From Wikipedia, the free encyclopedia
మంగోలియా : (mɒŋˈɡంʊliə); (మంగోలియన్ భాష : Монгол улс), మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పుఆసియా, మధ్యాసియాలో ఉంది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు, పడమరలలో చైనా దేశాలున్నాయి. దీని దక్షిణాగ్రాన కొద్ది మైళ్ళ దూరంలో కజకస్తాన్ సరిహద్దు ఉంది. ఉలాన్ బతోర్ దీని రాజధాని, అతిపెద్ద నగరమూను. దేశంలోని దాదాపు 38% జనాభా రాజధానిలోనే నివసిస్తోంది. ఈ దేశపు రాజకీయ విధానము పార్లమెంటరీ రిపబ్లిక్ విధానము.
Монгол улс మోంగోల్స్ మోంగోలియా |
||||
---|---|---|---|---|
రాజధాని | ఉలాన్‌బతార్ 47°55′N 106°53′E | |||
అతి పెద్ద నగరం | రాజధాని | |||
అధికార భాషలు | మంగోలియన్ | |||
ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాతంత్రం | |||
- | రాష్ట్రపతి | నాంబరిన్ ఎన్క్బయార్ | ||
- | ప్రధానమంత్రి | మియీగోమ్ బిన్ ఎంక్‌బోల్డ్ | ||
ఏర్పాటు | ||||
- | జాతీయ స్థాపక దినం | 1206 | ||
- | చింగ్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యము | డిసెంబరు 29 1911 | ||
- | మంగోలియా ప్రజా గణతంత్రం | నవంబరు 24 1924 | ||
- | మంగోలియా ప్రజాతంత్రం | ఫిబ్రవరి 12 1992 | ||
విస్తీర్ణం | ||||
- | మొత్తం | 1,564,116 కి.మీ² (19వ) 603,909 చ.మై |
||
- | జలాలు (%) | 0.6 | ||
జనాభా | ||||
- | డిసెంబరు 2006 అంచనా | 2,794,100 [1] (139వది) | ||
- | 2000 జన గణన | 2,407,500 [2] | ||
- | జన సాంద్రత | 1.7 /కి.మీ² (227వది) 4.4 /చ.మై |
||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||
- | మొత్తం | $5.56 బిలియన్ (147వది) | ||
- | తలసరి | $2,175 (138వది) | ||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.691 (medium) (116వ) | |||
కరెన్సీ | తాగ్రాగ్ (MNT ) |
|||
కాలాంశం | (UTC+7) | |||
- | వేసవి (DST) | (UTC+8) | ||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mn | |||
కాలింగ్ కోడ్ | +976 |
మంగోలియాలో 8,50,000 సంవత్సరాలకు పూర్వమే హోమో ఎరెక్టస్ నివసించారు.[3] ఆధునిక మానవులు మంగోలియాను 40,000 సంవత్సరాల ముందు " అప్పర్ పాలియోలిథిక్ " కాలంలో చేరడానికి ఖోయిడ్ త్సెంకర్ గుహలు సాక్ష్యంగా ఉన్నాయి.[4] ఖోయిడ్ ప్రాంతంలో ఉన్న గులాబీ, గోధుమ రంగు, ఎరుపు వర్ణ చిత్రాలు 20,000 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. వీటిలో మముత్, లింక్స్, బాక్ట్రియన్ ఒంటెలు,, ఉష్ట్రపక్షి జంతువుల బొమ్మలు చోటుచేసుకున్నాయి. ఈ వర్ణచిత్ర సహిత గుహలు " మంగోలియా లాస్కాక్స్ "గా వర్ణించబడుతున్నాయి. ఉత్తర మంగోలియాలోని మాల్టాలోని వీనస్ చిత్రం 21,000 సమవత్సరాల పూర్వం నాటి అప్పర్ పాలియోలిథిక్ కాలంనాటిదని భావిస్తున్నారు. మాల్టా ప్రస్తుతం రష్యాలో భాగంగా ఉంది. .
నొరొవ్లిన్, తంసగ్బులాగ్, భయంజాగ్, రషాన్ ఖాద్ వద్ద క్రీ.పూ 5500-3500 కాలం నాటి నియోలిథిక్ కాలం నాటి వ్యవసాయ ఆధారిత నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. నొమాడిజం (గుర్రపు వాడకం) ప్రవేశం మంగోలియన్ జీవన విధానంలో ప్రాముఖ్యత సంతరించుకున్న సంఘటనగా నిలిచింది. రాగి, ఇత్తడి వాడకం ఆరంభం అయిన కాలంలో (అఫనసెవన్ సంస్కృతి) నొమాడిజం ఆరంభం అయిందని భావిస్తున్నారు. అఫనసెవన్ సంస్కృతి మద్య మంగోలియాలోని ఖంగై పర్వతాలలో ఉందని భావిస్తున్నారు. అఫనసెవన్ శ్మశానాలలో క్రీ.పూ 22000 కాలంనాటి చక్రంతో కూడిన వాహన అవశేషాలు లభ్యమయ్యాయి.[5] తరువాత మంగోలియాలో ఒకునెవ్ సంస్కృతి (క్రీ.పూ 2000) కాలంలో జంతువుల పెంపకం, లోహాల వాడకం చక్కగా అభివృద్ధి చెందింది. ఆంధ్రొనొవొ సంస్కృతి (క్రీ.పూ 2300-1000), కరసుక్ సంస్కృతి (క్రీ.పూ 1500-300), ఇనుప యుగం (క్సియాంగ్‌ను) సామ్రాజ్యము (క్రీ.పూ 209) స్థాపన వరుసగా చోటుచేసుకున్నాయి. క్సియాంగ్‌ను సంస్కృతికి ముందున్న ఇత్తడి యుగం కాలంలో జింక, కుర్గన్లు స్లాబ్ సమాధులు, శిలా చిత్రాలు లభ్యమవుతున్నాయి.
నియోలిథిక్ కాలం నుండి పంటలు పండించడం కొనసాగినప్పటికీ నొమాడిజం తరువాత వ్యవసాయంతో పోల్చి చూస్తే అది స్వల్పంగానే ఉండేది. వ్యవసాయం మొదట పశ్చిమ భూభాగంలో ఆరంభమై చివరికి ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది. తూర్పు భూభాగంలో రాగి యుగం మంగోలాయిడ్ అని వర్ణించబడింది. అదే ప్రస్తుత మంగోలియా. పశ్చిమభూభాగంలో యురోపాయిడ్ అని పిలువబడింది.[4] ఇత్తడి యుగంలో పశ్చిమ మంగోలియాలో టొచారియన్లు (యుయేజి), సిథియన్లు నివసించారు. సిథిలియన్ వీరుని భద్రపరచబడిన మృతశరీరం (మమ్మీ) 2,500 సంవత్సరాలకు పూర్వం నాటిదని భావిస్తున్నారు. మృత వీరుని శరీరం 30-40 సంవత్సరాల వయసు కలిగినదై ఉండవచ్చని భావిస్తున్నారు. శ్వేతవర్ణ శిరోజాలు ఉన్నాయి. శరీరం మంగోలియాలోని అల్టై పర్వతాలలో లభించింది. .[6] మంగోలియాలో అశ్వ నొమాడిజం ప్రవేశించిన తరువాత రాజకీయాలు యురేషియన్ స్టేప్పే నుండి మంగోలియాలో కేంద్రీకృతం అయ్యాయి.అది సా.శ. 18వ శతాబ్దం వరకు కొనసాగింది. ఉత్తర భూభాగంలో ఉన్న పశువులకాపరులు (గుయిఫాంగ్, షంరాగ్, డొంఘ్) షంగ్ వశస్థుల (క్రీ.పూ1600-1046) కాలం, ఝౌ వశస్థుల (క్రీ.పూ 1046-256) పాలనా కాలంలో (నోమాడిక్ సామ్రాజ్యాలు) చైనాలో ప్రవేశించారు.
ఉత్తర చైనా భూభాగం నుండి స్వతంత్రంగా ఏర్పరచుకున్న రాజ్యమే మంగోలియా అని వెన్ చక్రవర్తి (హాన్) క్రీ.పూ 162లో లావోషంగ్ చన్యూకు వ్రాసిన ఉత్తర ఋజువు చేస్తుంది. (recorded in the Hanshu):
" చైనా చక్రవర్తి క్సియోంగ్నుకు చెందిన గ్రేట్ షాన్ యు (చన్యు)కు గౌరవనీయంగా నమస్కరిస్తున్నాడు. నాకు ముందు పాలించిన చక్రవర్తి చైనా మహా కుడ్యం (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) ను నిర్మించాడు. ఉత్తర భూభాగంలో ఉన్న దేశాలన్నీ షాన్ యు ఆధిఖ్యతలో ఉంటాయి. చైనా మహా కుడ్యం లోపలి భాగంలో తలపాగా, కండువా ధరించే ప్రజలు అందరూ నా పాలనలో ఉంటారు. వేలాది మంది ప్రజలు వారి వారి వృత్తులలో ఉంటూ భూమి దున్నుతూ, నేత నేస్తూ, షూటింగ్ , వేటలో జీవినాధారం వెతుక్కుంటారు. రెండు దేశాలు ప్రస్తుతం శాంతితో ఉండాలని రాజకుమారులు ఇద్దరూ స్నేహసంబంధాలు కలిగి ఉండాలని మీ లేఖ చెబుతూ ఉంది. ఇరు దేశాల మద్య సైనిక చర్యలు నిలిపి వేసి సైనికులందరూ తమ నివాసాలకు పంపివేయబడతారు.
వారు పశువులను మేపుతూ, సంపదలతో , సంతోషంతో రోజురోజుకూ వర్ధిల్లేలా జీవిస్తారు. సంతృప్తి కరమైన అదే సమయంలో ప్రశాంతమైన సరికొత్త శకం స్థాపిస్తాము. " ఇది నన్ను మరింత గౌరవపరుస్తుంది. నేను నీతో కలిసి గళం కలుపుతూ శాంతిగీతం ఆలపిస్తూ స్వర్గద్వారాలను తెరచి ప్రజల పట్ల చూపించే కరుణ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది తరతరాలకు ఇలా కొనసాగుతూ ఉంటుంది. విశ్వాన్ని ఆరాధిస్తూ పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవచ్చు. ఉత్తర భూభాగంలో వెన్నులో వణుకు పుట్టించే వాతావరణంలో నివసిస్తున్న ప్రజలకు వార్షికంగా ధాన్యం, బంగారం, పట్టు పంపమని అధికారులకు ఆదేశాలు ఇస్తాను. ఇప్పుడు ప్రపంచం అంతటా శాంతిని స్థాపిస్తాము. వేలాది ప్రజలు ఆనందంగా జీవిస్తారు. నేను షాన్ యు ప్రజలను తండ్రి వలె పాలిస్తాము. .[7]
మంగోలియాలో చరిత్రకాలానికి ముందు నుండి నోమాడులు నిరంతరంగా నివసిస్తూ ప్రముఖమైన సమాజాన్ని రూపొందించారు. సమాజంలో సాధారణంగా ఖాన్, కురు, లెఫ్ట్, రైట్ పక్షాలు, కేషిగ్ రాజవ్యవస్థ, సైనిక వ్యవస్థ ఉండేది. ముందుగా క్రీ.పూ 209 లో మొడు షన్యు క్సియోగ్ను (జాతి నిర్ణయించబడలేదు)లను సమైక్యపరచి రాజరిక వ్యవస్థను స్థాపించాడు. అతి త్వరలో వారు క్విన్ వంశానికి గొప్ప ప్రత్యర్థులుగా అభివృద్ధి చెందారు. వారు తరువాత చైనా మాహా కుడ్యం నిర్మించేలా వత్తిడి తీసుకువచ్చారు. మెంగ్ తియాన్ పాలనాకాలంలో చైనా కుడ్యాన్ని నిర్మించారు. క్సియోగ్ను దాడుల నుండి రక్షించడానికి 3,00,000 సైనికులను నియమించారు. విస్తారమైన క్సియోగ్ను (క్రీ.పూ 209- సా.శ. 93) సామ్రాజ్యపాలన తరువాత మంగోలిక్ క్సియాంబెయి సామ్రాజ్యం (సా.శ. 93- 234) విస్తారమైన రాజ్యాన్ని పాలించింది. వీరు దాదాపు ప్రస్తుత మంగోలియా రాజ్యం అంతటినీ పాలించారు. విస్తారమైన క్సియాంబెయి భూభాగాన్ని మంగోలిక్ రౌరన్ ఖంగనతే (330-555) పాలించారు. మంగోలిక్ రౌరన్ ఖంగనతెను ఓడించి గోక్త్రుక్కులు (555-745) వరకు పాలించారు. గోక్త్రుక్కులు పంతికేపియం (ప్రద్తుత కెర్చ్) భూభాగాన్ని (576లో) తమ రాజ్యంలో విలీనం చేసి మరింత విస్తారమైన భూభాగాన్ని పాలించారు. వారిని అధిగమిస్తూ ఉఘూర్ ఖంగనతే (745-840) ఈ ప్రాంతాన్ని పాలించారు. ఉఘూర్ ఖంగనతెలను కిర్గిజ్ ఓడించి కిర్గిజ్లు పాలించారు. తరువాత క్సియాంబెయి వంశానికి చెందిన మంగోలిక్ కితాన్ ప్రజలు (లియో సామ్రాజ్యం 907-1125) పాలించారు. మంగోలిక్ కితాన్ తరువాత ఖమాగ్ మంగోల్ (1125-1206) పాలించారు.
