From Wikipedia, the free encyclopedia
అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ నమీబియా అని పిలవబడే నమీబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. దీని పశ్చిమ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరసరిహద్దులో అంగోలా - జాంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బోత్సువానా - జింబాబ్వే దేశాలు ఉన్నాయి, దక్షిణ - తూర్పుసరిహద్దులను దక్షిణ ఆఫ్రికాతో పంచుకుంటుంది. ఇది నమీబియా స్వతంత్ర పోరాటం తర్వాత 1990 మార్చి 21న దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యాన్ని పొందింది. నమీబియా రాజధాని, అతిపెద్ద నగరం విండ్‌హక్ ఉంది.
రిపబ్లిక్ ఆఫ్ నమీబియా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం "Unity, Liberty, Justice" |
||||||
జాతీయగీతం "en:Namibia, Land of the Brave" |
||||||
[[బొమ్మ: |250px |center |నమీబియా యొక్క స్థానం]] | ||||||
రాజధాని అతి పెద్ద నగరం | Windhoek 22°34.2′S 17°5.167′E | |||||
అధికార భాషలు | English | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | Afrikaans, German, Oshiwambo | |||||
ప్రజానామము | నమీబియన్ | |||||
ప్రభుత్వం | రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | హేగే జీంగోబ్ | ||||
- | ప్రధాన మంత్రి | Nahas Angula | ||||
Independence | from South Africa | |||||
- | Date | 1990 మార్చి 21 | ||||
- | జలాలు (%) | negligible | ||||
జనాభా | ||||||
- | 2009 అంచనా | 2,108,665[1] (142nd) | ||||
- | 2008 జన గణన | 2,088,669 | ||||
జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $13.771 billion[2] | ||||
- | తలసరి | $6,614[2] | ||||
జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
- | మొత్తం | $9.459 billion[2] | ||||
- | తలసరి | $4,543[2] | ||||
జినీ? (2003) | 70.7[1] (high) (1st) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.686 (medium) (128th) | |||||
కరెన్సీ | నమీబియా డాలర్ (NAD ) |
|||||
కాలాంశం | WAT (UTC+1) | |||||
- | వేసవి (DST) | WAST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .na | |||||
కాలింగ్ కోడ్ | ++264 |
నమీబియా ఐక్యరాజ్యసమితి, సదరన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ, ఆఫ్రికన్ యూనియన్, కామన్వెల్త్ ఆఫ్ నేషన్సు వంటి పలు అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా ఉంది. చాలా సంవత్సరాలకాలం దీనిని నైరుతి ఆఫ్రికాగా పిలిచేవారు. ఇక్కడ నమీబియా ఎడారి ఉన్న కారణంగా దేశానికి నమీబియా అనే పేరు వచ్చింది. ఇది ప్రపంచ దేశాలలోలో (మంగోలియా తర్వాత) రెండవ అత్యల్ప జనసాంద్రత గల దేశంగా పేరు గాంచింది.
నమీబియాలోని మెరక భూములలో ప్రారంభ సమయంలో బుష్మెన్, డమారా, నామాక్యూలు, బంటు ప్రజలు విస్తరణలో ప్రవేశించాయి. బంటు ప్రజలు ఈ భూభాగంలో సుమారు 14వ శతాబ్దం నుండి విస్తరించాయి. దీనిని 18వ శతాబ్దం చివరిలో బ్రిటీష్, డచ్ మిషనరీలు సందర్శించాయి. 1879లో డోర్స్లాండు ప్రయాణీకులు (వీరిని జంకరు బోయెర్సు) కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు.[3] కాని 1884లో ఒక జర్మనీ సామ్రాజ్యానికి చెందిన దేశంగా మారింది. 1920లో నానాజాతి సమితి ఈ దేశాన్ని దక్షిణ ఆఫ్రికాకు అప్పగించింది. తరువాత ఈ ప్రాంతంలో చట్టాలు అమలయ్యాయి. 1948 నుండి ఇక్కడ వర్ణవిచక్ష విధానం అమలులోకి అమలయ్యింది.
1966లో ఆఫ్రికా నేతల వ్యతిరేకతలు, అభ్యర్ధనల ఫలితంగా ఆ ప్రాంతం మీద ఐక్యరాజ్యసమితి ప్రత్యక్ష బాధ్యత వహించింది. 1973లో నమీబియా ప్రజల అధికారికంగా ప్రాతినిధ్యం వహించడానికి " సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ "ను నియమించారు. అయితే ఆ సమయంలో నమీబియా దక్షిణ ఆఫ్రికా పాలనలోనే ఉంది. అంతర్గత పోరాటం తర్వాత 1985లో నమీబియాలో దక్షిణ ఆఫ్రికా తాత్కాలిక పరిపాలనను స్థాపించింది. 1990లో దక్షిణ ఆఫ్రికా నుండి నమీబియా సంపూర్ణ స్వతంత్రాన్ని పొందింది. ఇందులో వాల్విస్ బేను మినహాయించింది. 1994 వరకు ఈ నగరం దక్షిణ ఆఫ్రికా పాలనలో ఉంది. 1990లో నైరుతి ఆఫ్రికా ఉన్న ఈ దేశం తన పేరును నమీబియాగా మార్చుకుంది.
నమీబియా జనసంఖ్య 2.1 మిలియన్లు. నమీబియాలో ఒక స్థిరమైన బహుళపార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. వ్యవసాయం, పశుపోషణ, పర్యాటక రంగం, విలువైన రత్నాలు, లోహాల త్రవ్వకం వంటి అంశాలు నమీబియా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా ఉంచుతున్నాయి. సుమారు జనాభాలో సగం మంది (ఒక రోజుకు $1.25 అమెరికా డాలర్లు) అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు.[4] 2007లో పురుషులలో 15% మందికి హెచ్.ఐ.వి. సోకింది. హెచ్.ఐ.వి. ప్రభావంతో దేశ జనాభా భారీగా దెబ్బతింది.[5]
నమీబియాలోని మెరకభూములలో ప్రారంభ సమయంలో బుష్మెను, డమారా, నామాక్యూలు, బంటు విస్తరణలో భాగంగా ప్రవేశించారు. బంటులు సుమారు సా.శ. 14వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో విస్తరించారు. 1485లో పోర్చుగీసు నావికులు డియాగో కాయో ఈ ప్రాంతంలో పరిశోధించిన మొట్టమొదటి ఐరోపా పౌరుడుగా గుర్తిస్తున్నారు. 1486లో బార్టోలోమెయు డియాసులను ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్ సామ్రాజ్యంలో చేర్చలేదు. 19వ శతాబ్దం జర్మనీ, స్వీడను వాసులు ప్రవేశించే వరకు సహారా ఆఫ్రికా మాదిరిగా నమీబియా ఐరోపా వ్యాపారులు, నివాసులు చేత అంవేషింపబడలేదు.
