Remove ads
From Wikipedia, the free encyclopedia
గాంబియా (ఆంగ్లం : The Gambia) [3] అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ద గాంబియా", సాధారణంగా గాంబియా అని పిలువబడుతుంది. పశ్చిమ ఆఫ్రికా లోని ఒక దేశం. ప్రధాన ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం చుట్టూ ఉత్తరాన, తూర్పున, దక్షిణాన సెనెగల్ వ్యాపించి యున్నది. దేశ పశ్చిమతీరంలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దీని రాజధాని బంజుల్.[4]
రిపబ్లిక్ ఆఫ్ ది గాంబియా |
||||
---|---|---|---|---|
నినాదం "Progress, Peace, Prosperity" |
||||
జాతీయగీతం |
||||
రాజధాని | బంజుల్ 13°28′N 16°36′W | |||
అతి పెద్ద నగరం | సెర్రెకుండ | |||
ప్రజానామము | గాంబియన్ | |||
ప్రభుత్వం | రిపబ్లిక్కు | |||
- | President | Yahya A.J.J. Jammeh[1] | ||
Independence | ||||
- | from the UK | February 18 1965 | ||
- | Republic declared | April 24 1970 | ||
- | జలాలు (%) | 11.5 | ||
జనాభా | ||||
- | 2007 United Nation అంచనా | 1,700,000 (146వది) | ||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||
- | మొత్తం | $2.264 billion[2] | ||
- | తలసరి | $1,389[2] | ||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||
- | మొత్తం | $808 million[2] | ||
- | తలసరి | $495[2] | ||
జినీ? (1998) | 50.2 (high) | |||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.471 (low) (160వది) | |||
కరెన్సీ | Dalasi (GMD ) |
|||
కాలాంశం | GMT | |||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .gm | |||
కాలింగ్ కోడ్ | +220 |
గాంబియా దేశం గాంబియా నదికి ఇరువైపులా ఉంది. గాంబియా నది దేశం మద్యలో ప్రవహించి అట్లాంటికు మహాసముద్రంలోకి సంగమిస్తుంది. 2013 ఏప్రెలు గణాంకాల ఆధారంగా దేశజనసంఖ్య 18,57,181, వైశాల్యం 10,689 చదరపు కిలోమీటర్లు (4,127 చ.మై) ఉంది. బంజులు గాంబియా రాజధానిగా ఉంది. సెరెకుండా, బ్రికమా అతిపెద్ద నగరాలుగా ఉన్నాయి.
గంబియా అనేక ఇతర పశ్చిమ ఆఫ్రికా దేశాలలాగా బానిసవాణిజ్య చారిత్రక మూలాలను కలిగి ఉంది. మొదటగా పోర్చుగీసు వారు గాంబియా నదీతీరంలో ఒక కాలనీని స్థాపించడానికి ఈ ప్రాంతం కీలక అంశంగా ఉంది. పోర్చుగీసువారు ఈ ప్రాంతానికి గాంబియా అని నామకరణం చేసారు. 1765 మే 25 న [5] గాంబియా బ్రిటీషు ప్రభుత్వం అధికారికంగా నియంత్రణను తీసుకున్న తరువాత గాంబియా సామ్రాజ్యంలో భాగంగా మారింది. తరువాత బ్రిటిషు సెనెగాంబియా స్థావరాన్ని స్థాపించింది. 1965 లో గాంబియాకు " దాదా జవరా " నాయకత్వంలో స్వాతంత్ర్యం పొందింది. 1994 లో యహ్యా జమ్మే అధికారాన్ని స్వాధీనం చేసుకుని అధికారాన్ని హస్థగతం చేసుకుని దాదా జవరాను అధికారం నుండి తొలగించారు. 2016 డిసెంబరు ఎన్నికలలో జమ్మేను ఓడించిన అదామా బారో జనవరి 2017 లో గాంబియా మూడవ అధ్యక్షుడు అయ్యాడు.[6] జమ్మీ మొదట ఫలితాలను అంగీకరించి తరువాత నిరాకరించాడు. ఇది గాంబియాలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడానికి కారణం అయింది. పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సమాజం సైనిక జోక్యం ఆయన బహిష్కరణకు దారితీసింది.[7][8][9] గాంబియా ఆర్థికవ్యవస్థ వ్యవసాయం, చేపలు పట్టడం, ముఖ్యంగా, పర్యాటక రంగం మీద ఆధారితమై ఉంది. 2015 లో జనాభాలో 48.6% పేదరికంలో నివసించారు.[10] గ్రామీణ ప్రాంతాల్లో పేదప్రజలు మరింత అధికంగా ఉన్నారు. గ్రామాలలో జనాభాలో అత్యధికంగా పేదలు (దాదాపు 70%) ఉన్నారు.[10]
అరబు వర్తకులు 9-10 వ శతాబ్దాలలో గాంబియా ప్రాంతపు మొట్టమొదటి లిఖిత రూప ఆధారాలు అందించారు. 17 వ శతాబ్దంలో ముస్లిం వర్తకులు, పండితులు అనేక పశ్చిమ ఆఫ్రికా వ్యాపార కేంద్రాలలో కమ్యూనిటీలను స్థాపించారు. రెండు సమూహాలు ట్రాన్స్-సహారా వర్తక మార్గాలు స్థాపించాయి. ఈ మార్గాలు బానిసలుగా మార్చబడిన స్థానిక ప్రజలను, బంగారం, దంతాలు ఎగుమతి చేయడానికి, తయారు చేసిన వస్తువుల దిగుమతి వంటి పెద్ద వాణిజ్యానికి దారి తీసింది.
