భారతీయ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (జ. 1962 జూన్ 20) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, తెలంగాణ శాసనసభకు రెండు సార్లు,ఒకసారి పార్లమెంట్ లోక్సభకు సభ్యుడిగా,2023 డిసెంబర్ 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 07 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | తమిళిసై సౌందరరాజన్ | ||
---|---|---|---|
ముందు | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ముందు | శానంపూడి సైది రెడ్డి | ||
నియోజకవర్గం | హుజూర్నగర్ | ||
పదవీ కాలం 2 జూన్ 2014 – 5 జూన్ 2019 | |||
ముందు | నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | ||
తరువాత | శానంపూడి సైది రెడ్డి | ||
నియోజకవర్గం | హుజూర్నగర్ | ||
పదవీ కాలం 6 జూన్ 2019 – 6 డిసెంబర్ 2023 | |||
ముందు | గుత్తా సుఖేందర్ రెడ్డి | ||
నియోజకవర్గం | నల్గొండ | ||
2వ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు | |||
పదవీ కాలం ఫిబ్రవరి 2015 – జూన్ 2021 | |||
ముందు | పొన్నాల లక్ష్మయ్య | ||
తరువాత | రేవంత్ రెడ్డి | ||
హౌసింగ్ & కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ మంత్రి | |||
పదవీ కాలం 25 మే 2009 – 21 ఫిబ్రవరి 2014 | |||
ముందు | బొత్స సత్యనారాయణ | ||
తరువాత | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | ||
ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
నియోజకవర్గం | హుజూర్నగర్ | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | వేనేపల్లి చందర్ రావు | ||
తరువాత | వేనేపల్లి చందర్ రావు | ||
నియోజకవర్గం | కోదాడ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | తాటిపాముల, తిరుమలగిరి మండలం, సూర్యాపేట్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | 1962 జూన్ 20||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | నలమాద పద్మావతిరెడ్డి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అతను సూర్యాపేటలో 1962, జూన్ 20న జన్మించాడు. అతని తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణి. అతని స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల.[2] అతను బియస్సీ చేసాడు. అతను భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా తన సేవలనందించాడు. అతను ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 విమానాలను నడిపాడు. అతను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు. [3]
ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి గెలిచి అదే సంవత్సరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు.[4] తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా 2015 నుండి 26 జూన్ 2021 వరకు పని చేశాడు.[5][6]
ఉత్తమ్ కుమార్ రెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హుజూర్నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]
ఉత్తమ్ కుమార్ రెడ్డి 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న నల్గొండ లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జ్గా[8], డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.