Remove ads
From Wikipedia, the free encyclopedia
వీటూరి నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.
వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి | |
---|---|
దస్త్రం:Vituri Suryanarayana murty- cine song writer.jpeg | |
జననం | వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి 1934 జనవరి 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామం |
మరణం | 1985, సెప్టెంబరు 21 మద్రాసు |
ఇతర పేర్లు | వీటూరి |
ప్రసిద్ధి | నాటకాల రచయిత, సినీగేయరచయిత |
ఇతడు 1934,జనవరి 3వ తేదీన జన్మించాడు. ఇతని జన్మస్థలం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామం[1]. తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టాడు వీటూరి. భీమిలిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశాడు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.
సినిమాలపై ఆసక్తి ఉండటంతో 1958లో మద్రాసు పయనమయ్యాడు వీటూరి. సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజుగార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా స్క్రిప్టు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు రాశాడు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం కలగడంతో ‘గజదొంగ’ చిత్రానికి వీటూరి మాటలు రాశాడు.
వీటూరి ‘స్వర్ణగౌరి (1962)’ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశాడు. అలా ఆయనకు తొలిసారిగా పూర్తిస్థాయి అవకాశం వచ్చింది. తర్వాత వీటూరి రాసిన తొలి సాంఘిక చిత్రం ‘దేవత (1965)’. ఇందులో రాసిన పాటలు వీటూరికి మంచిపేరు తెచ్చాయి. నిర్మాత భావనారాయణ, జానపదబ్రహ్మ బి.విఠలాచార్యల ప్రోత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచన చేశాడు. వందకు పైగా పాటలు రాశాడు.
వీటూరి ‘విజయలలిత పిక్చర్స్’ సంస్థను స్థాపించి ‘అదృష్టదేవత (1972)’ సినిమా నిర్మించాడు. వీటూరి రాసిన ‘భారతి’ కథను స్వీయ దర్శకత్వంలో ‘భారతి (1975)’ చిత్రంగా తెరకెక్కించాడు. దానికి మాటలు, పాటలు కూడా వీటూరివే. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967)’ చిత్రంలోని వీటూరి పాటతోనే ఎస్.పి.బాలు గాయకునిగా సినిమారంగ ప్రవేశం చేశాడు. 1984లో మద్రాసులో కన్నుమూశాడు.
క్రమసంఖ్య | సినిమా పేరు | పాట పల్లవి | గాయకుడు | సంగీత దర్శకుడు | సినిమా విడుదలైన సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | శ్రీకృష్ణ లీలలు | మురళీధరా కృష్ణయ్య నిన్నే నమ్ముకొంటినయ్యా కరుణించి రావదేల | ఎస్. ఎల్. మర్చంటు ఎం. ఎస్. శ్రీరాం | 1958 | |
2 | మహారథి కర్ణ | జోజో వీరా జోజో యేధాజో జోజో జోజో | ఎస్. జానకి | డి. బాబూరావు | 1960 |
3 | మహారథి కర్ణ | మనసా అంతా మాయేలే కనుమా జ్యోతిర్మయు లీలా | పి.బి. శ్రీనివాస్ | డి. బాబూరావు | 1960 |
4 | జగదేక సుందరి | 1961 | |||
5 | ఏకైక వీరుడు | న్యాయం ధర్మం మరువకురా ఏనాడు ఎవరికి వెరువకురా | ఘంటసాల | ఎస్.పి. కోదండపాణి | 1962 |
