![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9c/Flag_of_Brunei.svg/langte-640px-Flag_of_Brunei.svg.png&w=640&q=50)
బ్రూనై
From Wikipedia, the free encyclopedia
బ్రూనై అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేక నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు[4]. ఇది ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలేషియా దేశ రాష్ట్రమైన సారవాక్ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్కు చెందిన లింబాంగ్ నగరం చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బోర్నియో ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము మలేషియా, ఇండోనేషియా దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్దములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో పోలి అనే పేరుతో రూపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్దములో అది ఇస్లాము మతము ప్రవేశించి అచ్చటి ప్రజలు ముస్లింలుగా మారే ముందుగా మజాపహిత్ సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. మజాపహిత్ సామ్రాజ్యము ఉచ్ఛస్థితిలో ఉన్న సమయములో దీనిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలోని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్, బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన సులు ఆర్చ్ ఫిలాగో వరకు విస్తరించారు. 1521లో ఫర్డినన్ద్ మెగల్లన్ నాయకత్వములో తలసోక్రసి ప్రవేశించింది. 1578లో స్పైన్ దేశముతో కేస్టిల్ వార్ పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో నార్త్ బోర్నియో చార్టేడ్ కంపెనీ సారవాక్ నుండి జెమ్స్బ్రోక్, సబాహ్ వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రునై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది[5]. 1984 జనవరి 1వ తారీఖున యునైటెడ్ కింగ్డమ్ నుండి బ్రూనై పూర్తిగా స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్థికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
بروني دارالسلام నెగారా బ్రూనై దారుస్సలాం (బ్రూనై రాజ్య శాంతిధామం) State of Brunei Darussalam |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "దైవ నిర్దేశనం ద్వారా ఎల్లప్పుడూ సేవ (Always in service with God's guidance)" (translation) |
||||||
జాతీయగీతం Allah Peliharakan Sultan అల్లాహ్ సుల్తాన్ ను దీవించుగాక (God Bless the Sultan) |
||||||
![]() |
||||||
రాజధాని | బందర్ సెరీ బెగవాన్ 4°55′N 114°55′E | |||||
అతి పెద్ద నగరం | రాజధాని | |||||
అధికార భాషలు | మలయ్[1][2][3] | |||||
ప్రభుత్వం | ||||||
- | సుల్తాన్ | హసన్ అల్ బోల్కియా | ||||
స్వతంత్ర్యం | ||||||
- | పరిసమాప్తి బ్రిటిష్ రక్షణ |
జనవరి 1 1984 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 5,765 కి.మీ² (170వది) 2,226 చ.మై |
||||
- | జలాలు (%) | 8.6 | ||||
జనాభా | ||||||
- | మే 2007 అంచనా | 383,990 (177వది) | ||||
- | 2001 జన గణన | 332,844 | ||||
- | జన సాంద్రత | 65 /కి.మీ² (127వది) 168 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $9.009 బిలియన్ (138వది) | ||||
- | తలసరి | $24,826 (26వది) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ![]() |
|||||
కరెన్సీ | బ్రూనై డాలర్ (BND ) |
|||||
కాలాంశం | (UTC+8) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .bn | |||||
కాలింగ్ కోడ్ | +673 | |||||
1 | మరియూ తూర్పు మలేషియా నుండి 080 . |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/53/Hassanal_Bolkiah.jpg/220px-Hassanal_Bolkiah.jpg)