1884లో నమీబియా బ్రిటీషు దురాక్రమణను నిరోధించడానికి ఒక జర్మనీ కాలనీగా మారింది. బ్రిటీషు పాలనలో ఉన్న వాల్విస్ బేను మినహాయించి దీనిని జర్మనీ నైరుతి ఆఫ్రికా (డియుస్ట్చు-సుద్వేస్త్రాఫికా )[6]గా పిలిచారు. 1904 - 1907 మద్యకాలంలో హీరెరో, నామాక్యూలు జర్మనీవాసులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. తదుపరి హీరెరో, నామాక్యూ సామూహిక హత్యాకాండలో 10,000 మంది (సగం మంది) నామా, 65,000 మంది హీరెరోలు (సుమారు 80%) హత్య చేయబడ్డారు.[7][8] చివరికి నిర్బంధం నుండి విడుదల చేయబడిన హతశేషులు దేశవిసర్జన, దేశ బహిష్కారం, నిర్బంధ శ్రామికులుగా జాతి విభజన వంటి వివక్షతకు పాత్రులయ్యారు. నాజీ జర్మనీ వారిని అనేక రకాలు వర్ణ విచక్షణగురిచేసి పారిశ్రామిక-స్థాయిలో హత్యలకు గురిచేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే కొంతమంది చరిత్రకారులు నమీబియాలోని జర్మనీ సామూహిక హత్యాకాండను నాజీల హోలోకాస్టుకు ఒక నమూనాగా భావించారు.[9] కాని ఎక్కువ మంది అధ్యయనకారులు ఆ ఘట్టం నాజీల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదని, ఎందుకంటే వారు ఆ సమయంలో చిన్నపిల్లలని పేర్కొన్నారు.[10] సామూహిక హత్యాకాండ స్మృతి స్వతంత్ర నమీబియాలో జాతి గుర్తింపుకు, జర్మనీతో సంబంధాలకు సంబంధిత అంశంగా మిగిలిపోయింది.[11]
మొదటి ప్రపంచ యుద్ధంలో జనరల్ లూయిస్ బోథా నాయకత్వంలో దక్షిణ ఆఫ్రికా (బ్రిటిషు నియంత్రణలో ఉన్న) ఈ ప్రాంతాన్ని ఆక్రమించి జర్మనీ వలసపాలనను రద్దుచేసింది. యుద్ధం ముగిసిన తరువాత క్రీ.పూ.1990 వరకు వర్సైల్లెసు ఒప్పందం ఫలితంగా దక్షిణాఫ్రికా దీనిని ఒక నానాజాతిసమితి నియంత్రిత ప్రాంతంలా మాత్రమే పరిపాలించింది.[12] మాజీ జర్మనీ, టర్కిషు భూభాగాలను మిత్రరాజ్యాలతో అనుసంధానం చేయడానికి వాదించే పాలకుల మధ్య రాజీగాచేయడానికి నానాజాతి వ్యవస్థ రూపొందించబడింది. వారు తమను తాము పరిపాలించే వరకు అంతర్జాతీయ ట్రస్టీషిపు కావాలని కోరుకొనే ప్రాంతాల పాలనకు ఇది బాధ్యత వహించింది.[12] రాజకీయ స్వయం నిర్ణయాధికారం కోసం ఆ భూభాగ నివాసులు సిద్ధమయ్యే వరకు నైరుతి ఆఫ్రికా పరిపాలన చేయడానికి నానాజాతిసమితి దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.[13] దక్షిణాఫ్రికా ఈ ఆదేశాన్ని తెరవేసిన అనుసంధానంగా వ్యాఖ్యానించి భవిష్యత్తు స్వయంప్రతిపత్తి కోసం నైరుతి ఆఫ్రికాను సిద్ధం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు.[13]
1945 లో అంతర్జాతీయ సంస్థ సమావేశం ఫలితంగా ఐక్యరాజ్యసమితి లీగ్ ఆఫ్ నేషన్సును, ట్రస్టీషిపు నియంత్రణను అధికారికంగా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి చార్టరు ఆర్టికల్ 77 ప్రకారం ఐక్యరాజ్యసమితి ట్రస్టీషిప్పు " ప్రస్తుతం లీగు ఆఫ్ నేషంసు నియంత్రణ ఉన్న భూభాగాలకు వర్తిస్తుంది". అదనంగా ఇది "పైన పేర్కొన్న భూభాగాలను ట్రస్టీషిప్పు వ్యవస్థ నిబంధనల ఆధారంగా తదుపరి ఒప్పందం ఉంటుంది".[14] మాజీ లీగ్ ఆఫ్ నేషన్సు దేశాలన్నింటిని వారి ట్రస్టీషిప్పు కౌన్సిళ్ళను అప్పగించి స్వాతంత్ర్యం గురించి యోచించాలని అభ్యర్థించింది.[14] అలా చేయడానికి దక్షిణాఫ్రికా నిరాకరించి నైరుతి ఆఫ్రికాను అధికారికంగా స్వాధీనం చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి అనుమతి కోరింది. దక్షిణాఫ్రికా చర్యకు గణనీయమైన విమర్శలు వచ్చాయి.[14] ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు దక్షిణాఫ్రికా వారి అభిప్రాయాన్ని తోసిపుచ్చుతూ భూభాగం మీద నియంత్రణను పటిష్ఠం చేయడం ప్రారంభించింది.[14] 1949 - 1966 మధ్య దక్షిణాఫ్రికా పాలన చట్టబద్ధత మీద అనేక చర్చలు జరిపిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసు వాయిదా వేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి ప్రతిస్పందించింది.[15]
1940 చివరలో దక్షిణాఫ్రికా నైరుతి ఆఫ్రికాలో వర్ణవివక్ష, జాతి విభజన మిశ్రితవ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రారంభించింది.[16] అగ్నేయాఫ్రికా నల్లజాతీయులను కేంద్రీకరించుకుని చట్టాలు రూపొందించబడ్డాయి. వారి కదలికలను భారీగా పరిమితం చేస్తూ కఠినమైన నివాస నిబంధనలు, కర్ఫ్యూలు విధించబడ్డాయి. దక్షిణాఫ్రికాకు ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద మాత్రమే అభివృద్ధి కేంద్రీకృతం చేయబడింది. దీనిని అధికారికంగా "పోలీస్ జోన్" అని పిలుస్తారు. ఇక్కడ జర్మనీ వలసరాజ్యాలయుగ స్థావరాలు, గనులు అధికంగా ఉన్నాయి. పోలీస్ జోన్ వెలుపల స్థానికప్రజల స్వయంపాలన సిద్ధాంతపరంగా గిరిజన మాతృభూమికి పరిమితం చేయబడ్డారు.[17]
1946లో ఐక్యరాజ్యసమితి లీగు భర్తీ తర్వాత, దక్షిణ ఆఫ్రికా ఒక ఐక్యరాజ్యసమితి ఒప్పందంచే భర్తీ చేయబడానికి అంగీకరించక ప్రాంతం పరిపాలనలో సమగ్ర అంతర్జాతీయ పర్యవేక్షణను అభ్యర్థించింది. దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం 'నైరుతీ ఆఫ్రికా'ను తన సామ్రాజ్యంలో విలీనం చేయాలని భావించినప్పటికీ అధికారికంగా విలీనం చేయడంలో విఫలం అయింది. వాస్తవానిక్ శ్వేతజాతీయుల దక్షిణ ఆఫ్రికా పార్లమెంటులో అల్పసంఖ్యాకులైన శ్వేతజాతీయుల ప్రాతినిధ్యంలో 'ఐదవ ప్రావీన్సు 'లా పరిపాలించబడింది.
1966లో " సౌత్-వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ " సైనిక దళం, గెరిల్లా దళం " పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ నమీబియా " ఒక స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ 1988 వరకు నమీబియాలో దక్షిణ ఆఫ్రికా తన పరిపాలనను ముగించడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ మొత్తం ప్రాంతానికి ఐక్యరాజ్యసమితి శాంతి ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించింది. 1989లో స్వాతంత్ర్యం కోసం సంధి ప్రారంభమైంది. 1990 మార్చి 21న మాత్రమే దేశం అధికారికంగా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందింది. 1994లో దక్షిణ ఆఫ్రికాలో వర్ణ విచక్షణ ముగిసిన తర్వాత నమీబియాలో వాల్విస్ బే విలీనం చేయబడింది.
