ఇరాక్ రాజధాని మరియు అతిపెద్ద నగరం From Wikipedia, the free encyclopedia
బాగ్దాద్ లేదా బాగ్దాదు (ఆంగ్లం : Baghdad) (అరబ్బీ భాష : 'بغداد' ) ఇరాక్ దేశపు రాజధాని. దీని జనాభా దాదాపు 70 లక్షలు. ఇరాక్ లో ప్రధాన, అతిపెద్ద నగరం.[1][2], మధ్య ప్రాచ్యంలో కైరో, టెహరాన్ ల తరువాత అతిపెద్ద మూడవ నగరం. ఈ నగరం టైగ్రిస్ నది ఒడ్డున ఉంది. దీని చరిత్ర సా.శ. 8వ శతాబ్దం వరకూ వెళుతుంది. ఈ నగరం ఒకానొక కాలంలో ముస్లిం ప్రపంచంలో దార్ ఉల్ సలామ్ విద్య, విజ్ఞాన, సాంస్కృతిక, చారిత్రక, కళల కేంద్రంగా విరాజిల్లినది.
బాగ్దాద్ بغداد |
|
ఇరాక్ లోని బాగ్దాద్ ప్రదేశం. | |
అక్షాంశరేఖాంశాలు: 33°20′00″N 44°26′00″E | |
---|---|
దేశము | ఇరాక్ |
ప్రాంతము | బాగ్దాద్ గవర్నరేట్ |
ప్రభుత్వం | |
- Type | {{{government_type}}} |
- గవర్నరు | హుసేన్ అల్ తహ్హాన్ |
వైశాల్యము | |
- City | 734 km² (283.4 sq mi) |
ఎత్తు | 34 m (112 ft) |
జనాభా (2006)[1][2] | |
- City | 70,00,000 |
- సాంద్రత | 34,280/km2 (88,784.8/sq mi) |
- మెట్రో | 90,00,000 |
రమారమి అంకెలు | |
కాలాంశం | గ్రీనిచ్ సమయం +3 (UTC) |
- Summer (DST) | +4 (UTC) |
దీని పేరుకు మూలం పర్షియన్ భాష,[3] అందరూ ఆమోదించే పేరు, 'భాగా లేదా బాగ్' "దేవుడు" + దాద్ "బహుమతి" వెరసి "దేవుని బహుమతి" లేదా "దేవుని ప్రసాదము". నవీన పర్షియన్ ల ఇంకో వాదన ప్రకారం, "ప్రసాదింపబడిన ఉద్యానవనం". కాని ఇవి ఇస్లాంకు పూర్వం నిర్వచింపబడిన పేర్లు. అబ్బాసీయుల కాలంలో [4]. మన్సూర్ దీనికి "మదీనత్ అస్-సలామ్" లేదా "శాంతి నగరం" అని పేరు పెట్టాడు. అతని కాలంలో నాణెములపై, తులామానాలపై ఇదే పేరును ఉపయోగించాడు.[5].
జూలై 30 సా.శ. 762 న ఖలీఫా అబూ జాఫర్ అల్ మన్సూర్ ఈ నగరాన్ని స్థాపించాడు.[6]. మన్సూర్ నమ్మకం ప్రకారం బాగ్దాద్, అబ్బాసీయులకు, ఇస్లామీయ కేంద్రంగాను, రాజధాని గాను సరైన నగరం. మన్సూర్ ఈ నగర స్థాపన నావల్ల జరగాలి, ఇందే నేను జీవించాలి, నాతరువాత వారునూ పరిపాలించాలి అని అన్నాడు.[7] ఈ నగరపు భౌగోళికాంశాలు, దీని అభివృద్ధికి చాలా తోడ్పడ్డాయి. మధ్యప్రాచ్యం నుండి ఆసియా ప్రాంతానికి వారధిగా ఈ నగరం యున్నది. నెలవారి వ్యాపార జాతరలు ఇంకనూ తోడ్పడ్డాయి. దీనికి నీటివనరులు, పొడి వాతావరణం మొదలగునవి అనుకూలాంశములు. హారూన్ రషీద్ (9వ శతాబ్దపు తొలిదశ) కాలంలో బాగ్దాద్ నగరం ఉచ్చస్థితికి చేరుకున్నది.
