మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో ఉస్మానాబాద్ జిల్లా (హిందీ:उस्मानाबाद जिल्हा) ఒకటి. ధారాశివ్ (धाराशिव) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,660,311. జిల్లావైశాల్యం 7569 చ.కి.మీ. నగర ప్రాంతం 241.4 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో 16.96% నగరప్రాంత నివాసితులు.[2]
ఉస్మానాబాద్ జిల్లా
عثمان آباد ضلع उस्मानाबाद जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాద్ |
ముఖ్య పట్టణం | Osmanabad |
మండలాలు | 1. Osmanabad, 2. Tuljapur, 3. Omerga, 4. Lohara, 5. Kallamb, 6. Bhoom, 7. Paranda, 8. Washi |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Osmanabad[1] |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,569 కి.మీ2 (2,922 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,60,311 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (570/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.33% |
• లింగ నిష్పత్తి | 920 |
ప్రధాన రహదార్లు | NH-9, NH-211 |
అక్షాంశ రేఖాంశాలు | 17.35°N 75.16°E-18.40°N 76.40°E |
సగటు వార్షిక వర్షపాతం | 730 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్ర దక్షిణ భూభాగంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇది సముద్రమట్టానికి 600 మీ ఎత్తులో ఉంది. మంజీరా నదిలో కొంత భాగం, తెర్నా నది జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మరత్వాడా భూభాగంలో తూర్పు భాగంలో ఉంది. జిల్లా 17.35 నుండి 18.40 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.16 నుండి 76.40 డిగ్రీల రేఖాంశంలో ఉంది.
జిల్లా ఉత్తర సరిహద్దులో బీడ్ జిల్లా, ఈశాన్య, తూర్పు సరిహద్దులో లాతూర్ జిల్లా, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా, ఆగ్నేయ, దక్షిణ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గ జిల్లా, దక్షిణ, నైరుతీ సరిహద్దులో సోలాపూర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో అహ్మద్‌నగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో అత్యధికభాగం బాలాఘాట్ పర్వతశ్రేణిలో ఉంది.
జిల్లాలో జిల్లా - సెప్టెంబరు వరకు వర్షపాతం, అక్టోబరు - నవంబరు మాసాలలో వాతావరణం హ్యూమిడ్గానూ నవంబరు - జనవరి పొడిగా - చల్లగానూ, ఫిబ్రవరి - జూన్ వరకు పొడిగా ఉండి క్రమంగా వేడెక్కుతూ ఉంటుంది. మరత్వాడా లోని ఇతర జిల్లాల కంటే వేసవిలో ఉస్మానాబాద్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 730 మిమీ. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీ గ్రేడ్. కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీ గ్రేడ్.
జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి :[3]
పరంద గ్రామం చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం ఇక్కడ ఒక కోట ఉంది.
మంజీర నదీతీరంలో ఉన్న కలంబ జిల్లాలో వ్యాపార ప్రాధాన్యత కలిగిన గ్రామం. ఇది మజీరా నదీతీరంలో ఉంది. ఇక్కడకు 20 కి.మీ దూరంలో ఉన్న యాదేశ్వరి ఆలయం తాలూకాకు ప్రత్యేకత ఇస్తుంది.
జిల్లాలో ఉన్న తుల్జాపూర్ (సోలాపూర్‌కు 25 కి.మీ దూరంలో ఉస్మానాబాద్, హైదరాబాదుకు 40 కి.మీ దూరంలో ఉంది) లో నల్దుర్గా వద్ద తుల్జాపూర్ భావానీ ఆలయం ఉంది. శివాజీ మహరాజ్‌కు తుల్జాపూర్ భవాని ఖడ్గం ఇచ్చిందని విశ్వసిస్తున్నారు. శివాజీ కుమారుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు. ఒమెర్గా జిల్లాలో జనసాంధ్రత అధికంగా ఉన్న తాలూకాగా గుర్తించబడుతుంది. తుల్జాపూర్లో టాటా కంసల్టెంసీ ఇంస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సు (ముంబయి) కి చెందిన " స్కూల్ ఆఫ్ రూరల్ డెవెలెప్మెంటు " ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,660,311,[2] |
ఇది దాదాపు. | గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 298వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 219 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 11.69%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 930:1000,[2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 76.33%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఉస్మానాబాద్ జాతీయ రహదారి మార్గం ద్వారా బీద్, లాతూర్, పూనా, సోలాపూర్ లతో అనుసంధానించబడి ఉంది.
ఉస్మానాబాద్ విమానాశ్రయం ఉస్మానాబాద్‌కు 10కి.మీ దూరంలో ఉంది. ఇది వాణిజ్య ప్రయోజనాలకు ఉపకరించదు. రిలయంస్ ఎయిర్పోర్ట్ డెవెలెపర్స్ దీనీని 95 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు.[11][12] plan to use this airport for aviation training.[13]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.