ఎస్.డబల్యూ.ఎ.పి.ఒ. తిరుగుబాటు తీవ్రతరం కావడంతో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సమాజంలో అనుసంధానం చేయడానికి ఆటంకాలు అధికరించాయి.[18] నైరుతి ఆఫ్రికా దేశీయ నివాసుల నైతిక, భౌతిక శ్రేయస్సును నిర్ధారించడానికి బాధ్యతవహించడంలో దక్షిణాఫ్రికా విఫలమైంది.[19] 1968 జూన్ 12 న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రజల కోరికను అనుసరిస్తూ నైరుతి ఆఫ్రికాకు నమీబియా అని పేరు పెట్టాలని ప్రకటించింది.[19] ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1969 ఆగస్టు 269 లో ఆమోదించబడింది. నమీబియా మీద దక్షిణాఫ్రికా నిరంతరంగా నియంత్రించడం చట్టవిరుద్ధం అని ప్రకటించింది.[19][20] ఈ నిర్ణయాన్ని గుర్తించి ఎస్.డబల్యూ.ఎ.పి.ఒ. సాయుధ విభాగానికి పీపుల్సు లిబరేషన్ ఆర్మీ ఆఫ్ నమీబియాగా పేరు మార్చారు.[21]
తిరుగుబాటు తరువాతి సంవత్సరాల్లో దక్షిణ ఆఫ్రికాలో ప్రచ్ఛన్న యుద్ధ సంఘర్షణ కేంద్రాలలో ఒకటిగా మారింది.[22] తిరుగుబాటుదారులు ఆయుధాల కొరకు, సైనిక శిక్షణ కొరకు సోవియట్ యూనియనును అభ్యర్థించారు.[23] ఎస్.డబల్యూ.పి.ఒ. రాజకీయ నాయకత్వం సోవియట్, క్యూబా, అంగోలా నుండి సైనిక సహాయం మీద ఆధారపడింది. ఈ ఉద్యమాన్ని 1975 నాటికి సోషలిస్టు కూటమిలో ఉంచారు.[24] ఈ ఆచరణాత్మక కూటమి ఎస్.డబల్యూ.ఎ.పి.ఒ. సోవియట్ ప్రతినిధిగా ఉన్నదన్న దృక్పథం బలోపేతం అయింది. దక్షిణాఫ్రికా, యునైటెడు స్టేస్టేట్సు ప్రచ్ఛన్న యుద్ధ భావజాలంలో ఆధిపత్యం చెలాయించింది.[17] దక్షిణాఫ్రికా పాశ్చాత్య మిత్రదేశంగా భావించిన సోవియటు యూనియను ఎస్.డబల్యూ.పి.ఒ.కు మద్దతు ఇచ్చింది.[25]
యుద్ధకారణంగా అధికరించిన అలసట, ఉన్నత శక్తుల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, సోవియటు యూనియను, యునైటెడు స్టేట్సు రెండింటి ఒత్తిడితో దక్షిణాఫ్రికా, అంగోలా, క్యూబాను త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకరించాయి.[26] ఈ ప్రాంతం నుండి క్యూబా సైనిక ఉపసంహరణకు బదులుగా దక్షిణాఫ్రికా నమీబియాకు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు అంగీకరించింది. ప్లానుకు సహాయాలన్నింటిని నిలిపివేయడానికి అంగోలా నిబద్ధతను పాటించింది.[27] 1988 ఆగస్టులో ప్లాను, దక్షిణాఫ్రికా అనధికారికంగా కాల్పుల విరమణను అంగీకరించాయి. నమీబియా శాంతి ప్రక్రియను పర్యవేక్షించడానికి, శరణార్థులు తిరిగి రావడాన్ని పర్యవేక్షించడానికి ఐక్యరాజ్యసమితి పరివర్తన సహాయ బృందం ఏర్పడింది.[28] 1989 మార్చిలో యు.ఎన్.టి.ఎ.జి ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్న ఫలితంగా, ప్లాన్ భూభాగంలోకి తుది చొరబాటు చేసిన తరువాత కాల్పుల విరమణ జరిగింది.[29] అంగోలాలోని తిరుగుబాటుదారులను యు.ఎన్.టి.జి. నిరాయుధులనుచేసి బలహీనపరిచి వారిని వారి బాహ్య స్థావరాలకు పరిమితం చేయాలనే షరతుతో కొత్త కాల్పుల విరమణ విధించబడింది.[28][30]
పరివర్తన కాలంలో నమీబియా నుండి దఫాలవారీగా దక్షిణాఫ్రికా దళాలను ఉపసంహరించుకున్నారు. రాజకీయ ఖైదీలందరికీ రుణమాఫీ మంజూరు చేశారు, జాతి వివక్షత చట్టం రద్దు చేయబడింది. 42,000 నమీబియా శరణార్థులు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దేశం మొదటి పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికలలో అర్హతగల ఓటర్లలో 97% మంది పాల్గొన్నారు.[31] ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్ధారించడానికి ఎన్నికల విదేశీపరిశీలకుల బృందం పర్యవేక్షణలో నిర్వహించారు. రాజ్యాంగ అసెంబ్లీలో 57% ప్రజాదరణ పొందిన ఓట్లతో స్వాపొ బహుళ స్థానాలను గెలుచుకుంది.[31] స్వాపొ పార్టీ 41 స్థానాలు సాధించింది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించనప్పటికీ ఇది రాజ్యాంగాన్ని స్వయంగా రూపొందించడానికి వీలు కల్పించింది.[31]
1990 ఫిబ్రవరిలో నమీబియా రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యాంగం మానవ హక్కుల రక్షణ, ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకుంటే పరిహారం చేయాలని తీర్మానించింది. రాజ్యాంగం స్వతంత్ర న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసింది (రాజ్యాంగ సభ జాతీయ అసెంబ్లీగా మారింది). 1990 మార్చి 21 న దేశం అధికారికంగా స్వతంత్రమైంది. దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సను మండేలా (అంతకుముందు నెలలో జైలు నుండి విడుదలయ్యారు), 20 మందితో సహా 147 దేశాల ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో సాం నుజోమా నమీబియా మొదటి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[32] 1994 లో దక్షిణాఫ్రికాలో మొదటి బహుళజాతి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వాల్విస్ బే నమీబియాకు అప్పగించబడింది.[33]
నమీబియాలోని రాజకీయాలు అధ్యక్షతరహా గణతంత్ర రాజ్య నమూనాలో నిర్వహించబడుతున్నాయి. ఎన్నికైన నమీబియా అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పదవీకాలంలో కొనసాగుతాడు. దేశ బహుళ-పార్టీ వ్యవస్థలో ఆయన దేశాధ్యక్షుడు గాను, ప్రభుత్వాధినేత గానూ వ్యవహరిస్తాడు. కార్యనిర్వాహణ అధికారం ప్రభుత్వం వద్ద ఉంటుంది. శాసనం చేసే అధికారం ప్రభుత్వం, ద్విసభ పార్లమెంట్ (జాతీయ అసెంబ్లీ, జాతీయ కౌన్సిల్లు) రెండింటికీ ఉంటుంది. న్యాయవ్యవస్థ అనేది కార్యనిర్వాహక, పాలన వ్యవస్థల నుండి స్వతంత్రంగా ఉంటుంది.[34][35][36] నమీబియాలో చట్టపరమైన పాలనా నిర్వహణ, ప్రాథమిక మానవ హక్కులు నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయి.[37] ద్వై-వార్షిక "నమీబియా లా జర్నల్", నమీబియాలో న్యాయ అభివృద్ధికి, చట్టపరమైన పాలనను నిర్వహించడానికి ఒక అనివార్యమైన ఉపకరణంలా ఉంటూ, చట్టపరమైన ప్రాముఖ్యత గల సమస్యలపై వ్యాఖ్యానించడానికి, చర్చించడానికి న్యాయవాదులకు విద్యావేత్తలకు ఒక వేదికగా నిలుస్తుంది.[38][39]
2008లో నమీబియా 48 ఉప-సహారా ఆఫ్రికా దేశాలలో ఇబ్రహీం ఇండెక్సు ఆఫ్ ఆఫ్రికా గవర్నెంసులో 6వ స్థానాన్ని పొందింది.[40] నమీబియాలో 2009 నవంబరు 27 - 28 మద్య అధ్యక్ష, జాతీయ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నమీబియాలోని ఎన్నికల సంఘం అధ్యక్ష, జాతీయ అసెంబ్లీ ఎన్నికలు 2009, ప్రాంతీయ కౌన్సిల్లు, స్థానిక అధికార ఎన్నికలు 2009, తదుపరి ఉప ఎన్నికలను నిశితంగా పర్యవేక్షించడానికి (పార్టీ ప్రతినిధులకు) ఉపయోగంగా ఒక "హ్యాండ్‌బుక్ ఫర్ ఎలెక్షన్ ఆబ్జర్వెర్స్ ఇన్ నమీబియా"ను ప్రచురించింది.[41]
నమీబియాను 13 ప్రాంతాలుగా, 107 నియోజక వర్గాలుగా విభజించారు.
నమీబియా స్వతంత్ర పోరాటంలో సహాయం చేసిన లిబియా, క్యూబాలతో అధిక స్వేచ్ఛాయుతమైన విదేశీవిధానాన్ని అనుసరిస్తుంది. ఒక స్వల్ప సైనిక దళం, దుర్బలమైన ఆర్థిక వ్యవస్థతో ఉన్న నమీబియా దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలలో ప్రాథమిక విదేశీసంబంధాలను పటిష్ఠపరచుకోవాలని భావిస్తుంది. నమీబియా దక్షిణ ఆఫ్రికా అభివృద్ధి సంఘంలో క్రియాశీకమైన సభ్యదేశంగా ఉంది. 1990 ఏప్రిల్ 23న ఐక్యరాజ్యసమితిలో 160వ సభ్య దేశంగా ప్రవేశించింది. కామన్వెల్తు ఆఫ్ నేషన్సులో 50వ సభ్య దేశంగా ప్రవేశించింది.
రిపోర్టర్సు వితౌవుట్ బోర్డర్సు వరల్డ్‌వైడ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్సు 2007[42]లో నమీబియా 169 దేశాల్లో 25వ స్థానాన్ని పొందింది. 2003లో 166 దేశాలలో 56వ స్థానాన్ని పొందింది. 2002లో 139 దేశాలలో 31వ స్థానాన్ని పొందింది.
నమీబియా పలు అల్పస్థాయి అంతర్జాతీయ వివాదాల్లో పాలుపంచుకుంది, వాటిలో:
8,25,418 చ.కి.మీ. వైశాల్యంతో,[43] నమీబియా ప్రపంచంలోని 34వ అతిపెద్ద దేశం (వెనెజులా, మంగోలియా తర్వాత)గా ఉంది. నమీబియా ప్రపంచంలోని అత్యల్ప జనసాంద్రత (2.5 మనుషులు/చ.కి.మీ) కలిగిన దేశంగా ఉంది. 17° - 29° దక్షిణ (17° చిన్న భూభాగం ఉత్తరంలో) అక్షాంశంలో ఉంది. 11° - 26° తూర్పు రేఖాంశంలో ఉంది.