6 | ఏకైక వీరుడు | అందాల రాణి మా యువరాణి జగతికే మోహిని | కె. రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ఎస్.పి. కోదండపాణి | 1962 |
7 | ఏకైక వీరుడు | ఆంధ్రుల ప్రతిభను చాటండి గోదావరి తల్లిని | మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ఎస్.పి. కోదండపాణి | 1962 |
8 | ఏకైక వీరుడు | ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన | కె. రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ఎస్.పి. కోదండపాణి | 1962 |
9 | ఏకైక వీరుడు | కలిత లలిత మద మరాళ గామినీ మదిలోన ప్రణయ | ఘంటసాల,పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1962 |
10 | ఏకైక వీరుడు | కళ్యాణ తిలకమ్ము కళలు వీడగలేదు గారాల ముద్రిక | మాధవపెద్ది | ఎస్.పి. కోదండపాణి | 1962 |
11 | ఏకైక వీరుడు | కావగరాదా కథ వినరాదా కరుణను పతిజాడ | కె. జమునారాణి | ఎస్.పి. కోదండపాణి | 1962 |
12 | ఏకైక వీరుడు | ననుకోర తగదిది వినుమా నా దరి చేర తగదిది | ఎం.ఎల్. వసంత కుమారి | ఎస్.పి. కోదండపాణి | 1962 |
13 | ఏకైక వీరుడు | నాట్యం ఆడు వయారి మయూరి సరిగ మ స్వరముల | ఎస్.పి. కోదండపాణి | ఎస్.పి. కోదండపాణి | 1962 |
14 | ఏకైక వీరుడు | హృదయములు పులకించవో | ఎం. ఎల్. వసంతకుమారి,శీర్గాళి గోవిందరాజన్ | ఎస్.పి. కోదండపాణి | 1962 |
15 | స్వర్ణగౌరి | ఆశలన్నీకలబోసి నేను కలలు కన్నాను నాలో | ఎస్.జానకి | యం. వెంకట్రాజు | 1962 |
16 | స్వర్ణగౌరి | జయమీవే జగదీశ్వరీ కావ్యగాన కళా సాగరీ | ఎస్. జానకి, చిత్తరంజన్ | యం. వెంకట్రాజు | 1962 |
17 | స్వర్ణగౌరి | రసమయ జీవన దీనావనా త్రిభువన పాలన | పి.బి. శ్రీనివాస్, పి. సుశీల | యం. వెంకట్రాజు | 1962 |
18 | స్వర్ణగౌరి | రావే నా చెలియా నీ తళుకు బెళుకు కులుకులతో | పి.బి. శ్రీనివాస్ | యం. వెంకట్రాజు | 1962 |
19 | స్వర్ణగౌరి | రావో జాబిలీ చిన్నారి కన్నెనోయి కన్నారా చూడవోయి | ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ | యం. వెంకట్రాజు | 1962 |
20 | స్వర్ణగౌరి | కరకు ఱాగుండె కాలుని కరుగ జేసి (పద్యం) | యం. వెంకట్రాజు | 1962 | |
21 | స్వర్ణగౌరి | జయ జయ నారాయణ ప్రభో పావన హే లీలా వినోదా | మంగళంపల్లి | యం. వెంకట్రాజు | 1962 |
22 | స్వర్ణగౌరి | తన మగని నత్తమామల జననీ జనకులను (పద్యం) | యం. వెంకట్రాజు | 1962 | |
23 | స్వర్ణగౌరి | దయగనుమా మొర వినుమా పతిని కాపాడవమ్మా | యం. వెంకట్రాజు | 1962 | |
24 | స్వర్ణగౌరి | న్యాయం మారిందా జగతిని ధర్మం మీరిందా | ఎస్.జానకి బృందం | యం. వెంకట్రాజు | 1962 |
25 | స్వర్ణగౌరి | పాలించు ప్రభువుల పసిపాపాలను జేసి (పద్యం) | మంగళంపల్లి | యం. వెంకట్రాజు | 1962 |
26 | స్వర్ణగౌరి | మనసేలా ఈ వేళా రాగాలా తేలేను ఆ వంనేకాని - | ఎస్.జానకి | యం. వెంకట్రాజు | 1962 |
27 | స్వర్ణగౌరి | రష్వ చాలించరా ఓ హౌసుకాడా నవ్వు నవ్వించరా | ఎస్.జానకి బృందం | యం. వెంకట్రాజు | 1962 |
28 | బంగారు తిమ్మరాజు | ఈవింత పులకింత నోలోన కలిగేను నిను కనినంత | ఎస్.జానకి | జి. విశ్వనాథం | 1964 |
