చ.కి.మీ= m²
గణితంలోని కొలత From Wikipedia, the free encyclopedia
చదరపు మీటర్ ను వర్గం (స్క్వేర్) చేయగా వచ్చు ఫలితాన్ని చదరపు కిలోమీటరు లేదా స్క్వేర్ కిలోమీటర్ అని అంటారు. దీనిని కిమీ2 చే సూచిస్తారు.
ఒక చదరపు కిలోమీటర్ కు సమానమైనవి:
- 1,000,000 చదరపు మీటర్లు (మీ2)
- 100 హెక్టార్లు (హెక్టార్లు)
సుమారు సమానంగా ఉండేవి:
- 0.3861 చదరపు మైళ్లు
- 247.1 ఎకరాలు
విలోమం:
- 1 మీ2 = 0.000001 (10−6) కిమీ2
- 1 హెక్టార్ = 0.01 (10-2) కిమీ2
- 1 చదరపు మైలు = 2.5899 కిమీ2
- 1 ఎకరం = దాదాపు 0.004047 కిమీ2
కిమీ2 అంటే (కిమీ)2 అని అర్థం, 3కిమీ2 అంటే 3×(1,000మీ)2 = 3,000,000 మీ2కి సమానం.
ఉదాహరణలు
టోపోగ్రాఫికల్ మ్యాప్

టోపోగ్రాఫికల్ పటం గ్రిడ్‌లు మీటర్లలో గుర్తించబడి ఉంటాయి, గ్రిడ్ లైన్‌లు 1,000 మీటర్ల దూరంలో ఉంటాయి. అంటే ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఒక గ్రిడ్ ఆక్రమించి ఉంటుంది.
మధ్యయుగ నగర కేంద్రాలు
అనేక ఐరోపా మధ్యయుగ నగరాల గోడలచే చుట్టబడిన ప్రాంతం దాదాపు ఒక చదరపు కిలోమీటరుగా ఉంటుంది.
ఒక చదరపు కిలోమీటరు గల ప్రాంతాలు
- పాత నగరం జెరూసలేం దాదాపు 1 చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉంది.
- మిల్టన్ సైన్స్ పార్క్, ఆక్స్‌ఫర్డ్‌షైర్, UK.
- మియెలెక్ ఇండస్ట్రియల్ పార్క్, మీలెక్, పోలాండ్.
- గిల్డ్‌ఫోర్డ్ క్యాంపస్ ఆఫ్ గిల్డ్‌ఫోర్డ్ గ్రామర్ స్కూల్, సౌత్ గిల్డ్‌ఫోర్డ్, పశ్చిమ ఆస్ట్రేలియా.
- సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SVNIT), సూరత్, ఇండియా.
- మారిషస్ తూర్పు తీరానికి సమీపంలో ఉన్న సెర్ఫ్స్ ద్వీపం.
- పెంగ్ చౌ ద్వీపం, హాంగ్ కాంగ్.[1][2]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.