నమీబియా, కలహరి ఎడారుల మధ్య ఉన్నందున నమీబియా ఉప-సహారా ఆఫ్రికాలో దేశాలన్నింటిల్ఫ్ తక్కువ వర్షపాతం కలిగిన దేశంగా ఉంది.[44] నమీబియా ప్రకృతి దృశ్యం సాధారణంగా ఐదు భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంటుంది. ఇవి అన్ని ఒకేరకమైన భౌతిక పరిస్థితులు, వృక్షసంపదతో ఉంటాయి. వాటి మధ్య కొన్ని వైవిధ్యాలు, వాటి మధ్య విస్తరించి ఉన్నాయి: మద్య పీఠభూమి, నమీబు, గొప్ప ఏటవాలు, శుష్కభూమి, కలహరి ఎడారి.
మద్య పీఠభూమి ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉంది. పీఠభూమి వాయవ్య దిశలో " స్కెలిటన్ కోస్టు "- నమీబ్ ఎడారి, నైరుతి దిశలో తీర మైదానాలు, దక్షిణాన ఆరెంజ్ నది, తూర్పున కలహరి ఎడారి సరిహద్దులుగా ఉన్నాయి. మద్య పీఠభూమిలోని కోనిగ్స్టెయిన్ (ఎత్తు 2,606 మీటర్లు (8,550 అడుగులు)) నమీబియాలో అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉంది.[45]
నమీబ్ హైపర్-శుష్క కంకర మైదానాలు, దిబ్బల విస్తీర్ణం, ఇది నమీబియా మొత్తం తీరప్రాంతం అంతటా విస్తరించి ఉంది. ఇది 100 కిమీ (60 మైళ్ళు), వందల కి.మీ వెడల్పు ఉంటుంది. నమీబియాలోని ప్రాంతాలలో స్కెలిటన్ కోస్టు, ఉత్తరాన కాకోవెల్డు, మధ్య తీరం వెంబడి విస్తృతమైన నమీబ్ ఇసుక సముద్రం ఉంది.[46]
గొప్ప వాలు వేగంగా 2,000 మీటర్లకు (7,000 అడుగులు) పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రతలు, ఉష్ణోగ్రత పరిధులు చల్లని అట్లాంటికు జలాల కంటే లోతట్టు ప్రాంతాలలో అధికరిస్తుంది. అయితే తీరప్రాంత పొగమంచు నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ ప్రాంతం పేలవంగా అభివృద్ధి చెందిన నేలలతో రాతితో ఉన్నప్పటికీ, ఇది నమీబ్ ఎడారి కంటే గణనీయంగా ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంది. వేసవి గాలులు గొప్పవాలు మీద శక్తివంతంగా వీస్తుంది. తేమను వర్షపాతం వలె సంగ్రహిస్తుంది.[47]
అంగోలాన్ సరిహద్దు వెంబడి ఈశాన్య నమీబియాలో కాప్రివి స్ట్రిప్‌లో శుష్కభూభాగం విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాల కంటే చాలా ఎక్కువ వర్షపాతం అందుకుంటుంది. సగటున సంవత్సరానికి 400 మిమీ (16 అంగుళాలు). ఈ ప్రాంతం సాధారణంగా చదునైనది, నేలలు ఇసుకతో ఉంటాయి. నీటిని నిలుపుకుని వ్యవసాయానికి తోడ్పడుతుంది.[48]
కలహరి ఎడారి, దక్షిణాఫ్రికా, బోత్సువానా వరకు విస్తరించి ఉన్న శుష్క ప్రాంతం, నమీబియా ప్రసిద్ధ భౌగోళిక లక్షణాలలో ఒకటి. ఇది కలహరి, ఎడారిగా ప్రసిద్ధి చెందింది. వివిధ రకాల వాతావరణాలను కలిగి ఉంది. వీటిలో కొన్ని ప్రశాంతమైన, సాంకేతికంగా ఎడారి కాని ప్రాంతాలు ఉన్నాయి. సక్యూలెంటు కారూ 5,000 జాతుల మొక్కలకు నిలయంగా ఉంది. వాటిలో సగం స్థానికంగా ఉన్నాయి; ప్రపంచంలోని సక్యూలెంట్లలో సుమారు 10% కరూలో కనిపిస్తాయి.[49] ఈ అధిక ఉత్పాదకత, స్థానికతకు వర్షపాతం కారణంగా ఉంది.[50]
నమీబియా తీరప్రాంతఎడారి ప్రపంచంలోని పురాతన ఎడారులలో ఒకటి. బలమైన సముద్రతీర గాలులచే సృష్టించబడిన దాని ఇసుక దిబ్బలు ప్రపంచంలోనే ఎత్తైనవి.[51] సముద్రతీరంలో ఉన్న కారణంగా, అట్లాంటికు చల్లని నీరు ఆఫ్రికా వేడి వాతావరణానికి చేరుకుంటుంది. ఫలితంగా తరచుగా తీరం వెంబడి చాలా దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది.[52] తీరానికి సమీపంలో దిబ్బలు వృక్షసంపద ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి.[53] నమీబియాలో గొప్ప సముద్ర వనరులు ఉన్నాయి. అవి ఎక్కువగా మానవ అవేషిత ప్రాంతాలుకాదు.[54]
నమీబియా 17 ° - 25 ° దక్షిణ అక్షాంశం మద్య ఉంటుంది. ఉప-ఉష్ణమండల హై ప్రెజర్ బెల్ట్ శీతోష్ణస్థితి ఉంటుంది. దీని మొత్తం వాతావరణం శుష్కంగా ఉంటుంది. ఉప-తేమ నుండి [500 మిమీ (20 అంగుళాలు) పాక్షిక-శుష్క (300 - 500 మిమీ (12 - 20 అంగుళాల వర్షపాతం) (నీరులేని కలహరిలో ఎక్కువ భాగం సామీప్యత) ప్రాంతం ఉంటుంది. శుష్క [150 - 300 మిమీ (6 - 12 అంగుళాలు)] (ఈ మూడు ప్రాంతాలు పశ్చిమ ఎస్కార్ప్మెంట్ నుండి లోతట్టు) హైపర్-అరిడ్ తీర మైదానం వరకు [100 మిమీ (4 అంగుళాల కన్నా తక్కువ). మొత్తం ప్రాంతం మొత్తం ఎత్తు కారణంగా ఉష్ణోగ్రత పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకు, దక్షిణప్రాంతంలో 40 ° సెం (100 ° ఫా) గరిష్ఠంగా నమోదు చేయబడింది.[55]
సాధారణంగా ఉప-ఉష్ణమండల వాతావరణప్రాంతం అయిన హై ప్రెజరు బెల్టు ప్రాంతంలో తరచుగా స్పష్టమైన ఆకాశంతో సంవత్సరానికి 300 రోజుల కంటే ఎక్కువ సూర్యరశ్మిని అందుకుంటూ ఉంటుంది. ఇది ఉష్ణమండల వాతావరణం కలిగిన దక్షిణాంత ప్రాంతంలో ఉంది; ట్రోపికు ఆఫ్ మకరం దేశాన్ని సగానికి తగ్గించింది. శీతాకాలం (జూన్ - ఆగస్టు) సాధారణంగా పొడిగా ఉంటుంది. రెండు వర్షాకాలం వేసవిలో సంభవిస్తుంది: సెప్టెంబరు, నవంబరు మధ్య స్వల్ప వర్షాకాలం, ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్య దీర్ఘకాల వర్షపాతం ఉంటుంది.[56] తేమ తక్కువగా ఉంటుంది. సగటు వర్షపాతం తీర ఎడారిలో దాదాపు సున్నా నుండి కాప్రివి స్ట్రిప్‌లో 600 మిమీ (24 అంగుళాలు) కంటే ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం చాలా వైవిధ్యంగా ఉంటుంది. సాధారణంగా కరువు నెలకొని ఉంటుంది.[57] 2006-07 వేసవిలో వార్షిక సగటు కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది.[58]