11 వ నుండి 12 వ శతాబ్దినాటికి ఉత్తరప్రాంతంలో సెనెగలు నదితీరంలో కేంద్రీకృతమై ఉన్న తాక్రూరు రాజ్యాల పాలకులు, పురాతన ఘనా, గావో ఇస్లాం మతంలోకి మారిపోయారు. అరబు భాషాప్రావీణ్యం ఉన్న వారిని రాజ్యసభలో ఉద్యోగులుగా నియమించారు.[11] 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుత గాంబియాలో చాలా భాగం మాలి సామ్రాజ్యంలో భాగంగా ఉందేది. 15 వ శతాబ్దం మధ్యకాలంలో పోర్చుగీసు అన్వేషకులు సముద్రం మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకున్న తరువాత విదేశీ వర్తకుల ఆధిపత్యం ప్రారంభం అయింది.
1588 లో పోర్చుగీసు ఆంటోనియోకు గాంబియా నదిమీద ప్రత్యేక వాణిజ్య హక్కులను ఇంగ్లీషు వ్యాపారులకు విక్రయించింది. మొదటి ఎలిజబెతు రాణి పేటెంటు లేఖలను మంజూరు చేసింది. 1618 లో ఇంగ్లాండు రాజు మొదటి జేమ్సు గాంబియా గోల్డ్ కోస్టు (ప్రస్తుతం ఘనా) తో వాణిజ్యానికి ఒక ఆంగ్ల కంపెనీకి ఒక చార్టర్ను మంజూరు చేసాడు. 1651 - 1661 మధ్యకాలంలో డచీ ఆఫ్ కోర్లాండు, సెమిగాలియా పాలనలో పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్-ఆధునిక లాట్వియా నియంత్రణలో ఉన్న గాంబియా లోని కొన్ని భాగాలు ప్రిన్సు జాకబు కెట్లర్బు చేత కొనుగోలు చేయబడ్డాయి.[12].
17 వ శతాబ్దం చివర నుండి 18 వ శతాబ్దం వరకు సెనెగలు నది, గాంబియా ప్రాంతాలలో రాజకీయ, వాణిజ్య ఆధిపత్యం కోసం బ్రిటీషు సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం నిరంతరంగా పోరాడాయి. 1758 లో సెనెగలు ఆక్రమణ తరువాత అగస్టసు కెప్పెలు నేతృత్వంలో జరిగిన ఒక దండయాత్ర ద్వారా బ్రిటిషు సామ్రాజ్యం గాంబియాను ఆక్రమించింది. 1783 లో వెర్సైల్లెసు ఒప్పందంతో గ్రేట్ బ్రిటన్ గాంబియా నదీప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచి నది అల్బ్రేడా వద్ద ఒక చిన్న ప్రదేశం నిలుపుకుంది. ఉత్తర తీరం 1856 చివరినాటికి యునైటెడు కింగ్డంకు ఇవ్వబడింది.
మూడు శతాబ్దాల కాలంలో ట్రాంసు అట్లాంటికు వాణిజ్యంలో భాగంగా ఈ ప్రాంతంలోని మూడు మిలియన్ల మంది బానిసలుగా తీసుకునివెళ్ళబడ్డారు. అట్లాంటికు బానిస వాణిజ్యం ప్రారంభమవడానికి ముందు గిరిజన యుద్ధాల కారణంగా, ముస్లిం వర్తకుల వాణిజ్యంలో ఎంతమంది బానిసలుగా మార్చబడ్డారో ఖచ్ఛితమైన వివరణ లేదు. వారిలో చాలా మంది ఇతర ఆఫ్రికన్లను ఐరోపావాసులకు విక్రయించారు. కొంతమంది గిరిజనుల అంతర్యుద్ధ ఖైదీలుగా ఉన్నారు. చెల్లించని రుణాల కారణంగా కొన్ని బాధితులను బానిసలుగా అమ్ముతారు. చాలామంది ఇతరులు అపహరణకు గురై బానిసలుగా విక్రయించబడ్డారు.[13]
18 వ శతాబ్దంలో వెస్ట్ ఇండీసు, ఉత్తర అమెరికాలో కార్మిక మార్కెట్టు విస్తరణ వరకు వ్యాపారులు మొదట ప్రజలను ఐరోపాకు పంపారు. 1807 లో యునైటెడ్ కింగ్డం దాని సామ్రాజ్యం అంతటా బానిస వాణిజ్యాన్ని రద్దు చేసింది. తరువాత గాంబియాలో బానిస వ్యాపారాన్ని అంతం చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. బానిస నౌకలను రాయలు నేవీకి చెందిన " పశ్చిమ ఆఫ్రికన్ స్క్వాడ్రన్ " చేత అడ్డగించబడిన బానిస నౌకలు గాంబియాకు తిరిగి వచ్చాయి. గాంబియా నదికి సమీపంలో ఉన్న మాకర్తి ద్వీపంలో విడువబడిన బానిసలు వారు కొత్త జీవితాలను ప్రారంభించాలని భావించారు.[14] 1816 లో బ్రిటిషు బాతుర్స్టు (ప్రస్తుతం బంజులు) ప్రాంతంలో సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
తరువాతి సంవత్సరాలలో కొన్నిమార్లు బంజులు సియర్రా లియోనిలోని బ్రిటీషు గవర్నరు-జనరలు అధికార పరిధిలో ఉంది. 1888 లో గాంబియా ఒక ప్రత్యేక కాలనీగా మారింది.