12వ శతాబ్దంలో గందరగోళంలో చెంఘీజ్ ఖాన్ అనే సైన్యాధ్యక్షుడు మంగోలియా గిరిజన ప్రజలను సమైక్యం చేసికొని మంచూరియా, అల్తై పర్వతాల మద్య భూభాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1206లో చెంఘీజ్ ఖాన్ నిర్వహించిన వరుస యుద్ధాలు క్రూరత్వానికి, క్రౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. చెంఘీజ్ ఖాన్ ఆసియా అంతటినీ ఆక్రమించి మంగోలియా సామ్రాజ్య స్థాపన చేసాడు. మంగోలియా సామ్రాజ్యం అత్యంత విస్తారమైనదిగా ప్రపంచ చరిత్రలో చోటుచేసుకుంది. ఆయన తరువాత పాలకులు మంగోలియా సామ్రాజ్యంతో పశ్చిమంలో ప్రస్తుత ఉక్రెయిన్ తూర్పున కొరియా, ఉత్తరంలో సైబీరియా, దక్షిణంలో గల్ఫ్ లోని ఓమన్, వియత్నాం లను తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకుని అత్యంత (విశాలమైన 33000000 చదరపు కి.మీ) పాలించారు.[8] ప్రపంచ భూభాగ వైశాల్యంలో ఇది 22%. ఆసమయంలో మంగోలియా జనసంఖ్య 100 మిలియన్లు. ఆసమయంలో ప్రపంచ జనసంఖ్యలో ఇది 25%. పాక్స్ మంగోలికా ఆసియా అంతటికీ వ్యాపారం, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.[9][10]
చెంఘీజ్ ఖాన్ మరణించిన తరువాత మంగోలియా సామ్రాజ్యం 4 రాజ్యాలుగా (ఖనాతేలు) విభజించబడింది. అవి మంగెఖాన్ (1259లో మరణించాడు) కారణంగా ఆరంభం అయిన తొలుయిడ్ (1260-1264) అంతర్యుద్ధం తరువాత చివరికి క్వాసి - స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. ఖనాతేలలో ఒకటైన గ్రేట్ ఖనాతేలో మంగోలియా ప్రధాన భూభాగం, కుబ్లై ఖాన్ (ఘెంగిస్ ఖాన్ మనుమడు) నాయకత్వంలోని యుయాన్ సామ్రాజ్యంలో చైనా భాగం అయింది. కుబ్లై ఖాన్ ప్రస్తుత పీకింగ్ను రాజధానిగా చేసుకుని మరణించాడు. ఒక శతాబ్ధకాలం తరువాత 1368లో యుయాన్ సామ్రాజ్యాన్ని అధిగమిస్తూ మింగ్ సామ్రాజ్యం స్థాపించబడింది. మంగోల్ రాజకుటుంబం ఉత్తర భూభాగాలకు పారిపోయింది.మింగ్ సైన్యాలు మంగోల్ రాజకుటుంబాన్ని అనుసరిస్తూ స్వస్థలంలో ప్రవేశించారు. తరువాత వారు మంగోల్ రాజధాని నగరం కరకోరంతో మరికొన్ని నగరాలను ధ్వంసం చేస్తూ స్వాధీనం చేసుకున్నారు. మంగోల్ నాయకుడు బిలిగ్తూ నాయకత్వంలో ప్రజలు కొన్ని ప్రాంతాలలో మింగ్ సైన్యాలను, వారి నాయకుడు కొకే తెమూర్ను ఎదుర్కొన్నారు. [ఆధారం చూపాలి]
యువాన్ రాజవంశం చైనా నుండి వైదొలగిన తరువాత మంగోలీలు వారి ప్రధాన భూభాగం మంగోలుకు చేరుకున్నారు. ఈ కాలం పోస్ట్ మంగోలాగా వర్ణించబడింది. తరువాత శతాబ్దాలు వివిధ జాతుల మద్య హింసాత్మకమైన అధికార కలహాలకు చిహ్నంగా ఉన్నాయి. ఈ కలహాలు అధికంగా గెంగీస్, గెంగీసేతర జాతులకు చెందిన ఒయిరాతుల మద్య చోటుచేసుకున్నాయి. చైనీయుల దాడులు (యోంగ్లే చక్రవర్తి చేసిన 5 దాడులు) అందులో భాగంగా ఉన్నాయి. 15వ శతాబ్దంలో ఒయిరాతులు ఎయెసెన్ తయ్సి నాయకత్వంలో ఎగువ భూములను స్వాధీనం చేసుకుని 1449లో చైనా భూభాగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎసెన్ 1454లో హత్యచేయబడ్డాడు. బొర్జిగిడ్ తిరిగి బలపశ్డాడు. . [ఆధారం చూపాలి]
16వ శతాబ్దంలో బతిమొంగ్కే దయాన్ ఖాన్ ఆతని ఖాతున్ (రాజ్యం) మందుఖై గెంగిసిదీస్ సాయంతో మంగోల్ సామ్రాజ్యం అంతటినీ తిరిగి సమైక్యం చేసాడు. 16వ శతాబ్దం మద్య కాలంలో తుమెద్కు చెందిన అల్తన్ ఖాన్ (దయాన్ ఖాన్ మనుమడు) న్యాయపరంగా వారసుడు కానప్పటికీ స్వయంగా శక్తివంతుడయ్యాడు. అల్తన్ ఖాన్ 1557లో హాహాట్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అల్తన్ ఖాన్ 1578లో దలై లామాతో సమావేశం కావడం మంగోలియాలో రెండవసారి టిబెటన్ బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. ఖల్ఖాకు చెందిన అబ్తాని ఖాన్ బుద్ధిజానికి మారి ఎర్డెనే జూ 1578లో సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అబ్తాని ఖాన్ మనుమడు జనాభాజార్ 1640లో మొదటి " జెబ్త్సుందంబ ఖుతుగుటు " అయ్యాడు. ఆల్తర్లోని మంగోలియన్ ప్రజలు దాదాపుగా బుద్ధిజానికి మారారు. ప్రతి కుటుంబాలలో బౌద్ధ మత సాహిత్యం, బుద్ధుని శిల్పాలు చోటుచేసుకున్నాయి. మంగోలియన్ ప్రముఖులు భూమి, ధనం, పశువుల మందలను బౌద్ధ ఆరామం నిర్మించడానికి దానంగా ఇచ్చారు. బౌద్ధమఠాలు ఆధ్యాత్మిక శక్తితో రాజకీయ శక్తికేంద్రాలు అయ్యాయి.[ఆధారం చూపాలి]
లిగ్డెన్ ఖాన్ చివరి మంగోలియన్ రాజుగా 17వశతాబ్దం ఆరంభంలో పాలించాడు. లిగ్డెన్ ఖాన్ మంచు ప్రజలతో కలిసి యుద్ధాలలో పాల్గొని పలు చైనా నగరాల దోపిడీకి కారణం అయ్యాడు. ఆయన మంగోలియన్ గిరిజనుల కూటమి ఏర్పరచుకున్నాడు. లిగ్డెన్ ఖాన్ 1634లో మరణించాడు. 1636లో అధికమైన మంగోలియా లోతట్టు ప్రాంతప్రజలను కలుపుకుని క్వింగ్ రాజవంశ పాలన ఆరంభం అయింది. 1691లో చివరికి ఖల్ఖా కూడా క్వింగ్ ఆధిక్యతకు తలఒగ్గింది. తరువాత ప్రస్తుత మంగోలియా ప్రాంతం అంతా మంచూల పాలనలోకి వచ్చింది. తరువాత జరిగిన పలుయుద్ధాల (1757-58) డ్జుంగరియాల మీద క్వింగ్ విజయం సాధించే సమయానికి యుద్ధంలో పలు డ్జుంగర్లు (పశ్చిమ మంగోలీలు లేక ఒరితాలు) హతమయ్యారు.[11]
కొందరు పరిశోధకులు 6,00,000 (80% కంటే అధికం) డ్జుంగర్ ప్రజలు యూద్ధాలకారణంగానూ, రోగాల కారణంగానూ మరణించారు. .[12] వెలుపలి మంగోలియా స్వయం ప్రతిపత్తిని గెంగిస్ ఖానా వంశానిమి చెందిన తుషీట్ ఖాన్, సెట్సెన్ ఖాన్, జసగ్త్ ఖాన్, సైన్ నొయోన్ ఖాన్లు సంరక్షించారు.
మంగోలియాకు చెందిన జెబ్త్సందంబ ఖుతుఖ్తు విస్తారమైన అధికారం కలిగి ఉంది.మంచూ ప్రజలు చైనా నుండి వలస వచ్చిన ప్రజలను అధికారానికి దూరంగా ఉంచారు. మంగోలీ ప్రజలు వారి సంస్కృతిని సంరక్షించుకున్నారు. ఈ సమయంలో సైబీరియన్ మార్గం ప్రధాన వాణిజ్య మార్గంగా (టీ మార్గం) ఉండేది. ఇక్కడ ఉన్న శాశ్వత స్థానాలలో 5-30 ఎన్నిక చేసిన కుటుంబాలు ఉండేవి. ఉర్గా (ప్రస్తుత ఉలన్ బటోర్) ఈ వాణిజ్య మార్గం ద్వారా చక్కని ప్రయోజనాలు పొందింది. మంగోలియా వెలుపల ఉన్న ఏకైక ప్రధాన నివాసిత ప్రాంతంగా ఇది గుర్తించబడుతుంది. వ్యాపారులు, అధికారులు, యాత్రీకులు దీనిని మజిలీ ప్రాంతంగా ఉపయోగించారు. [ఆధారం చూపాలి]
1911 వరకు క్వింగ్ సామ్రాజ్యం మంగోలియా మీద ఆధిపత్యం కలిగి ఉంది. ఇది సాధించడానికి క్వింగ్ పాలకులు పలు కూటములు, వివాహ సంబంధాలు, సైనిక, ఆర్థిక బలం ఉపయోగించారు. అంబనులు, మంచు ఉన్నతాధికారులు,ప్ ఉలాంబతార్, ఉలియాస్తై, ఖోవ్‌ద్ నగరాలలో నివసించడానికి అనుమతించబడ్డారు. దేశంలో భూస్వాములు, మతాధికారులకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. 19వ శతాబ్దం నాటికి భూస్వాముల ప్రాతినిథ్యం అధికమై వారి వృత్తిపరమైన బాధ్యతలు తగ్గుముఖం పట్టాయి. మంగోలీ ప్రముఖులు ప్రవర్తన, చైనా వ్యాపారుల నుండి అధిక వడ్డీ వసూలు చేయసాగారు. అంతే కాక సామ్రాజ్యపరమైన పన్నులను జంతువులకు బదులుగా బంగారు, వెండి రూపంలో వసూలు చేసినందున పేదరికం తీవ్రంగా వ్యాపించింది. 1911 నాటికి ఈ ప్రాంతంలో 700 బృహత్తర మఠాలు ఉండేవి. ప్రజలలో 1,15,000 మంది (21%కంటే అధికం) సన్యసించారు. జెబుత్సందంబా ఖుతుఖ్తు కాక మిగిలిన ప్రాంతంలో 13 పునరుత్తానంలో పాల్గొనే ఉన్నత స్థాయి లామాలు (సీల్- హోల్డింగ్- సెయింట్లు) ఉండేవారు.
