From Wikipedia, the free encyclopedia
ఉమాశ్రీ (జననం 1957 మే 10) భారతీయ సినిమా నటి, రాజకీయవేత్త. ఆమె 400లకు పైచిలుకు కన్నడ భాషా చలనచిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె 2008లో గులాబి టాకీస్‌లో గులాబీ పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.[1]
ఉమాశ్రీ | |||
స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం మే 20, 2013 – మే 15, 2018 | |||
ముందు | కలకప్ప జి. బండి | ||
---|---|---|---|
తరువాత | జయమాల | ||
కన్నడ , సాంస్కృతిక శాఖ మంత్రి | |||
పదవీ కాలం 2013 మే 20 – 2018 మే 15 | |||
ముందు | గోవింద్ ఎం. కర్జోల్ | ||
తరువాత | జయమాల | ||
కర్ణాటక శాసనసభ సభ్యురాలు | |||
పదవీ కాలం 2013 మే 17 – 2018 మే 15 | |||
ముందు | సిద్దు సవది | ||
తరువాత | సిద్దు సవది | ||
నియోజకవర్గం | టెర్డాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నోనవినకెరె, తిప్టూరు, తుంకూరు జిల్లా, కర్ణాటక, భారతదేశం | 1957 మే 10||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | నటి (1978 - ప్రస్తుతం) రాజకీయ నాయకురాలు (2013 - ప్రస్తుతం) |
2013లో, ఆమె కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో శాసనసభ సభ్యురాలు, [2] మంత్రిగా కూడా వ్యవహరించింది.[3][4]
ఉమాశ్రీ దేవాంగ కుటుంబంలో జన్మించింది.[5][6] ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచింది. ఆమె కుమార్తె గాయత్రి దంతవైద్యురాలు కాగా కుమారుడు విజయకుమార్ న్యాయవాది.
ఉమాశ్రీ గ్రామీణ, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు మద్దతు ఇవ్వడం వంటి సానుకూల సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఆమె గ్రామీణ ప్రాంతాల అవసరాలకు ప్రదానంగా కృషి చేస్తుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ నుండి తెర్డాల్ నియోజకవర్గం శాసన సభ్యురాలుగా ఎన్నికైంది. ఆమె మహిళా, శిశు అభివృద్ధి, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా చేసింది.
ఆమెకు నాటకాలలో అనుభవం ఉంది. ఫ్రిట్జ్ బెన్నెవిట్జ్, బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్, సి. జి. కృష్ణస్వామి, ఆర్. నగేష్, టి.ఎస్. నాగాభరణం వంటి దర్శకులతో ఆమె పనిచేసింది. ఆమె బెంగుళూరులోని రంగసంపద అమెచ్యూర్ థియేటర్ గ్రూప్‌లో సభ్యురాలు.
ఉమాశ్రీ 1984లో కాశీనాథ్‌తో కలిసి అనుభవ చిత్రంలో సహాయ పాత్రలో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. కానీ అంతకు ముందు ఆమె టి ఎస్ నాగభరణ దర్శకత్వంలో 1980 కన్నడ చిత్రం బంగారడ జింకే విడుదలైంది.
ఆమె నటుడు ఎన్. ఎస్. రావు, దినేష్, ద్వారకీష్, మైసూర్ లోకేష్, సిహికహి చంద్రు, రమేష్ భట్, ముఖ్యమంత్రి చంద్రు, దొడ్డన్న, కరిబసవయ్యలతో కలిసి నటించింది. అలాగే ఆమె దర్శకుల్లో ఎస్. వి. రాజేంద్ర సింగ్ బాబు, భార్గవ, సింగీతం శ్రీనివాసరావు, పేరాల, కె వి రాజు, విజయ్, దొరై భగవాన్, ద్వారాకిష్, డి రాజేంద్ర బాబు, దినేష్ బాబు, వి రవిచంద్రన్, పూరీ జగన్నాథ్, యోగరాజ్ భట్ తదితర దర్శకులతో పనిచేసింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.