1889 లో బ్రిటిషు ఫ్రెంచి రిపబ్లికుతో ఒక ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులను స్థాపించింది. తరువాత గాంబియా బ్రిటీషు గాంబియా అని పిలిచే బ్రిటీషు క్రౌను కాలనీగా మారింది. ఇది పరిపాలనా సౌలభ్యం కొరకు కాలనీ (బంజులు చుట్టుపక్కల ప్రాంతం), సంరక్షక (పరిపాలనా ప్రాంతం) ప్రాంతాలుగా విభజించబడింది. 1901 లో గాంబియాకు దాని స్వంత ఎగ్జిక్యూటివ్ శాసన కౌన్సిలు మంజూరు చేయబడింది. ఇది క్రమంగా స్వీయ-ప్రభుత్వానికి దారితీసింది. 1906 లో బానిసత్వం నిషేధించబడింది. బ్రిటీషు వలసరాజ్య శక్తులు స్వదేశీ గాంబియన్ల మధ్య ఒక చిన్న సంఘర్షణ తరువాత బ్రిటీషు వలసరాజ్య అధికారం నిలకడగా స్థాపించబడింది.[15]
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొంతమంది సైనికులు మిత్రరాజ్యాలతో పోరాడారు. ఈ సైనికులు ఎక్కువగా బర్మాలో పోరాడినప్పటికీ కొందరు ఇంటికి చేరిన తరువాత మరణించారు. వీరికి ఫజరాలో " కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ " శ్మశానం (బంజులుకు సమీపంలో) ఉంది. బంజులులో " యు.ఎస్. ఆర్మీ ఎయిర్ ఫోర్సెసు " ఎయిర్ స్ట్రిపు ఉంది. ఇక్కడి నౌకాశ్రయంలో మిత్రరాజ్య నౌకాదళ నౌకలు నిలుపబడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రాజ్యాంగ సంస్కరణల వేగం అధికరించింది. 1962 లో సాధారణ ఎన్నికలను తరువాత సంవత్సరంలో యునైటెడు కింగ్డం పూర్తి అంతర్గత స్వీయ-పాలనను మంజూరు చేసింది.
1965 ఫిబ్రవరి 18 న కామన్వెల్తులో భాగంగా రెండవ ఎలిజబెతురాణిని గాంబియా రాణిగా అంగీకరిస్తూ రూపొందించబడిన గాంబియా రాచరిక రాజ్యానికి గవర్నరు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత కొంతకాలానికి జాతీయ ప్రభుత్వం గాంబియా రిపబ్లికుగా ప్రతిపాదిస్తూ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడంలో ఈ ప్రజాభిప్రాయసేకరణ విఫలమైంది. కాని ఫలితాలు విదేశాల పరిశీలకుల దృష్టిని విస్తృతంగా ఆకర్షించింది.[ఆధారం చూపాలి]
1970 ఏప్రెలు 24 న రెండవ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత గాంబియా కామన్వెల్తులో గణతంత్ర రాజ్యంగా మారింది. ప్రధానిగా సర్ దాదా కైరాబా జవరా అధ్యక్షుడి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
అధ్యక్షుడుగా సర్ దాదా జవరా తిరిగి ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1981 జూలై 29 న జరిగిన ఒక తిరుగుబాటు తరువాత ఆర్థికరంగం బలహీనపడి రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేయబడ్డాయి.[16] అధ్యక్షుడు జవరా లండనును సందర్శించిన సమయంలో సోషలిస్టు కుకొయి సాంబా సన్యంగు వ్యూహంలో వామపక్ష " నేషనల్ రివల్యూషనరీ కౌంసిల్ ", రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ కౌంస్లిలు, దేశ సైనికదళాలు అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు.[16]
అధ్యక్షుడు జవరా సెనెగల నుండి సైనిక సాయం కోరాడు. జూలై 31 న గాంబియాకు 400 మంది సైనికులను నియమించారు. ఆగస్టు 6 నాటికి, 2,700 సెనెగలు సైనికులు తిరుగుబాటు బలగాలను ఓడించారు.[16] తిరుగుబాటు సమయంలో, తరువాత జరిగిన హింసాకాండలో 500 - 800 మంది చంపబడ్డారు.[16] 1981 లో జరిగిన తిరుగుబాటు తరువాత 1982 లో సెనెగలు, గాంబియా సమాఖ్య ఒప్పందంలో సంతకం చేశాయి. సెనెగాంబియా కాన్ఫెడరేషన్ రెండు దేశాల సాయుధ దళాలను మిళితం చేసి వారి ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఏడు సంవత్సరాల తర్వాత 1989 లో కాంఫిడరేషను నుండి గాంబియా శాశ్వతంగా నిష్క్రమించింది.
1994 లో సాయుధ దళాల తాత్కాలిక పాలనా మండలి జవరా ప్రభుత్వాన్ని తొలగించి ప్రతిపక్ష రాజకీయ కార్యకలాపాలను నిషేధించింది. లెఫ్టినెంటు యాహ్యా ఎ.జె.జె. జమ్మీ, ఎ.ఎఫ్.పి.ఆర్.సి. చైర్మను దేశ అధిపతి అయ్యాడు. తిరుగుబాటు సమయంలో జమ్మీ వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఎ.ఎఫ్.పి.ఆర్.సి. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తిరిగి రావడానికి ప్రణాళికను ప్రకటించింది. 1996 లో ఓటర్లు నమోదు చేయడానికి, ఎన్నికలు, ప్రజాభిప్రాయ నిర్వహణకు ఇండిపెండెంట్ ఎలక్టోరల్ కమిషన్ (ఐ.ఇ.సి.) స్థాపించబడింది.
