From Wikipedia, the free encyclopedia
ముండక ఉపనిషత్తు లేదా ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. "ముక్తిత" సూత్రాలననుసరించి ఇది 108 ఉపనిషత్తులలో 5 వ ది.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.
ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ సంబభూవ
విశ్వస్య కర్తా భువనస్య గోప్తా|
స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్ఠామ్
అథర్వాయ జ్యేష్టపుత్రాయ ప్రాహ||
సృష్టికర్తా జగద్రక్షకుడూ అయిన బ్రహ్మ దేవతలందరికంటే ముందు పుట్టాడు. ఆయనే జగత్తు సృష్టికర్త, రక్షకుడు. ఆయన సకల శాస్త్రాలకూ ఆధారభూతమైన బ్రహ్మవిద్యను తన పెద్దతనయుడైన అథర్వునకు అనుగ్రహించాడు.
అథర్వణే యాం ప్రవదేవ బ్రహ్మా-
థర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యామ్|
స భారద్వాజాయ సత్యవహాయ ప్రాహ
భారద్వాజోంగిరసే పరావరామ్||
బ్రహ్మ అథర్వునకు ఉపదేశించిన బ్రహ్మవిద్యను ప్రాచీన కాలంలో అథర్వుడు అంగిరునకు బోధించాడు. ఆవిద్యనే భరద్వాజగోత్రుడైన సత్యవహుడు అంగిరునివద్ద గ్రహించాడు. ఇలా పరంపరగా వస్తున్న అపరావిద్యను సత్యవాహుడు అంగిరసునికి అందజేశాడు.
విధివదుపసన్న: పప్రచ్చ|
కస్మిన్ను భగవో విజ్ఞాతే
సర్వమిదం విజ్ఞాతం భవతీతి:||
శునక ఋషి కుమారుడూ, ఉత్తమ గృహస్తుడని పేరుపొందినవాడూ అయిన శౌనక మహర్షి శాస్త్రోక్తరీతిగా అంగిరస మహర్షిని సమీపించి వినమృడై "హే భగవన్, దేనిని తెలుసుకోవడంవలన ఈ ప్రపంచం అంతా తెలుసుకోబడుతుంది?" అని అడిగాడు.
తస్మై స హూవాచ! ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్
బ్రహ్మవిదో వదంతి, పరా చైవాపరా చ||
అంగిరసుడు శౌనకునికి ఇలా బదులు చెప్పాడు. పరావిద్య అపరావిద్య అని తెలుసుకోవలసిన విద్యలు రెండున్నాయని బ్రహ్మవిదులు చెబుతారు.
తత్రపరా, ఋగ్వేదో యజుర్వేద:
సామవేదో థర్వవేద: శిక్షాకల్పా
వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి|
అథ పరా, యయా తదక్షర మధిగమ్యతే||
ఈ రెండువిద్యల్లో నాలుగు వేదాలు, వేదాంగాలైన శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, చందస్సూ, జ్యోతిషమూ అన్నీ అపరా విద్యలే. ఇక శాశ్వతమూ, అమరమూ అయిన తత్వాన్ని అందించే విద్య పరావిద్య.
యత్ తదద్రేశ మగ్రాహ్య మగోత్రం అవర్ణమ్
అచక్షు: శ్రోత్రం తదపాణిపాదమ్|
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం
తదవ్యయం యద్ భూతయోనిం పరిపశ్యంతిధీరా:||
కళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాలకు గోచరం కానిదీ, చేతులూ మొదలైన కర్మేంద్రియాలకు దొరకనిదీ, ఉత్పత్తి లేనిదీ, రంగులేనిదీ, కళ్ళు చెవులు, కాళ్ళూ చేతులు లేనిది, శాశ్వతమైనదీ, అంతటా వ్యాపించినదీ, అత్యంతమూ సూక్ష్మమైనదీ, సృష్టికి మూలకారణమైనది అయిన ఆ అక్షరతత్వాన్ని జ్ఞానులు సకల జగత్తుకూ మూలంగా అంతటా చూడగలరు.
యథోర్ణ నాభి: సృజతే గృహ్ణతే చ
యథా ఫృథివ్యామ్ ఓషధయ: సంభవంతి |
యథా సత: పురుషాత్ కేశలోమాని
తథా క్షరాత్ సంభవతీహ విశ్వమ్ ||
సాలె పురుగు ఎలా తన గూడును నోటినుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవును తలమీదా శరీరంమీదా ఏ ప్రయత్నం లేకనే వెండ్రుకలు ఎలా పెరుగుతాయో అలాగే ఆ అక్షరతత్త్వంనుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది.
తపసా చీయతే బ్రహ్మ తతో న్నమభిజాయతే |
అన్నత్ ప్రాణో మన: సత్యం లోకా: కర్మసు చామృతం ||
తపస్సువల్ల ధర్మం పెంపొందుతుంది. ఆ బ్రహ్మంనుండి అన్నం పుడుతుంది. ఆ అన్నంనుండి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు, అన్నీ ఉద్భవించాయి.
య: సర్వజ్ఞ: సర్వవిద్యస్య జ్ఞానమయం తప: |
తస్మాదేతద్ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే ||
సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞానమే తపంగాగల బ్రహ్మ సకల ప్రాణులు వాటి ఆహారం అన్నీ పరబ్రహ్మంనుంచి ఉద్భవిస్తున్నవి.
తదేతత్ సత్యం
మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం
స్తాని త్రేతాయాం బహుధా సంతతాని|
తాన్యాచరథ నియతం సత్యకామా
ఏష వ: పన్థా: సుకృతస్య లోకే|| 1
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.