సింగపూరు
ఆసియా ఖండంలోని చిన్నదేశం / From Wikipedia, the free encyclopedia
సింగపూర్ (మలయ్: Singapura; చైనీస్: 新加坡, Xīnjiāpō; తమిళం: சிங்கப்பூர்), అధికారిక నామం సింగపూర్ గణతంత్రం, ఒక చిన్న ద్వీపం, నగరం, దేశం కూడాను. మలేషియాకు దక్షిణాన ఉంది. 704 చదరపు కిలోమీటర్ల (272 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం.
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ 新加坡共和国 சிங்கப்பூர் குடியரசு Republic of Singapore |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం ["Majulah Singapura"] Error: {{Lang}}: text has italic markup (help) (Malay) "Onward, Singapore" ముందుకు, సింగపూర్' |
||||||
జాతీయగీతం మజూలా సింగపురా (మజులా సింగపురా) |
||||||
రాజధాని | సింగపూరు నగరం 1°17′N 103°51′E | |||||
అతి పెద్ద నగరం | సింగపూరు | |||||
అధికార భాషలు | ఆంగ్లము మలయ్ చైనీస్ మాండరిన్ తమిళం |
|||||
ప్రభుత్వం | పార్లమెంటరీ తరహా రిపబ్లిక్కు | |||||
- | రాష్ట్రపతి | టోనీ టాన్ | ||||
- | ఫ్రధానమంత్రి | లీ సియెన్ లూంగ్ | ||||
స్వతంత్రం | ||||||
- | స్వపరిపాలన ఇంగ్లాండు పరిపాలనలో |
June 3 1959[1] |
||||
- | ఏక పక్షంగా స్వతంత్రం ప్రకటన | ఆగస్టు 31 1963 | ||||
- | మలేసియాతో విలీనం | సెప్టెంబరు 16 1963 | ||||
- | మలేసియా నుండి వేరుపడడం | ఆగస్టు 9 1965 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 704.0 కి.మీ² (188వ స్థానం) 270 చ.మై |
||||
- | జలాలు (%) | 1.444 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 4,483,900 (117వ స్థానం) | ||||
- | 2000 జన గణన | 4,117,700[2] | ||||
- | జన సాంద్రత | 6,489 /కి.మీ² (2 వస్థానం) 16,392 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | US$228.116 బిలియన్లు[3] (44వ స్థానం) | ||||
- | తలసరి | US$49,714 (6వ స్థానం) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.916 (high) (25వ స్థానం) | |||||
కరెన్సీ | సింగపూరు డాలరు (SGD ) |
|||||
కాలాంశం | SST (సింగపూర్ ప్రామాణిక కాలం) (UTC+8) | |||||
- | వేసవి (DST) | (UTC+8) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .sg |
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది మలయ్, ఒరాంగ్ లౌట్ జాలర్లు నివసించు గ్రామం. బ్రిటిషు వారు రవాణాల నిమిత్తం వాడుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. విదేశీ పెట్టుబడులు ప్రభుత్వ యాంత్రీకరణము వలన ఎలక్ట్రానిక్సు, కర్మాగారం ఆధారంగా ఒక ఆధునిక ఆర్థికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. భూభాగము ప్రకారము ఎంతో చిన్నదయినా, సి.$212 బిలియన్ల మారకద్రవ్య (అ.$139 బిలియన్లు) నిల్వలు కలది. ధనవంతమైన జీవన శైలి ప్రకారము, ది ఎకనామిస్టు (2005) సింగపూరును ఆసియాలో అతి ఉత్తమమైనదిగా ప్రపంచములో 11వ స్థానముగా నిర్ధారించింది. ఇంత చక్కటి విలువలు కలిగి ఉన్నా, సగటున లక్ష జనాభాకు 13.57 మరణశిక్షలు నమోదు అవుతున్నాయి, సౌదీ అరేబియా 4.65, చైనా 2.01 శాతం గమనించాల్సిన విషయం.