ఇమామ్
From Wikipedia, the free encyclopedia
ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
| |
ఫిఖహ్ | |
| |
అహ్‌కామ్ | |
| |
పండిత బిరుదులు | |
|
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ, షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా. ప్రముఖ ఉర్దూ, పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
ఇమామ్ లు
- సున్నీ ఇమామ్ లు
- ఇమామ్ అబూ హనీఫా
- ఇమామ్ మాలిక్
- ఇమామ్ షాఫి
- ఇమామ్ హంబల్
- షియా ఇమామ్ లు
వీరినే బారా ఇమామ్లు అంటారు.
- అలీ ఇబ్న్ అబీ తాలిబ్ 600–661), (అలీ అమీరుల్ మోమినీన్)
- హసన్ ఇబ్న్ అలీ 625–669), (హసన్ అల్-ముజ్తబా)
- హుసేన్ ఇబ్న్ అలీ (626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
- అలీ ఇబ్న్ హుసేన్ (658–713), (అలీ జైనల్ ఆబిదీన్)
- మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743), (మహమ్మద్ అల్ బాఖర్)
- జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765), (జాఫర్-ఎ-సాదిఖ్)
- మూసా ఇబ్న్ జాఫర్ (745–799), (మూసా అల్-కాజిమ్)
- అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అల్-రజా)
- ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, మహమ్మద్ అత్-తఖీ)
- అలీ ఇబ్నే ముహమ్మద్ (827–868), (అలీ అల్-హాది నఖీ)
- హసన్ ఇబ్నే అలీ (846–874), (హసన్ అల్-అస్కరీ)
- మహమ్మద్ ఇబ్న్ హసన్ (868- ), (ఇమామ్ మహదీ)
వీటినీ చూడండి
ఇవీ చూడండి
- ఖలీఫా
- ముస్లిం పండితులు
- అమీర్
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.