Remove ads
From Wikipedia, the free encyclopedia
పటియాలా పంజాబ్‌లో ఆగ్నేయ భాగంలో ఉన్న నగరం. ఇది రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. పటియాలా జిల్లాకు ముఖ్య పట్టణం. 1763 లో పటియాలా రాజ వంశాన్ని స్థాపించిన సిద్దూ జాట్ అధిపతి అలా సింగ్ నిర్మించిన ఖిలా ముబారక్ చుట్టూ పటియాలా నగరం విస్తరించింది. ఈ వంశం పేరిటే నగరానికి ఈ పేరు పెట్టారు.
పటియాలా | |||||||
---|---|---|---|---|---|---|---|
నగరం | |||||||
Coordinates: 30.34°N 76.38°E | |||||||
దేశం | India | ||||||
రాష్ట్రం | పంజాబ్ | ||||||
జిల్లా | పటియాలా | ||||||
Founded by | ఆలా సింగ్ | ||||||
Named for | ఆలా సింగ్ | ||||||
Government | |||||||
• Type | మునిసిపాలిటీ | ||||||
• Body | పటియాలా మునిసిపల్ కార్పొరేషను | ||||||
విస్తీర్ణం | |||||||
• నగరం | 160 కి.మీ2 (60 చ. మై) | ||||||
• Metro | 366.66 కి.మీ2 (141.57 చ. మై) | ||||||
Elevation | 350 మీ (1,150 అ.) | ||||||
జనాభా (2011) | |||||||
• నగరం | 4,06,192[3] | ||||||
• Metro | 4,46,246 | ||||||
Demonym | పాటియాల్వీ | ||||||
భాషలు | |||||||
• అధికారిక | పంజాబీ | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
PIN | 147001 to 147007 and 147021 to 147023 | ||||||
టెలిఫోన్ కోడ్ | పటియాలా: 91-(0)175, రాజ్‌పురా: 91-(0)1762, పట్రాన్ & సామనా: 91-(0)1764, నభా: 91-(0)1765 & అమ్లోహ్: 91-(0)1768 | ||||||
ISO 3166 code | IN-Pb | ||||||
Vehicle registration | PB-11 |
ప్రజా జీవనంలో, సంస్కృతిలో నగరం భాగమైంది. పటియాలా షాహి తలపాగా (తలపాగాలో ఒక రకం), పరందా, పటియాలా సల్వార్ (స్త్రీల దుస్తులు), జుట్టీ (బూట్లు), పటియాలా పెగ్ (మద్యం యొక్క కొలత) వంటివి ప్రజాఅ జీవితంలో భాగమై పోయాయి. [4]
'పటియాలా' పాటి, ఆలా అనే రెండు మూల పదాల నుండి వచ్చింది, ఉర్దూలో పాటి అంటే నేల అని అర్థం. అలా అనేది నగర వ్యవస్థాపకుడు అలా సింగ్ పేరు నుండి వచ్చింది. కాబట్టి, 'పటియాలా' అంటే అలా గారి స్థలం అని చెప్పవచ్చు. [5]
పటియాలా రాజ్యాన్ని 1763 లో అలా సింగ్ స్థాపించాడు. అతను కిలా ముబారక్ అనే పేరుగల పటియాలా కోటను నిర్మించాడు. దాని చుట్టూ ప్రస్తుత పటియాలా నగరాన్ని నిర్మించారు. 1761 లో మూడవ పానిపట్టు యుద్ధంలో ఆఫ్ఘన్లు మరాఠాలను ఓడించాక, పంజాబ్ అంతటా ఆఫ్ఘన్లు అధికారం చెలాయించారు. ఈ దశలోనే పటియాలా పాలకులు రాయల్టీని పొందడం మొదలైంది. పటియాలా రాజ్యం, ఆఫ్ఘన్ దుర్రానీ సామ్రాజ్యంతోటి, మరాఠా సామ్రాజ్యం, లాహోర్ సిక్కు సామ్రాజ్యాల తోటీ నలభై ఏళ్ళకు పైగా నిరంతరం ఆధిపత్య పోరాటాలు చేసింది.