2001 చివరలో, 2002 ఆరంభంలో గాంబియా అధ్యక్ష శాసన, స్థానిక ఎన్నికల పూర్తి చక్రం పూర్తి చేసింది. విదేశీ పరిశీలకులు ఎన్నికలను స్వేచ్ఛ, న్యాయం, పారదర్శకంగా భావించినప్పటికీ, కొన్ని [లోపాలు] లోపాలు ఉన్నాయని ఉన్నారు. అధ్యక్షుడు యాహ్యా జమ్మెహు తిరుగుబాటును అధిగమించి అధ్యక్షునిగా ఎన్నికై పదవిగా కొనసాగాడు. 2001 డిసెంబరు 21 న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. జాతీయ అసెంబ్లీలో జమ్మీ " అలయన్సు పేట్రియాటికు రియోరియంటేషను అండ్ కంస్ట్రక్షన్ " (ఎ.పి.ఆర్.సి) తన బలమైన మెజారిటీ ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (UDP) శాసన ఎన్నికలను బహిష్కరించిన తరువాత కూడా బలమైన ఆధిక్యతను నిలుపుకుంది. [1]
2013 అక్టోబరు 2 న గాంబియా అంతర్గత వ్యవహారాల మంత్రి గాంబియా కామన్వెల్తును తక్షణమే వదిలిపెడుతుందని ప్రకటించడంతో సంస్థ 48 సంవత్సరాల సభ్యత్వం ముగిసింది. " గాంబియా ఎటువంటి నియో-కాలనీయల్ సంస్థ సభ్యదేశంగా ఉండదని, వలసవాదం విస్తరణకు ప్రాతినిధ్యం వహించే సంస్థలో ఎప్పటికీ భాగస్వామ్యం వహించదని " అని గాంబియా ప్రభుత్వం పేర్కొంది.[17]
అధ్యక్షుడు జమ్మేషు ప్రతిపక్ష నాయకుడు అదమ బారో (ఇండిపెండెంటు కోయిలేషన్ ఆఫ్ పార్టీలు) [18] మమ్మ కండేహ్ (గాంబియా డెమొక్రటిక్ కోయిలేషన్ పార్టీలు), [19] నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. గాంబియా జూలై 2016 జూలైలో ప్రధాన ప్రతిపక్ష నేత, మానవ హక్కుల న్యాయవాది ఔసైనౌ దర్బాయుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించి[20] అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి ఆయనను అనర్హులుగా ప్రకటించారు.
డిసెంబరు 1 ఎన్నిక తరువాత ఎన్నికల సంఘం అధ్యక్ష ఎన్నికల విజేతగా అడామా బారోను ప్రకటించింది.[21] 22 సంవత్సరాలుగా పాలించిన జమ్మీ 2016 ఎన్నికలలో ఓటమి పొంది ముందుగా పదవి నుండి వైతొలుగుతానని ప్రకటించి ఫలితాలు ప్రకటించడానికి ముందుగా కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి పిలుపు ఇవ్వడంతో ఒక రాజ్యాంగ సంక్షోభానికి కారణమై " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు " దాడికి దారితీసింది.[22] 2017 జనవరి 20 న జామ్హే పదవీవిరమణ అంగీకరించి దేశం విడిచిపెడతానని ప్రకటించాడు.[8]
2017 ఫిబ్రవరి 14 న గాంబియా కామన్వెల్తు సభ్యత్వానికి తిరిగి అంగీకరించింది. 2018 జనవరి 22 న తిరిగి కామంవెల్తులో చేరడానికి కార్యదర్శి జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్కు తన దరఖాస్తును అధికారికంగా సమర్పించింది.[23][24] 1965 లో దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత గాంబియాను సందర్శించటానికి మొట్టమొదటి బ్రిటీషు విదేశాంగ కార్యదర్శి బోరిసు జాన్సను[25] బ్రిటీషు ప్రభుత్వం కామన్వెల్తుకు గాంబియా తిరిగి వచ్చిందని ప్రకటించాడు.[25] 2018 ఫిబ్రవరి 8 న గాంబియా అధికారికంగా తిరిగి కామంవెల్తులో చేరింది.[26][27]
గాంబియా చాలా చిన్న, ఇరుకైన దేశం. దీని సరిహద్దులు గాంబియా నదిని ప్రతిబింబిస్తాయి. ఇది 13 నుండి 14 ° ఉత్తర అక్షాంశం, 13 నుండి 17 ° పశ్చిమ రేఖంశాల పొడవుల మధ్య ఉంటుంది.
గాంబియా 50 కిలోమీటర్లు (31 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. దేశవైశాల్యం 11,295 చ.కి.మీ 2 (4,361 చ.కి.మీ). గాంబియా 1,300 చదరపుకి (1.4 × 1010 చదరపు అడుగులు) (11.5%) జలభాగం కలిగి ఉంది. ఇది ఆఫ్రికా ప్రధాన భూభాగంలో అతిచిన్న దేశం. గాంబియా జమైకా ద్వీపం కంటే కొంచెం తక్కువగా ఉంది.