బాగ్దాద్ నగర ఉత్థానస్థితి కారణంగా పర్షియా దేశ రాజధాని టెసిఫాన్ నగరానికి గ్రహణం పట్టినట్టయింది. బాబిలోనియా ప్రాంతం (క్రీ.పూ. 2 వ శతాబ్దంలో అంతమయినది) బాగ్దాద్ నగరానికి దక్షిణాన 90 కి.మీ. దూరాన ఉంది.
ప్రారంభ సంవత్సరాలలో, ఈ నగరం ఖురాన్ వర్ణించినటువంటి స్వర్గం గుర్తుకు వచ్చేలా వుందని, వుండాలని భావించేవారు.[8]. సా.శ. 758 ఈ నగరానికి శంకుస్థాపన చేయడానికి ఖలీఫా మన్సూర్ ప్రపంచంలోని పలు ఇంజనీర్లను, సర్వేయర్లను, నిర్మాణ కళాకారులను ఆహ్వానించాడు. వీరిని క్రోడీకరించి, బాగ్దాద్ నగర నిర్మాణ నమూనా తయారు చేయమని కోరాడు. దాదాపు 1 లక్ష మంది, నిర్మాణపు నిపుణులు కళాకారులు వచ్చి సర్వేలు నమూనాలు తయారు చేయడం ప్రారంభించారు. చాలా మందికి జీతాలు పంచడంగూడా జరిగింది. ఈ నగరపు నమూనా రెండు పెద్ద అర్ధ-గోళాలు కలిగినది, వీటి వ్యాసాలు దాదాపు 19 మైళ్ళు. ఖగోళికులైన నౌబక్త్, మాషాఅల్లా, ఇద్దరూ కలసి మహూర్తాలు లెక్కించి, ఈ నగరం సింహరాశిలో వుండాలని, దీని శంకుస్థాపన జూలై నెలలో జరగాలని నిర్ణయించారు.[9]. ఈ నిర్మాణ కార్యక్రమంలో అబూ హనీఫా ఇటుకలను లెక్కపెట్టే పని చేపట్టి, ఒక కాలువ నిర్మాణం కూడా చేపట్టాడు. ఈ కాలువ వలన, నిర్మాణపు పనుల కొరకు నీరు అందించింది. ఈ నగరపు నిర్మాణంలో చలువరాయి ఉపయోగించబడింది. నది ఒడ్డున మెట్లకు కూడా ఈ చలువరాయే ఉపయోగించడం జరిగింది. నగరంలో అనేక ఉద్యానవనాలు, తోటలు, భవంతులు, సుందరమైన రహదారులు నిర్మించబడినవి. వీటి వలన, నగరానికి సుందరత్వం కలిగినది.[10]. ఈ నగరాన్ని20 కి.మీ. వ్యాసనిడివి గల వృత్తాకారంలో డిజైన్ చేశారు., ఇది "గుండ్రని నగరం"గా పేరుగాంచింది. దీని అసలు డిజైన్ "ఉంగరపు ఆకారం"లో గలదు. , ఆఖరి నిర్మాణంలో బయటి ఉంగరంలో ఇంకో ఉంగరపు ఆకారం చేర్చబడింది.[11] ఈ నగరపు మధ్యలో మస్జిద్, , రక్షకభట నిలయం గలవు. ఈ నమూనాలన్నీ పర్షియాకు చెందిన ససానిద్ ల డిజైన్‌లను పోలి యుంటుంది. విశాలమైన పురవీధులు, సుందరమైన భవంతులు, ప్రభుత్వ భవనాలు, మస్జిద్‌లు, చర్చీలు, సినగాగ్‌లు నగర నడిబొడ్డున ఉన్నాయి.
ఈ నగర చుట్టూ గల కుడ్యాలకు కూఫా, బస్రా, ఖురాసాన్ , సిరియా ల పేర్లు పెట్టారు. కారణం ఈ గోడలు ఆయా నగరాల లేదా దేశాల వైపు వుండడమే.[12].
