From Wikipedia, the free encyclopedia
శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lankan cricket team ) అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించిన జట్టులలో ఇది 8వది. 1990 దశాబ్దంలో పూర్తిగా క్రిందిస్థాయిలో ఉన్న జట్టు క్రమంగా ఉన్నత స్థానంలోకి చేరినది. 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ సాధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ఒక స్థానాన్ని సంపాదించి అడపాదడపా విజయాలను నమోదుచేస్తూనే ఉంది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ లాంటి బ్యాట్స్మెన్లు, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి బౌలర్లు శ్రీలంకకు గత 15 సంవత్సరాలలో పలు విజయాలు అందజేశారు.
దస్త్రం:Sri Lanka Cricket Cap Insignia.svg | |||||||||||||
మారుపేరు | ది లయన్స్ | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అసోసియేషన్ | Sri Lanka Cricket | ||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||
టెస్టు కెప్టెన్ | దిముత్ కరుణరత్నే | ||||||||||||
ఒన్ డే కెప్టెన్ | కుసాల్ మెండిస్ | ||||||||||||
Tట్వంటీ I కెప్టెన్ | దాసున్ శనక | ||||||||||||
కోచ్ | క్రిస్ సిల్వర్‌వుడ్ | ||||||||||||
చరిత్ర | |||||||||||||
టెస్టు హోదా పొందినది | 1981 | ||||||||||||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | |||||||||||||
ICC హోదా | అసోసియేట్ సభ్యుడు (1965) పూర్తి సభ్యుడు (1981) సస్పెండ్ చేయబడింది (2023) | ||||||||||||
ICC ప్రాంతం | ఆసియా | ||||||||||||
| |||||||||||||
టెస్టులు | |||||||||||||
మొదటి టెస్టు | v ఇంగ్లాండు వద్ద P. సారా ఓవల్, కొలంబో; 17–21 ఫిబ్రవరి 1982 | ||||||||||||
చివరి టెస్టు | v పాకిస్తాన్ వద్ద సింగలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో; 24–27 జూలై 2023 | ||||||||||||
| |||||||||||||
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | 5th place (2021–2023) | ||||||||||||
వన్డేలు | |||||||||||||
తొలి వన్డే | v వెస్ట్ ఇండీస్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్; 7 జూన్ 1975 | ||||||||||||
చివరి వన్డే | v న్యూజీలాండ్ at M. Chinnaswamy Stadium, Bangalore; 9 November 2023 | ||||||||||||
| |||||||||||||
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | Champions (1996) | ||||||||||||
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 2 (first in 1979) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | Champions (1979, 2023) | ||||||||||||
ట్వంటీ20లు | |||||||||||||
తొలి టి20ఐ | v ఇంగ్లాండు వద్ద ది రోజ్ బౌల్, సౌతాంప్టన్; 15 జూన్ 2006 | ||||||||||||
చివరి టి20ఐ | v న్యూజీలాండ్ వద్ద M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు; 9 నవంబర్ 2023 | ||||||||||||
| |||||||||||||
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) | ||||||||||||
అత్యుత్తమ ఫలితం | Champions (2014) | ||||||||||||
| |||||||||||||
As of 9 November 2023 |
అక్టోబర్ 2007 నాటికి శ్రీలంక 170 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 29.41% విజయాలు సాధించగా, 37.05% పరాజయాలు పొందినది. 33.52% డ్రాగా ముగించింది.
1972కు పూర్వం సిలోన్ అనబడే శ్రీలంక దేశంలో 1926-27లో మొట్టమొదటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పోటీ కొలంబోలోని విక్టోరియా పార్క్‌లో నిర్వహించారు. అందులో శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని పొందినది.[9] శ్రీలంక జట్టుకు తొలి విజయం పటియాలాలోని ధ్రువ్పాండవ్ స్టేడియంలో 1932-33లో జరిగిన మ్యాచ్‌లో దక్కినది.[10]
1981లో శ్రీలంక జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడింది. ఈ హోదా పొందిన దేశాలలో ఇది ఎనిమిదవది. 1982లో ఈ జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతకు ముందే 1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొని అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడినది. 1990 దశకంలో ఈ జట్టు శక్తివంతమైన ప్రదర్శన ప్రదర్శించింది. ఇదే ఊపుతో 1996లో భారత ఉపఖండంలో జరిగిన 6వ ప్రపంచ కప్ పోటీలలో విశ్వవిజేతగా నిల్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపర్చింది. 2003లో దక్షిణాఫ్రికాలో నిర్వహించబడిన ప్రపంచ కప్‌లో కూడా సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. 2007లో ఫైనల్ వరకు దూసుకెళ్ళింది.
వన్డే ప్రపంచ కప్ | ఐసిసి చాంపియన్ ట్రోఫీ | ఆసియా కప్ | ఆస్ట్రేలేషియా కప్ | కామన్వెల్త్ క్రీడలు | ఐఐచి ట్రోఫీ |
---|---|---|---|---|---|
|
|||||
శ్రీలంక టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
క్ర.సం | పేరు | టెస్టులు | గెలుపు | ఓటమి | డ్రా | |||
1 | బండుల వర్ణపుర | 4 | 0 | 3 | 1 | |||
2 | దులీప్ మెండిస్ | 19 | 2 | 8 | 9 | |||
3 | సోమచంద్ర డి సిల్వ | 2 | 0 | 2 | 0 | |||
4 | రంజన్ మధుగలె | 2 | 0 | 2 | 0 | |||
5 | అర్జున రణతుంగె | 56 | 12 | 19 | 25 | |||
6 | అరవింద డి సిల్వ | 6 | 0 | 4 | 2 | |||
7 | హసన్ తిలకరత్నె | 11 | 1 | 4 | 6 | |||
8 | సనత్ జయసూర్య | 38 | 18 | 12 | 8 | |||
9 | మర్వన్ ఆటపట్టు | 18 | 8 | 6 | 4 | |||
10 | మహేల జయవర్థనే | 14 | 6 | 4 | 4 | |||
మొత్తము | 170 | 47 | 64 | 59 | ||||
శ్రీలంక వన్డే క్రికెట్ కెప్టెన్లు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
క్ర.సం | పేరు | వన్డేలు | గెలుపు | టై | ఓటమి | ఫలితం తేలనివి | ||
1 | అనుర టెన్నెకూన్ | 4 | 0 | 0 | 4 | 0 | ||
2 | బండుఅ వర్ణపుర | 8 | 3 | 0 | 5 | 0 | ||
3 | దులీప్ మెండిస్ | 61 | 11 | 0 | 46 | 4 | ||
4 | సోమచంద్ర డి సిల్వ | 1 | 0 | 0 | 1 | 0 | ||
5 | రంజన్ మధుగలె | 13 | 2 | 0 | 11 | 0 | ||
6 | అర్జున రణతుంగ | 193 | 89 | 1 | 95 | 8 | ||
7 | రవి రత్నాయకె | 1 | 1 | 0 | 0 | 0 | ||
8 | అరవింద డి సిల్వ | 18 | 5 | 0 | 12 | 1 | ||
9 | రోషన్ మహానామా | 2 | 0 | 0 | 2 | 0 | ||
10 | సనత్ జయసూర్య | 117 | 65 | 2 | 47 | 3 | ||
11 | మర్వన్ ఆటపట్టు | 63 | 35 | 0 | 27 | 1 | ||
12 | మహేలా జయవర్థనే | 26 | 19 | 0 | 6 | 1 | ||
13 | చమిండా వాస్ | 1 | 0 | 1 | 0 | 0 | ||
మొత్తము | 502 | 226 | 3 | 255 | 18 | |||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.