మంచు ప్రజల ఆధిక్యం క్వింగ్ వంశం పతనం తరువాత 1911లో బొగ్ద్ ఖాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అయినప్పటికీ కొత్తగా స్థాపించబడిన " రిపబ్లిక్ ఆఫ్ చైనా " (1912-1949) మంగోలియాను తమ భూభాగంగా భావించింది. బొగ్ద్ ఖాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు యుయాన్ షికైతో " నేను నీ కంటే ముందే నా స్వంత రాజ్యం స్థాపించాను. మంగోలియన్లు , హాన్ చైనీయులు వైవిధ్యమైన సాంస్కృతిక మూలాలు కలిగి ఉన్నారు, వైవిధ్యమైన భాషలు వాడుకలో ఉన్నాయి, వైవిధ్యమైన లిపులను వాడుతున్నారు. నీవు మంచు సంతతికి చెందిన వాడివి కాదు. చైనా మంచు సంబంధిత రాజ్యమని ఎలా చెప్పగలవు " అని ప్రశ్నించాడు.[13] క్వింగ్ పాలనా కాలంలో బొగ్ద్ ఖాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం పూర్వపు వెలుపలి మంగోలియా భాభాగంలో ఉంది. రష్యాలో అక్టోబరు తిరుగుబాటు తరువాత 1919లో క్సు షుజెంగ్ నాయకత్వంలో చైనా సైన్యం మంగోలియాను ఆక్రమించుకుంది.
రష్యన్ అంతర్యుద్ధం, వైట్ మూవ్మెంట్ ఫలితంగా 1920 అక్టోబరులో లెఫ్టినెంట్ జనరల్ రోమన్ ఉంగెం నాకత్వంలో సైన్యం మంగోలియాలో ప్రవేశించి మంగోలియన్ల మద్దతుతో ఉలాన్ బతోర్ వద్ద చైనా సైన్యాలను ఓడించింది. ఉంగెం సృష్టించిన భీతిని తొలగించడానికి బొల్షొవిక్ రష్యా మంగోలియాలో కమ్యూనిష్ఠ్ మంగోలియన్, సైన్యాల స్థాపన చేయాలని నిశ్చయించుకున్నాడు. 1921 మార్చి 18న మంగోలియన్ ప్రభుత్వం చైనా ఆధీనంలో ఉన్న మంగోలియన్ భూభాగం క్యాఖ్తను స్వాధీనం చేసుకుంది. జూలై 6న రష్యన్, మంగోలియన్ సైన్యం ఖురీలో ప్రవేశించింది. 1921 జూలై 11న మంగోలియా స్వతంత్రదేశంగా " మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ "గా అవతరించింది. .[14] ఈ సంఘటనలు రష్యా , మంగోలియా మద్య సత్సంబంధాలు కొనసాగడానికి సహకరించాయి. .
1924లో బొగ్ద్ ఖాన్ స్వరపేటిక క్యాంసర్తో మరణించిన తరువాత [15] రష్యా గూఢచారుల సమాచారం అనుసరించి [16] మంగోలియన్ రాజకీయ విధానంలో మార్పులతో సరికొత్త " మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ అవతరించింది. 1928లో ఖొర్లూగిన్ చొయిబల్సన్ అధికారానికి వచ్చాడు. మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ (1921-1952) కమ్యూనిజానికి చెందిన వారు కాదు. వారిలో అత్యధికులు మంగోలిస్టులు. సోవియట్ యూనియన్ మంగోలియాలో బలవంతంగా కమ్యూనిజం ప్రవేశపెట్టారు. తరువాత పాన్ మంగోలియన్లు కమ్యూజిజాన్ని తొలగించారు. 1960లో పాన్ మంగోలిస్ట్ నాయకుడు చొయిబాల్సన్ మరణించిన తరువాత రష్యా ప్రభుత్వం " మంగోలియన్ పీపుల్స్ పార్టీ "ని అసలైన కమ్యూనిష్టులుగా గుర్తించారు.
ఖొర్లూగిన్ చియిబక్సన్ పెంపుడు జంతువుల సమీకరణ చేయమని సూచించడం మంగోలియాలో టిబెటన్ బుద్ధిజం ఆధిపత్యం విధ్వంశం కావడానికి కారణం అయింది. మంగోలియాలో స్టాలిన్ కమ్యూనిజం ఆధిపత్యం ఫలితంగా సన్యాసులు , ఇతరుల హత్యలు కొనసాగాయి. 1920 లో మంగోలియాలోని పురుషుల సంఖ్యలో దాదాపు మూడింట ఒక వంతు సన్యాసులుగా ఉన్నారు.20వ శతాబ్ధపు ఆరంభంలో మంగోలియాలో 750 మఠాలు ఉన్నాయి.[17]1937 లో స్టాలినిస్ట్ ప్రక్షాళన ప్రజలను బాధించింది. ఇందులో భాగంగా 30,000 మంది చంపబడ్డారు. 1930లో మంగోలియన్ పీపుల్స్ రిపబ్లికన్‌లో బుర్యాతులు ప్రవేశించకుండా రష్యా అడ్డగించడం మంగోలియన్లు తిరిగి విలీనం కాకుండా ఉండడానికి కారణం అయింది. రష్యన్ షరతులను అంగీకరించి మంగోలియన్ల పట్ల హింసాత్మక చర్యలకు పాల్పడని మంగోలియన్ నాయకులందరూ రష్యన్ల చేతిలో హతులయ్యారు. పెల్జిదిన్ , అనందున్ అమర్ హతులైన వారిలో కొందరు. 1952లో చొయిబల్సన్ సందేహాత్మకంగా రష్యాలో హతుడయ్యాడు. కొమింటన్ నాయకుడు బొహుమీర్ స్మెరల్ " మంగోలియన్ ప్రజలు ముఖ్యం కాదు. మంగోలియన్ భూమి మాత్రమే ముఖ్యం. మంగోలియన్ భూమి ఇంగ్లాండ్, ఫ్రాంస్, జర్మనీ కంటే విశాలమైనది. [13]
1931లో జపానీయులు మంచురియా మీద దండయాత్ర చేసిన తరువాత జపానీయుల సామ్రాజ్యవాదం మంగోలియాను అప్రమత్తం చేసింది.1939లో జరిగిన సోవియట్ - జపాన్ యుద్ధంలో జపానీయుల సామ్రాజ్య విస్తరణ నుండి సోవియట్ యూనియన్ మంగోలియాను విజయవంతంగా రక్షించింది.1939లో ఖాల్ఖిన్ గోల్ యుద్ధంలో మంగోలియా జపాన్‌తో యుద్ధం చేసింది. తరువాత 1945 ఆగస్టులో దక్షిణ మంగోలియాను జపాన్, చైనా నుండి రక్షించడానికి జరిగిన సోవియట్ - జపాన్ యుద్ధంలో మంగోలియా కూడా పాల్గోన్నది. పసిఫిక్ యుద్ధంలో సోవియట్ యూనియన్ పాత్ర గురించి చర్చించడానికి 1945 ఫిబ్రవరి యల్టా సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో పాల్గొనడానికి రష్యా మంగోలియా స్వాతంత్ర్యం రక్షించబడాలని షరతు విధించింది. 1945 అక్టోబరులో మగోలియన్ స్వతంత్ర రిఫరెండం సభ్యుల 100% ఆమోదంతో నెరవేరింది.[18] పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన తరువాత 1949 అక్టోబరు 6న చైనా, మంగోలియాలు పరస్పరం ఒకరిని ఒకరు గుర్తించుకున్నాయి. 1952 జనవరి 26న యుజాగిన్ త్సెడెంబాల్ మంగోలియా పాలనాధికారం స్వీకరించాడు. త్సెడెంబాల్ మాస్కోకు వెళ్ళిన తరుణంలో ఆయన అనారోగ్యం కారణంగా చూపి పార్లమెంటు ఆయనను పదవి నుండి తొలగించి జంబిన్ బత్మోంక్ పదవి బాధ్యతలు అప్పగించింది.
రష్యా పతనం మంగోలియన్ రాజకీయాలలో పెనుమార్పులను తీసుకువచ్చింది. రాజకీయ మార్పులు 1990 మంగోలియన్ స్వతంత్ర సమరం, బహుళ పార్టీ విధానం, మార్కెట్ ఎకనమీ ఏర్పడడానికి దారితీసాయి. 1992 లో మంగోలియాలో కొత్త రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది. దేశం పేరు నుండి పీపుల్స్ రిపబ్లిక్ అనే పదాలు తీసివేయబడ్డాయి. మార్కెట్ ఆర్థిక పరివర్తన తరచుగా అస్థిరం అయింది. 1990లో దేశంలో పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యం, ఆహారం కొరత ఏర్పడ్డాయి..[ఆధారం చూపాలి] 1993లో నిర్వహించబడిన మొదటి ఎన్నికలలో కమ్యునిష్ఠేతర పార్టీ అధికార పీఠం అధిరోహించింది.
At 1,564,116 కి.మీ2 (603,909 చ. మై.),[19] మంగోలియా వైశాల్యపరంగా ప్రపంచంలో 19వ స్థానంలో (ఇరాన్ తరువాత స్థానం) ఉంది. మంగోలియా ఉత్తర అక్షాంశంలో 41° - 52° (52° ఒక చిన్న ప్రదేశం ఉంది), తూర్పు రేఖాంశంలో 87° - 120°లో ఉంది. ఉత్తర మంగోలియా ఉత్తరంగా బెర్లిన్, జర్మనీ, అంస్టర్‌డాం ఎత్తుకు సరిగా ఉంది. దక్షిణ మంగోలియా రోం (ఇటలీ), చికాగో (యు.ఎస్.ఎ) సమానంగా ఉంది. పశ్చిమ మంగోలియా కొలకత్తా (భారతదేశం), తూర్పు మంగోలియా క్విన్హుయాంగ్డియో (చైనా), హంగ్‌ఝౌ (చైనా) అలాగే తైవాన్ పశ్చిమ సరిహద్దుకు సమానంగా ఉంటుంది. పశ్చిమ మంగోలియా కజకిస్థాన్ మద్య దూరం 36.76 కి.మీ.
మంగోలియా " లాండ్ ఆఫ్ ది ఈటర్నల్ బ్లూ స్కై " లేక " కంట్రీ ఆఫ్ బ్లూ స్కై " అని వర్ణించబడుతుంది. మంగోలియా దేశంలో 250 సన్నీ డేస్ ఉంటాయి. [20][21][22][23]
మంగోలియా దేశం " అశ్వదేశం " (లాండ్ ఆఫ్ హస్ర్స్) గా, (స్టెప్పే మంగోలియా) కూడా పిలువబడుతుంది. (మంగోలియన్: తలిన్ మంగోల్), మంగోలియన్లు ప్రపంచంలో ఉత్తమ అశ్వికులుగా గుర్తించబడుతున్నారు.[24] జె. త్సెరెండెలెగ్ " గుర్రాలు లేని మంగోల్ చరిత్రను ఊహించలేము " అన్నాడు. మంగోలియన్ అధ్యక్షుడు ప్రకృతి, పర్యావరణ రక్షణ బధ్యత వహిస్తాడు. .[24] గుర్రాలు లేని మంగోలియన్ భష్యత్తును ఊహించలేము. గుర్రాలు లేని మంగీలియా మంగోలియానే కాదు.[24]
మంగోలియన్లు వారి దేశం మంగోలియాను " నీలి మంగోలియా " అంటారు. (మంగోలియన్: ఖొక్ మంగోల్), నీలి మంగోలియన్లు (మంగోలియన్: ఖోఖ్ మంగోల్చుద్), స్టెపే మంగోల్స్ (మంగోలియన్: తలిన్ మంగోల్చుద్).
