From Wikipedia, the free encyclopedia
మూస:మహా దద్దమ్మ ప్రవక్త
|
హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు, కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్, ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
సనద్, మతన్లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి, సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది.[2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు, ఆచరణల సంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
(అబూ దావూద్)
(అల్-తిర్మజి)
(అల్-నసాయి)
(ఇబ్న్ మాజా)
హదీసుల ప్రామాణికతలపై అనేక సందేహాలు, శంకలూ ఉన్నాయి. ఖురాను లాగా హదీసులు ప్రామాణికత్వాన్ని కచ్చితత్వాన్ని కలిగి లేవని, సందేహాలతో కూడి వున్నవని, ముస్లిం సముదాయాలలో అనేకులు భావిస్తారు.
షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
పేరు | సేకర్త | కొలమానం |
ఉసుల్ అల్-కఫి | హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి (329 AH) | 15,176 హదిత్ లు |
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ | ముహమ్మద్ ఇబ్న్ బాబుయా | 9,044 |
అల్-తహ్ ధిబ్ | షేక్ ముహమ్మద్ తూసీ | 13,590 |
అల్-ఇస్తిబ్సర్ | షేక్ ముహమ్మద్ తూసీ | 5,511 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.