ఇమామ్ అల్-ఆజమ్ (అరబ్బీ : الامام الاعظم) "ప్రఖ్యాత ఇమామ్" ముహమ్మద్ నౌమాన్ బిన్ సాబిత్ బిన్ జుతా బిన్ మాహ్ (అరబ్బీ : النعمان بن ثابت), సాధారణంగా (అరబ్బీ : أبو حنيفة) (699 — 767 సా.శ. / 80 — 148 హి.శ.) హనీఫా తండ్రిగా ఖ్యాతి. ఇతను సున్నీ ఇస్లామీ న్యాయశాస్త్రాల హనఫీ పాఠశాలను స్థాపించాడు.
ఇస్లామీయ న్యాయశాస్త్ర పండితుడు ఇస్లామీయ స్వర్ణయుగం | |
---|---|
పేరు: | ఇమామ్ అల్-ఆజమ్ అబూ-హనీఫా |
జననం: | 699 |
మరణం: | 767 |
సిద్ధాంతం / సంప్రదాయం: | హనఫీ |
ముఖ్య వ్యాపకాలు: | ఇస్లామీయ న్యాయశాస్త్రం |
ప్రముఖ తత్వం: | ఇస్లామీయ న్యాయశాస్త్రం |
ప్రభావితం చేసినవారు: | ఖతాదా ఇబ్న్ అల్-నౌమాన్,[1] అల్ఖమా ఇబ్న్ ఖైస్,[2] జాఫర్ అల్-సాదిఖ్ |
ప్రభావితమైనవారు: | ఇస్లామీయ న్యాయశాస్త్రం, అల్-షాఫీ, అబూ యూసుఫ్ |
అబూ హనీఫా సహాబా ల తరువాత తరానికి చెందిన తాబయీన్. ఇతను సహాబీ అయినటువంటి "అనస్ ఇబ్న్ మాలిక్", ఇతర సహాబీలనుండినుండి హదీసులు సేకరించాడు.[3]
పేరు, జననం, పూర్వీకులు
అబూ హనీఫా అన్-నౌమాన్ (699 — 767 సా.శ. / 80 — 148 హిజ్రీ శకం) ఇరాక్ లోని కూఫా నగరంలో జన్మించాడు. ఉమయ్యద్ ఖలీఫా యైన అబ్దుల్ మాలిక్ బిన్ మార్వాన్ యొక్క శక్తిమంతమైన కాలమది. ఇతనికి "అల్-ఇమామ్-ఎ-ఆజమ్" లేదా "ఇమామ్-ఎ-ఆజమ్" అనే బిరుదు గలదు. ఇతని పేరు నౌమాన్ బిన్ సాబిత్ బిన్ జుతా బిన్ మాహ్, కాని ఇతనికి అబూ హనీఫా గా గుర్తిస్తారు. హనీఫా ఇతని కుమార్తె. అనగా 'హనీఫా తండ్రి' గా పేరుపొందాడు. ఇలా కుమార్తె (లేక కుమారుడి పేరుతో) గుర్తింపబడడాన్ని అరబ్బీ, ఉర్దూ సాహిత్యపరంగా కునియా లేక కునియత్ అంటారు. ఇతని తండ్రి సాబిత్ బిన్ జుతా, కాబూల్కు చెందిన వర్తకుడు (ఆకాలంలో 'ఖోరాసాన్' పర్షియా), ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని. అబూహనీఫా జన్మించినపుడు సాబిత్ వయస్సు 40 సంవత్సరాలు. తాత పేరు 'జతా'.
అబూ హనీఫా మనుమడు "ఇస్మాయీల్ బిన్ హమ్మాంద్" ప్రకారం తన తాత అబూ హనీఫా పూర్వీకులు 'సాబిత్ బిన్ నౌమాన్ బిన్ మర్జబాన్' లు పర్షియా (నేటి ఇరాన్) కు చెందినవారు. చరిత్రకారుడు అబూ ముతి ప్రకారం అబూ హనీఫా ఒక అరబ్ జాతీయుడు, వీరి పూర్వీకులు, నౌమాన్ బిన్ సాబిత్ బిన్ జుతా బిన్ యహ్యా బిన్ అసద్.