భౌగోళికంగ మంగోల్ వైవిధ్యం కలిగి ఉంటుంది. దేశం దక్షిణ సరిహద్దులో గోబీ ఎడారి, ఉత్తరంలో పర్వతాలు ఉన్నాయి. మంగోలియాలో 11.2% అరణ్యాలు ఉన్నాయి. వీటిని స్టెప్పెలు అంటారు.[25] ఐర్లాండ్ దేశంలో (10%) అధికం.[26] మంగోలియాలోని " ఖుయితెన్ " (437 మీ) పర్వతం అత్యంత ఎత్తైనదిగా భావిస్తున్నారు. యుస్ సరసులో కొంత భాగం తువా రిపబ్లిక్ (రష్యా) ఉంది. దీనిని ప్రపంచ సంప్రదాయ సంపదలలో ఒకటిగా గుర్తిస్తున్నారు. దేశం వేసవి అత్యంత వేడిగానూ, శీతాకాలంలో అత్యంత శీతలంగానూ ఉంటుంది. జనవరి మాస ఉష్ణోగ్రత అత్యంత శీతలంగా ఉండి 30 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుంటుంది..[27] శీతాకాలంలో సైబీరియా నుండి విస్తారమైన శీతల, బరివైన, మందపు గాలులు దేశంలో ప్రవేశిస్తాయి. నదీలోయలు, పర్వతాల బేసిన్లు చాలా చల్లాగా ఉంటాయి. పర్వత భూభాగంలో అవసరమైనంత వెచ్చగా ఉంటుంది.
శీతాకాలంలో మంగోలియా అంతటి మీద సైబీరియన్ ఏంటీసైక్లోన్ ప్రభావం ఉంటుంది. యువ్స్ భూభాగంలోని ఉలంగోం, పశ్చిమ ఖొవ్స్గోల్ (రించిన్ ఖుంబె), తూర్పు జవ్ఖాన్ ( తొసంత్సెంగల్ ), ఉత్తర బుల్గన్ (హుతగ్), తూర్పు డొర్నాడ్ భూభాగం (ఖల్ఖిన్ గోల్) ప్రాంతాలలో అతి అత్యంత శీతలప్రాంతాలుగా ఉన్నాయి. ఉల్సంబాతర్ కూడా చలి ప్రదేశం అయినప్పటికీ చాలా అధికం కాదు. దక్షిణ ప్రాంతంలో చలి తక్కువగా ఉంటుంది. ఒమ్నొగొవి భూభాగం (దలంజద్గాడ్, ఖాంబొగ్ద్ ), అటై పర్వతాలు చైనా సతిహద్దులో ఉన్నాయి. మధ్య, అర్ఖంగై భూభాగం (త్సెత్సెర్లెగ్), ఉత్తర ఒవొర్ఖంగై భూభాగం (అరవైఖీర్) లలో జనవరి ఉష్ణోగ్రత ఒకే మాదిరిగా ఉన్నా తరచుగా దక్షిణ భూభాగంలో ఉన్న ఎడారి ఉష్ణోగ్రతకంటే అధికంగా ఉంటుంది. అదనంగా వాతావరణం స్థిరంగా కూడా ఉంటుంది. ఖంగై పర్వతాలు సూక్ష్మమైన వాతావరణం రూపొందడానికి పాత్రవహిస్తుంది. త్సెత్సెర్లెగ్ అతి వెచ్చని నగరంగా భావిస్తున్నారు. జనవరి మాసంలో రాత్రి ఉష్ణోగ్రత అధికంగా 30 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుతుంది. పగటి ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడు నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడు వరకు ఉంటుంది. [28][29]
దేశంలో ఒక్కోసారి వాతావరణం కఠినంగా మారుతుంది. దీనిని జుద్ అంటారు. ఉలంబాతర్ సరాసరి ఉష్ణోగ్రత 1.3 సెంటీగ్రేడ్ లేక 29.7 ఫారెంహీట్ ఉంటుంది. ఇది ఈ నగరాన్ని ప్రపంచపు అతిశీతల రాజధాని నగరంగా గుర్తింపును ఇస్తుంది. .[27] మంగోలియాలో అధిక చలి, వేగమైన గాలి ఉంటుంది. శీతాకాలం దీర్ఘంగా వేసవి కాలం తక్కువగా ఉంటుంది. వేసవి కాలంలోనే వర్షపాతం ఉంటుంది.దేశంలో 257 మేఘావృత రోజులు ఉంటాయి. దేశం మధ్యలో హై అట్మొస్ఫెరిక్ ప్రెషర్ ఉంటుంది. ఉత్తర భూభాగంలో వర్షపాతం అధికంగా (వార్షిక వర్షపాతం 250-350 మి.మీ) ఉంటుంది.దక్షిణ భూభాగంలో వర్షపాతం తక్కువగా (వార్షిక వర్షపాతం 100-200 మి.మీ) ఉంటుంది. అత్యధిక వార్షిక వర్షపాతం 622.297 మి.మీ. అధిక వర్షపాతం రష్యా సరిహద్దులలోఉన్న బుల్గాన్ భూభాగంలోని అరణ్యాలలో కురుస్తుంది. అత్యల్ప వర్షపాతం గోబీ ఎడారిలో (41.735) ఉంటుంది.[30] జనసంఖ్య పలుచగా ఉండే ఉత్తర బుల్గాన్ భూభాగంలో 600 మి.మీ ఉంటుంది. బీజింగ్ వార్షిక వర్షపాతం (వార్షిక వర్షపాతం 571.8- 571 మి.మీ) కంటే అధికం.
గీబీ అనే పదం మంగోలి భాషకు చెందింది. గోబీ అంటే వృక్షజాల రహిత ఆతిపోయిన భూమి అని అర్ధం. ఇది మమ్ముత్, ఒంటెలు జీవించడానికి సహకరిస్తుంది. గోబీ అంటే ఎడారి కంటే కొంచం వేరుగా ఉంటుంది. విదేశీయులు మంగోలియన్ భూమికి అలవాటు పడడం కష్టం. గోబీ పొడి భూములు పెళుసుగా ఉంటాయి. ఇక్కడ వృక్షజాలం జంతువులు అధికంగా మేయడం వలన క్షీణించి మరింత ఎడారిభూమిగా మారిపోయింది. రాతిమయమైన భూభాగంలో బాక్త్రియన్ ఒంటెలు కూడా జీవించడం కష్టమే. గోబీ ఎడారిలోని పొడి భూమి హిమాలయాలలో ఉన్నట్లు రెయిన్ షాడో ఎఫెక్టుకు కారణం పుతుంది. 10,000 మిలియన్ సంవత్సరాల ముందు ఇండో - ఆస్ట్రియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్‌తో ఢీకొని హిమాలయాలు రూపొందక ముందు మంగోలియా వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా ఉండేది. ప్రస్తుతం, శీతల ప్రదేశంలో సముద్రపు టర్టిల్, మొల్లస్క్ శిలాజాలు లభ్యం ఔతున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో టాడ్‌పోల్ ష్రింప్స్ కూడా శిలాజాలుగా లభ్యం ఔతుంటాయి.
2015 యు.ఎస్ సెంసస్ బ్యూరో గణాంకాలను అనుసరించి మంగోలియా మొత్తం జనసంఖ్య [31] 3,000,251. ప్రపంచ జనసంఖ్యా గణాంకాల వరుసలో ఇది 121వ స్థానంలో ఉంది. యు.ఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ ఈస్ట్ ఆసియన్, పసిఫిక్ అఫైర్స్ యునైటెడ్ నేషంస్ అంచనాలను అనుసరిస్తుంది. [32] యు.ఎస్ సెంసస్ బ్యూరో అంచనాలకు బదులుగా యునైటెడ్ నేషంస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫెయిర్స్ జనసంఖ్యా విభాగం [33] 2007 మంగోలియన్ జనసంఖ్య 2,629,000 (యు.ఎస్ సెంసస్ బ్యూరో అంచనాల కంటే 11%తక్కువ) యు.ఎన్ అంచనాలు మంగోలియన్ అంచనాలకు సమీపంలో ఉన్నాయి. (2007 జూన్ ఆఖరుకు 2,612,900). 2007 మగోలియన్ జసంఖ్యాభివృద్ధి 1.2%.[33] 30 వయసుకంటే తక్కువ వయసు కలవారి సంఖ్య 59%, 14 వయసుకంటే తక్కువ వయసు కలవారి సంఖ్య 27%. 1918లో మొదటిసారిగా జసంఖ్యా గణాంకాలు అనుసరించి మంగోలియన్ జనసంఖ్య 6,47,500. [34] సోషలిజం ముగింపుకు వచ్చే సమయానికి మంగోలియా జసంఖ్యాభివృద్ధి క్షీణత సంస్యను ఎదుర్కొన్నది. ఐక్యరాజ్య సమితి అంచనాలను అనుసరించి మంగోలియన్ శిశుజనన శక్తి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే తక్కువగా ఉంది.[33] in 1970–1975, fertility was estimated to be 7.33 children per woman, dropping to about 2.1 in 2000–2005.[35] సమీపకాలంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2005-2010 మద్య జనసంఖ్యాభివృద్ధి 2.5% చేరుకుంది.
మంగోలియన్ సంప్రదాయక ప్రజల శాతం 95%. వీరిలో ఖల్ఖా, ఇతర ప్రజలు ఉన్నారు. ప్రజలలో పలు మంగోలియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. మంగోలియాలో ఖల్ఖా ప్రజలు 86% ఉన్నారు. మిగిలిన 14% శాతం ప్రజలలో ఒయిరాతులు, బుర్యాతులు, ఇతరులు ఉన్నారు. టర్కీ ప్రజలు, కజఖాస్, తువానులు 4.5% ఉన్నారు. మిగిలిన వారిలో రధ్యన్లు, చైనీయులు, కొరియన్లు, అమెరికన్లు ఉన్నారు.[36]
మంగోలియ భాష మంగోలియా అధికారిక భాషగా ఉంది. మంగోలియా భాష 95% ప్రజలలో వాడుక భాషగా ఉంది. ఒయిరాత్ భాష,, బురియాత్ భాషలు కూడా దేశమంతటా వాడుకలో ఉన్నాయి. మంగోలిక్ ఖమ్నిగన్ భాషకూడా వాడుకలో ఉంది. దేశం పశ్చిమ భూభాగంలో కజఖ్, తువాన్ భాషలు వాడుకలో ఉన్నాయి. రెండు టర్కీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. మంగోలియన్ సైన్ భాష చెవిటి వారి కొరకు ప్రధాన భాషగా వాడుకలో ఉంది.
ప్రస్తుతం మంగీలియన్లు వ్రాయడానికి సిర్లిక్ లిపిని వాడుతున్నారు. గతంలో వ్రాయడానికి మంగోలియన్ లిపి వాడుకలో ఉంది. 1994లో పురాతన లిపిని తిరిగి అధికార భాషగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. ముందు తరం వారు భాషను వాడడంలో సమస్యలను ఎదుర్కొనడం కారణంగా ఆప్రయత్నం సఫలం కాలేదు.[37] క్రమంగా సంప్రదాయక భాష తిరిగి పాఠశాలలలో ప్రవేశపెట్టబడుంది.[38]
మంగోలియాలో అధికంగా వాడుకలో ఉన్న విదేశీ భాషలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో ఆంగ్లభాష ఉంది. ఆంగ్లభాష క్రమంగా రష్యాభాష స్థానంలోకి మారి రెండవ భాషగా గుర్తించబడుతుంది. కొరియన్ భాష దక్షిణ కొరియాలో పనిచేస్తున్న లక్షలాది మంది మంగోలియన్లలో వాడుకలో ఉంది. .[39]
మంగోలియా పొరుగు ప్రాంతాల భాష మాండరిన్ పట్ల మంగోలియను ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. .[ఆధారం చూపాలి] వయసైన మంగోలియన్ విద్యావంతులలో జర్మన్ భాష వాడుకలో ఉంది. వారు మునుపటి తూర్పు జర్మనీలో విద్యాభ్యాసం చేయడం అందుకు ప్రధానకారణం. మరి కొంతమందికి ఈస్టర్న్ బ్లాక్ భాష వాడుకలో ఉంది. యువకులు అనేకమందికి పశ్చిమ యురేపియన్ భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. వారు జర్మనీ, ఫ్రాంస్, ఇటలీలలో చదవడం, పనిచేయడం అందుకు ప్రధానకారణం. .[ఆధారం చూపాలి]
మంగోలియా ఆహారపుటలవాట్లు మంగోలియా శైలిలోనే ఉంటాయి. వాతావరణం కూడా ఆహారపుటలవాట్ల మీద తనదైన ప్రభావం చూపుతుంది. ఆహారంలో పాల ఉత్పత్తులు, మాంసం, జంతుసంబంధిత కొవ్వు అధికంగా చోటుచేసుకుంటుంది. కూరగాయలు, సుగంధద్రవ్యాల వాడకం పరిమితంగా ఉంటుంది. భౌగోళిక సామీప్యత, లోతుగా చారిత్రక సంబంధాలు కారణంగా మంగోలియన్ ఆహారపుటలవాట్ల మీద చైనా, రష్యా ప్రభావం అధికంగా ఉంటుంది. మంగోలియాలో అత్యధికంగా ప్రాముఖ్యత సంతరించుకున్న ఆహారాలలో ఆవిరి మీద ఉడికించబడే " బుజ్ " ఒకటి. తరువాత ప్రాముఖ్యత సంతరించుకున్న ఆహారం లప్ష (ఇది సులభమైన నూడిల్ వంటకం). నూడిల్స్ అనే పదం వాస్తవంగా రష్యాభాషకు చెందింది.