తీరప్రాంతంలో వాతావరణం అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా చల్లగా ఉంటుంది. ఉత్తరాన ప్రవహించే బెంగులా కరెంటు ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది చాలా తక్కువ వర్షపాతం (సంవత్సరానికి 50 మిమీ (2 అంగుళాలు) లేదా అంతకంటే తక్కువ) ఉంటుంది. తరచుగా దట్టమైన పొగమంచు, మొత్తం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి.[57] శీతాకాలంలో అప్పుడప్పుడు బెర్గ్విండు ("పర్వత గాలి" జర్మనీ) లేదా ఓస్వీరు ("తూర్పు వాతావరణం" కోసం ఆఫ్రికా) అని పిలువబడే పరిస్థితి ఏర్పడుతుంది. లోతట్టు నుండి తీరానికి వేడి పొడి గాలి వీస్తుంది. తీరం వెనుక ఉన్న ప్రాంతం ఎడారి కాబట్టి, ఈ గాలులు ఇసుక తుఫానులుగా అభివృద్ధి చెందుతాయి. అట్లాంటికు మహాసముద్రంలో ఉన్న ఇసుక నిక్షేపాలు ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తాయి.[59]
సెంట్రల్ పీఠభూమి, కలహరి ప్రాంతాలు 30 ° సెం (86 ° ఫా) వరకు విస్తృత రోజువారీ ఉష్ణోగ్రత పరిధిని కలిగి ఉంటాయి.[57]
దేశంలోని ఉత్తర ప్రాంతాల ఎఫండ్జా వార్షిక వరదలు తరచుగా మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించడమే కాకుండా ప్రాణనష్టానికి కారణమవుతాయి.[60] అంగోలాలో కురిసే వర్షపాతం కారణంగా ఉద్భవించిన జలాలు నమీబియా కువెలై బేసిన్‌లోకి ప్రవహిస్తూ ఈ వరదలకు కారణమౌతుంటాయి. ఈ జలాలు అక్కడ ఓషనాలను (ఓషివాంబో: వరద మైదానాలు) నింపుతాయి. ఇప్పటివరకు 2011 మార్చిలో సంభవించిన వర్షపాతం అతి తీవ్రమైన వరదలకు కారణమై 21,000 మందిని స్థానభ్రంశం చేశాయి.[61]
నమీబియా ఉప-సహారా ఆఫ్రికాలో పొడిగా ఉన్న దేశం, ఎక్కువగా భూగర్భజలాలపై ఆధారపడి ఉంటుంది. సంవత్సరానికి సగటున 350 మిమీ (14 అంగుళాలు) వర్షపాతంతో ఈశాన్యంలోని కాప్రివిలో (సంవత్సరానికి 600 మిమీ (24 అంగుళాలు) అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. వర్షపాతం పశ్చిమ, నైరుతి దిశలో 50 మిమీ (2 అంగుళాలు)కు క్షీణిస్తుంది. తీరంలో వార్షిక వర్షపాతం తక్కువగా ఉంటుంది. దక్షిణాఫ్రికా, అంగోలా, జాంబియా, కాప్రివిలోని బోత్సువానాతో ఉన్న చిన్న సరిహద్దులలో మాత్రమే శాశ్వత నదులు కనిపిస్తాయి. దేశ లోపలి భాగంలో అసాధారణమైన వర్షపాతం తరువాత నదులు వరదలలో ఉన్నప్పుడు, వేసవి నెలలలో మాత్రమే ఉపరితల నీరు లభిస్తుంది. మిగిలిన కాలంలో ఉపరితల నీరు ఈ కాలానుగుణ వరదప్రవాహ జలాలను నిలుపుకోవటానికి నిర్మించబడిన కొన్ని ఆనకట్టలకు పరిమితం చేయబడింది. శాశ్వతంగా నదుల దగ్గర నివసించని, ఆనకట్టలను ఉపయోగించని ప్రజలు భూగర్భజలాల మీద ఆధారపడి ఉంటారు. ఉపరితల నీటి వనరులకు దూరంగా ఉన్న ఒంటరి సమాజాలు గనుల తవ్వకం, వ్యవసాయం, పర్యాటకం వంటి ఆర్థిక కార్యకలాపాలు కూడా దేశంలోని దాదాపు 80% పైగా భూగర్భజలాల నుండి నీరుసరఫరా ఏర్పాటు చేసుకుంటారు.[62]
గత శతాబ్దంలో నమీబియాలో 1,00,000 కు పైగా బోర్హోల్సు డ్రిల్లింగు చేయబడ్డాయి. ఈ బోర్హోల్సులో మూడోవంతు పొడిగా ఉన్నాయి. [63] 2012 లో అంగోలా-నమీబియా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ఒహాంగ్వేనా II అనే జలాశయం కనుగొనబడింది. ప్రస్తుతం (2018) ఇది వినియోగ శాతం ఆధారంగా ఉత్తరంలో 8,00,000 మందికి 400 సంవత్సరాల కాలం నీట్జీసరఫరా చేయగలదని అంచనా.[64] నమీబియాలో 7,720 చ.కి.మీ. (1,850 చ.మై) భూగర్భ జలాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.[65][66]
సహజ వనరుల పరిరక్షణ, రక్షణ బాధ్యతలను రాజ్యాంగంలో చేర్చుకున్న కొన్ని ప్రపంచదేశాలలో నమీబియా ఒకటి.[67] ఆర్టికలు 95 ఇలా చెబుతోంది. "కింది వాటిని లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ విధానాలను అవలంబించడం ద్వారా ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని చురుకుగా ప్రోత్సహించి, నిర్వహిస్తుంది: పర్యావరణ వ్యవస్థల నిర్వహణ, అవసరమైన పర్యావరణ ప్రక్రియలు, సహజవనరుల ఉపయోగం, నమీబియా జీవ వైవిధ్యం, స్థిరమైన ప్రాతిపదికన ఉపయోగించి నమీబియా ప్రజలందరి ప్రస్తుత, భవిష్యత్తు ప్రయోజనం "[67]
1993 లో కొత్తగా ఏర్పడిన నమీబియా ప్రభుత్వం " లివింగ్ ఇన్ ఎ ఫినిట్ ఎన్విరాన్మెంట్ (లైఫ్) ప్రాజెక్ట్ " ద్వారా యునైటెడు స్టేట్సు ఏజెన్సీ " ఫర్ ఇంటర్నేషనలు డెవలప్మెంటు " నుండి నిధులు పొందింది.[68] ఫర్ ఇంటర్నేషనలు డెవలప్మెంటు, ఎండేంజర్ విల్డు లైఫ్ ట్రస్ట్ (అంతరించిపోతున్న వన్యజాతుల సేవానిధి), కెనడియన్ అంబాసిడర్ ఫండ్ వంటి సంస్థల నుండి ఆర్థిక సహాయంతో పర్యావరణ, పర్యాటక మంత్రిత్వ శాఖ కలిసి కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ రిసోర్సు మేనేజ్మెంటు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. వన్యప్రాణుల నిర్వహణ, పర్యాటకానికి స్థానిక సమాజాలకు హక్కులు ఇవ్వడం ద్వారా స్థిరమైన సహజ వనరుల నిర్వహణను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.[69]
రాజధాని, అతిపెద్ద నగరం అయిన విండ్‌హక్ దేశంలో మధ్యభాగంలో ఉంది. ఇక్కడ " విండ్‌హక్ హోసీ కుటాకో అంతర్జాతీయ విమానాశ్రయం ", దేశంలోని ముఖ్య రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇతర ముఖ్యమైన నగరాలు:
సార్వభౌమాధికార దేశాలలో అత్యల్ప జన సాంద్రత కలిగిన దేశాలలో నమీబియా ద్వితీయ (మంగోలియా తర్వాత) దేశంగా ఉంది. నమీబియా ప్రజలలో అత్యధిక శాతం (దేశ జనాభాలో సగంమంది) నల్ల ఆఫ్రికజాతీయులు - అధికంగా స్థానిక ఓవాంబో జాతీయులు ఉన్నారు. వీరు అధికంగా దేశంలోని ఉత్తర ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు. ఇతర జాతి సమూహాలలో హెరెరో, హింబా ప్రజలు ఉన్నారు. వీరు ఒకే భాషను మాట్లాడుతారు.