బాగ్దాద్ కు మధ్యన కేంద్రకూడలి వద్ద 'బంగారు ద్వార సౌధం' గలదు. ఈ భవంతి, ఖలీఫా , అతని కుటుంబ నివాసం. ఈ భవంతి మధ్యన 160 అడుగుల ఎత్తుగల పచ్చని గుమ్మటం వుండేది. ఈ గుమ్మటం పైభాగాన చేతిలో దీపం పట్టుకొన్న ఓగుర్రపువ్యక్తి నిల్చుని వుండేవాడు. సిరియా ద్వారం వద్ద రక్షకభటుల భవనం వుండేది. ఈ భవనంలో సైన్యాధ్యక్షుడు నివాసముండేవాడు. 813 లో ఖలీఫా అమీన్ మరణం తరువాత ఖలీఫా భవంతి నిరుపయోగంగా మారింది. ఈ భవంతిలో ఖలీఫాలు నివాసం ఉండడం మానేశారు.[13].
అబ్బాసీ ఖలీఫాలు ముహమ్మద్ ప్రవక్త వంశీయులు , ఖురైష్ తెగకు సంబంధించినవఅరు. వీరు షియా ముస్లింలుగా పరిగణింపబడుతారు. వీరు ఖురాసాన్ ఉద్యమంద్వారా ఉమయ్యద్ ఖలీఫాల పర్షియన్ సామ్రాజ్యం పైగల పట్టును విడదీయడానికి పూనుకున్నారు.[14]. వీరు, అరబ్-ఇస్లామిక్ , పర్షియాకు చెందినససానిద్ ల వారసులుగా భావించుకున్నారు. ఈ రెండు సంస్కృతుల సమ్మేళనాలు వీరి నిర్మాణాలలో కానవస్తాయి. వీరు (మన్సూర్ ఖలీఫా కాలంలో) బాగ్దాద్ నగరంలో విజ్ఞాన భవనం నిర్మించి ఈ సంస్కృతుల ప్రాతినిథ్యాన్ని ప్రపంచానికి చాటారు. వృత్తాకారపు నగరమైన బాగ్దాద్, అరబ్-పర్షియన్ సంస్కృతులకు చిహ్నం. ఈ విజ్ఞాన భవనంలో ప్రపంచంలోని భాషలయిన గ్రీకు అరబ్బీ పర్షియన్ మొదలగులయందు విజ్ఞాన గ్రంథాలను తర్జుమా కార్యక్రమాలను చేపట్టారు. మన్సూర్ ఖలీఫా ("తర్జుమా ఉద్యమం") చేపట్టే ఖ్యాతిని పొందాడు.[15].
స్థాపింపబడిన ప్రథమ జెనరేషన్ లోనే, బాగ్దాద్ నగరం విజ్ఞాన కేంద్రముగానూ, వాణిజ్య కేంద్రంగానూ ఎదిగింది. విజ్ఞాన భవనం గ్రీకు భాష, మధ్య పర్షియా, సిరియన్ అనువాదపు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించింది. అబ్బాసీయ సామ్రాజ్యానికి చెందిన అనేక స్కాలర్లు, బాగ్దాద్ కు బయలు దేరారు. గ్రీకు శాస్త్రాలను, భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేసి, వాటిని అరబ్బులోనూ, ఇస్లామీయ ప్రపంచంలోనూ పరిచయంచేసారు. బాగ్దాద్ నగరం, అలనాటి చారిత్రాత్మమ, ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా మార్పు చెందినది. ఆ తరువాత ఈ నగరం ఖర్తబా (కార్డోబా) (స్పెయిన్) నగరంతో అనుసంధానం చేయబడింది.[16] కొన్ని లెక్కల ప్రకారం ఈ నగరంలో అత్యధికంగా 10 లక్షలకు పైగా జనాభా వుండేది.[17] అలీఫ్ లైలా (వెయ్యిన్నొక్క రాత్రులు) లో గల అనేక జానపద కథలు బాగ్దాద్ నగరానికి కేంద్రంగా చేసుకొని వ్రాసినవే. ఈ బాగ్దాద్ నగరంలో అరబ్బేతరులైన పర్షియన్లు, అరామియన్లు, గ్రీకులు, కొంత జనాభా వుండేది. ఈ సముదాయాలు రాను రాను అరబ్బీ భాషను స్వీకరించారు.