2010 జాతీయ గణాంకాలను అనుసరించి 15 సంవత్సరాలకు పైబడిన వారిలో 53% ప్రజలు బుద్ధిజం అనుసరిస్తున్నారు, నాస్థికులు 39% ఉన్నారు. అనుసరిస్తున్నారు.
మంగోలియన్ చరిత్రకాలం అంతా మంగోలియన్ షామనిజం అనుసరించబడింది. అది ఇప్పుడు కూడా మంగోలియాలో అనుసరించబడుతుంది. మద్య ఆసియాలోని నోమాడ్స్ మద్య అదే విశ్వాసాలు కొనసాగుతున్నాయి. క్రమంగా టిబెటన్ బుద్ధిజం మంగోలియాలో ప్రవేశించగానే షామనిజం బలహీనపడినప్పటికీ షామనిజం ఇప్పటికీ మంగోలియన్ మతసంస్కృతి మీద పురాతన చిహ్నాలను వదిలి వెళ్ళింది. కొంతమంది మంగోలియన్లు, టర్కిక్ ప్రజలు సంప్రదాయమైన ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు.
20వ శతాబ్దంలో " మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ " పాలనలో ప్రభుత్వం మంగోలియన్ మతస్వాతంత్ర్యాన్ని అణిచివేసింది. మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ అధికంగా ట్జిబెటన్ బుద్ధమత సంబంధిత మతాధికారులు మారియు ఆలయాల మీద దృష్టిని సారించింది. టిబెటన్ బుద్ధమతం పూర్వపు భూస్వామ్య వ్యవస్థ అంతటా పూర్తిగా వ్యాపించింది. [41]1930లో పాలనాధికారం ఖొర్లూగిన్ చొయిబాల్సన్ హస్థగతం అయిన తరువాత 700 మంగోలియన్ బౌద్ధమఠాలు మూసివేయబడ్డాయి. మంగోలియా లోని స్టాలినిస్ట్ రాజకీయవాదులు చంపిన 30,000 ప్రజలలో 18,000 మంది లామాలు ఉన్నారు..[42] 1990 - 1924 మద్యకాలంలో బౌద్ధ సన్యాసుల సంఖ్య 1,00,000 నుండి 110కి క్షీణించింది. [41]
1991లో కమ్యూనిజం పతనం అయిన తరువాత ప్రజల మతవిశ్వాసాలకు తిరిగి స్వతంత్రం లభించింది. టిబెటన్ బుద్ధిజం ఒకప్పుడు మంగోలియాలో పునరుద్ధరించబడింది. 1990లో మతవిశ్వాసం అణిచివేత ముగింపుకు వచ్చిన తరువాత మంగోలియాలో ఇతర మతాలు కూడా విస్తరించడానికి అవకాశం లభించింది. క్రైస్తవ మిషనరీ బృందం బర్నాబాస్ ఫండ్ గణాంకాలను అనుసరించి 1989లో క్రైస్తవుల సంఖ్య 4 మాత్రమే ఉండగా 2008 నాటికి 40,000 మందికి చేరింది. 2013 మే మాసానికి " ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ " చర్చి 20 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంది. మంగోలియాలో ఆసమయానికి 16 చర్చిలు ఉన్నాయి.
[43] 2003 నాటికి మంగోలియాలో 1000 మంది కాథలిక్కులు ఉన్నారు. అలాగే ఫిలిప్పైన్ నుండి వచ్చిన కాథలిక్ చర్చి, బిషప్ ఉన్నారు.[44] హిందూమతాన్ని మంగోలియాలో చాలా కొద్ది స్థాయిలో ఆచరిస్తున్నారు.
మంగోలియా 21 భూభాగాలుగా (అయిమాగ్స్) విభజించబడింది. అవి తిరిగి 339 జిల్లాలుగా (సంస్) విభజించబడ్డాయి.[45] రాజధాని నగరం ఉలాంబాతార్ రాజధాని నగరం (పురపాలకం) గా నిర్వహించబడుతుంది.
|
|
ఉలాంబాతర్లో 40% ప్రజలు నివసిస్తుంటారు. 2002 లో ప్రజలు డర్ఖాన్, ఎర్డెనెట్, ఎయిమాగ్స లలో నివసించే వారి శాతం 23%. మంగోజ్లియన్ స్లంస్లో ప్రజలు స్థిరంగా జీవిస్తున్నారు. [46] మిగిలిన ప్రజలు స్లం కేంద్రాలలో నివసిస్తున్నారు. మంగోలియాలోని ప్రధాన నగరాలు :-
నగరం సంఖ్య | విభాగం పేరు | నగరం పేరు | జనసంఖ్య |
---|---|---|---|
1 | ఉలంబతర్ | ఉలంబతర్ | 1,340,000 |
2 | ఎర్డెనెట్ | ఒర్ఖాన్ | 86,866 |
3 | దర్ఖాన్ | దర్ఖాన్- వూల్ | 74,300 |
4 | చొయిబల్సన్ | డొర్నొడ్ | 38,150 |
5 | మొరొన్ | ఖొవ్స్గొల్ | 36,082 |
6 | ఖొవ్ద్ | ఖొవ్ద్ | 28,601 |
7 | ఒల్గి | భయన్- ఒల్గి | 27,855 |
8 | భయంఖొగొర్ | భయంఖొంగొర్ | 26,252 |
9 | అర్వైఖీర్ | ఒవొర్ఖంగై | 25,622 |
10 | ఉలాంగొం | య్వ్స | 21,406 |
11 | సుఖ్బతర్ | సెలెంగే | 19,626 |
12 | సైంషంద్ | డొర్నొగొవి | 19,891 |
13 | డలంజద్గాద్ | ఒమ్నొగొవి | 16,856 |
14 | త్సెత్సెర్లెగ్ | అర్ఖంగై | 16,300 |
15 | ఉలస్తై | జవ్ఖాన్ | 16,240 |
16 | అల్తై | గొవి- అల్తై | 15,800 |
17 | జూంఖరా | సెలెంగే | 15,000 |
18 | ఒందొర్ఖాన్ | ఖెంతీ | 14,800 |
19 | జూన్మొద్ | తొవ్ | 14,568 |
20 | బరున్ - ఉర్త్ | సుఖ్బతర్ | 12,994 |
మంగోలియా ఆర్థికరంగం సంప్రదాయకంగా జంతువుల పెంపకం, వ్యవసాయ ఆధారితంగా ఉంటుంది. అలాగే విస్తారమైన రాగి, బొగ్గు, మోలిబ్డెనం, టిన్, టంగ్స్టన్, బంగారం ఖనిజ నిల్వలు పారిశ్రామిక ఉత్పత్తులు ఆర్థికరంగానికి ఇతోధిక సాయం అందిస్తుంది.[47] ఖనిజాలు (2.8% జి.డి.పి), వ్యవసాయం ( (16% జి.డి.పి) అభివృద్ధి జరుగుతుండగా వాటిని సమైక్య పారిశ్రామిక జి.డి.పి, హోల్ సేల్, చిల్లర వ్యాపారం, రవాణా, స్టోరేజ్, ఆస్తుల క్రయవిక్రయాల జి.డి.పిలు అధిగమిస్తున్నాయి.[47] ది గ్రే ఎకనమీ అధికారిక ఎకనమీలో మూడింట ఒక వంతు ఉంటుంది.[47]2006 గణాంకాలను అనుసరించి మంగోలియా 68.4% ఎగుమతులు " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా "కు చేరుతుంటాయి. " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా " నుండి మంగోలియా 29.8% దిగుమతి చేసుకుంటుంది.[48]
మంగోలియా ఆర్థికరంగాన్ని " లోవర్ మిడిల్ ఎకనమీ "గా ప్రపంచ బ్యాంక్ గుర్తించింది.[49] 22.4% మంగోలియా ప్రజల దినసరి ఆదాయం 1.25 యు.ఎస్ డాలర్లకంటే తక్కువ. [50] GDP per capita in 2011 was $3,100.[51] 1998 లో దారిద్యరేఖకు దుగువన ఉన్న ప్రజల శాతం 35.6%, 2002-2003 నాటికి 36.1% చేరుకుంది, 2006 నాటికి అది 32.2% నికి తగ్గించబడింది. [52]
మంగోలియా దేశంలో ఖనిజ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి కారణంగా 2007 - 2008 లలో అభివృద్ధి రేటు 9.9% , 8.9% చేరుకుంది.[47] 2009లో 16 కమర్షియల్ బ్యాంకులు అనుసంధానించబడ్డాయి.[47] 2011 జి.డి.పి అభివృద్ధి 16.4% అయినప్పటికీ ఆర్థికమాంద్యం అభివృద్ధి జి.డి.పి అభివృద్ధిని నిర్వీర్యం చేసింది. [47] 2002 నుండి జి.డి.పి క్రమంగా అభివృద్ధి చెందింది. 2006 నాటికి 7.5% గి.డి.పి అభివృద్ధి సాధించాలని అంచనా వేసారు. వ్యాపారరంగం అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషిచేస్తూ ఉంది. 2013లో వ్యాపార లోటు శాతం 14% ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేసారు.[53]
2011 వరకు మంగోలియా ప్రపంచ మార్కెట్ల జాబితాలో చోటుచేసుకో లేదు. సిటీ గ్రూప్ విశ్లేషకులు మంగోలియా " 3 జి దేశాలు" ఒకటని నిర్ణయించారు. 2010-2050 కాలం నాటికి 3జి దేశాలు అత్యధికంగా అభివృద్ధి దశలో పయనిస్తున్న దేశాలుగా గుర్తించబడుతున్నాయి.[54] మంగోలియన్ స్టాక్ ఎక్చేంజి 1991లో ఉలంబతర్లో స్థాపించబడింది. మార్కెట్ పెట్టుబడుల దృష్ట్యా ప్రపంచంలోని చిన్నతరహా స్టాక్ ఎక్చేంజిలలో ఇది ఒకటి. .[55][56] 2011లో మంగోలియాలో 336 కంపెనీలు ఉన్నాయి. పారిశ్రామిక మొత్తం పెట్టుబడి 2 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 2008లో పారిశ్రామిక పెట్టుబడి 406 మిలియన్ల అమెరికన్ డాలర్లు.[57] 2012 నుండి మంగోలియా ప్రభుత్వం వ్యాపారం సులభతరం చేసిన తరువాత వ్యాపారంలో అభివృద్ధి మొదలైంది. ఇంటర్నేషనల్ ఫైనాంస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డూయింగ్ బిజినెస్ నివేదికలు అనుసరించి 2011 లో 88 వ స్థానంలో ఉన్న మంగోలియా నుండి 2012 లో 76వ స్థానానికి చేరుకుందని తెలుస్తుంది.[58]
