శ్రీలంక క్రికెటర్ From Wikipedia, the free encyclopedia
1972, ఏప్రిల్ 17న జన్మించిన ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ బౌలర్. 2007, డిసెంబర్ 4న టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండుతో కాండీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కాలింగ్వుడ్ను తన స్పిన్ బౌలింగ్‌తో ఔట్ చేసి తన టెస్ట్ జీవితంలో 709వ వికెట్టు సాధించి ఇంతకు క్రితం ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ సృష్టించిన రికార్డును అధిగమించాడు. షేన్‌వార్న్ 145 టెస్టులు ఆడి నెలకొల్పిన రికార్డును మరళీధరన్ కేవలం 116వ టెస్టులోనే అధిగమించాడు. 2004లోనే మరళీధరన్ అత్యధిక టెస్ట్ వికెట్ల రికార్డును సృష్టించిననూ ఆ వెంటనే షేన్‌వార్న్ అధిగమించాడు. చాలా కాలంపాటు ఈ రికార్డు వీరిద్దరి మధ్య చేతులు మారింది. షేర్‌వార్న్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో ఇక మరళీధరన్‌కు తిరుగులేకపోయింది. వన్డే క్రికెట్లో కూడా అత్యధిక వికెట్ల రేసులో మరళీధరన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2002లో మరళీధరన్ గణాంకపరంగా క్రికెట్ బౌలర్లలో సుప్రసిద్ధుడిగా విజ్డెన్ క్రికెటర్స్ యొక్క అల్మానాక్ ద్వారా గుర్తింపు పొందినాడు [3]. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందిననూ అతని క్రీడాజీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు. బౌలింగ్ శైలిపై పలు మార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు అతను జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై మాత్రమే ఎక్కువ వికెట్లు సాధించాడని, ఆస్ట్రేలియా, భారత్‌లపై రికార్డు అంతంత మాత్రమేనని విమర్శకుల వాదన. ఏమైననూ క్రీడాప్రపంచం దృష్టిలో అతను గొప్ప బౌలరే.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ముత్తయ్య మురళీధరన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్యాండీ, శ్రీలంక | 1972 ఏప్రిల్ 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ముత్తయ్య | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 7 అం. (1.70 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 54) | 1992 ఆగస్టు 28 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2010 జూలై 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 70) | 1993 ఆగస్టు 12 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2011 ఏప్రిల్ 2 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 8 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 13) | 2006 డిసెంబరు 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 అక్టోబరు 31 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991/92–2009/10 | Tamil Union | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999, 2001, 2005, 2007 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | Kent | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | Chennai Super Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Kochi Tuskers Kerala | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | Gloucestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | Wellington Firebirds | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12 | Chittagong Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2014 | Royal Challengers Bangalore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–2013/14 | Melbourne Renegades | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Jamaica Tallawahs | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2014 జనవరి 8 |
1992లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మురళీధరన్ టెస్టులు, వన్డే క్రికెట్ లలో కల్పి 1000 వికెట్లకు పైగా సాధించి ఈ ఘనత పొందిన తొలి బౌలర్ గా అవతరించాడు. 200 కి పైగా వికెటను సాధించిన బౌలర్ల గణాంకాలు చూస్తే ప్రతి టెస్ట్ మ్యాచ్ కు అత్యధిక సరాసరి వికెట్లు (6.2) తీసుకున్న బౌలర్‌గా మురళీధరన్ ప్రథమ స్థానంలో నిలుస్తారు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెటులు సాధించిన బౌలర్‌గా రికార్డు స్థాపించడం మురళీధరన్ కు ఇది తొలిసారి కాదు. ఇంతకు పూర్వమే 2004 మేలో 519 టెస్ట్ వికెట్లు సాధించి వెస్ట్ఇండీస్ బౌలర్ కోర్ట్నీవాల్ష్ సృష్టించిన రికార్డును అధికమించాడు. 2004 చివరి నాటికి షేర్వార్న్ీధికమించే వరకు ఇతనిదే రికార్డు[4]. ఇన్నాళ్ళు వార్న్ రికార్డును అధికమించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్పిన్ మాంత్రికుడు పట్టువదలేడు. చివరికి వార్న్ రిటైర్ కావడంతో మరళీధరన్ కు అవకాశం లభించింది. అయితే తన రికార్డును మరలి అధికమిస్తాడని వార్న్ ఎప్పుడొ జోస్యం చెప్పాడు. తను రిటైర్ కావడాన్కి ముందే అంతర్జాతీయ క్రికెట్ లో మరళి 1000 వికెట్లు సాధిస్తాడని కూడా వార్న్ జోస్యం చెప్పాడు.[5] ఈ విషయంలో మాజీ ప్రపంచ రికార్డు స్థాపకుడు కోర్ట్నీవాల్ష్ కూడా మరళీధరన్ వికెట్ల ఆకలితో ఉన్నాడని త్వరలోనే ఈ రికార్డుకు చేరువ అవుతాడని చెప్పినాడు.[6] మురళీధరన్ స్వయంగా ఈ మైలురాయిని చేరుకోవడం సుసాధ్యమేనని ఊహించాడు.[7]
భారతీయ సంతతికి చెందిన, శ్రీలంక తమిళుడైన మురళీధరన్ 2005 మార్చి 21 న తమిళ అమ్మాయి మదిమలార్ ను వివాహం చేసుకున్నాడు [8]. 2006 జనవరిలో మొదటి సంతానం నరేన్ జన్మించాడు [9]. క్రికెట్ అంటే ఏమిటో తెలియని మదిమలర్ మురళీధరన్ ను తొలి చూపులోనే క్లీన్‌బౌల్డ్ చేసింది.[10]. ఎంబిఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన మదిమలార్ కు ఈ సంబంధం కుదిర్చింది తమిళ నటుడు చంద్రశేఖర్.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.