కోన వెంకట్, తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్‌కు మంచి స్నేహితుడు. పరిచయం అయిన కొత్తల్లో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తను రాసిన సంభాషణలూ సీన్లూ చదివి వినిపించేవాడు.అతను రచయిత కావడానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన ప్రభాకరరావు అతని తాత. రాజకీయనాయకుడైనా సినిమాలపైనా బాగా ఆసక్తి ఉండేదాయనకు. మంగళసూత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎల్వీప్రసాద్‌ ద్రోహి సినిమాలో విలన్‌గా చేశాడు.

త్వరిత వాస్తవాలు కోన వెంకట్, వృత్తి ...
కోన వెంకట్
Thumb
వృత్తిరచయిత, దర్శకుడు
జీవిత భాగస్వామిసునీల
పిల్లలుకావ్య, శ్రావ్య
మూసివేయి

బాల్యం

వెంకట్ తండ్రి పోలీసు ఉద్యోగం చేయడం వల్ల తరచు బదిలీలు అయ్యేవి. అందుకని హైదరాబాదు‌లో తాతయ్య దగ్గరే పెరిగాడు.

ఉద్యోగం

గ్రూప్స్‌ పరీక్షలు రాసి పాసయ్యాడు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి పౌరసరఫరా శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. కొద్దినెలలకే ఆ పనిమీదా ఆసక్తి పోయింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలోని ఒక మంత్రి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేరాడు. ఆ ఉద్యోగం దాదాపు మూడేళ్లు చేశాడు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేస్తే దానికి కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఆ బాధ్యతల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా సినిమా వాళ్లతో ప్రచారం చేయించేవాడు. ప్రచారంలో ఆయనతో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నరేష్‌ ఉన్నాడు. ఆ సమయంలో ధర్మవరపు ఆయనకొక కథ చెప్పాడు. వెంకట్ దాన్ని సినిమాగా తీస్తానన్నాడు. ఆ సినిమా... తోకలేనిపిట్ట. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకుడు, హీరో నరేష్‌. ఆ సినిమా బాగా ఆడలేదు.

అప్పటికి ఆయనకు హైదరాబాదు‌లో ఒక అపార్ట్‌మెంట్‌ ఉండేది. రెండు కార్లుండేవి. ఈ సినిమా దెబ్బకి మొత్తం పోయింది. అపార్ట్‌మెంటు, కార్లు, ఆఖరుకి భార్య నగలు కూడా అమ్మేశాడు. మాసాబ్‌ట్యాంక్‌ దగ్గర ఒకచిన్న గదిలో అద్దెకి చేరాడు. అద్దె కట్టడానికీ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రామ్‌గోపాల్‌వర్మను కలిశాడు. రామ్‌గోపాల్ వర్మ అతనికికు కాలేజీ రోజుల నుంచీ పరిచయం. అతని సలహా మేరకు బాంబే వెళ్ళి ఆయన సినిమా సత్యకు పనిచేశాడు. సంభాషణల రచయితగా అది తొలిమెట్టు.

ఆ సినిమా సంభాషణలను చెన్నైలో దర్శకుడు మణిరత్నం విని తన 'దిల్‌ సే' తెలుగు అనువాదానికి ఆయన్ను సంభాషణలు రాయమని అడిగాడు. తర్వాత... వెన్నెలకంటి, రామకృష్ణ లాంటి రచయితలు కాదన్న అనువాద చిత్రాలన్నీ ఆయన దగ్గరకు వచ్చేవి. మరోవైపు రాము తీసిన సినిమాలన్నింటికీ తెలుగు అనువాదాలు రాసేవాడు. పేరుకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌నే అయినా ప్రొడక్షన్‌ మేనేజర్‌లా ఉండేది ఆయన పని.దీంతో ఒకరోజు రామూకి చెప్పాపెట్టకుండా సామాను సర్దుకుని హైదరాబాదు‌కి వచ్చేశాడు. ఇక్కడ పూరి జగన్నాథ్‌ పరిచయమయ్యాడు.

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రావాలాకు పనిచేశాడు. అప్పుడే శ్రీనువైట్ల తోనూ వినాయక్ తోనూ పరిచయమైంది. వరసగా వెంకీ, సాంబ, అందరివాడు, బాలు, ఢీ, రెడీ, హోమం, చింతకాయల రవి, అదుర్స్ సినిమాలు చేశాడు.