.
10వ శతాబ్దం లో, నగరపు జనాభా దాదాపు 300,000 నుండి 500,000 వరకూ వుండేది. కాని ఖలీఫాల అంతర్-సమస్యల కారణంగా బాగ్దాద్ నగరపు అభివృద్ధి కుంటుపడినది. ఈ సమస్యల కారణంగానే 808 - 819, 836 - 892 కాలములలో రాజధానిని బాగ్దాద్ నుండి సమర్రా నగరానికి మార్చబడింది. తరువాతి కాలంలో ఇరాన్ రాజకీయ కర్ర పెత్తనంలో బువైహిద్‌ల (945 - 1055), సెల్జుక్ తురుష్కుల (1055 - 1135) ల కాలాలలో క్షీణ దశకు చేరుకున్నది. సెల్జుక్‌లు సైబీరియా స్టెప్పీ ప్రాంతాలకు చెందిన ఒగూజ్ తురుష్కుల సంతతికి చెందిన వారు. వీరు సున్నీ ముస్లింలుగా మారారు. సా.శ. 1040 లో ఘజనవీడు లకు అంతమొందించి తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. సెల్జుక్ ల నాయకుడు తుగ్రిల్ బేగ్, 1055 లో బాగ్దాద్ ను వశపరచుకున్నాడు. సెల్జుక్ లు బుయీద్ లను పదవీచ్యుతులను చేసి బాగ్దాద్ ను తమ ఆధీనంలో తీసుకున్నారు. వీరు అబ్బాసీయ ఖలీఫాల టైటిల్ అయిన సుల్తాన్ తమకూ అన్వయించుకుని, తాము కూడా అబ్బాసీయఖలీఫాల మాదిరి చెలామణి అయ్యారు. ఈ తుగ్రిల్ బేగ్ అబ్బాసీ ఖలీఫాల సంరక్షకుడిలా నడచుకున్నాడు.[18].
1258 ఫిబ్రవరి 10, న బాగ్దాద్ మంగోలులుచే ఆక్రమించుకొనబడింది. ఈ ఆక్రమణను చెంఘీజ్ ఖాన్ మనుమడైన హులెగు (ముస్లిం సముదాయాలలో "హలాకూ"గా గుర్తించబడుతాడు), బాగ్దాద్ దురాక్రమణ చేపట్టాడు. ఈ దురాక్రమణలో వేలకొలది ఇండ్లు కాల్చబడ్డాయి, లూటీలు మారణహోమాలు జరిగాయి. ఖలీఫా అయిన అల్ ముస్తసీమ్ను మట్టుబెట్టారు, భవంతులు కార్యాలయాలు, వంతెనలు, కాలువలు, వ్యావసాయిక నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు పిల్లకాలవలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ దెబ్బతో ఇస్లామీయ సంస్కృతి కోలుకోలేక పోయింది. ఈ కాలంలో బాగ్దాద్ ను ఇరాన్కు చెందిన మంగోల్ చక్రవర్తులు ఇల్-ఖనీద్లు పరిపాలించారు. 1401 లో, బాగ్దాద్ తిరిగీ దురాక్రమణకు గురయ్యంది, ఈ సారి ఈ దురాక్రమణ తైమూర్ లంగ్ చే జరిగింది. బాగ్దాద్ ఒక ప్రాంతీయ రాజధానిగా మార్చబడింది. , దీనిపై పెత్తనం జలైయిరిద్‌లు (1400 - 1411), కారా కోయున్లు (నల్లగొర్రెల తురుష్కులు) (1411 - 1469), అక్ కోయున్లు (తెల్లగొర్రెల తురుష్కులు) (1469 - 1508), , ఇరానీ సఫవీధులు (1508 - 1534) సామ్రాజ్యాలదై యుండినది.