గాంబియా మూడు వైపులా సెనెగలు ఆక్రమించి ఉంటుంది. దేశపశ్చిమ సరిహద్దులో 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) పొడవున అట్లాంటిక్ మహాసముద్రతీరం ఉంటుంది.[28]
1889 లో యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్సు మధ్య జరిగిన ఒప్పందం తరువాత ప్రస్తుత సరిహద్దులు నిర్ణయించబడింది. పారిసులో ఫ్రెంచి, బ్రిటిషు మధ్య చర్చల సందర్భంగా ఫ్రెంచి గాంబియా నదికి 200 మైళ్ల దూరంలో (320 కిలోమీటర్లు) భూభాగం మీద నియంత్రణను బ్రిటిషుకు స్వాధీనం చేసింది. 1891 లో సరిహద్దులను గుర్తించడంతో ఉంచడంతో ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాల తరువాత పారిసు సమావేశాలు నిర్వహించి గాంబియా చివరి సరిహద్దులను నిర్ణయించబడ్డాయి. ఫలితంగా గాంబియా నదికి ఉత్తరం, దక్షిణాన 10 మైళ్ళ (16 కి.మీ.) ప్రాంతం బ్రిటీషు నియంత్రణలోకి ఇవ్వబడింది.[29]
గాంబియా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలం కొనసాగుతుంది. నవంబరు నుండి మే వరకు, చల్లటి ఉష్ణోగ్రతలు ఆధిక్యత చేస్తుంటాయి.[28] గాంబియాలో వాతావరణం పొరుగున ఉన్న సెనెగలు దక్షిణ మాలి, బెనిన్ ఉత్తర భాగాన్ని పోలి ఉంటుంది.[30]
గాంబియా స్వేచ్ఛాయుతమైన మర్కెట్టు సాంప్రదాయిక జీవనాధార వ్యవసాయం, వేరుశనగ ఎగుమతి ఆదాయాల సంబంధితమై ఉంది. గాందియా నౌకాశ్రయం నుండి వస్తువులు ఎగుమతి చేయడానికి తక్కువ సుంకం వసూలుచేయడం, తక్కువ నిర్వహణా వ్యయం కారణంగా ఇక్కడకు చేరిన సరుకులు ఇక్కడి నుండి తిరిగి ఎగుమతి చేయబడుతుంటాయి. నియంత్రణరహితమైన నిలకడలేని ఎక్స్ఛేంజి, గణనీయమైన పర్యాటకరంగం ఆర్థికరంగాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి.[31]
ప్రపంచ బ్యాంకు గాంబియా జి.డి.పి. (2011) ను $ 898 మిలియన్ల అమెరికండాలర్లు ఉండేలా నియంత్రిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2011 లో $ 977 మిలియన్ల అమెరికా డాలర్లు ఉండేలా వద్ద ఉంచింది.
2006 నుండి 2012 వరకు గాంబియా ఆర్థిక వ్యవస్థ జి.డి.పి. 5-6% వార్షికవృద్ధితో ప్రతి వృద్ధి చెందింది.[32]
వ్యవసాయం రంగం 30% జి.డి.పి.తో 70% కార్మిక శక్తికి ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయంలో వేరుశెనగ ఉత్పత్తి జి.డి.పిలో 6.9%, ఇతర పంటలు 8.3%, పశువుల 5.3%, ఫిషింగు 1.8%, అటవీ ఉత్పత్తులు 0.5% ఉన్నాయి. జీడీపీలో 8%సేవలలో, పరిశ్రమలు 58% భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత (ఉదా. వేరుశెనగ ప్రాసెసింగు, బేకరీలు, ఒక సారాయి, టాన్నరీ). ఇతర తయారీ కార్యకలాపాలలో సబ్బు, శీతల పానీయములు, వస్త్రాలు ఉన్నాయి.[31]
గతంలో యునైటెడు కింగ్డం, ఇతర ఐరోపా దేశాలు ప్రధాన గాంబియా ఎగుమతి మార్కెట్లను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో సెనెగలు, యునైటెడు స్టేట్సు, జపాను గాంబియా ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా మారాయి. 2007 లో ఆఫ్రికా దేశాలలో సెనెగలు గాంబియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ప్రాతినిధ్యం వహించింది. ఇది గైనీ-బిస్సా, ఘానాతో సమానంగా ముఖ్యమైన వ్యాపార భాగస్వామ్యదేశంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అది విరుద్ధంగా విరుద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా డెన్మార్కు, యునైటెడు స్టేట్సు, చైనా గాంబియా దిగుమతులకు ముఖ్యమైన వనరులుగా మారాయి. యు.కె., జర్మనీ, ఐవరీ కోస్టు, నెదర్లాండ్సు గాంబియా దిగుమతులకు సరసమైన వాటాను అందిస్తాయి. 2007 కొరకు గాంబియా వాణిజ్య లోటు $ 331 మిలియన్లు.[31]
2009 మే నాటికి గాంబియాలో 12 వాణిజ్య బ్యాంకులతో ఒక ఇస్లామికు బ్యాంకు ఉన్నాయి. వీటిలో పురాతనమైనది 1894 లో స్టాండర్డు చార్టర్డు బ్యాంకుగా స్థాపించబడి కొంతకాలం తరువాత బ్యాంక ఆఫ్ బ్రిటిషు వెస్టు ఆఫ్రికా అయింది. 2005 లో ఇంటర్నేషనలు కమర్షియలు బ్యాంకు అనుబంధ సంస్థగా స్విసు-ఆధారిత బ్యాంకింగ్ గ్రూపు స్థాపించింది. ఇప్పుడు దేశంలో నాలుగు శాఖలు ఉన్నాయి. 2007 లో నైజీరియా యాక్సెసు బ్యాంకు అనుబంధ సంస్థను స్థాపించింది. ఇది ఇప్పుడు దేశంలో నాలుగు శాఖలను కలిగి ఉంది. దాని ప్రధాన కార్యాలయంతోపాటు; బ్యాంకు అదనంగా నాలుగు శాఖలు తెరవడాతాయని ప్రతిజ్ఞ చేసింది.