నమీబియాలో బంటు ప్రజల ఆధిక్యతతో దక్షిణ ఆఫ్రికాలోని స్థానిక నివాసులకు వారసులైన కహోయిసాన్లు (నామా, బుష్మెన్ వంటివారు) సంఖ్యాపరంగా తరువాతి స్థానంలో ఉన్నారు. ఈ దేశంలో అంగోలా శరణార్ధుల వారసులు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ "కలరెడ్సు", "బాస్టెర్సు" అని పిలిచే మిశ్రమ జాతి మూలాలు కలిగిన ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. వీరు దేశ జనాభాలో 6.5% మంది ఉన్నారు (ఇద్దరు కలరెడ్సుకు ఒక బాస్టెర్సు నిష్పత్తిలో). 2006 నాటికి నమీబియాలో 40,000 మంది చైనీయులు ఉన్నారు.[70]
జనాభాలో పోర్చుగల్, డచ్, జర్మన్, బ్రిటీష్, ఫ్రెంచ్ వంశస్థుల శ్వేతజాతీయులు 7% మంది ఉన్నారు; వీరు దక్షిణ ఆఫ్రికా తర్వాత సబ్-సహారా ఆఫ్రికాదేశాలలో నమీబియాలోనే అధికసంఖ్యలో ఉన్నారు. యథార్థ సంఖ్యల ఆధారంగా కూడా ఐరోపా వంశీయుల రెండవ భారీసంఖ్యలో ఉన్నారు.[1] ఎక్కువ మంది నమీబియా శ్వేతజాతీయులు, సన్నిహిత మిశ్రమ జాతి ప్రజలు ఆఫ్రికాభాష మాట్లాడుతారు. వీరు దక్షిణ ఆఫ్రికాలోని శ్వేత, వర్ణజాతి జనాభా వలె ఒకే మూలాలు, ఆచారాలు, మతాలను కలిగి ఉన్నారు. స్వల్ప సంఖ్యలోని శ్వేతజాతీయులు వారి కుటుంబ మూలాలను జర్మనీ కాలనీయుల వంశస్థుల మూలాలను కలిగి ఉన్నారు. వారు జర్మనీ సంస్కృతీ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. దేశంలో స్థిరపడని దాదాపు మొత్తం పోర్చుగీసు దేశస్థులు అంగోలాలోని గత పోర్చుగీసు కాలనీ నుండి తరలి వచ్చారు.[71]
Religion in Namibia | ||||
---|---|---|---|---|
religion | percent | |||
Lutheranism | 50% | |||
Other Christians | 30% | |||
Indigenous | 10% | |||
Unknown | 7% | |||
Islam | 3% |
నమీబియా జనాభాలో సుమారు 80% మంది క్రైస్తవ సంఘానికి చెందినవారుగా ఉన్నారు. వీరిలో 50% మంది లుథెరన్లు ఉన్నారు. జనాభాలో సుమారు 10% మంది స్థానిక ఆచారాలను అనుసరిస్తారు. ఇస్లాంను జనాభాలో 3% మంది ఆచరిస్తున్నారు. జనాభాలోని మిగిలినవారి మతం తెలియరాలేదు.[1]
1800ల్లో మిషనరీ కార్యక్రమం అధికసంఖ్యలో నమీబియావాసులను క్రైస్తవం వైపు ఆకర్షించింది. నమీబియావాసులలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. వీరిలో రోమను క్యాథలిక్కులు, మెథడిస్టులు, ఆంగ్లికన్, ఆఫ్రికన్ మెథడిస్టు ఎపిస్కోపాల్, డచ్ రీఫార్ముడు క్రిస్టియన్సు, మోర్మాన్ (లేటర్-డే సన్యాసులు) ప్రతినిధులు అలాగే కొంతమంది యూదులు ఉన్నారు.[72]
అధికారిక భాష ఆంగ్లం. 1990 వరకు జర్మన్, ఆఫ్రికా భాషలులు కూడా అధికార భాషలుగా ఉండేవి. దక్షిణ ఆఫ్రికా నుండి నమీబియా స్వతంత్రం పొందిన తర్వాత ఎస్.డబల్యూ.ఎ.పి.ఒ. దేశంలో అధికారికంగా ఒకే భాషను ఉపయోగించాలని నిర్ణయించింది.[73] దీని వలన నమీబియాలో ఆంగ్ల భాష ఏకైక అధికారిక భాషగా నిర్ణయించబడింది. ఆఫ్రికా, జర్మన్, ఓస్హివాంబోలు ప్రముఖ స్థానిక భాషలుగా పేరు గాంచాయి.
మొత్తం నమీబియావాసులలో సగంమంది వారి ప్రధాన భాషగా ఓష్హివాంబోను మాట్లాడతారు. అయితే అక్కడ ఎక్కువమంది అర్థం చేసుకునే భాషగా ఆఫ్రికాభాష ఉంది. యువతరంలో ఎక్కువగా ఉపయోగించే భాషగా ఆంగ్ల భాష ప్రాచుర్యం పొందింది. ఆఫ్రికా, ఆంగ్ల భాషలు రెండూ ప్రధానంగా ప్రజా సంబంధిత సంఘాలలో ప్రత్యామ్నాయ భాషలా ఉపయోగించబడుతున్నాయి. కాని దేశంలో వీటిని ప్రధాన భాషగా ఉపయోగించే సమూహాలు కొన్ని ఉన్నాయి.
ఆగ్లభాష అధికారిక భాష హోదాను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువమంది శ్వేతజాతీయులు జర్మనీ, ఆఫ్రికాభాషలను మాట్లాడతారు. జర్మనీ కాలనీయల్ శకం ముగిసి 90 సంవత్సరాలు అయినా ఇప్పటికీ జర్మనీ భాష ఒక వాణిజ్య భాషగా ప్రధాన హోదాను కలిగి ఉంది. శ్వేతజాతీయులలో 60% మంది ఆఫ్రికాభాష, 32% మంది జర్మనీ భాషను మాట్లాడతారు. ఆంగ్ల భాషను 7% మంది మాట్లాడుతుండగా, పోర్చుగీసును 1% మంది మాట్లాడుతున్నారు.[1] పోర్చుగీసు-మాట్లాడే అంగోలాకు భౌగోళికంగా సామీప్యతగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో లుసోఫోనులు అధిక సంఖ్యలో ఉన్నారు.
నమీబియాలో ఎయిడ్స్ అంటువ్యాధి ఒక పెద్ద సమస్యగా మారింది. సంక్రమణ శాతం తూర్పుదిశలో సమీప ప్రాంతమైన బోత్సువానా కంటే చాలా తక్కువైనప్పటికీ, నమీబియా జనాభాలో సుమారు 10% మంది (2,063,929 మందిలో 210,000 మంది వ్యక్తులు) ఎయిడ్స్ బారిన పడ్డారు. 2001లో ఈ ప్రాంతంలో 2,10,000 మంది వ్యక్తులు ఎయిడ్సుతో జీవిస్తున్నారు. 2003లో 16,000 మంది మరణించే అవకాశముందని అంచనా వేశారు. ఎయిడ్స్ అంటువ్యాధిని మరణాంతక వ్యాధిగా భావిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా పలు శ్రామికులు చనిపోవడంతో, అనాథలు అధికరించారు. దీనితో ఈ అనాథలకు విద్య, ఆహారం, నివాసం, దుస్తులను అందించే బాధ్యత ప్రభుత్వం మీద పడింది.[74]
ఎయిడ్స్ అంటువ్యాధితో పాటు మలేరియా వ్యాధి కూడా మరొక సమస్యగా మారింది. నమీబియాలో ఒక వ్యక్తి ఎయిడ్స్ వ్యాధి బారిన పడినట్లయితే ఆ వ్యక్తికి మలేరియా సోకే అవకాశం 14.5% ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ఎయిడ్ సోకిన వ్యక్తి మలేరియా బారిన పడటం వలన మరణించే శాతం సుమారు 50% అధికరించింది.[75] ఈ అత్యధిక సంక్రమణ స్థాయిలు అలాగే పెరుగుతున్న మలేరియా సమస్య కారణంగా, ఈ అంటువ్యాధి యొక్క వైద్య, ఆర్థిక ప్రభావాలను ఎదుర్కొవడం ప్రభుత్వానికి బాగా క్లిష్టంగా మారింది. ఈ దేశంలో 2002లో 598 వైద్యులు మాత్రమే ఉన్నారు. [76]
దక్షిణాఫ్రికాతో ఉన్న భాగస్వామ్యం కారణంగా నమీబియా ఆర్థిక వ్యవస్థ దక్షిణ ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ మీద అధికంగా ఆధారపడి ఉంది.[35][36] వీటిలో ప్రధానంగా 2007లో స్థూలదేశీయోత్పత్తిలో గనులత్రవ్వకం 12.4%, వ్యవసాయం (9.5%), తయారీరంగం (15.4%) ఉన్నాయి. నమీబియా ఆర్థికవ్యవస్థ గనుల త్రవ్వకం నుండి అధిక శాతం ఆదాయాన్ని పొందుతుంది. ఇది దేశం ఆదాయంలో 25% అందిస్తుంది.[77] ఆఫ్రికాలో ఇంధనేతర ఖనిజాలను ఎగుమతి చేసే దేశాలలో నమీబియా నాల్గవ అతిపెద్ద దేశంగా ఉంది. ఇది ప్రపంచంలో యురేనియం ఉత్పత్తి చేసే ఐదవ అతిపెద్ద దేశంగా కూడా ఉంది. ఇక్కడ యురేనియం త్రవ్వకాల మీద అత్యధిక పెట్టుబడులు పెడుతున్నారు. 2015నాటికి అతిపెద్ద యురేనియం ఎగుమతిదారుగా ఉండడానికి నమీబియా కృషి చేస్తుంది. 2007లో లాంగెర్ హెన్రిచ్ యురేనియం త్రవ్వకం ప్రారంభించబడింది.[78] అత్యధిక జలాప వజ్ర నిల్వలు నమీబియాను విలువైన వజ్రాలకు ప్రధాన వనరుగా మార్చాయి.[79] నమీబియా అధిక మొత్తంలో సీసం, జింక్, తగరం, వెండి, టంగస్టనులను కూడా ఉత్పత్తి చేస్తుంది.