1808 లో, పటియాలా రాజా 1808 లో లాహోర్‌కు చెందిన సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా భారత ఉపఖండంలోని బ్రిటిష్ వారు చేపట్టిన పెద్ద సామ్రాజ్య నిర్మాణ ప్రక్రియలో సహకారి అయ్యాడు. పటియాలా బ్రిటిష్ రాజ్ కాలంలో 17-తుపాకుల వందనం (17-గన్ సెల్యూట్) రాజ్యంగా మారింది. కరమ్ సింగ్, నరీందర్ సింగ్, మహేంద్ర సింగ్, రాజిందర్ సింగ్, భూపిందర్ సింగ్,, యదువీంద్ర సింగ్ వంటి పటియాలా పాలకులకు బ్రిటిషు వారు గౌరవ మర్యాదలతో సంభావించారు
పటియాలా నగరాన్ని దేవాలయ నిర్మాణ శైలిలో రూపొందించి, అభివృద్ధి చేసారు. పటియాలా లోని తొలి స్థిరనివాసులు సిర్హింద్ కు చెందిన హిందువులు. వాళ్ళు దర్శని గేట్ వెలుపల తమ వ్యాపార సంస్థలను తెరిచారు. [6]
ఈ రాజ మహలుకు ఇప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వం వహిస్తున్నాడు. అతను ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి కూడా. ఈ రాజ వంశీకులను తూర్పు పంజాబ్లో సాంస్కృతిక, రాజకీయ చిహ్నాలుగా భావిస్తారు.
1813 నుండి 1845 వరకు పాలించిన మహారాజా కరం సింగ్ (పంజాబ్ లోని పటియాలా సిక్కు రాజ్యం) బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో చేరి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ యొక్క సిక్కు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధాల సమయంలో బ్రిటిష్ వారికి సహాయం చేసింది. అప్పట్లో రంజిత్ సింగ్ రాజ్యం టిబెట్ కాశ్మీర్, ఆఫ్ఘన్ సరిహద్దుల సమీపంలో పెషావర్ నుండి పంజాబ్ మైదానాల వరకూ విస్తరించింది.
1947 లో భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, పటియాలా పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రధాన విద్యా కేంద్రంగా అవతరించింది. ఈ నగరంలో థాపర్ విశ్వవిద్యాలయం, [7] ఎల్.ఎమ్. థాపర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, [8] జగత్ గురు నానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్శిటీ, పంజాబ్ స్పోర్ట్స్ యూనివర్శిటీలు ఉన్నాయి. పంజాబీ విశ్వవిద్యాలయం, [9] రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా, [10] జనరల్ శివదేవ్ సింగ్ దివాన్ గుర్బాచన్ సింగ్ ఖల్సా కాలేజ్, [11] మోహింద్రా కాలేజ్, ఆర్యన్స్ కాలేజ్ ఆఫ్ లా, ముల్తాని మాల్ మోడీ కాలేజ్, రాజీంద్ర హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల, పటియాలా, ప్రొ. గుర్సేవాక్ సింగ్ ప్రభుత్వ శారీరక విద్య కళాశాల, బాలికల ప్రభుత్వ కళాశాల వీటిలో కొన్ని. ఉత్తర భారతదేశంలోని ప్రధాన వాణిజ్య కళాశాలలలో ఒకటైన ప్రభుత్వ బిక్రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, [12] కూడా నగరం లోనే ఉంది.
పటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉత్తర భారతదేశపు క్రీడా కేంద్రంగా ఉంది. పటియాలా లోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా, [13] 2006 పంజాబ్ ప్రభుత్వ చట్టం ప్రకారం స్థాపించారు. ఇది ఉత్తర భారతంలోని మొదటి జాతీయ న్యాయ పాఠశాల.
పటియాలాలో ఉన్న విశ్వవిద్యాలయాలు:
పేరు | విశ్వవిద్యాలయం రకం |
---|---|
పంజాబీ విశ్వవిద్యాలయం | రాష్ట్ర విశ్వవిద్యాలయం |
థాపర్ విశ్వవిద్యాలయం | డీమ్డ్ విశ్వవిద్యాలయం |
రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా | రాష్ట్ర విశ్వవిద్యాలయం |
పంజాబ్ క్రీడా విశ్వవిద్యాలయం | రాష్ట్ర విశ్వవిద్యాలయం |
జగత్ గురు నానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్శిటీ | రాష్ట్ర విశ్వవిద్యాలయం |
పటియాలాలోని పాఠశాలల జాబితా:
పటియాలా నగరంలో అనేక ఆట స్థలాలు ఉన్నాయి. వీటిలో రాజా భలీంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి. దీనిని పోలో గ్రౌండ్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఇండోర్ స్టేడియం ఉంది. అథ్లెటిక్స్ కోసం యాదవీంద్ర స్పోర్ట్స్ స్టేడియం, రోలర్ స్కేటింగ్ కోసం రింక్ హాల్, క్రికెట్ కోసం ధ్రువ్ పాండొవ్ క్రికెట్ స్టేడియం, పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వంటి ఇతర క్రీడా సౌకర్యాలు కూడా ఉన్నాయి.