సినిమా రచయితగా పనిచేస్తోన్న వెంకట్ అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఫీచర్ ఫిలిం తయారుచేశారు. త్వరలో యూట్యూబులో దాన్ని విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.[1]

కుటుంబం

ఆయన భార్య సునీల. వాళ్ళది ప్రేమ వివాహం. హైదరాబాదు‌లో బీకాం చేసేటప్పుడు ఆయన క్లాస్‌మేట్‌. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్తే ఒప్పుకొంటారో లేదోనన్న భయంతో ఆర్యసమాజంలో పెళ్ళి చేసేసుకున్నారు. ఆయన మామ ఆయన మీద కిడ్నాప్‌కేసు పెట్టారు. అప్పటి కమిషనర్‌కువెంకట్ తాతయ్య బాగా తెలుసు. దాంతో ఆయన వాళ్ళ మామగారిని పిలిపించి 'వాళ్లిద్దరూ మేజర్లు, పైగా మంచి కుటుంబం' అని నచ్చజెప్తే వూరుకున్నారు. పెళ్ళినాటికి ఆయన వయసు పంతొమ్మిదేళ్లు. ప్రస్తుతం వాళ్ళకిద్దరు అమ్మాయిలు. కావ్య, శ్రావ్య. పెద్దమ్మాయి అమెరికాలో ఇంజినీరింగ్‌ చేస్తోంది. చిన్నమ్మాయి హైదరాబాదు లో మాస్‌కమ్యూనికేషన్స్‌ డిగ్రీ చేస్తోంది.

వ్యక్తిత్వం

వ్యక్తిగతంగా తాను క్లీన్ హ్యూమర్ నే ఇష్టపడతాననీ, అదే వృత్తిలో కూడా ప్రతిఫలిస్తుందని వెంకట్ పేర్కొంటారు. ఈ అంశంపై మాట్లాడుతూ నేను మితిమీరిన ద్వందార్థాలు, వెగటు హాస్యం రాయను. నాకు ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళతో కలిసి నా సినిమా చూసి నేనే ఇబ్బంది పడే స్థితి తెచ్చుకోకూడదు కదా. మాస్ పేరును అడ్డం పెట్టుకుని గీతలు దాటి రాసే ప్రయత్నం చేయనని పేర్కొన్నారు.[1]

అభిప్రాయాలు

వివిధ అంశాల పట్ల కోన వెంకట్ వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఇవి:

  • కామెడీ డైలాగులు రాయదానికి కారెక్టరైజేషన్ మూలం. అదొక ట్రాన్స్ ఫార్మర్ లాంటిది. ఎన్ని బల్బులైనా వేసుకోవచ్చు.
  • ఏ డైలాగ్ రాసినా పైనుంచి ఊడిపడదు. సినిమాలో వచ్చేవన్నీ ఇదివరకు ఎక్కడో ఎవరో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నవే! అవి తెరమీద కనిపించేసరికి ప్రాచుర్యం పొందుతాయి.

తెలుగు చిత్రాలు

ప్రఖ్యాత డైలాగులు

  • రావు గారూ..! నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ - ఢీ సినిమాలో చారి పాత్ర (నటించినవారు కన్నెగంటి బ్రహ్మానందం)
  • అ-అడిగాను, ఇ-ఇవ్వనన్నావు, ఉ-ఊరుకుంటానా? - సాంబలో కారెక్టర్ పాత్ర ఆస్తిని లాక్కునే సన్నివేశంలో విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్
  • ఒరే, మనకు జేబులు ఎడమవైపే ఎందుకు పెడతారో తెలుసా? మనం చెయ్యి పెట్టుకున్నప్పుడు ఎడమ వైపున్న గుండె మనకు ధైర్యం చెబుతుంది - భగీరథ సినిమాలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సందర్భంలో హీరో రవితేజ పాత్ర ద్వారా
  • ప్రేమ అనేది బస్ జర్నీ లాంటిది. ఎప్పుడైనా దిగి వేరే బస్ ఎక్కొచ్చు. కాని పెళ్ళి ఫ్లైట్ జర్నీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే మధ్యలో దిగడానికి కుదరదు - బాడీగార్డ్ సినిమాలో

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.