1534 లో, బాగ్దాద్ ఉస్మానియా తురుష్కులచే ఆక్రమించుకొనడమైనది . ఉస్మానీయుల కాలంలో, బాగ్దాద్ నగర ప్రభావం క్రమంగా క్షీణిస్తూవచ్చింది. దీనకారణాలలో ఇరానీయులు , తురుష్కుల మధ్య శతృత్వం ఒకటి. ఇరానీయులు బాగ్దాద్ పై తురుష్కుల పెత్తనాన్ని అంగీకరించ పోవడం ఒకటి. 1623 - 1638 మధ్యకాలంలో ఇరానీయుల ఆధ్వర్యంలో బాగ్దాద్ తిరిగీ మధ్య ప్రాచ్యంలో అతిపెద్ద నగరంగా రూపుదిద్దుకుంది. మమ్‌లూక్ ల ప్రభుత్వ కాలంలో బాగ్దాద్ వైభవం తిరిగీ జీవం పోసుకున్నది. నట్టల్ విజ్ఞాన సర్వస్వం నివేదిక ప్రకారం 1907 లో బాగ్దాద్ జనాభా 185,000.
1638 లో ఉస్మానీయులు తమ సామ్రాజ్యంలో కలుపుకుని 1917 మొదటి ప్రపంచయుద్ధం జరిగే సమయం వరకూ తమ ఆధీనంలో వుంచారు. 1917 లో మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆంగ్లేయులు దీనిని వశపరచుకుని, "ఇరాక్ సామ్రాజ్య" నకు రాజధానిగా 1021 లో మార్చారు. 1932లో ఇరాక్ కు పాక్షిక స్వాతంత్ర్యం ఇవ్వబడింది. 1946లో సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం జరిగింది. నగర జనాభా 1950 లో 145,000 వున్నది, 1990లో 580,000 వరకూ పెరిగింది.
1970 కాలంలో పెట్రోల్ ధరలు పెరిగిన కారణంగా బాగ్దాద్ కు మహర్దశ వచ్చింది. 1980 లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ఈ నగరానికి కష్టకాలం వచ్చింది.
2003 మార్చి ఏప్రిల్లో అమెరికా జరిపిన ఇరాక్ పై దురాక్రమణ, అమెరికా ఇరాక్ ను ఆధీనంలో తీసుకునే సమయంలో బాగ్దాద్ తీవ్రంగా లూటీలకు విచక్షణా రహిత బాంబుల ప్రయోగాలకు లోనైనది. ఇది సద్దాం హుసేన్ కాలం. ఇరాన్-ఇరాక్ యుద్ధకాలంలో సద్దాం హుసేన్ ను చేరదీసిన అమెరికా, సద్దాం హుసేన్ ఇరాక్ ను సహించలేక, ఇరాక్ పై దాడి జరిపింది. అమెరికా సైన్యం బాగ్దాద్ నగరాన్ని స్వాధీనపరచుకున్నాయి. కోలిషన్ ప్రొవిజనల్ అథారిటీ 3 చ.కి.మీ. గ్రీన్-జోన్ ను స్థాపించింది, ఈ ప్రదేశంలోనే క్రొత్త ప్రభుత్వం తన కార్యకలాపాలను ప్రారంభించింది.[19] "[20] అమెరికా అధిపత్యాన్ని బాగ్దాదీయులు సహించలేక పోయారు. అమెరికా దాడులవలన, బాగ్దాద్ నగరపు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్తు, విద్య, వైద్యం, ఇతర ప్రముఖ రంగాలన్నీ తీవ్రంగా ప్రభావితమైనవి. అమెరికా దాడి సమయంలో దాదాపు నగరమంతా అరాచకానికి లోనయ్యింది. ప్రజలు అన్నివిధాలా నష్టపోయారు. 1950లో 90 శాతం వరకూ బాగ్దాద్ ప్రజలలో సున్నీ ముస్లింలు వుండేవారు. ప్రస్తుతం షియా ముస్లింలు బాగ్దాద్ జనాభాలో 40 శాతం గలరు. అనగా సున్నీ ముస్లింలు గణనీయంగా తగ్గిపోయారు. పేర్కొనదగ్గ క్రైస్తవుల సంఖ్య కూడా ఈ నగరంలో గలదు.