పటియాలా నగరంలో మతం[14] | ||||
---|---|---|---|---|
మతం | శాతం | |||
హిందూమతం | 57.22% | |||
సిక్కు మతం | 39.96% | |||
ఇతరులు | 2.82% |
పటియాలా నగరంలో హిందూ మతం, సిక్కు మతాలు ప్రధానమైనవి. మైనారిటీలు ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఉన్నారు. [15]
2011 జనాభా లెక్కల ప్రకారం, పటియాలా నగర జనాభా శివార్లతో కలిపి 446,246, పటియాలా నగరం వరకు 406,192. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46% ఉన్నారు. పటియాలా సగటు అక్షరాస్యత రేటు 86% ఇది జాతీయ సగటు 64.9% కంటే ఎక్కువ. పటియాలా జనాభాలో ఐదేళ్ళ లోపు పిల్లలు మొత్తం జనాభాలో 10% మంది ఉన్నారు
మాల్వా ప్రాంతంపై పటియాలా ప్రభావం, కేవలం రాజకీయ ప్రభావమే కాక, దాన్ని మించి విస్తరించింది. పటియాలా మత, సాంస్కృతిక జీవితాల సమితి. విద్యాపరంగా, పటియాలా ముందంజలో ఉంది. 1870 లోనే డిగ్రీ స్థాయి చదువు కలిగిన కళాశాల మొహీంద్రా కళాశాల ఈ నగరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయి కళాశాలల్లో ఇది తొలి తరానికి చెందినది.
పటియాలా ఒక ప్రత్యేకమైన శైలి నిర్మాణ పరిణామాన్ని చూసింది. రాజపుత్ర శైలి లోని అందాన్నీ, చక్కదనాన్నీ అందిపుచ్చుకుని, దానికి స్థానిక సంప్రదాయాలతో మేళవించిన శైలి ఇది.
పటియాలా మహారాజుల చురుకైన ప్రోత్సాహంతో, " పటియాలా ఘరానా " అనే హిందూస్థానీ సంగీత శైలి వృద్ధి చెందింది. ప్రస్తుత కాలం వరకు దాని ప్రత్యేకతను నిలుపుకుంటూ ఉంది. ఈ సంగీత శైలిలో అనేక మంది ప్రసిద్ధ సంగీతకారులు పేరుతెచ్చుకున్నారు. వీరిలో చాలా మంది 18 వ శతాబ్దంలో ఢిల్లీలోని మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత పటియాలా వచ్చారు. శతాబ్దం ప్రారంభంలో, ఉస్తాద్ అలీ బక్ష్ ఈ ఘరానాకు చెందిన అత్యంత ప్రసిద్ధ వ్యక్తి. ఆ తరువాత, అతని కుమారులు ఉస్తాద్ అక్తర్ హుస్సేన్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. పటియాలా ఘరానాకు కీర్తి తెచ్చారు.
బ్రిటిష్ ఇండియా విభజన తరువాత, ముస్లింలు సామూహికంగా పాకిస్తాన్‌కు వలసపోయారు. అదే సమయంలో, చాలా మంది హిందూ, సిక్కు శరణార్థులు పాకిస్తాన్ నుండి వలస వచ్చి పటియాలాలో స్థిరపడ్డారు. అప్పటి పటియాలా మహారాజా, హిస్ హైనెస్ యాదవీంద్ర సింగ్, పెప్సుకు చెందిన రాజ్‌ప్రముఖ్‌గా ఉండేవాడు. ఆయన తన భార్య మహారాణి మొహిందర్ కౌర్‌తో కలిసి పెద్ద సంఖ్యలో శిబిరాలను నిర్వహించి ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు.
పటియాలా భారతదేశంలో అత్యధిక తలసరి వాహనాలు కలిగిన నగరాల్లో ఒకటి. [16]
నగరం నుండి అంబాలా, కైతాల్, చండీగఢ్, అమృత్‌సర్, ఢిల్లీ తదితర నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.. పటియాలా నుండి రాష్ట్ర రహదారి 8 ద్వారా లుధియానా, జలంధర్, అమృత్సర్ వంటి నగరాలకు వెళ్ళే ఎన్‌హెచ్ 1 కు సంధానం ఉంది. NH 1 సిర్హింద్ వరకు వెళ్తుంది. NH 64 (జిరాక్‌పూర్ - పటియాలా - సంగ్రూర్ - భటిండా) పటియాలాను రాజ్‌పురాతో కలుపుతుంది.
పటియాలా రహదారితో పాటు రైలు ద్వారా కూడా ఢిల్లీకి చక్కటి రవాణా సౌకర్యం ఉంది. పటియాలాకు అంబాలా రైల్వే డివిజన్ కింద రైల్వే స్టేషన్ ఉంది. పటియాలా విమానాశ్రయం ప్రస్తుతం పనిచేయడం లేదు . సమీప దేశీయ విమానాశ్రయం చండీగఢ్ విమానాశ్రయం. ఇది సుమారు 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. పటియాలాకు నభా పట్టణం చాలా దగ్గరలో, 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. [17]
పటియాలా నుండి ప్రధాన పట్టణాలకు దూరాలు:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.