ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా భారతదేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థ. దీని చట్టసభలలో 175 శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పదవికాలంతో ప్రజలచే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు, వివిధ శాసనమండలి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే 58 మంది శాససమండలి సభ్యులు వుంటారు.[2] ఈ ప్రభుత్వానికి రోజువారి ప్రభుత్వ కార్యకలాపాలకు బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ముఖ్యమంత్రి,మంత్రివర్గం చేతిలో చట్టాలు చేసే అధికారం వుంటుంది. శాసనవ్యవస్థతో పాటు శాసనాల అమలుకు కార్యనిర్వాహకవ్యవస్థ, హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు పరిపాలన కేంద్రం, చట్ట వ్యవస్థ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలన కేంద్రంఅమరావతి, రాజధాని
చట్ట వ్యవస్థ
శాసనసభఆంధ్రప్రదేశ్ శాసనసభ
సభాపతిప్రకటించాలి (టిబిడి)
శాసనసభ్యుల సంఖ్య175
శాసనమండలిఆంధ్రప్రదేశ్ శాసనమండలి
అధ్యక్షుడుకొయ్యే మోషేన్‌రాజు
ఉప అధ్యక్షుడుజకియా ఖానమ్
శాసనమండలి సభ్యులసంఖ్య58
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నర్సయద్ అబ్దుల్ నశీద్
ముఖ్యమంత్రిఎన్. చంద్రబాబునాయుడు
ఉపముఖ్యమంత్రికొణిదెల పవన్ కళ్యాణ్
ప్రధాన కార్యదర్శినిరబ్ కుమార్ ప్రసాద్ , IAS[1]
న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
ప్రధాన న్యాయమూర్తిప్రశాంత్ కుమార్ మిశ్రా
మూసివేయి
Thumb
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం

కార్య నిర్వహణ

గవర్నరు

2023 ఫిబ్రవరి 12న బిశ్వభూషణ్ హరిచందన్ [3] స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ 24వ గవర్నర్‌గా భారత రాష్ట్రపతి నియమించారు.[4]

ముఖ్యమంత్రి

నారా చంద్రబాబునాయుడు, 2024 జూన్ 12న నవ్యాంధ్ర మూడవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నరు ప్రమాణ స్వీకారం చేయించారు.ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి అధికారక కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది.[5]

మంత్రివర్గం

ప్రధాన వ్యాసం:ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

  • నీరబ్ కుమార్ ప్రసాద్

డి. జి.పి

  • సి.హెచ్.ద్వారకా తిరుమలరావు

ప్రభుత్వ శాఖలు

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు 30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.

జిల్లా స్ధాయి పరిపాలన

జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్రస్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు.[6]

రాజపత్రం

ప్రభుత్వ రాజుపత్రాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి.[7]

ప్రభుత్వ ఆదేశాలు

రహస్యం కాని ప్రభుత్వ ఆదేశాలు అంతర్జాలంలో అందుబాటులో ఉంటాయి.[8]

డిజిటల్ సేవలు

2001 లో ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి రాజీవ్ ఇంటర్నెట్ విలేజి కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి ఏర్పడింది. As of 2021, దీనిని అన్ని ప్రభుత్వ డిజిటల్ సేవల కొరకు విస్తరించి మైఎపి (myap) అనే జాలస్థలి (గవాక్షం) ఏర్పడింది.[9]

చట్ట సభలు

శాసనసభ

చూడండి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)

శాసనమండలి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి [10] 2007 మార్చి 30 న పునరుద్ధరించబడింది.

న్యాయవ్యవస్థ

అమరావతిలో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభించబడింది. దీనికి ప్రతి జిల్లాలో పౌర, నేర వివాదాల న్యాయస్థానాలు ఉన్నాయి.[11] హైకోర్టు తీర్పులు అంగీకరించని కక్షిదారులు భారత సుప్రీమ్ కోర్టులో వివాదం కొనసాగించవచ్చు.

ప్రధాన న్యాయమూర్తి

ఇవీ చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.