Remove ads
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు From Wikipedia, the free encyclopedia
'భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య, పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ, ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది. 1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | US8565522039 |
పరిశ్రమ | బ్యాంకింగ్, ఆర్థిక సేవలు |
స్థాపన |
|
ప్రధాన కార్యాలయం | ముంబై, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచవ్యాప్తం |
కీలక వ్యక్తులు | దినేష్ కుమార్ ఖరా |
ఉత్పత్తులు | రీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, ఫైనాన్స్ , ఇన్సూరెన్స్ సేవలు, పెట్టుబడిల బ్యాంకింగ్ సెవలు, లోన్స్ , ప్రైవేట్ బ్యాంకింగ్ & ఈక్విటీ, సేవింగ్స్ & సెక్యూరిటీస్, క్రెడిట్ , డెబిట్ కార్డ్స్ |
రెవెన్యూ |
|
Operating income | ₹50,847.90 crore (US$6.4 billion) (2017) |
Net income |
|
Total assets | ₹27,05,966.30 crore (US$340 billion) (2017) |
Total equity | ₹1,44,274.65 (US$1,800) (2016) |
ఉద్యోగుల సంఖ్య |
|
మూలధన నిష్పత్తి | 13.12% (2016) |
వెబ్సైట్ | www |
Footnotes / references [1][2][3][4] |
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా పేరు మార్చబడింది. పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 2 జూన్, 1806 న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్, రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన), బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బ్యాంకు స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము 30 ఏప్రిల్, 1955 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటు చేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
భారతీయ స్టేట్ బ్యాంకుకు గతంలో 7 అనుబంధ బ్యాంకులు ఉండేవి. అవన్నీ సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి 1959లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి. 2008 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2009 లో స్టేట్ బ్యాంక్ ఇండోర్ మాతృసంస్థ లో విలీనం అయ్యాయి. మిగిలిన 5 అనుబంధ బ్యాంకులు 2016 లో విలీనం అయ్యాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.