జనవరి: విలియం పిట్ ది యంగర్ 21 సంవత్సరాల వయస్సులో గ్రేట్ బ్రిటన్ పార్లమెంటులోకి ప్రవేశించాడు. తరువాతి కాలంలో అతడు గ్రేట్ బ్రిటన్ కు ప్రధానమంత్రి అయ్యాడు.
జనవరి 6: జెర్సీ యుద్ధం: ఛానల్ దీవులలో జెర్సీని ఆక్రమించకుండా బ్రిటిష్ దళాలు ఫ్రెంచ్ దళాలను నిరోధించాయి.
ఫిబ్రవరి 3: నాల్గవ ఆంగ్లో-డచ్ యుద్ధం – సింట్ యుస్టాటియస్ ఆక్రమణ: బ్రిటిష్ దళాలు డచ్ కరేబియన్ ద్వీపం సింట్ యుస్టాటియస్ను స్వాధీనం చేసుకున్నాయి.
మార్చి 13: సర్ విలియం హెర్షెల్యురేనస్గ్రహాన్ని కనుగొన్నాడు. వాస్తవానికి అతను దీనిని గ్రేట్ బ్రిటన్ రాజు జార్జ్ III గౌరవార్థం జార్జియం సిడస్ (జార్జ్ స్టార్) అని పేరు పెట్టాడు
మే 18: లిమా నుండి పంపిన స్పానిష్ సైన్యం ఇన్కా తిరుగుబాట్లను అణిచివేసింది. టుపాక్ అమారు II ను బంధించి క్రూరంగా చంపేసింది.
సెప్టెంబర్ 4: కాలిఫోర్నియాలోని 44 మంది స్పానిష్ వలస వాసుల బృందం లాస్ ఏంజలెస్ నగరాన్ని స్థాపించింది. వారు దానికి పెట్టిన పేరు ఎల్ ప్యూబ్లో డి న్యుస్ట్రా సెనోరా లా రీనా డి లాస్ ఏంజిల్స్ డి పోర్సియున్కులా .
నవంబర్ 29: ఆంగ్ల బానిస వ్యాపారులు అక్రాలో తీసుకున్న సుమారు 142 మంది బానిసలను కరేబియన్ సముద్రంలోకి బ్రతికి ఉండగానే బానిస ఓడ జోంగ్ నుండి సముద్రం లోకి తోసెయ్యడం మొదలుపెట్టారు. మిగిలి ఉన్నవారికి ఆహారాన్నొఇ సర్దుబాటు చేసేందుకు ఈ పని చేసారు. ఆ తరువాత వారి యజమానులు తమకు జరిగిన నష్టంలో కొంత భాగాన్ని బీమా సంస్థల నుండి తిరిగి పొందటానికి ప్రయత్నించారు.[2]