From Wikipedia, the free encyclopedia
మర్వన్ ఆటపట్టు (Marvan Samson Atapattu) 1970, నవంబర్ 22న శ్రీలంక లోని కలుతరలో జన్మించాడు. ఇతడు శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఢిల్లీ జెట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిఛాడు.
దస్త్రం:శ్రీలంక Cricket Practice Session - Coach Marvan Atapattu giving slip catching practice.jpg | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Marvan Samson Atapattu | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Kalutara, Ceylon | 1970 నవంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right arm లెగ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Opening బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 46) | 1990 నవంబరు 23 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2007 నవంబరు 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 59) | 1990 డిసెంబరు 1 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2007 ఫిబ్రవరి 17 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990/91–2006/07 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2008 | ఢిల్లీ Giants | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2008 సెప్టెంబరు 27 |
ఆతపట్టు నవంబర్ 1990లో టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసాడు. ప్రారంభంలో అంతర్జాతీయ క్రికెట్లో అతని ఆటతీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. తొలి 6 ఇన్నింగ్సులలో 5 డకౌట్లు మరో ఇన్నింగ్సులో 1 పరుగు సాధించాడు. దేశవాళి పోటీలలో టన్నులకొద్ది పరుగులు సాధించే ఆటపట్టు ఆ తరువాత 11 ఇన్నింగ్సులలో అత్యధిక స్కోరు 29 మించలేకపోయాడు. అతని 10వ టెస్టులో భారత్ పై ఎట్టకేలకు తొలి సెంచరీని నమోదుచేశాడు. అప్పటికి టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసి 7 సంవత్సరాలు కావడం గమనార్హం. 22 మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి డకౌట్లలో, పేరౌట్లలో (రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే ఔట్ కావడం) టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు!
క్రమక్రమంగా పట్టు సాధించి మొత్తంపై 89 టెస్టులలో 5502 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతడి అత్యధిక స్కోరు 249 పరుగులు.
ఆటపట్టు 268 వన్డేలలో 37.57 సగటుతో 8529 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 59 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 132 (నాటౌట్).
ఆటపట్టు 4 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా శ్రీలంక విజయం సాధించిన 1996లో, ఆ తరువాత 1999, 2003, 2007లలో కూడా శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.