మంగోలియా ఎగుమతులలో 80% ఖనిజాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది 95% చేరుకుంటుందని అంచనా వేసారు. 3,000 గనుల త్రవ్వకపు అనుమతులు జారీ చేయబడ్డాయి. [53] మంగోలియాలో గనుల పరిశ్రమ అభివృద్ధిచెందుతున్న ప్రధాన పరిశ్రమగా గుర్తించబడుతుంది. మంగోలియాలో పలు చైనా, రష్యా, కెనడా దేశాల సంస్థలు మైనింగ్ వ్యాపారంలో పాల్గొంటున్నాయి.[51]2009లో వేసవిలో మంగోలియన్ ప్రభుత్వం ఒయు తొల్గి రాగి , బంగారు నిల్వల అభివృద్ధి కొరకు " రియో టింటో గ్రూప్", " టర్క్యువైజ్ హిల్ రిసౌర్సెస్ " లతో ఇన్వెస్ట్మెంటు ఒప్పందం చేసుకుంది.[47] మంగోలియన్ మైనింగ్ వ్యాపారం అత్యధికంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న పరిశ్రమా అభివృద్ధి చెందింది. దేశం జి.డి.పి అభివృద్ధిలో మూడింట ఒక వంతు మైనింగ్ నుండి లభిస్తుంది.[53] మార్చి 2011లో 6 మైనింగ్ కంపెనీలు తవన్ తొల్గొ లోని విస్తారమైన బొగ్గు నిల్వల కొరకు ప్రాంతంలో త్రవ్వకాల వేలంలో పాల్గొన్నది. మంగోలియన్ లోని తవన్ తొల్గియి ప్రభుత్వానికి స్వంతమైన ఎర్డెంస్ ఎం.జి.ఎల్ నివేదికలను అనుసరించి ఆర్సెలర్ మిట్టల్, వేల్, క్సత్ర, యు.ఎస్. కోయల్ మైనర్ పీబాడీ, చైనీస్ ఎనర్జీ ఫాం షెంహుయా గ్రూప్, జపాన్ మిస్తుయి & కొ, జపానీస్ కంసోరిటం, దక్షిణ కొరియన్, రష్యన్ ఫాం వంటి ప్రముఖ సంస్థలు బిడ్డింగ్ చేసాయని తెలుస్తుంది.[60]
2002లో మంగోలియాలోని 30% కుటుంబాలు జంతువుల పెంపకం జీవనోపాధిగా ఎంచుకున్నాయి.[61] మంగోలియాలోని పశువుల మందలు నోమోడిజం, సెమీ నోమోడిజానికి సంబంధితమై ఉన్నాయి. 2009- 2010 శీతాకాలంలో 9.7 మిలియన్ల జంతువులు (22% జంతువులు) లను నష్టపోయింది. ఇది మాంసపు ధరల మీద ప్రభావం చూపింది. మాంసపు ధరలు రెండు రెట్లు అధికం అయింది. 2009 లో జి.డి.పి 1.6% పతనం అయింది.[47]
మంగోలియన్, పొరుగు ప్రాంతాలకు " ది- ట్రాంస్ - మంగోలియన్ - రైల్వే " ప్రధాన రైలు మార్గంగా ఉంది. ఇది రష్యాలోని ఉలాన్- ఉడే నగరం వద్ద ఉన్న " ట్రాంస్- సైబీరియన్ రైల్వే " వద్ద ప్రారంభం ఔతుంది. తరువాత మంగోలియాను దాటి ఉలంబతార్ను దాటి తరువాత ఎరెంహాట్ నగరం వద్ద చైనాలో ప్రవేశిస్తుంది. అక్కడ ఇది చైనా రైలుమార్గంతో అనుసంధానించబడుతుంది. ఒక ప్రత్యేక రలుమార్గం చొయిబల్సన్ నగరాన్ని సైబీరియన్ రైలు మార్గంతో అనుసంధానిస్తుంది. ఈ రైలు మార్గం మంగోలియన్ లోని చులుంకొరూట్ నగరానికి సమీపంలో ఉంది..[62]
మంగోలియాలో పలు విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అంతర్జాతీయ అంతస్తు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ మంగోలియాలో " చింగిస్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం " ప్రధానమైనదిగా ఉంది. ఇది రాజధాని నగరం ఉలాంబాతర్కు 20కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి చైనా, దక్షిణ కొరియా,తాయ్ లాండ్,జపాన్,రష్యా,జర్మనీ,కిర్గ్య్స్థాన్, టర్కీ దేశాలకు నేరుగా విమాన సేవలు లభిస్తుంటాయి. ఎం.ఎ.ఐ.టి మంగోలియన్ ఎయిర్ లైంస్ అంతర్జాతీయ విమానాలను నడుపుతూ ఉంది. ఎయిరో మంగోలియా, హున్‌ను ఎయిర్ లైంస్ డొమస్టిక్, రీజనల్ మార్గాలలో సేవలు అందిస్తున్నాయి.
మంగోలియాలో కంకర రహదార్లు లేక క్రాస్ - కంట్రీ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. ఉలంబాతర్ నగరంలో మాత్రమే పేవ్డ్ రహదార్లు ఉంటాయి. ఇక్కడి నుండి తూర్పుగా రష్యా, చైనా సరిహద్దు వరకు రహదార్లు ఉన్నాయి. పశ్చిమంలో డర్కన్ నుండి బుల్గాన్ వరకు రహదార్లు ఉన్నాయి. ప్రస్తుతం పలు రహదార్లు నిర్మాణదశలో ఉన్నాయి. మంగోలియాలో 4,800 కి.మీ పొడవున పేవ్డ్ రహదార్లు ఉన్నాయి. వీటిలో 1,800 కి.మీ పొడవైన రహదారి మార్గాలు 2013లో నిర్మించబడ్డాయి. .[63]
మంగోలియాలో సోషలిస్ట్ పాలనలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడింది. సోషలిస్ట్ పాలనలో గుర్తించతగినంతగా విద్యాభివృద్ధి సాధించబడ్జింది. నిరక్ష్యరాశ్యత చాలా వరకు తగ్గించబడింది. నోమాడ్ కుటుంబాలలోని పిల్లలకు సీజనల్ బోర్డింగ్ స్కూల్స్ నడపడం ద్వారా నిరక్షరాశ్యతను తొలగించగలిగారు. 1990 నుండి బోర్డింగ్ స్కూల్స్‌కు నిధి మంజూరు చేయడం నిలిపివేయబడింది. తరువాత దేశంలో నిరక్ష్యరాశ్యతా శాతం అధికం అయింది.
మంగోలియాలో ప్రాథమిక, మాధ్యమిక విద్య 10 సంవత్సరాల విధానం ఉంది. తరువాత దీనిని 11 సంవత్సరాలకు పొడిగించబడింది. 2008-2009 విద్యా సంవత్సరంలో 12 సంవత్సరాల విద్యా విధానం ప్రవేశపెట్టబడ్జింది. అయినా 12 సంవత్సరాల విద్యా విధానం పూర్తి స్థాయిలో అమలు చేయబడలేదు.[64]2006 నుండి మంగోలియా అంతటా సెకండరీ స్కూల్స్‌లో 4 గ్రేడ్ నుండి ఆగ్లమాధ్యమం ప్రవేశపెట్టబడింది.
మంగోలియన్ నేషనల్ యూనివర్శిటీలు " నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మంగోలియా ", " మంగోలియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ " లతో అనుసంధానించబడి ఉన్నాయి. ప్రస్తుతం మంగోలియన్ యువతలో ఐదుగురిలో ముగ్గురు విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్నారు. 1993-2010 మద్యలో విద్యార్థుల సంఖ్య 6 రెట్లు అధికం అయింది. [65]
1990 నుండి ఆరోగ్య సూచికలు ఆయుఃప్రమాణం, గర్భస్రావాలు, శిశుమరణాలు క్రమంగా అభివృద్ధి చెందాయి. సాంఘికంగా వచ్చిన మార్పులు ఆరోగ్యరంగంలో అభివృద్ధికి కారణం అయ్యాయి. 1990లో యువత ఆరోగ్యం క్షీణించడం వలన 21 వ శతాబ్దంలో శిశుమరణాల సంఖ్య అధికం అయింది.[66]
గ్రామ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదురయ్యాయి.[67] 2011 గణాంకాలను అనుసరించి " వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ " మంగోలియా రాజధాని ఉలాంబతార్ ప్రపంచ కాలుష్యనగరాలలో రెండవ స్థానంలో ఉంది. [68] వాయు కాలుష్యం కూడా వృత్తిపరమైన వ్యాధులకు ప్రధాన కారణంగా భావించబడుతుంది. మంగోలియాలోని వృత్తిపరమైన వ్యాధిగ్రస్థులలో మూడింట రెండువంతులు దుమ్ము సంబంధిత ఊపిరితిత్తుల వ్యాధులు, నిమోనియా వ్యాధిగ్రస్థులుగా ఉన్నారు.[69]
సరాసరి శిశుజననాలు 2.25 %.[31]–1.87[33] per woman (2007) and సరాసరి ఆయుఃప్రమాణం 68.5. .[50] గర్భస్రావాలు 1,9%.[70]–4%,[71] శిశుమరణాలు 4.3%.[72]
మంగోలియాలో 17 స్పెషల్ ఆసుపత్రులు, 4 రీజనల్ డయోగ్నోస్టిక్ ట్రీట్మెంటు కేంద్రాలు, 9 జిల్లా ఆసుపత్రులు, 21 అయిమాగ్ జనరల్ ఆసుపత్రులు, 323 సౌం ఆసుపత్రులు, 18 ఫెల్డ్షర్ పోస్టులు, 233 కుటుంబ ప్రాక్టిసులు, 556 ప్రైవేట్ ఆదుపత్రులు, 57 డ్రగ్ సప్లై కంపెనీలు ఉన్నాయి. 2002 గణాంకాలను అనుసరించి ఆరోగ్య సిబ్బంది సంఖ్య 33,273 పనిచేస్తున్నారు. వీరిలో 6823 మంది డాక్టర్లు, 788 ఫార్మాసిస్టులు, 7802 నర్సులు, 14,091 మిడ్- లెవల్- పర్సనల్స్ ఉన్నారు. ప్రస్తుతం 10,000 మందికి 27.7 ఫిజీషియన్లు, 75.7 హాస్పిటల్ బెడ్లు ఉన్నాయి.
మంగోలియా పార్లమెంటరీ రిపబ్లిక్ పాలనా విధానం కలిగి ఉంది. అధ్యక్షుడు నేరుగా ఎన్నుకొనబడతాడు. ప్రజలు నేషనల్ అసెంబ్లీ, ది స్టేట్ గ్రేట్ ఖురల్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి అధ్యక్షునితో కలిసి సమాలోచనలు నిర్వహించి కాబినెట్ మంత్రులను ప్రతిపాదిస్తాడు. ఖురల్ మంత్రులను నియమిస్తుంది. మంగోలియా నియోజకవర్గాలకు వాక్స్వాతంత్ర్యం, మతస్వాతంత్ర్యం కలిగి ఉంటుంది. మంగోలియాలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో " మంగోలియన్ పీపుల్స్ పార్టీ, ది డెమొక్రటిక్ పార్టీ ప్రధానమైనవి.