బాగ్దాద్ నగరం టిగ్రిస్ నది (en:River Tigris) ఒడ్డున ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టిగ్రిస్ నది బాగ్దాద్ నగరాన్ని రెండుగా చీలుస్తున్నది. తూర్పు భాగాన్ని 'రిసాఫా', పశ్చిమ భాగాన్ని 'కర్ఖ్' అనీ పిలుస్తారు. ఈ నగరపు భూమి దాదాపు చదునుగా ఉంది. బాగ్దాద్ అత్యుష్ణ మండలంలో వున్న కారణంగా, ఎక్కువ వేడిమికలిగి వాతావరణం (కోఫెన్ వాతావరణం BWh) కలిగి వుంటుంది. ప్రపంచంలో అత్యంత వేడిమి గల నగరాలలో బాగ్దాద్ ఒకటి. వేసవి కాలం జూన్ నుండి ఆగస్టు వరకు వుంటుంది, ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రత 44 °C (111 °F) వుంటుంది. వర్షపాతం తక్కువే. కనీస ఉష్ణోగ్రత 24 °C (75 °F) వరకూ వుంటుంది. అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత 50 °C (122 °F).[21]
బాగ్దాద్ నగరం 9 జిల్లాలు, 89 పరిసరాలు, అధికారికంగా కలిగి ఉంది. ఈ నగరపు ఉపవిభాగాలు, పురపాలక కేంద్రాలుగా 2003 వరకు ఏలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకుండా సాగాయి. దాని తరువాత అమెరికా ఆధిపత్యాన గల Coalition Provisional Authority (CPA) వీటియందు క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పరిసర ప్రాంతాల యందు పురపాలక సంఘాల ఏర్పాటు, అందులో ప్రజల భాగస్వామ్యం మిగతా విషయాలు చోటు చేసుకున్నవి. ఈ విధంగా అధికార వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం, కౌన్సిళ్ళ ఏర్పాటు త్వరిత గతిన జరిగాయి.
బాగ్దాద్ రాష్ట్రంలో 127 వేరువేరు కౌన్సిళ్ళు రంగంలోకి వచ్చాయి. బాగ్దాద్ రాష్ట్ర జనాభా దాదాపు 70 లక్షలు. క్రింది స్థాయి కౌన్సిళ్ళు సరాసరి 74,000 జనాభాను ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
9 జిల్లాల అడ్వైజరీ కౌన్సిళ్ళు (DAC) క్రింది విధంగా ఉన్నాయి:[22]
అరబ్ సాంస్కృతిక జీవితంలో బాగ్దాద్ తన పాత్రను ప్రత్యేకంగా పోషించింది. ఈ నగరం అనేక రచయితలకు, సంగీతకారులకు, కళాకారులకు పుట్టినిల్లుగా కళాపోషక కేంద్రంగా వర్థిల్లింది. బాగ్దాద్ లో మాట్లాడే భాష (అరబ్బీ మాండలికం), ఇతర ప్రాంతాలలో మాట్లాడే మాండలాకలకంటే భిన్నంగా కానవస్తుంది. అరబ్ తెగల మాండలకైన వెర్సీఘ్ (అరబ్బీ మాండలికం), యొక్క ప్రభావం ఎక్కువ కానవస్తుంది. మధ్య యుగం లో అనేక గ్రామాలనుండి, అనేక తెగలవారు, పట్టణావాసం చేయడం ఒక ముఖ్య కారణం.