2009 మేలో లెబనీసు కెనడియన్ బ్యాంకు ప్రైం బ్యాంకు అనే అనుబంధ శాఖను ప్రారంభించింది.[33]
Population in The Gambia[34] | |||
---|---|---|---|
Year | Million | ||
1950 | 0.27 | ||
2000 | 1.2 | ||
2016 | 2 |
2011 నాటికి గాంబియా పట్టణీకరణ శాతం 57.3% ఉంది.[28] 2003 జనాభా లెక్కల ఆధారంగా తాత్కాలిక గణాంకాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మద్య అంతరం స్వల్పంగా ఉన్నందున పలుప్రాంతాలు పట్టణాలుగా ప్రకటించబడ్డాయి. పట్టణ వలసలు, అభివృద్ధి పథకాలు, ఆధునికీకరణ పశ్చిమ దేశాల అలవాట్లు, విలువలు, వస్త్రధారణ, స్థానికుల వేడుకల రూపాలు, కుటుంబం సాంప్రదాయిక ప్రాముఖ్యత గాంబియన్ల దైనందిన జీవితంలో అంతర్భాగంగానే తీసుకువస్తున్నారు.[31]
యు.ఎన్.డి.పి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఫర్ 2010 ఇండెక్సులోని 169 దేశాలలో గాంబియా 151 వ స్థానంలో ఉంది. ఫలితంగా గాంబియా 'లో హ్యూమన్ హ్యూమన్ డెవలప్మెంట్' కేటగిరీలో ఉంచబడింది. ఈ ఇండెక్సు సరాసరి ఆయుఃపరిమితి, విద్యాకాలం, సరాసరి స్థూల జాతీయోత్పత్తి, ఇతర విషయాలను పోల్చింది.
2013 లో సరాసరి సంతానోత్పత్తి ఒక మహిళకు 3.98 పిల్లలు.[35]
గాంబియాలో వివిధ రకాల జాతి సమూహాలు నివసిస్తుంటాయి. ఒక్కొక జాతి స్వంత భాష, సంప్రదాయాలు సంరక్షించబడుతుంటాయి. మండిన్కా జాతి అతిపెద్దదిగా ఉంది. తరువాత స్థానాలలో ఫులా, వోల్ఫ్, జోలా (కరోనిన్కా), సేరహులే (జహాంకా), సేరర్సు, మంజగో, బంబారా, అకు మరాబో, బైనూంకా, ఇతర జాతికి చెందిన ప్రజలు ఉన్నారు.[36] స్థానికంగా అకుస్ అని పిలవబడే క్రియో ప్రజలు గాంబియాలో అల్పసంఖ్యాక జాతి ప్రజలలో ఒకరుగా ఉన్నారు. వారు సియెర్రా లియోనే క్రియోలు ప్రజల వారసులు. సాంప్రదాయకంగా వీరు రాజధానిలో కేంద్రీకృతమై ఉన్నారు.
ఆఫ్రికాకు చెందని నివాసితులు సుమారుగా 3,500 ఐరోపా, లెబనా మూలానికి చెందిన కుటుంబాలకు చెందిన ప్రజలు (మొత్తం జనాభాలో 0.23%) ఉన్నారు.[31] స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలామంది బ్రిటిషు ప్రజలు దేశం వదిలి వెళ్ళినప్పటికీ అల్పసంఖ్యాక ఐరోపా వాసులలో బ్రిటీషు ప్రజలు అధికంగా ఉన్నారు. .
ఆంగ్లభాష గాంబియా అధికారిక భాషగా ఉంది . ఇతర భాషలలో మండిన్కా, వోల్ఫు, ఫులా, సెరెరు, క్రియో, జోలా, ఇతర స్థానిక భాషలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.[28] దేశం భౌగోళిక ఉపస్థితి కారణంగా ఫ్రెంచి భాష (అధిక పశ్చిమ ఆఫ్రికా దేశాలలో అధికారిక భాష) దేశం అంతటా వాడుకలో ఉంది.
