జేమ్స్ ఆండర్సన్ (క్రికెటర్)
From Wikipedia, the free encyclopedia
జేమ్స్ మైఖేల్ ఆండర్సన్ (జననం 1982 జూలై 30) ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ జట్టులో భాగమైన ఇంగ్లిష్ క్రికెటర్. ఇతను గతంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1100కి పైగా ఫస్ట్ క్లాస్ వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. .
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జేమ్స్ మైఖేల్ ఆండర్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1982-07-30) 1982 జూలై 30 (వయసు 41) బర్న్లే, లంకషైర్, ఇంగ్లండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అడుగుల 2 అంగుళాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 613) | 2003 మే 22 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జులై 27 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 172) | 2002 డిసెంబరు 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2015 మార్చి 13 - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 9 (గతంలో 40) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2007 జనవరి 9 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 నవంబరు 15 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000 | లంకషైర్ క్రికెట్ బోర్డు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–present | లంకషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08 | ఆక్లాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 జులై 31 |
దేశీయ క్రికెట్లో ఇతను లంకషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2010 ఐసీసీ ప్రపంచ టీ20 కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో ఆండర్సన్ ఒక సభ్యుడు
అండర్సన్ 2002 నుంచి 2015 వరకూ ఇంగ్లండ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో భాగంగా ఆడాడు. 2003లో జింబాబ్వేపై టెస్ట్ కెరీర్ ప్రారంభించాడు. 2007 నుంచి కొన్నేళ్ళ పాటు టీ20 టీమ్‌లో భాగంగా ఆడాడు.[1] 2018లో ఇంగ్లండ్ 1000వ టెస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డ్ తయారుచేసిన దేశపు అత్యుత్తమ ఆల్-టైమ్ టెస్ట్ ఎలెవెన్ జట్టులో భాగంగా ఆండర్సన్ ఎంపికయ్యాడు.[2] 2023 జూలై నాటికి, అతను ఐసీసీ పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని నాల్గవ టెస్ట్ బౌలర్‌గా ర్యాంక్ పొందాడు.[3]
అండర్సన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్. 600 పైచిలుకు టెస్ట్ వికెట్లు తీసి టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లలోగా చరిత్రకెక్కాడు.[4] అతను ఇంగ్లండ్ తరఫున అత్యంత ఎక్కవ మ్యాచ్‌లు ఆడినవాడిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ రికార్డు ఉన్నది ఇతనికే.[5][6] బ్యాట్స్‌మెన్‌గా ఇతను, జో రూట్ కలసి టెస్టుల్లో 198 పరుగులతో అత్యధిక పదో వికెట్ భాగస్వామ్యం సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.[7]
భారత్‌తో ధర్మశాల వేదికగా జరిగిన 2024 ఫిబ్రవరిలో 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 700 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా, ప్రపంచంలోనే ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 3వ బౌలర్ రికార్డు సృష్టించాడు.[8] ఇంతకు ముందు శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ మాత్రమే టెస్ట్ క్రికెట్లో 700+ వికెట్లు పడగొట్టారు.[9][10]