చూడదగ్గ ప్రదేశాలలో ఇరాక్ జాతీయ సంగ్రహాలయం ఒకటి, దీనిలోని అద్వితీయ సంగ్రహాలు 2003 నాటి దాడిలో లూటీ చేయబడ్డాయి. నేటి ఇరాకీ పార్టీల మధ్య ఈ సంగ్రహాలయపు శిథిలాలు చారిత్రక శిథిలాలుగా వుంచాలా లేదా తొలగించాలా అనే చర్చలు జరుగుచున్నవి. ఇరాక్ జాతీయ గ్రంథాలయం లోని వేలకొలదీ అమూల్యమైన అత్యంత ప్రాచీన వారసత్వ గ్రంథ, పత్రాల, రచనా సంపద అంతా ధ్వంసం చేయబడింది. ఈ దాడి ముస్లిం ధార్మిక, విజ్ఞాన కేంద్రాలపై చెంఘీజ్ ఖాన్ దాడిని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథాలయపు ప్రధాన భవనం అగ్నికి ఆహుతి చేయబడింది. ఖాదిమియా లోని అల్ ఖాదిమైన్ ధార్మిక కేంద్రం అగ్నికి ఆహుతి చేయబడింది. అబ్బాసీయ కాలపు మదరసా అల్-ముస్తన్‌సిరియా, సరాయ్ భవనం మొదలగునవి, ఇలాగే నేలమట్టమయ్యాయి.
బాగ్దాద్ జంతుప్రదర్శన శాల మధ్య ప్రాచ్యం లోనే అతి పెద్ద ప్రదర్శన శాల. 2003 లో జరిగిన అమెరికా దాడులలో, ఈ ప్రదర్శన శాలలోని 650 నుండి 700 వరకు గల జంతువులలో కేవలం 35 జంతువులు మాత్రమే మిగిలాయి. కొన్ని దాడులలో చనిపోతే, కొన్ని ఆకలితో అలమటించే మనుషుల బారిన పడ్డాయి, మిగతావి ఆహారపానీయాలు లేక మరణించాయి. [33] బ్రతికి బయటపడ్డ జంతువులలో ఎలుగుబంట్లు, సింహాలు, పులులు ఉన్నాయి.[33] దక్షిణ ఆఫ్రికా లారెన్స్ ఆంథోని, కొందరు ఈ ప్రదర్శనశాలలోని జంతువుల పరిరక్షణా బాధ్యతలు చేపడుతున్నారు. చుట్టు ప్రక్కలా సంచరించే గాడిదలకూ సంరక్షిస్తున్నారు.[33][34] అనంతరం, అమెరికాకు చెందిన ఇంజనీరు పాల్ బ్రెమర్ ఈ జంతువుల సంరక్షణ కొరకు ఆదేశాలిచ్చి, ఈ ప్రదర్శనశాలకు తిరిగీ తెరిపించాడు.[33]
ఇరాక్ లోని విజయవంతమైన ఫుట్ బాల్ టీంలలో బాగ్దాద్ టీం ఒకటి. పెద్ద టీంలకు ఉదాహరణ; అల్ ఖువా అల్ జావియా (ఎయిర్ ఫోర్స్), అల్ జౌరా, అల్ షుర్తా (పోలీస్), అల్ తాలబా (విద్యార్థులు). బాగ్దాద్ లో పెద్ద్ స్టేడియం అల్ షాబ్ స్టేడియం దీనిని 1966లో ప్రారంభించారు. ఇంకో స్టేడియం తయారవుచున్నది. ఈ నగరంలో గుర్రపు స్వారీ కూడా ఒక ప్రముఖ క్రీడ, రెండవ ప్రపంచ యుద్ధం కాలం నుండి ఇది ప్రసిద్ధిగాంచింది. ఇంకా అనేక జూద క్రీడలు ఇరాక్ లో సాధారణంగా కానవచ్చే క్రీడలు.
దాదాపు ఇరాకీ పునర్నిర్మాణం ప్రయత్నాలు, పట్టణ ప్రాంతాలలో జరిగిన తీవ్ర నష్టాలను పూడ్చుటకు తయారు చేయబడినవి. ఆర్కిటెక్ట్, పట్టణ డిజైనర్ అయిన హిషామ్ అష్కూరి యొక్క బాగ్దాద్ పునరుజ్జీవన ప్రణాళిక, సింద్‌బాద్ హోటల్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ సెంటర్ ప్రైవేటు రంగానికి ఇవ్వబడింది.[35]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.