గాంబియాలో రాజ్యాంగం నిర్బంధ ప్రాథమిక విద్యావిధానం అమలులో ఉంది. వనరులు, విద్యాసంస్థలు లేకపోవడం కారణంగా అమలు చేయడం కష్టంగా మారింది.[37] 1995 లో ప్రాథమిక నమోదు రేటు 77.1%, నికర ప్రాథమిక నమోదు రేటు 64.7% ఉంది.[37] పాఠశాల ఫీజులు అనేక మంది పిల్లలను పాఠశాలకు హాజరు కావడాన్ని నిరోధిస్తున్నాయి. 1998 ఫిబ్రవరిలో అధ్యక్షుడు జమ్మీ తొలి ఆరు సంవత్సరాలుగా పాఠశాలలో ఫీజు వసూలు చేయడానికి ముగింపు పలికాడు.[37] ప్రాథమిక పాఠశాల బాలికలు నమోదు 52%. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాలికల నమోదు మరింత తక్కువగా ఉండవచ్చు. ఇక్కడ సాంస్కృతిక సంప్రదాయాలు, పేదరికం తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడాన్ని నిరోధించాయి.[37] పాఠశాల చేరవలసిన వయసులో సుమారు 20% మంది ఖురానిక్ పాఠశాలలకు వెళతుంటారు.[37]
Religions in the Gambia[38] | ||||
---|---|---|---|---|
Religions | Percent | |||
Islam | 95.8% | |||
Christianity | 4.1% | |||
Other | 0.1% |
రాజ్యాంగంలోని ఆర్టికలు 25 ప్రజలు తాము ఎంచుకున్న మతాన్ని పాటించేలా పౌరుల హక్కులను రక్షిస్తుంది.[39] 2015 డిసెంబరులో గాంబియా దేశం అధ్యక్షుడు యాహ్యా జమ్మేషు గాంబియాను ఒక ఇస్లాం దేశంగా ప్రకటించాడని ర్యూటరు నివేదించింది. దేశంలో 95% ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరించరిస్తున్నారు.[38] గాంబియాలో ఎక్కువమంది ముస్లింలు సున్నీ చట్టాలు, సంప్రదాయాలను స్వీకరిస్తారు.[40] అయితే గణనీయమైన ప్రజలు అహ్మదీయ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు.[41]
గాంబియాలో దాదాపుగా అన్ని వాణిజ్య సంస్థలు ఈద్ అల్ అధా, ఈద్ ఉల్-ఫితర్లతో వంటి ప్రధాన ముస్లిం సెలవు దినాల్లో మూసివేయబడుతుంటాయి.[42] గాంబియాలోని చాలామంది ముస్లింలు మాలికి పాఠశాల న్యాయనిర్ణయానికి లోబడి పనిచేస్తుంటారు. అనుసరిస్తుంటారు.[43] అంతేగాక గాంబియాలో షియా ముస్లింలు ఉన్నారు. ప్రధానంగా లెబనీయులు, ఇతర అరబు వలసదారులు ఈ ప్రాంతంలో ఉన్నారు.[44] ప్రజలలో క్రైస్తవ సమాజం దాదాపు 4% ఉన్నారు. [38] పశ్చిమ, దక్షిణ గాంబియా ప్రాంతాలలో నివసిస్తున్న క్రైస్తవ సమాజంలోని చాలామంది తమని తాము రోమను క్యాథలికులుగా గుర్తించారు. ఆంగ్లికన్లు, మెథడిస్ట్లు, బాప్టిస్టులు, ఏడవ రోజు అడ్వెంటిస్టులు, యెహోవాసాక్షులు, చిన్న సువార్త తెగల వంటి చిన్న క్రైస్తవ సమూహాలు కూడా ఉన్నాయి.[40]
సెరరు మతం వంటి స్థానిక మతవిశ్వాసాలు ఎంత వరకు ఉన్నాయన్నది అస్పష్టంగా ఉంది. సెరరు మతం విశ్వోద్భవం, రోగు అని పిలువబడే సుప్రీం దేవత విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఈ మతస్థులు అనుసరిస్తున్న పండుగలలో కొన్ని క్సాయ్, బొసెయి, రండౌ ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం సెరెరు మతానికి అనుగుణంగా సెయిగలు సెయిగెషను వేడుక కోసం సెనెగలులో వార్షిక పుణ్యక్షేత్రం యాత్ర జరుగుతుంది.[45] సెరగాంబియన్ ముస్లిం పండుగల కంటే సెరరు మతంలో అధికమైన పండుగలు ఉన్నాయి. సెరెర్ మతం నుండి సెరెగాంబియను ముస్లిం మతం ( "టొబాస్కి", "గామో", "కొరైతే", "వరి కోర్" వంటివి పండుగలను అరువు తెచ్చుకుందని భావిస్తున్నారు. అవి ప్రాచీన సెరెర్ పండుగలుగా ఉన్నాయి.[46]
సెరర్లు వలె, జోలా ప్రజలకు వారి స్వంత మతపరమైన ఆచారాలు కూడా ఉన్నాయి. జోలాస్ ప్రధాన మతపరమైన కార్యక్రమాల్లో బౌకవుటు ఒకటి.
దక్షిణ ఆసియా నుండి వలస వచ్చిన కొద్దిమంది హిందువులు, బహాయి విశ్వాసం అనుచరులు కూడా ఉన్నారు.[40] దక్షిణ ఆసియా వలసదారులు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. [40]
గాంబియా ప్రధాన భూభాగంలో ఆఫ్రికాలో అతిచిన్న దేశం అయినప్పటికీ దాని సంస్కృతి పలు విభిన్న ప్రభావాలతో రూపొందించబడింది. జాతీయ సరిహద్దులు గాంబియా నదికి ఇరువైపులా ఒక ఇరుకైన భూచీలికను రూపొందిస్తాయి. దేశం లోని ప్రజాజీవనంలో కీలక పాత్ర పోషించిన నీటిప్రవాహం స్థానికంగా నది పిలువబడుతుంటుంది. సహజ సరిహద్దులు లేని గాంబియా పశ్చిమ ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్న (ప్రత్యేకించి సెనెగలులో) స్థానిక జాతి సమూహాలకు గాంబియా స్థావరంగా మారింది.
గాంబియా నది ఖండంలోకి ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్నందున గాంబియా చరిత్రలో ఐరోపియన్లు కూడా ప్రముఖ్యత వహిస్తూ ఉంటారు. 15 వ నుండి 17 వ శతాబ్దం వరకు భౌగోళిక ఉపస్థితి కారణంగా బానిస వాణిజ్యానికి అత్యంత లాభదాయకమైన ప్రాంతంగా మారింది. ( 19 వ శతాబ్దంలో దీనిని చట్టవిరుద్ధం చేసిన తరువాత కూడా ఇది వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది.) గాంబియాలో రచించబడిన అలెక్సు హాలీ పుస్తకం, టి.వి. సిరీసు రూట్సు ద్వారా ఈ చరిత్ర కొంతభాగం ప్రాచుర్యం పొందింది.
