కూతురు
From Wikipedia, the free encyclopedia
కుటుంబములోని ఆడ సంతానాన్నిపుత్రిక, కూతురు లేదా కుమార్తె (Daughter) అంటారు. మగ సంతానాన్ని కుమారుడు లేదా కొడుకు అంటారు. కుమార్తె అనే పదం పెద్దవారు స్త్రీలకు ప్రేమపూర్వక పదంగా కూడా ఉపయోగిస్తారు.

పితృస్వామ్య సమాజాలలో కుమార్తెలు తరచుగా కొడుకుల కంటే భిన్నమైన లేదా తక్కువ కుటుంబ హక్కులను కలిగి ఉంటారు. ఒక కుటుంబం కుమార్తెల కంటే కొడుకులను కలిగి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నందున ఆడశిశువుల హత్యలు జరుగుతుండవచ్చు.[1] కొన్ని సమాజాలలో కుమార్తెను తన భర్తకు "అమ్మడం" ఆచారంగా ఉంది. పెళ్ళి కుమారుని వారు వధువుకు కొంత ధర చెల్లించాల్సి ఉంది. దీనిని కన్యా శుల్కం అంటారు. ఈ ఆచారానికి విదుద్ధంగా తల్లిదండ్రులు వివాహ విషయంలో తల్లిదండ్రులు స్త్రీ ఆర్థిక భారాన్ని భర్తీ చేయడానికి భర్తకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు, మహిళలు ఇంటి వెలుపల శ్రమించని సమాజాలలో ఇది కనిపిస్తుంది. దీనిని కట్నం అని పిలుస్తారు.
జనగణన వివరించే అంశాలు
భారతదేశ జనాభాలో స్త్రీ - పురుష నిష్పత్తిని చూస్తే 1951 దశకం నుండి పురుషుల కంటే స్త్రీల జనాభా తక్కువగా ఉంటోంది[2].
సంవత్సరం | పురుషులు | స్త్రీలు |
---|---|---|
1951 | 1000 | 946 |
1961 | 1000 | 941 |
1971 | 1000 | 930 |
1981 | 1000 | 934 |
1991 | 1000 | 929 |
2001 | 1000 | 933 |
2011 | 1000 | 943 |
భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు
హిందూ మతంలో
- కూతుర్లకు వారి తండ్రి ఆస్తిలో కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది. అదే విధంగా తల్లి ఆస్తిలో కూడా ఒక భాగం ఉంటుంది.
- హిందూ మతం వారసత్వ (సవరణ) చట్టం, 2005 (2005 39) 2005 సెప్టెంబరు 9 నుంచి అమలులోకి వచ్చింది. సవరణ చట్టం లింగ వివక్షత నిబంధనలను తొలగించింది. కుమార్తెలకు కొన్ని హక్కులు కలిగించింది.[3]
- పుట్టికతోనే కుమారులతో సమానంగా ఆమె కూడా స్వంత హక్కుతో ఒక దాయాది అవుతుంది; ఆమె కుమారునిగా జన్మించి ఉంటే ఉండేటటువంటి అన్నిదాయాది హక్కులు కుమార్తెకు ఉంటాయి. కుమార్తెకు కుమారుడికి కేటాయించిన వాటా లాగే కేటాయించాలి.
- వివాహిత కుమార్తెకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయ హక్కు, లేదా నిర్వహణా హక్కు ఉండదు. అయితే, ఒక వివాహిత కుమార్తె విడాకులు లేదా భర్తను కోల్పోయినప్పుడు నివాస హక్కు ఉంటుంది.
మూలాలు
బాహ్య లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.