మలేషియా
From Wikipedia, the free encyclopedia
మలేషియా ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం). మలేషియాలో 13 రాష్ట్రాలు, మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల (127,350 చ.మై.) గా ఉండి, దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం (పెన్స్యులర్ మలేషియా), మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్లాండ్, ఇండోనేషియా, బ్రునై దేశాలు, సముద్ర సరిహద్దులు సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం కౌలాలంపూరు, పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, బోర్నియోలో 28,33 మిలియన్లు. ప్రస్తుత మలేషియాకు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, మలయ్ రాజ్యాలు 18 వ శతాబ్దం నుండి బ్రిటిషు సామ్రాజ్యం అధీనంలోనికి మారాయి అప్పుడు ఈ ప్రాంతాన్ని స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్ అని పిలిచేవారు. బ్రిటిషు వారు ద్వీపకల్ప మలేషియా భూభాగాలను మొదట 1946 లో మలయన్ యూనియన్ పేరుతో ఏకీకృతం చేసారు. తిరిగి 1948 లో మలయ సమాఖ్య పేరుతో పునర్వ్యవస్థీకరించారు. మలేషియా 1957 ఆగష్టు 31 న స్వాతంత్ర్యం పొందినది. 1963 సెప్టెంబరు 16 న సభ, సారవాక్, సింగపూరు ప్రాంతాలను మలయా సమాఖ్యలో కలుపుకొని, దేశం పేరును మలేషియాగా మార్చి రెండు సంవత్సరాల గడవకముందే 1965 లో సింగపూరును సమాఖ్య నుండి బహిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దాని సహజ వనరులపై ఆధారపడి ఉంది కాని వైజ్ఞానిక, పర్యటక, వాణిజ్య, వైద్య పర్యటక రంగాలు కూడా ఆర్ధిక వ్యవస్థకు దన్నుగానిలుస్తున్నాయి.
మలేషియా | ||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం "బెర్సెకుటు బెర్తంబాహ్ ముటు" "ఐకమత్యమే బలము"1 |
||||||
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | కౌలాలంపూరు3 3°08′N 101°42′E | |||||
అధికార భాషలు | మలయు2 | |||||
ప్రజానామము | మలేషియన్ | |||||
ప్రభుత్వం | ఫెడరల్ రాజ్యాంగ రాజరికం | |||||
- | Yang di-Pertuan Agong | Al-Sultan Abdullah Ri'ayatuddin | ||||
- | ప్రధానమంత్రి | Ismail Sabri Yakkob | ||||
స్వాతంత్ర్యం | ||||||
- | from the యునైటెడ్ కింగ్డం నుండి (మలయా మాత్రం) | ఆగష్టు 31 1957 |
||||
- | Federation (with సబాహ్, సారవాక్ , సింగపూరు4) | సెప్టెంబరు 16 1963 |
||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 329,847 కి.మీ² (67th) 127,355 చ.మై |
||||
- | జలాలు (%) | 0.3 | ||||
జనాభా | ||||||
- | జూన్ 2007 అంచనా | 27,122,000 (45వది) | ||||
- | 2000 జన గణన | 24,821,286 | ||||
- | జన సాంద్రత | 82 /కి.మీ² (109వది) 213 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
- | మొత్తం | $308.8 బిలియన్ (33) | ||||
- | తలసరి | $12,700 (59) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.805 (high) (61వది) | |||||
కరెన్సీ | రింగిత్ (RM) (MYR ) |
|||||
కాలాంశం | MST (UTC+8) | |||||
- | వేసవి (DST) | లేదు (UTC+8) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .my | |||||
కాలింగ్ కోడ్ | +605 | |||||
1 | Malaysian Flag and Crest from www.gov.my. | |||||
2 | The current terminology as per government policy is Bahasa Malaysia (literally Malaysian language) ref but legislation continues to refer to the official language as Bahasa Melayu (literally Malay language). | |||||
3 | పుత్రజయ is the primary seat of government. | |||||
4 | Singapore became an independent country on 9 August 1965. | |||||
5 | 020 from Singapore |
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. వెస్ట్ మినిష్టర్ పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది, న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే ఇస్లాం మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు ( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
యురేషియాఖండం దక్షిణ కొనలో, ఉష్ణమండలంలో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు, మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్, ఇస్లామిక్ సహకార సంస్థ, ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, అలీనోద్యమము మొదలైన సంస్థలు, సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది