![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/Kashmir_Jammu_Map.png/640px-Kashmir_Jammu_Map.png&w=640&q=50)
సియాచెన్ ఘర్షణ
From Wikipedia, the free encyclopedia
సియాచెన్ హిమానీనదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రం.[8][9] భారత్ పాకిస్తాన్లు 1984 ఏప్రిల్ 13 నుండి అడపాదడపా అనేక సార్లు ఘర్షణ పడ్డాయి. రెండు దేశాలూ శాశ్వత సైనిక స్థావరాలను స్థాపించాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఇరుదేశాలూ కలిసి 2000 మంది వరకూ కోల్పోయాయి.
త్వరిత వాస్తవాలు సియాచెన్ ఘర్షణ, తేదీ ...
సియాచెన్ ఘర్షణ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ఇండో-పాకిస్తాన్ యుద్ధాలు, కాశ్మీరు సమస్యలో భాగము | |||||||||
![]() కాశ్మీరులో సియాచెన్ (తెల్లనిది) సియాచెన్ హిమానీ నదం కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
![]() | ![]() | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
![]() LGen P.N.Hoon LGen M.L.Chibber MGen Shiv Sharma LGen V.R.Raghavan BGen C.S.Nugyal BGen R.K.Nanavatty BGen V.K.Jaitley | LGen Zahid Ali Akbar BGen Pervez Musharraf | ||||||||
బలం | |||||||||
3,000+ [2] | 3,000[2] | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
846 మృతులు (సాయుధ ఘర్షణేతర మరణాలతో కలిపి )[3][4] 36 casualties during combat (1984)[5] | 213 మృతులు (సాయుధ ఘర్షణేతర మరణాలతో కలిపి 2003, 2010 మధ్య)[4][6][7] 200 casualties during combat (1984)[5] | ||||||||
ప్రధాన వ్యాసం: Siachen Glacier |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ae/Un-kashmir-jammu.png/640px-Un-kashmir-jammu.png)
NJ9842 (35.008371°N 77.008805°E / 35.008371; 77.008805) బిందువు తరువాతి ప్రాంతాన్ని సరిగ్గా విభజించి చూపకపోవడాన సియాచెన్ ఘర్షణ తలెత్తింది. 1949 నాటి కరాచీ ఒప్పందం, 1972 నాటి సిమ్లా ఒడంబడికలు సియాచెన్ను ఎవరు నియంత్రిస్తున్నారో వివరించలేదు. సంధి రేఖ NJ9842 వద్ద ముగిసిందని మాత్రమే అవి ప్రకటించాయి. సియాచెన్ లాంటి అతి శీతలమైన, బీడు భూమిని భారత పాకిస్తాన్లు పట్టించుకోవని ఐక్యరాజ్యసమితి అధికారులు భావించారు.[10]