గాంబియా సంగీతం పొరుగు ప్రాంతలైన సెనెగలు, లోతట్టు సరిహద్దులతో అనుసంధానంగా ఉంది. ఇది ప్రముఖ పాశ్చాత్య సంగీతం, నృత్యాన్ని సబారుతో మిశ్రితం చేది ప్రదర్శిస్తుంది. సాంప్రదాయ డ్రమ్మింగు, వొలోఫు, సేరరు ప్రజల నృత్య సంగీతం గాంబియా సంగీతంలో ప్రాధాన్యత వహిస్తున్నాయి.
గాంబియా ఆహారాలలో వేరుచనగలు, బియ్యం, చేఓలు, మాసం, ఎర్రగడ్డలు, టొమాటోలు, మిరపకాయలు, ఓస్టర్లు (గాంబియా నదీ ప్రాంతాలలో మహిళలు వీటిని పండిస్తారు) ప్రాధాన్యత వహిస్తుంటాయి. వీటిని యస్సా, డొమాడో తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. [47] ఇవి స్థానిక ప్రజలలో, పర్యాటకులలో ప్రాబల్యత సంతరించికిన్నాయి.
విమర్శకులు ప్రభుత్వం వాక్స్వాతంత్ర్యాన్ని పరిమితం చేసిందని ఆరోపించారు. 2002 లో ఆమోదించిన ఒక చట్టం లైసెంసులు మంజూరుచేయడానికి, జైలు శిక్షకులను జారీచేయడానికి అధికార కమిషనును ఏర్పాటు చేసింది. 2004 లో అదనపు చట్టం అపవాదులకు జైలు శిక్షలను అనుమతించింది. అన్ని ముద్రణ, ప్రసార లైసెన్సులను రద్దు చేసింది. మీడియా గ్రూపులు అసలు ధరకంటే ఐదురెట్లు తిరిగి చెల్లించి నమోదు చేయాలని వత్తిడి చేసింది.[48][49] తిరుగుబాటు ప్రయత్నం ఆరోపణలతో ముగ్గురు గాంబియా పాత్రికేయులు అరెస్టు చేయబడ్డారు. ప్రభుత్వ ఆర్థిక విధానాన్ని విమర్శించినందుకు (మాజీ హోం మంత్రి, సెక్యూరిటీ చీఫ్ కుట్రదారులలో ఒకరని పేర్కొంటూ) వారు ఖైదు చేయబడ్డారని ప్రకటించారు.[50] 2004 లో వార్తాపత్రిక సంపాదకుడు డీడ హైడరా కారణాలు వివరించకుండా కాల్చి చంపబడ్డాడు.
వార్తాపత్రికలు, రేడియో స్టేషన్లకు లైసెన్సు ఫీజులు ఎక్కువగా ఉంటాయి. దేశవ్యాప్త స్టేషన్లు ప్రభుత్వంచే నియంత్రించబడతాయి.[48]
" రిపోర్టర్సు వితౌట్ బోర్డర్సు " అధ్యక్షుడు యాహ్యా జమ్మేషు హత్య, కాల్పులు, చట్టవిరుద్ధమైన అరెస్టు, పాత్రికేయులకు వ్యతిరేకంగా బెదిరింపులకు పోలీసు స్టేషన్లను ఉపయోగించారని ఆరోపించింది.
2010 డిసెంబరులో ది ఇండిపెండెంటు వార్తాపత్రిక మాజీ సంపాదకుడు ముసా సైడిఖునుకు నైజీరియాలోని అభుజాలోని ఎకోవాసు కోర్టు నుండి $ 2,00,000 అమెరికా డాలర్లు అవార్డుగా లభించింది. గాంబియా ప్రభుత్వం జాతీయ ఇంటెలిజెంసు ఏజెన్సీ విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచి హింసించిదని ఆయనకు విఫలమైన తిరుగుబాటు గురించి ముందే తెలుసని ఇంటెలిజెంసు ఏజెన్సీ భావించిందని ఆరోపించబడింది. [ఆధారం చూపాలి]
పొరుగున ఉన్న సెనెగలు మాదిరిగా, గాంబియాలో కుస్తీ జాతీయక్రీడగా అత్యంత ప్రజాదరణ పొందుతూ ఉంది.[52] అసోసియేషను ఫుట్బాలు, బాస్కెట్బాలు కూడా ప్రాచుర్యం పొందాయి. గాంబియాలో ఫుట్బాలు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ, సి.ఎ.ఎఫ్. లకు అనుబంధంగా " గాంబియా ఫుట్బాలు ఫెడరేషను " నిర్వహిస్తుంది. గాంబియాలో జి.ఎఫ్.ఎ. లీగు ఫస్టు డివిజను గాంబియా జాతీయ ఫుట్బాల్ జట్టుతో గి.ఎఫ్.ఎ. లీగు ఫుట్బాలును నిర్వహిస్తుంది. "స్కార్పియన్సు" అనే ముద్దుపేరున్న ఈ జట్టు జాతీయ జట్టు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డు కపు, సీనియరు స్థాయిలో ఉన్న ఆఫ్రికా కపు ఆఫ్ నేషన్సు ఫైనల్సు కొరకు అర్హత సాధించలేదు. వారు ఇండిపెండెన్సు స్టేడియంలో ఆడతారు. 2005 లో గాంబియా సి.ఎ.ఎఫ్. యు-17 క్రీడలకు ఆతిధ్యం ఇచ్చిన సమయంలో రెండు చాంపియన్షిప్లను గెలుచుకుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.