వైరా

ఖమ్మం జిల్లాకు వైరా మండలానికి చెందిన పట్టణం. From Wikipedia, the free encyclopedia

వైరా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం.ఇది వైరా మండలానికి ప్రధాన కేంద్రం. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది. ఇది వైరా పురపాలకసంఘంగా ఏర్పడింది.

త్వరిత వాస్తవాలు వైరా, దేశం ...
వైరా
పట్టణం
వైరా రోడ్డు దృశ్య చిత్రం
వైరా రోడ్డు దృశ్య చిత్రం
Thumb
వైరా
తెలంగాణ పటంలో వైరా స్థానం
Thumb
వైరా
వైరా (India)
Coordinates: 17°11′46″N 80°21′20″E
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఖమ్మం జిల్లా
Named forవైరా రిజర్వాయర్
Government
  Typeపురపాలక సంఘం
భాష
  అధికారకతెలుగు
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
507165
ప్రాంతీయ ఫోన్‌కోడ్08749
Vehicle registrationTS 04
మూసివేయి

ఆలయాలు

వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని, భక్తులకు మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంకా, పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్దషిర్డీ సాయిబాబా గుడి ఉంది. శివాలయం ఉంది. వైరా నుండి కొత్తగూడెం వెళ్ళే దారిలో కాల్వగట్టు గoడగలపాడు షిరిడీ సాయిబాబా ఆలయం కలదు,ప్రతి మొదటి గురువారం అన్నదానం జరుగుతుంది, ఈ ఆలయాన్ని తెలంగాణా షిరిడీ గా పిలుస్తారు...[1]

వైరా జలాశయం

వైవద్ద షిరిడీ సాయి రువు అనునది వైరా నది నుండి వచ్చింది. ఈ చెరువులో 19 బావులువున్నవ.ి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించాడు. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతోంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.

విద్యా సంస్థలు

  • కె.వి.సి.ఎమ్. డిగ్రీ కాలేజి
  • మధు విద్యాలయం, జూనియర్ కాలేజి,డిగ్రీ కాలేజీ
  • టాగోర్ విద్యాలయం
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • క్రాంతి జూనియర్ కాలేజి
  • న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ & జూనియర్ కళాశాల
  • మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్
  • వాణి విద్యాలయం

బ్యాంకులు

  1. నాగార్జున గ్రామీణ బ్యాంక్.
  2. ఆంధ్రా బ్యాంక్.
  3. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపంలో ).
  4. హెచ్ డి ఫ్ సి బ్యాంక్ (కోటయ్య హాస్పిటల్ ఎదురుగా)

వ్యవసాయం

వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి, వైరా చెరువు వల్ల ఇక్కడ జాలర్లు కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు. ఇది చెరువు పక్కనే ఉంది.

రవాణా సౌకర్యాలు

ఇక్కడ నుంచి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు, హైదరాబాదుకూ రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకు సర్వీసు ఆటోలు ఉంటాయి, మధిర నుంఛి ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.హైదరాబాద్కు మధిర నుంచి బస్సులు ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గం

మూలాలు

బయటి లింకులు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.