫ్రికాలో, ఈజిప్టు, నైజీరియా దేశాలలో అధిక ముస్లిం జనాభా గలదు.[3] అనేక యూరప్ దేశాలలో క్రైస్తవం తరువాత, ఇస్లాం అతి పెద్ద రెండవ మతం.[5]
ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలో దాదాపు 55 ఇస్లామిక్ దేశాలున్నాయి. వాటి పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.
ఈ దేశాలు ప్రధానంగా సెక్యులర్ దేశాలు.
Seamless Wikipedia browsing. On steroids.