From Wikipedia, the free encyclopedia
పంజాబీ ముస్లింలు (పంజాబీ: پنجابی مسلمان (షాముఖీ) ) అన్నది తూర్పు పాకిస్తాన్, వాయువ్య భారతదేశం ప్రదేశాల్లో విస్తరించిన పంజాబ్ ప్రాంతానికి చెందిన భాషాపరమైన, భౌగోళికమైన, మతపరమైన జన సమూహం. పంజాబీ జాతిలో అత్యంత పెద్ద సముదాయమైన[4] పంజాబీ ముస్లింలు ఇస్లాంను అనుసరిస్తూ, పంజాబీ భాష మాట్లాడుతారు. 90 కోట్లకు పైగా జనాభాతో, [4] పాకిస్తాన్ లో అతి ఎక్కువ జనాభా కలిగిన జాతిగానూ, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంఖ్యాధిక్య ముస్లిం జాతిగానూ నిలుస్తోంది.[11] పంజాబీ ముస్లింలలో ఎక్కువమంది ఇస్లాంలో సున్నీ శాఖకు చెందినవారు. వీరిలో మైనారిటీలుగా షియాలు, పంజాబ్ లోనే ప్రారంభమైన అహ్మదియ్యా వంటి శాఖల వారు ఉన్నారు.
Total population | |
---|---|
దాదాపు 9 కోట్లు. | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
పాకిస్తాన్: 92,531,483 (2011)[1][2][3][4] | |
United Kingdom | 500,000[5] |
సౌదీ అరేబియా | 500,000+ (2013) |
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 300,000+ |
India | 500,000 |
యు.ఎస్.ఏ[6] | 263,699 |
Canada | 100,310[7] |
ఇటలీ | 100,000+ |
కువైట్ | 80,000+ |
ఒమన్ | 55,000+ |
గ్రీస్ | 55,000+ |
ఫ్రాన్స్ | 54,000 |
Germany | 43,668+ |
ఖతార్ | 42,000+ |
స్పెయిన్ | 37,000+ |
బహ్రెయిన్ | 35,500+ |
చైనా | 43,000+[8] |
నార్వే | 29,134+ |
డెన్మార్క్ | 18,152+ |
ఆస్ట్రేలియా | 31,277+ |
దక్షిణ కొరియా | 25,000+[9] |
నెదర్లాండ్స్ | 19,408+ |
హాంగ్కాంగ్ | 13,000+[10] |
జపాన్ | 10,000+ |
Sweden | 5000+ |
మలేషియా | 1000+ |
పెరూ | 100+ |
భాషలు | |
పంజాబీ, Urdu | |
మతం | |
ఇస్లాం 100% (మెజారిటీ సున్నీ, 20%తో షియా) |
పంజాబీ ముస్లింల మాతృభూమి ప్రధానంగా పాకిస్తానీ ప్రావిన్సు అయిన పంజాబ్ లో నెలకొన్నాయి. ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ లలో చెప్పుకోదగ్గ సముదాయాలు, మధ్య ప్రాచ్యంలో పెద్ద స్థాయిలో విదేశీ జనాభాగా వీరికి ప్రపంచవ్యాప్త డయాస్పోరా ఉంది.
పంజాబ్ అంటే ఐదు జలాలు అని యధాతథ అర్థం వస్తుంది (పంజ్-ఐదు, ఆబ్-జలాలు). ఈ ప్రాంతంలో ప్రవహించే ఐదు నదుల వల్ల ఈ ప్రాంతానికి పంజాబ్ అన్న పేరు వచ్చింది. పంజాబ్ ను భారతదేశానికి, పాకిస్తాన్ కీ ధాన్యగారాంగా పేర్కొంటూ వుంటారు.[12][13]
పంజాబ్ ప్రాంతంలోని వివిధ తెగలు, కులాలు, మతాలకు చెందిన నివాసులను విస్తృతమైన సాధారణపదం పంజాబీ అన్నది వాడడం 18వ శతాబ్ది ప్రారంభం నుంచి మొదలైంది. దీనికి ముందు పంజాబ్ ప్రాంతంలో భాషాపరమైన, చారిత్రికమైన, జాతిపరమైన సామాన్య లక్షణాలు, సాధారణ చరిత్ర పంచుకునే ఉన్నా ప్రజల్లో పంజాబీ అన్న జాతిపర, సాంస్కృతక గుర్తింపు ఉండేది కాదు.[14][15][16]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.