నమీబియాలో అత్యధిక శాతంలో నిరుద్యోగం ఉంది. "ఖచ్చితమైన నిరుద్యోగం" (పూర్తి స్థాయి ఉద్యోగాన్ని కోరుకుంటున్న వ్యక్తులు) 2000లో 20.2% ఉండగా, అది 2004లో 21.9%కు అధికరించింది. 2008లో 29.4% చేరుకుంది. ఒక అంచనా ప్రకారం (ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్న వ్యక్తులతో), 2004లోని నిరుద్యోగం 36.7% ఉండగా 2008లో 51.2%కు అధికరించింది. ఈ అంచనాలో అనధికార ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులను ఉద్యోగస్థులుగా పరిగణించారు. ఈ ఫలితాల అధ్యయనాన్ని కార్మిక, సామాజిక సంక్షేమ శాఖా మంత్రి ఇమ్యానుల్ న్గాట్జిజెకో "గతంలోని గణాంకాలుతో పోలిస్తే ఈ అధ్యయన ఫలితాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నట్లు" ప్రశంసించారు.[80]
ఇక్కడ దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పలు చట్టసంబంధిత కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 2004లో గర్భధారణ, ఎయిడ్స్ ఆధారంగా ఉద్యోగ వివక్షతను నిర్మూలించడానికి, దాని నుండి ప్రజలను సంరక్షించడానికి ఒక కార్మిక చట్టం ప్రవేశపెట్టబడింది. 2010లో ప్రభుత్వ టెండరు బోర్డు "నమీబియాలో ఎటువంటి మినహాయింపు లేకుండా నైపుణ్యం లేని, తక్కువ-నైపుణ్యాలను కలిగిన కార్మికులను 100% నియమించాలని" ప్రకటించింది.[81]
దేశంలో ఎక్కువ భాగం గ్రామీణ వాతావరణం ఉన్నప్పటికీ, నమీబియాలో ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలుమార్గాలు (నేరో-గేజ్) ఉన్నాయి. ఈ దేశం ఒక ప్రాంతీయ రవాణా ప్రాంతంగా మారేందుకు ప్రయత్నిస్తుంది; ఇది ముఖ్యమైన ఓడరేవుగా పలు పరివేష్టిత సమీప దేశాలకు పలు జలమార్గ రవాణా సౌకర్యాలు అందిస్తుంది. మధ్య పీఠభూమి ఇప్పటికే అధిక జనసాంద్రత గల ఉత్తర ప్రాంతం నుండి దక్షిణ ఆఫ్రికాకు ఒక రవాణా మార్గంగా సేవలు అందిస్తుంది. నమీబియాలోని ఐదింటి నాలుగు వంతుల దిగుమతులు దీని ద్వారానే జరుగుతున్నాయి.[82]
జనాభాలో సుమారు సగంమంది వారి జీవనం కోసం వ్యవసాయం మీద (జీవనోపాధి వ్యవసాయం)ఆధారపడుతున్నారు. అయినప్పటికీ నమీబియాకు అవసరమైన ఆహారంలో కొంత భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దేశ తలసరి జి.డి.పి. దక్షిణ ఆఫ్రికాలోని బీద దేశాల తలసరి జి.డి.పి. కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. నమీబియాలోని ఎక్కువమంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారు జీవనోపాధి మీద జీవిస్తున్నారు. ఆదాయ అసమానతలు అత్యధిక శాతంలో ఉన్న ప్రపంచదేశాలలో నమీబియా ఒకటి. దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో నగదు రహిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు అధికంగా ఉన్నాయి. ఈ అసమానత గణాంకాలు వాస్తవానికి వారి జీవనం కోసం లాంఛనప్రాయ ఆర్థికవ్యవస్థ మీద ఆధారపడని ప్రజలను పరిగణనలోకి తీసుకున్నాయి.
రాబోయే సంవత్సరాల్లో పలు ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీని వలన మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. అయితే పర్యావరణ ఆధార మూలధనం మీద పెట్టుబడి కేంద్రీకరించడం కారణంగా నమీబియా తలసరి ఆదాయం కుంటుపడింది.[83] నమీబియాలో త్వరిత ఆర్థిక అభివృద్ధి కనిపిస్తున్న రంగాలలో వన్యప్రాణుల సంరక్షణాలయాల అభివృద్ధి కూడా ఉంది. ఈ సంరక్షితనిలయాలు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలోని సాధారణ నిరుద్యోగ జనాభాకు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి.
నమీబియాలోని విద్యుత్తును ప్రధానంగా థర్మల్, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంటుల నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తి పద్ధతులను కూడా ఉపయోగిస్తున్నారు. స్థానికంగా సరఫరా చేసే వోల్టేజ్ 220 వీల్టుల ఎ.సి. విద్యుత్తు నియంత్రణ బోర్డు [84] నమీబియాలోని విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, దిగుమతి, ఎగుమతుల నియంత్రణకు బాధ్యతను వహించే ఒక చట్టపరమైన నియంత్రణాధికారిన్ని కలిగి ఉంది.
నమీబియాలో జీవన వ్యయం అధికంగా ఉంది. ఎందుకంటే దైనందిన జీవితంలో అవసరమయ్యే పలు వస్తువులను అత్యధిక రవాణా వ్యయాలతో దిగుమతి చేసుకోవడం ప్రధానకారణంగా ఉంది. కొన్ని వ్యాపార రంగాలలోని గుత్తాధిపత్యం అత్యధిక లాభార్జన, ధరలు మరింత పెరగడానికి కారణమైంది. ఉదాహరణకు విండ్హకులో సుమారు విద్యుత్తు ధరలు యూనిట్జూకు 0.0060 N$ ఇ.ఎస్.బి. పన్నుతో సహా యూనిటుకు 0.5873 N$గా ఉంది. లోడ్ ఆధారంగా ఒక నిర్దిష్ట ధర రసీదుకు జోడించబడుతుంది. కనిష్ఠ మొత్తం 48N$ (10ఎ లోడ్ వరకు).[85] గ్యాసోలైను ధర (పెట్రోల్) లీటరుకు 7 N$ కంటే ఎక్కువగా ఉంది.[86], ద్రవీకృత పెట్రోలియం ధర లీటరుకు 3 N$ వరకు ఉంది.[87] సురక్షిత నగర ప్రాంతాలలో కుటుంబ నివాసం కోసం అద్దె నెలకు 12000 N$ మించిపోయింది.[88] . వ్యక్తిగత ఆదాయ పన్ను ఒక వ్యక్తి మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి వర్తిస్తుంది. మొత్తం వ్యక్తులు ఆదాయ పరిధుల శ్రేణి ఆధారంగా పన్ను విధించబడుతుంది. ఈ వార్షిక పన్ను మార్చి 1 నుండి ఫిబ్రవరి 28 కాల పరిధికి లెక్కించబడుతుంది.
2010 సంవత్సరానికి పన్ను రేట్లు క్రింది విధంగా ఉన్నాయి:
పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం | పన్ను రేట్లు |
---|---|
పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం N$ 40 000 మించకపోతే | 0% |
N$ 40 001, N$ 80 000 మధ్య | N$ 40 000 మించి పన్ను పరిధిలోకి వచ్చే మొత్తంలో 27% |
N$ 80 001, N$ 200 000 మధ్య ఉన్నట్లయితే | N$ 10 800 + N$ 80 000 మించి పన్ను పరిధిలోకి వచ్చే మొత్తంలో 32% |
N$ 200 001, N$ 750 000 మధ్య ఉన్నట్లయితే | N$ 49200 + N$ 200 000 మించి పన్ను వర్తించే మొత్తంలో 34% |
N$ 750 000 కంటే ఎక్కువ | N$ 236 200 + N$ 750 000 మించి పన్ను వర్తించే మొత్తంలో 37% |
సాధారణంగా ఒక ఉద్యోగస్థునికి జీతాన్ని నమీబియా డాలర్లల్లో చెల్లిస్తారు (1 US Dollar = సుమారు 7.37 నమీబియా డాలర్లు)[90], ఆదాయ పన్ను సంస్థచే మినహాయించబడుతుంది.