ది పీపుల్స్ పార్టీ (1921-2010 వరకు పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ) 1921-1996 (1990 లో ఒక పార్టీ విధానం), 2000 నుండి 2004లో ప్రభుత్వం రూపొందించింది. (డెమొక్రేట్ పార్టీల కూటమితో) 2004 నుండి 2012 లో ఎన్నికలలో ఓటమి పొందే వరకు ఈ పార్టీ మంగోలియాను పాలించింది.1996, 2000లలో డెమొక్రేట్లు ఆధిక్యత వహించారు. 2004-2006 వరకు సమాన సభ్యులతో డేమొక్రెటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వం రూపొందించింది. 2012 జూన్ 28న నేషనల్ అసెంబ్లీ ప్రతినిధుల ఎన్నిక సమయంలో ఏ ఒక్క పార్టీ పూర్తి ఆధిక్యత సాధించలేదు. [73] అయినప్పటికీ డెమొక్రెటిక్ పార్టీ అధిక స్థానాలు సాధించింది. [74] 20012 ఆగస్టు 21న డెమొక్రెటిక్ పార్టీ నాయకుడు నొరొవిన్ అల్తంఖుయాంగ్ ప్రధాని పదవిని అధిరోహించాడు. .[75] తరువాత 20014 నవంబరు 21న చిమెడిన్ సైఖంబిలెగ్ ప్రధాని పదవిని అధిరోహించాడు. [76]
మంగోల్ అధ్యక్షుడు అధికంగా అలంకారిక పాత్ర అయినప్పటికీ అవసరమైనప్పుడు పార్లమెంటును నియత్రించే అధికారం ఉంటుంది. అలాగే న్యాధిపతులను నియమించడం, ఒక్కో సమయం న్యాయనిర్ణయం చేయడం వంటి అధికారాలు ఉంటాయి. అలాగే దూతలను నియమించడం వంటి అధికారం ఉంటుంది. పాత్లమెంటుకు మూడింట రెండువంతుల మెజారిటీతో చట్టలను అమలు చేస్తుంది. అధ్యక్ష నియామకానికి మంగోలియన్ పాలనా విధానంలో మూడు నియమాలు అనుసరించబడతాయి. ఒకటి అధ్యక్షినిగా పోటీచేసే అభ్యర్థి మంగోలియాలో జన్మించి ఉండాలి. వయసు 45 సంవత్సరాలు నిండి ఉండాలి. అధికారానికి వచ్చే ముందు 5 సంవత్సరాల కాలం మంగోలియాలోనే నివసించాలి. అధ్యక్షుడు పదవీస్వీకారం చేసే ముందు తమపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. త్సఖియాజిన్ ఎల్బెగ్దొర్ (రెండు మార్లు ప్రధాన మంత్రుగా పనిచేసాడు) గత డెమాక్రటిక్ సభ్యుడు 2009 మే 29న అధ్యక్షుడుగా ఎన్నికయి జూన్ 18న పదవీ స్వీకారం చేసాడు.[77] 2013 జూన్ 26న ఎల్బెగ్దొర్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయి జూలై 10న అధ్యక్షపీఠం అలంకరించాడు. [78]
మంగోలియా పాలనావిధానం యూనికెమెరా పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది. అధ్యక్షపదవి అలంకార ప్రాయంగా ఉంటుంది. ప్రజలచే ఎన్నిక చేయబడిన లెజిస్లేటువ్ పాలనా నిర్వహణ బాధ్యత వహిస్తుంది. లెజిస్లేటివ్ ఆర్ం, ది స్టేట్ గ్రేట్ ఖురల్ 76 సభ్యులు కలిగిన చాంబర్ కలిగి ఉంటుంది. చాంబర్ సమావేశాలు స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంటాయి. చాంబర్ ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు నిర్వహించబడుతుంటాయి. ది స్టేట్ గ్రేట్ ఖురల్ మంగోలియన్ ప్రభుత్వంలో విశేష అధికారాలు ఉంటాయి. ప్రార్లమెంటు సభ్యులు ప్రధాన మంత్రిని ఎన్నుకుంటారు. అధ్యక్షపదవి అలంగారంగా ఉంటుంది.
మంగోలియా రష్యా, చైనా, భారతదేశం, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలతో దౌత్యపరంగా సత్సంబంధాలు కలిగి ఉంది. మంగోలియా ప్రభుత్వం విదేశీ సంబంధాలు, వ్యాపారానికి ప్రోత్సాహం అందిస్తుంది.
మంగోలియా దేశానికి ఆళ్మట్య, అంకార, బ్యాంకాక్, బెర్లిన్, బీజింగ్, బ్రసెల్స్, బుదపేస్ట్, కైరో, కాన్బెర్రా, వార్సా, వాషింగ్టన్, డి.సి, వియన్నా, వియెన్షేన్, హవానా, న్యూ ఢిల్లీ, కువైట్ సిటీ, లండన్, మాస్కో, ఒట్టావా, పారిస్, ప్రేగ్, ప్యోంగ్యాంగ్, సియోల్, సోఫియా, స్టాక్‌హోల్ం, టోక్యో, హ్యానై,, సింగపూర్, ఇర్క్ట్స్క్ లో ఒక కాన్సులేట్, బ్రేడ, ఉలాన్-ఉదే,, దౌత్య న్యూ యార్క్ సిటీ, జెనీవాలో యునైటెడ్ నేషన్స్ నగరాలలో దౌత్యకార్యాలయాలు ఉన్నాయి.[79]
మంగోలియా 2003 ఇరాక్ దాడిని సమర్ధించింది. మద్దతుగా మంగోలియా 103-108 బృందాలను ఇరాక్‌కు పంపింది. 130 బృందాలు ప్రస్తుతం ఆఫ్ఘన్స్థాన్లో నియమించింది. 200 బృందాలు సియేరా లియోనెలో సేవలు అందిస్తున్నారు. వీరు 2009 జూన్ మాసంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక న్యాయస్థాన రక్షణార్ధం ఐక్యరాజ్యసమితి ఆదేశాలమేరకు సియేరా లియోనెలో నియమించబడ్డారు. " ఎం.ఐ.ఎన్.యు.ఆర్.సి.ఎ.టి "కి మద్దతుగా చాద్‌కు బెటాలియన్ పంపడానికి నిశ్చయించింది.[80] 2005 నుండి 2006 మద్యకాలంలో 40 బృందాలు బెల్జియం , కొసవొ లకు పంపబడ్డాయి. 2005 నవంబర్ 21న జార్జ్ డబల్యూ బుష్ (పదవిలో ఉన్న యు.ఎస్ అధ్యక్షుడు)?మంగోలియాకు విజయం చేసాడు. .[81]2014లో బల్గేరియన్ చెయిర్మెన్ ఆధ్వర్యంలో " ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కార్పొరేషన్ ఇన్ ఐరోపా" ఆసియన్ భాగస్వామిగా మంగోలియాను ఆహ్వానించింది.
మంగోలియా జాతీయ జండాలో ఎడమవైపు ఉన్న బుద్ధిజం చిహ్నాన్ని సొయొంబొ సింబొ అంటారు. ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, స్వర్గానికి ప్రతీక. విశ్వోద్భవ చిహ్నాలైన వీటిని సంప్రదాయకమైన తంగ్క పెయింటింగులలో చూడచ్చు.
20వ శతాబ్ధానికి ముందు మంగోలియా కళమీద మతప్రభావం అధికంగా ఉంటుంది. తరువాత మంగోలియన్ ఫై ఆర్ట్స్ మీద మతసంబధిత వ్రాతలు అధికంగా ప్రభావం కలిగి ఉన్నాయి. [82] అప్లిక్యూ సాంకేతికతో తయారుచేయబడే తంగ్కాల మీద వైవిధ్యమైన చిత్రాలను చిత్రిస్తుంటారు. ఇత్తడి శిల్పాలలో అధికంగా బుద్ధుని శిల్పాలు చోటుచేసుకుంటాయి. గొప్ప కళాఖాండాలు అధికంగా జెబ్త్సుందంబ ఖుతుఖు, జనాభాజార్ చెందినవై ఉన్నాయి.
19వ శతాబ్దం చివరలో మర్జన్ షరవ్ మొదలైన చిత్రకారులు అతి సహజమైన చిత్రాల శైలిని అనుసరించారు. మంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్, సోషలిస్ట్ రియలిజం చిత్రకళ మీద ఆధిపత్యం వహించాయి.[83] అయినప్పటికీ సంప్రదాయకమైన తంగ్క చిత్రాలు మతసంబంధిత, జాతీయ అంశాలచిత్రాలు కూడా ప్రానల్యత సంతరించుకున్నాయి. వీటిని " మంగోల్ జురంగ్ " అంటారు.
మంగోలియా ఫైన్ ఆర్ట్స్‌లో!ఆధునిక చిత్రాలను మొదటిసారిగా పరిచయం చేసినప్పుడు 1960లో త్సెవెగ్జవ్ నుండి " ఎహ్లిన్ సెట్జెల్" (తల్లి ప్రేమ) చిత్రం వెలువడింది. తన చిత్రం సెంసార్ చేయబడిందని చిత్రకారుడు వివరించాడు.
మంగోలియన్ ఫైన్ ఆర్ట్స్ అన్ని రూపాలు పెరెస్టోరికా (1980) తరువాత అభివృద్ధి చెందాయి. మంగోలియన్ ఆధునిక చిత్రకారునిచే " ఒత్గొంబయార్ ఎర్షూ "ను నిర్వహిస్తున్నాడు. ఆయన " జురగ్" చిత్రంలో టోబియస్ తోడేలును చిత్రించాడు.[84]
మంగోలియన్ సంప్రదాయ నివాసాలను జెర్ అంటారు. గతంలో నివాసాలకు రష్యన్ పదం " యుర్ట్ " వాడుకలో ఉండేది. తరువాత ఆంగ్లం మాట్లాడే యురేపియన్ దేశాలలో మంగోలియన్ పదం " " జెర్ " అధికంగా వాడుకలో ఉండేది. మంగోలియన్ కళాకారుడు, కళావిమర్శకుడు ఎన్.చుల్టెం జర్ అనే పదం మంగోలియన్ సంప్రదాయ నిర్మాణకళా సంబంధిత పదమని అభిప్రాయ పడుతున్నాడు. 16 -17 శతాబ్ధాలలో లామాసెరీస్ నిర్మించబడ్డాయి. వాటిలో అతధికం జర్ ఆలయాలుగా నిర్మించబడ్డాయి. ఆరాధకుల సంఖ్య అధికం అయిన కారణంగా జర్ ఆలయాలు విస్తరించి నిర్మించబడ్డాయి. మంగోలియన్ నిర్మాణశైలో 6-12 కోణాలతో ఆలయాలు నిర్మించబడతాయి. వీటిని విస్తరించి నిర్మిచినప్పుడు వీటి ఆకారంలో మార్పులు సంభవించాయి. [విడమరచి రాయాలి] పైకప్పు మసీదు పైకప్పు ఆకారంలో నిర్మించబడతాయి.[85] నిర్మాణాలకు రాళ్ళు, ఇటుకలు, బీం,, పలకలను వాడడంతో అవి స్థిరనివాసాలుగా మార్చబడ్డాయి.[86]
చుల్టెం మంగోలియన్ 3 వైవ్ధ్యమైన నిర్మాణశైలి నిర్మాణాల కలయిక (మంగోలియన్, టిబెటన్, చైఇనా). వీటిలో ఒకటైన క్వాడ్రాటిక్ ఆలయాలు (బటు- త్సగాన్) (1654) లను జనాభాజర్ రూపొందించాడు. జర్ శైలి నిర్మాణాలు (లాంసెరి - చొయొలింగ్) ఉలాంబతర్ వద్ద ఉన్నాయి. లార్విన్ ఆలయాలు (18వ శతాబ్ధానికి చెందినవి) ఎర్డెనే జూ వద్ద ఉన్నాయి. లామసెర్రి టిబెటన్ శైలిలో నిర్మించబడతాయి. చైనా శైలో నిర్మించబడిన లామసెరీలను చోయిజింగ్ లామిన్ సుమే (1904) అంటారు. ప్రస్తుతం అది మ్యూజియంగా ఉంది. క్వయాడ్రాటిక్ ఆలయం త్సొగ్చిన్ లామసెరి గండన్ ఉలాంబజర్ వద్ద ఉంది. ఇది మంగోలియన్, చైనా మిశ్రితశైలిలో నిర్మించబడి ఉంది. మైత్రేయ ఆలయం (1938లో పడగొట్టబడింది) టిబెటో మంగోలియన్ శైలిలో నిర్మినచబడింది.[85] దషి- చొయిలింగ్ బౌద్ధ విహారంలో 80 అడుగుల ఎత్తైన మైత్రేయ విగ్రహం ప్రతిష్ఠించడానికి ప్రయత్నించింది. .