తాబయీ గా గుర్తింపు
మహమ్మదు ప్రవక్త మరణించిన 67 సంవత్సరాల తరువాత అబూహనీఫా పుట్టాడు. అబూ హనీఫా తన యౌవనదశలో కొందరు సహాబీలను చూశాడు. ఇందులో ముఖ్యులు "అనస్ బిన్ మాలిక్" (93 హిజ్రీలో మరణించాడు), ఇతను మహమ్మదు ప్రవక్త బాగోగులు చూసేవాడు. ఇంకో సహాబీ అబుల్ తుఫైల్ అమీర్ బిన్ వసీలా (ఇతను 100 హిజ్రీలో మరణించాడు), ఆ సమయంలో అబూ హనీఫా 20 సంవత్సరాల వయస్సుగలవాడు. ఈ రెండు సహాబీలను చూశాడు గావున అబూహనీఫా "తాబయీ". సున్నీ సంప్రదాయాల ప్రకారం హనీఫా, సహాబాల నుండి 12 హదీసులను పొందాడు. (మూలం ప్రముఖ ఇస్లామీయ పండితుడు తాహిరుల్ ఖాద్రి గారి "అల్ మిన్హాజుస్ సవ్వీ")
ప్రారంభ జీవితం , విద్య
అబూ హనీఫా, ఖలీఫాలైన అబ్దుల్ మాలిక్ బిన్ మార్వాన్, అతని కుమారుడు వలీద్ బిన్ అబ్దుల్ మాలిక్ ల కాలంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇరాక్ గవర్నరు అయిన హజ్జాజ్ బిన్ యూసుఫ్ వలీద్ బిన్ అబ్దుల్ మాలిక్ విధేయుడు. ధార్మిక పండితులు అబ్దుల్ మాలిక్ కు అడ్డంకిగా వున్నారనే దురభిప్రాయం వుండేది. అబూ హనీఫా ధార్మికపండితోన్నతవిద్య కొరకు వ్యామోహం చూపలేదు. తన తండ్రితాతల అడుగుజాడలలోనే నడుస్తూ ఇటు ఇస్లామీయ పాండిత్యంలోనూ అటు వ్యాపారం లోనూ రాణించాడు. అబూ హనీఫా పట్టుబట్టల పరిశ్రమను స్థాపించాడు. ఇతడు అత్యంత వినయమూ విధేయతా కలిగి వుండేవాడు. బట్టలలో ఏకొంతలోపం ఉన్నా వాటిలోపాలను చూపిస్తూ వాటిని పేదలలో పంచిపెట్టేసేవాడు.
హి.శ. 95లో హజ్జాజ్, 96 లో వలీద్ మరణించినతరువాత ఇస్లామీయ విద్యకు మంచి కాలం వచ్చింది. సులేమాన్ బిన్ అబ్దుల్ మాలిక్, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్లు ధార్మిక విద్య పట్ల వీటి పాఠశాలల పట్ల శ్రధ్ధ వహించారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ విద్యను ప్రోత్సహించాడు, ప్రతి ఇంటికి ఒక మదరసా (పాఠశాల) అనేధ్యేయంతో పనిచేశాడు. అబూ హనీఫా విద్యయందు శ్రద్ధచూపడం ప్రారంభించాడు. కూఫా పండితుడైన 'అష్-షబీ' (సా.శ. 722) ఉపదేశంతో అబూ హనీఫా ధార్మికవిద్యను ఔపోసనపట్టాడు. సా.శ. 762 లో అబ్బాసీయ ఖలీఫా అల్ మన్సూర్, బాగ్దాద్ నగర నిర్మాణం చేపట్టినపుడు, అబూ హనీఫా, ఈ నిర్మాణంలో బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించాడు.
యౌవ్వనం
763 లో, అబ్బాసీయ ఖలీఫా అల్ మన్సూర్, తనరాజ్య ప్రధానన్యాయమూర్తిపదవికి అబూహనీఫా పేరును ప్రతిపాదించి ఆహ్వానిస్తాడు, అబూహనీఫా ఈ పదవిని తిరస్కరిస్తాడు, కారణం తాను స్వతంత్రుడుగా జీవించడానికే ఇష్టపడతాదు. ఇతని శిష్యుడు అబూ యూసుఫ్ కు ఈ ప్రధానన్యాయమూర్తి 'ఖాజి అల్-ఖాజాత్' పదవి కట్టబెడతారు. అల్-మన్సూర్ ఖలీఫా, అబూ హనీఫాకు ప్రధాన న్యాయమూర్తి పదవికొరకు ఆహ్వానించినపుడు, తాను అందుకు అర్హుడు కాడని జవాబిస్తాడు. అల్-మన్సూర్ "నీవు అబద్ధాలాడుతున్నావు" అని అన్నప్పుడు, అబూ హనీఫా "అబద్దాలకోరుకు ప్రధానన్యాయమూర్తి పదవి అంటగట్టడమేమిటని" జవాబిస్తాడు. అల్-మన్సూర్ కోప్పడి అబూ హనీఫాపై అబధ్ధాలాడాడనే నిందను మోపి చెరసాలలోవుంచుతాడు.యాఖూబి, గ్రంథం.lll, పుట.86; మురూజ్ అల్ జహాబ్, గ్రంథం.lll, పుట.268-270.
చెరసాలలో కూడా తనవద్దకు వచ్చేవారిని ఇస్లామీయ పాండిత్యాన్ని బోధించేవాడు.
767 లో అబూ హనీఫా చెరసాలలోనే పరమదించాడు. అబూ హనీఫా 'జనాజా ప్రార్థన'లకు యాభైవేల మంది గుమిగూడారు. ఒకేసారి ఇంతమంది జనాజా నమాజ్ చదవడానికి వీలు గాక, 6 సార్లు జమాఅత్ చేసి జనాజా ప్రార్థనలు జరిపారు.
అబూ హనీఫా సాహితీరచనలు
- కితాబ్-ఉల్-ఆసర్ - 70,000 హదీసుల కూర్పు
- ఆలిమ్-వల్-ముతల్లిమ్
- ఫిఖహ్ అల్-అక్బర్
- జామిఉల్ మసానీద్
- కితాబుల్ రాద్ అల్ ఖాదిరియ
ఇవీ చూడండి
బయటి లింకులు , మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.