నమీబియా సాధారణంగా పర్యావరణ సంబంధిత పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులలో ఎక్కువమంది వేర్వేరు వాతావరణ పరిస్థితులను, ప్రసిద్ధ తూర్పు ఎడారిని, మైదానాలు వంటి సహజ భౌగోళిక భూభాగాలను ఆస్వాదించడానికి విచ్చేస్తారు. ఇక్కడ పర్యావరణ సంబంధిత పర్యాటకుల వసతి కోసం పలు వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. శాండుబోర్డింగు, 4x4 అనే విస్తృత క్రీడలు బాగా ప్రాచుర్యం పొందాయి. పలు నగరాలలో యాత్రలను అందించే సంస్థలు ఉన్నాయి. తప్పక సందర్శించవల్సిన ప్రాంతాలలో కాప్రివి ఖండం, ఫిషు రివరు కాన్యాను, సోసుస్వ్లెయి, స్కెలిటన్ కోస్టు ఉద్యానవనం, సెస్రియెం, ఎటోషా ప్యాను, స్వాకోప్ముండు, వాల్విస్ బే, లుడెర్టిజి తీరప్రాంత నగరాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి]
నమీబియాలో బాల కార్మికులు ఉన్నారు. 2008 జనవరిలో బాల కార్మికుల నిర్మూలనకు కార్యాచరణ కార్యక్రమంకి ప్రభుత్వ మంత్రులు, కీలక వాటాదారులు మద్దతు పలికారు. బాలల అక్రమ రవాణాకు కూడా నమీబియా ప్రధాన స్థావరంగా ఉన్నట్లు నివేదించబడింది; అయితే సమస్య తీవ్రతను పేర్కొనలేదు. చట్టపరమైన సమాజ సేవ అధికారులకు ఈ సమస్యతో పోరడుతున్నారు. సమస్య పరిష్కారానికి అత్యల్ప ప్రజా అవగాహన, నైపుణ్యంలేని శిక్షణలు ప్రతిబంధకంగా మారాయి. నిర్బంధ వ్యవసాయ పనికి, పశువుల రక్షణ, అమ్మకాలు వంటి దేశీయ కార్యక్రమాలు కోసం దేశంలోనే బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. బాలల వ్యభిచార కేసులు కూడా నమోదు అయ్యాయి.[91] బాల కార్మికులు, అక్రమ బాలల రవాణాలకు వ్యతిరేకంగా చట్టాలు అమలులో ఉన్నాయి; అయితే, ప్రభుత్వం బాలల అక్రమ రవాణా మీద ఒక్క కేసును కూడా విచారించలేకపోయింది.
నమీబియా రాజ్యాంగం, సైన్యం బాధ్యతను "ప్రాంతాలు, జాతీయ సంపదలను రక్షించడం"గా పేర్కొంది. నమీబియా ఒక 23-సంవత్సరాల బుష్ యుద్ధంలోని మాజీ శత్రువులతో నమీబియా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ నమీబియా, సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ టెరిటోరియల్ ఫోర్సు. బ్రిటీష్ దళాల సమ్మేళన ప్రణాళికను రూపొందించింది, ఎన్.డి.ఎఫ్‌కు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. దీనిలో ఐదు పటాలాలు, ఒక చిన్న ముఖ్యకార్యాలయ అంశం ఉన్నాయి.
స్వతంత్రం పొందిన తర్వాత ఎన్.డి.ఎఫ్.కు శిక్షణ ఇవ్వడానికి, ఉత్తర ప్రాంతాన్ని స్థిరీకరించడానికి యునైటెడ్ నేషన్సు ట్రాన్సిటినోయల్ అసిస్టెన్స్ గ్రూప్ కెన్యా పదాతి పటాలం మూడు నెలలు పాటు నమీబియాలో ఉంది. నమోదు అయిన పురుషులు, మహిళలు సంఖ్య 7,500 కంటే ఎక్కువ ఉండదని నమీబియా రక్షణశాఖా మంత్రి పేర్కొన్నారు. రక్షణ, భద్రతా రంగాల మీద ప్రభుత్వం సుమారు 3.7% ఖర్చు చేస్తుంది.
నమీబియాలో 6 నుండి 16 సంవత్సరాల మధ్య పిల్లలకు 10 సంవత్సరాలు పాటు ఉచిత విద్య అందుబాటులో ఉంది. 1-7 తరగతులు ప్రాథమిక స్థాయి కాగా, 8-12 తరగతులను ఉన్నత స్థాయిగా పేర్కొంటారు. 1998లో, నమీబియాలో ప్రాథమిక పాఠశాల్లో 400,325 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాల్లో 115,237 విద్యార్థులు ఉన్నట్లు అంచనా వేశారు. 1999లో విద్యార్థి-గురువు నిష్పత్తి 32:1గా అంచనా వేశారు, GDPలో 8% విద్య కోసం వెచ్చిస్తున్నారు.[92]
నమీబియాలో పాఠశాలలను అధికంగా ప్రభుత్వం నడుపుతుంది. అయినప్పటికీ దేశంలోని విద్యా వ్యవస్థకు సేవ అందిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటిలో సెయింటు పాల్సు కాలేజి, విండ్‌హక్ ఆఫ్రికంసు ప్రైవేట్స్కూలు, డచ్చి గోహియరు ప్రైవేటుస్కూలు, విండ్‌హక్ జిమానిజాలు ఉన్నాయి. బోధన ప్రణాళికాబద్ధమైన బోధనాభివృద్ధి, విద్యా పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలకు ఓకాహాండ్జాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంటు బాధ్యత వహిస్తుంది.[93]
ఇక్కడ నాలుగు అధ్యాపక శిక్షణ విద్యాలయాలు, మూడు వ్యవసాయ విద్యాలయాలు, ఒక పోలీసు శిక్షణ విద్యాలయం, ఒక పాలిటెక్నికు, ఒక నేషనల్ విశ్వవిద్యాలయం ఉన్నాయి.
నమీబియా దాని పరిసర ప్రాంతాలలో సహజ వనరుల సంరక్షణ, భద్రతకు కార్యక్రమాలు చేపట్టిన కొన్ని ప్రపంచ దేశాలలో నమీబియా ఒకటి.[67] కథనం 95 ఆధారంగా "రాజ్యం క్రింది లక్ష్యాలు కోసం అంతర్జాతీయ విధానాలను అనుసరించడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణను అధికరించి నిర్వహించాలి: పర్యావరణ వ్యవస్థల నిర్వహణ, పర్యావరణ సంబంధిత విధానాలు, నమీబియాలో జీవ వైవిధ్యం, ప్రస్తుత, భవిష్యత్తు నమీబియావాసుల ప్రయోజనాలు కోసం స్థిరమైన సహజ వనరుల వినియోగం."[67]
1993లో నమీబియాలో ఏర్పాటు అయిన నూతన ప్రభుత్వం యునైటెడు స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంటు నుండి దాని లివింగ్ ఇన్ ఏ ఫైనేట్ ఎన్విరాన్మెంటు ప్రాజెక్టు నుండి నిధిని అందుకుంది.[94] యు.ఎస్.ఎయిడ్, అపాయకర వన్యప్రాణి సంస్థ, డబల్యూ.డబల్యూ.ఎఫ్, కెనడియన్ అంబాసిడర్స్ ఫండ్ వంటి సంస్థల నుండి లభించిన ఆర్థిక సహాయంతో పర్యావరణ, పర్యాటక రంగ మంత్రిత్వశాఖ ఒక సహజ వనరుల నిర్వహణ ఆధారిత సంఘం ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టు స్థానిక సంస్థలకు వన్యప్రాణి నిర్వహణ, పర్యాటక రంగం హక్కులను అందజేయడం లక్ష్యంగా చేసుకుని కృషిచేస్తుంది. ఇది సహజ వనరు నిర్వహణను ప్రోత్సహిస్తుంది.[95]
నమీబియాలో ఫుట్బాలు (సాకర్) చాలా ప్రాచుర్యం పొందిన క్రీడ. నమీబియా జాతీయ ఫుట్‌బాల్ జట్టు 2008 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషంసుకు అర్హత సాధించింది. రగ్బీ యూనియను, క్రికెటు క్రీడలు కూడా మంచి ప్రజాదరణ పొందాయి. నమీబియా 1999, 2003, 2007 రగ్బీ వరల్డు కప్పులలో పాల్గొంది. వారు 2003 క్రికెట్టు వరల్డ్టు కప్పులో కూడా పాల్గొంది. ఇన్లైన్ హాకీ అనేది మొట్టమొదటిసారిగా 1995లో ఆడారు. ఇది కూడా ఇటీవల సంవత్సరాలలో మంచి ప్రజాదరణను పొందింది. మహిళల ఇన్లైన్ హాకీ జాతీయ జట్టు 2008, ప్రపంచ ఛాంపియన్షిప్పులలో పాల్గొన్నారు. నమీబియా ప్రపంచంలోని కఠినమైన పరుగు పందెలలో ఒకటి అయిన నమీబియన్ ఆల్ట్రా మారథానుకు స్వస్థలంగా చెప్పవచ్చు.
నమీబియాలో ప్రాచుర్యం పొందిన క్రీడాకారుడుగా పరుగు పందెగాడు (100, 200 మీ) అయిన ఫ్రాంకీ ఫ్రెడెరిక్సు అంటారు. ఆయన 4 ఒలింపికు రజత పతకాలను (1992, 1996) సాధించాడు. ఆయన పలు ప్రపంచ అథ్లెటిక్సు ఛాంపియన్షిప్పుల నుండి పతకాలను సాధించాడు. ఆయన నమీబియా, ఇతర ప్రాంతాలలో జీవకారుణ్య కార్యక్రమాలకు కూడా ప్రఖ్యాతి చెందాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.