మంగోలియా సంగీతం ప్రకృతి, నోమాడిజం, షమనిజం, టిబెటన్ బుద్ధిజం ప్రభావితమై ఉంటుంది. సంప్రదాయ సంగీతంలో వివిధ వాయిద్యాలు చోటుచేదుకుంటాయి. మోరి ఖుర్ ఉంటుంది. ఆలాపించే పద్ధతులలో లాంగ్ సాంగ్ (ఉర్తిన్ దూ), త్రోట్ సాంగ్ (తువన్ త్రోట్), ఖూమేలి ప్రధానమైనవి. త్సం భూత ప్రేత పిశాచాలను దూరంగా పారద్రోలడానికి చేసే నృత్యం.
మంగోలియాలో మొదటిసారిగా రాక్ నృత్యం (సొయొల్ ఎర్డెనె) 1960 స్థాపించబడింది. బీటిల్స్ వంటి నృత్యాలు కమ్యూనిష్ఠలచేత తీవ్రంగా విమర్శించబడ్డాయి. తరువాత ముగుంహుర్హ్రీ, ఇనీంసెగ్లెల్, ఉర్గూ మొదలైన నృత్యాలు రూపొందించబడ్డాయి. ముగుంహుర్హ్రీ, హరంగ నృత్యాలు బరువైన రాక్ నృత్యానికి మార్గదర్శకాలు అయ్యాయి. 1980, 1990 లలో హరంగ ఉన్నత స్థాయికి చేరుకుంది.
హరంగ నాయకుడు ప్రముఖ గిటారిస్ట్ ఎంహ్-మన్లై తరువాత తరం రాక్ నృత్య అభివృద్ధికి కృషిచేసాడు. 1990 హర్- చొనొ బృందం మంగోలియా ఫోల్క్- రాక్ నృత్యం రూపొందించాడు. ఇది మంగోలియన్ లాంగ్ సాంగ్ ను తనలో మిశ్రితం చేసుకున్నాయి.
ఆ సమయంలో డెమొక్రటిక్ పార్టీ కళాత్మకమైన ఆలోచన అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం, స్వాతంత్ర్యం ఇచ్చింది.
1920లో సోవియట్ యూనియన్ సహకారంతో మంగోలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని ఆధ్వర్యంలో ప్రెస్ ఆరంభించబడింది. తరువాత ఉనెన్ (నిజం) వార్తాపత్రిక స్థాపించబడింది. ఇది సోవియట్ " ప్రవ్ద " పత్రికను పోలి ఉండేది.[87]1990 సస్కరణలు మొదలైయ్యే వరకు ప్రభుత్వం మాధ్యమం మీద ఆధిక్యత కలిగి ఉండేది. ఆసమయంలో స్వతంత్రంగా వ్యవహరించే పత్రిక లేదు.[87] సోవియట్ యూనియన్ పతనం తరువాత మంగోలియా మీద ప్రభావం చూపింది. మంగోలియా ఏక పార్టీ విధానం నుండి బహుళ పార్టీ విధానంలోకి మారింది. మంగోలియాకు స్వతంత్రం వచ్చిన తరువాత మాధ్యమానికి కూడా స్వతంత్రం లభించింది.
1998 ఆగస్టు 28న ఇంటర్నేషనల్ ఎన్.జొ.ఒ సాయంతో మాధ్యమ స్వతంత్రం కొరకు కొత్త చట్టం ప్రవేశపెట్టబడింది. ఇది 1999 జనవరి 1 అమలు కావడంతో మాధ్యమరంగంలో సంస్కరణలు జరగడానికి మార్గం సుగమం అయింది.[88] మంగోలియన్ మాధ్యమం ప్రస్తుతం 300 ప్రింట్, ప్రసార మాద్యమాలను కలిగి ఉంది..[89]
2006 నుండి ప్రభుత్వం సరికొత్తగా " ఫ్రీడం ఆఫ్ ఇంఫర్మేషన్ ఏక్ట్ " గురించిన చర్చ ప్రారంభించిన తరువాత మాధ్యమానికి మరికొంత స్వతంత్రం లభించింది. [90][91] మార్కెట్ సంస్కరణలు మాధ్యమంలో పనిచేసే సిబ్బంది ప్రతిఏటా అభివృద్ధి చెందడానికి, జర్నలిజం ప్రధానాంశంగా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి కారణం అయింది.[90]
2013లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ నివేదిక, రిపోర్టర్స్ విథౌట్ బార్డర్ మంగోలియా మాధ్యమం స్వాతంత్ర్యం అంతర్జాతీయంగా 98వ స్థానంలో (మొత్తం 179) ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. .[92]
ప్రధాన జాతీయ ఉత్సవం నాడం. శతాబ్దాలుగా నిర్వహించబడుతున్న మంగోలియన్ సంప్రదాయక ఉత్సవం ప్రతి వేసవిలో మూడు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో మూడు మంగోలియన్ సంప్రదాయక క్రీడలు ఉంటాయి. విలువిద్య, గుర్రపుస్వారీ (విస్తారమైన వైశాల్యం ఉన్న దేశంలో గుర్రపుస్వారీ పోటీలు పశ్చిమ దేశాలలోలాగా చిన్న ట్రాక్ వెంట పోటీలు నిర్వహించబడవు), కుస్తీ పోటీలు నిర్వహించబడతాయి. వీటిని పురుషత్వం కలిగిన క్రీడలుగా మంగోలియన్ ప్రజలు భావిస్తారు కనుక ఇవి శతాబ్దాలుగా నాడం ఉత్సవాలలో నిర్వహించబడుతున్నాయి. ఆధునిక కాలంలో ఈ ఉత్సవాలు జూలై 11 నుండి 13 వరకు నిర్వహించబడుతున్నాయి. ఇవి నేషనల్ డెమొక్రటిక్ రివల్యూషన్, గ్రేట్ మంగోల్ స్టేట్ అవతరణ సందర్భాలను గౌరవిస్తూ నిర్వహించబడుతున్నాయి.
మంగోలియన్ క్రీడలలో ప్రాముఖ్యత సంతరించుకున్న క్రీడలలో షాగా ఒకటి. గొర్రె చీలమండల ఎముకను వేళ్ళతో పట్టుకుని విసురుతూ కొన్ని అడుగుల దూరంలో వేదిక మీద ఉన్న ఎముకల లక్ష్యాన్ని తాకడం. నాడం ఉత్సవాలలో ఈ పోటీ చాలా ప్రాముఖ్యత సంతరించికుంది. ఈ క్రీడలో ప్రేక్షకులు (ప్రత్యేకంగా వయసైన మంగోలియన్లు) తరచూ ఉద్రేకానికి లోనౌతుంటారు.
మంగోలియాలో గుర్రపు స్వారీ సంస్కృతి చిహ్నంగా (ప్రత్యేకంగా మద్య మంగోలియా) ఉంటుంది. నాడం ఉత్సవ సమయంలో లాంగ్ డిస్టెంస్ పోటీలు నిర్వహించబడుతుంటాయి. ఈ పోటీలలో ట్రిక్ గుర్రపు స్వారీ ప్రధానాంశంగా ఉంటుంది. ట్రిక్ గుర్రపు స్వారీకి ఉదాహరణగా చరిత్ర సృష్టించిన నాయకుడు దాందిన్ సుఖ్బతార్ గుర్రపు స్వారీ చేస్తూ నాణ్యాలను కిందకు విసురుతూ వాటిని గుర్రపు స్వారీ చేస్తూ కింద విసిరిన నాణ్యాలను సేకరిస్తాడు.
మంగోల్ క్రీడలలో మంగోలియన్ మల్లయుద్ధం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మంగోలియన్ మూడు ప్రధాన క్రీడలలో మల్లయుద్ధం ఒకటి. చరిత్రకారులు మంగోలియన్ శైలి మల్లయుద్ధం 7000 సంవత్సరాలకు పూర్వం నాటిదని భావిస్తున్నారు. మంగోలియన్ వివిధ నగరాల నుండి వందలాది మల్లయోధులు జాతీయ క్రీడలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తుంటారు.
మంగోలియాలో బాస్కెట్ బాల్, ప్లింపిక్ వెయిట్ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, అసోసియేషన్ ఫుట్ బాల్, అథ్లెట్లు, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, జుజుస్తు, కరాటే, అయికిడో, కిక్‌బాక్సింగ్, మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ క్రిడలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. మంగోలియన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటారు. 1958 నుండి మంగోలియాలో ఫ్రీ స్తైల్ రెస్టిల్ంగ్ అభ్యసించబడుతుంది. .[93] మంగోలియన్ ఫ్రీ స్తైల్ రెస్టిల్ంగ్ మంగోలియన్ ఒలిపిక్ పతక సాధనలో మొదటి స్థానంలో ఉంది.
నైడంగిన్ తువ్షింబయార్ మొదటి సారిగా ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకం సాధించి మొదటి మంగోలియన్ ఒలిపింక్ బంగారు పతకం సాధించిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. [94]
1948 నుండి మంగోలియాలో అమెచ్యూర్ బాక్సింగ్ అభ్యసించబడుతుంది. [95] 1960లో మంగోలియన్ ఒలింపిక్ బాక్సింగ్ నేషనల్ టీం స్థాపించబడింది. మంగోలియన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 1964-1967 మద్య కాలంలో బాక్సింగ్ క్రీడలను నిషేధించింది. అయినప్పటికీ త్వరలోనే నిషేధం తొలగించింది. 1990లో ప్రొఫెషనల్ బాక్సింగ్ ఆరంభం అయింది.
మంగోలియన్ నేషనల్ బాస్కెట్ బాల్ టీం సమీపకాలంలో " బాస్కెట్ బాల్ ఎట్ ది ఈస్ట్ ఆసియన్ గేంస్ లో కొన్ని విజయాలు సాధించింది.
మంగోలియాలో అసోసియేషన్ ఫుట్ బాల్ క్రీడకూడా ఆడబడుతుంది. ది మంగోలియా నేషనల్ ఫుట్ బాల్ టీం 1990 నుండి తిరిగి జాతీయస్థాయిలో క్రీడలలో పాల్గొంటుంది. అయినప్పటికీ ఇది అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనడానికి ఇంకా అర్హత సాధించలేదు. మంగోలియన్ ప్రీమియర్ లీగ్ అత్యుత్తమ దేశీయస్థాయి పోటీగా ఉంది.
పలు మంగోలియన్ మహిళలు షూటింగ్లో ప్రతిభను ప్రదర్శించింది: ఒత్ర్యాదిన్ గుండెగ్మా 2008లో ఒలింపిక్ క్రీడలలో వెండి పతకం సాధించింది. ముంఖ్‌బయార్ డొర్జ్సురెన్ రెండు మార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ కంచు పతకం సాధిందింది. ప్రస్తుతం ఆమె జర్మనీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. త్సొగ్బద్రఖిన్ మొంఖ్జుల్ 2007 మే ప్రపంచ 25 మీటర్ల పిస్టల్ పోటీలలో మూడవ స్థానం సంబంధించింది.[96]
మంగోలియన్ సుమో కుస్తీ క్రీడాకారుడు డొల్గొర్సురెంగిన్ డాగ్వదోర్జ్]] 25 టాప్ డివిజన్ టోర్నమెంట్ చాంపియంషిప్ లలో పాల్గొన్నాడు. సుమో క్రీడాకారులలో ఆయనకు 4వ స్థానం ఉంది. 2015 జనవరి న మొంఖ్బతిన్ డావాజర్గల్ 33 వ టాప్ డివిషన్ చాంపియంషిప్లో పాల్గొని సుమో పోటీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.
మంగోలియాలో సంవత్సరమంతా పలు సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఇవి అధికంగా మంగోలియన్ సాంస్కృతిక సంబంధితమై ఉంటాయి. నాడం ఉత్సవం దేశమంతటా నగరాలు పల్లెలు అన్న బేధం లేకుండా జరుపుకునే గొప్ప ఉత్సవం. ఈగల్ ఫెస్టివల్లో 400 మంది ఈగల్ వేటకారులు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఈ క్రీడలో పాల్గొంటారు. యాత్రీకుడు ముంఖ్బయార్ట్ బత్సైఖాన్ కూడా తన పెంపుడు గద్దతో పోటీలో పాల్గొన్నాడు. ఐస్ ఫెస్టివల్, తౌజండ్ కెమేల్ ఉత్సవం ఇతర మంగోలియన్ సంప్రదాయ ఉత్సవాలలో ముఖ్యమైనవి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.