29 | బంగారు తిమ్మరాజు | కోడెకారు చినవాడా కొంటెచూపుల మొనగాడా | ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ | జి. విశ్వనాథం | 1964 |
30 | బంగారు తిమ్మరాజు | నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎర ఏసి గురిచూసి | కె.జమునారాణి | జి. విశ్వనాథం | 1964 |
31 | బంగారు తిమ్మరాజు | బలే బలే బలే బాగుంది అలా అలా ఒళ్ళు తేలిపోతోంది | కె.జమునారాణి | జి. విశ్వనాథం | 1964 |
32 | బంగారు తిమ్మరాజు | రాగభోగాల తేలించు దొరవని కోరి పిలిచేనురా | పి.సుశీల బృందం | జి. విశ్వనాథం | 1964 |
33 | బంగారు తిమ్మరాజు | లేడిని సీత చూడకపోతే | మాధవపెద్ది,స్వర్ణలత,శర్మ,పట్టాభి | జి. విశ్వనాథం | 1964 |
34 | బంగారు తిమ్మరాజు | బలదర్పమున దుర్జనుల్ ప్రబలి నీ భక్తాళి భాదింపగా (పద్యం) | పి.బి. శ్రీనివాస్ | జి. విశ్వనాథం | 1964 |
35 | బంగారు తిమ్మరాజు | స్దిరమై ముక్తికి మార్గదర్శకరమై శ్రీమన్మహాలక్ష్మి (పద్యం) | మాధవపెద్ది | జి. విశ్వనాథం | 1964 |
36 | దేవత | అందములోల్కు మోముపై హాసవిలాస మనోజ్ఞరేఖలే (పద్యం) | పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1965 |
37 | దేవత | ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జ్యోతి | ఘంటసాల | ఎస్.పి.కోదండపాణి | 1965 |
38 | దేవత | ఈతడే ట్రాజెడీ యాక్టింగులో కింగ్ హిందీ ఫీల్డ్ (పద్యం) | మాధవపెద్ది | ఎస్.పి.కోదండపాణి | 1965 |
39 | దేవత | కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు | ఘంటసాల,పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1965 |
40 | దేవత | జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని నీవు (పద్యం) | ఘంటసాల | ఎస్.పి.కోదండపాణి | 1965 |
41 | దేవత | తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే | ఘంటసాల,పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1965 |
42 | ఆకాశరామన్న | ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ ఒకే మాట | ఎస్.జానకి, సత్యారావు బృందం | ఎస్.పి.కోదండపాణి | 1965 |
43 | ఆకాశరామన్న | ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడవోయి నీ ఎదుట | ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ | ఎస్.పి.కోదండపాణి | 1965 |
44 | ఆకాశరామన్న | చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది జువ్వుమని నరాలన్నీ | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
45 | ఆకాశరామన్న | జలగలా పురషుల జవసత్వములు పీల్చి వేదించి (పద్యం) | మాధవపెద్ది | ఎస్.పి.కోదండపాణి | 1965 |
46 | ఆకాశరామన్న | డుంకు డుంకు ఓ పిల్లా డుంకవె డుంకవె ఇల్లాలా | మాధవపెద్ది,ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
47 | ఆకాశరామన్న | తళుకు బెళుకులు చూపించి ధర్మరాజువంటి రాజును (పద్యం) | బి. గోపాలం | ఎస్.పి.కోదండపాణి | 1965 |
48 | ఆకాశరామన్న | తేనె పూసిన కత్తి నీ దేశభక్తి వంచనలపుట్ట నీ పొట్ట (పద్యం) | బి. గోపాలం | ఎస్.పి.కోదండపాణి | 1965 |
49 | ఆకాశరామన్న | దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి ఉరికి ఉరికి | పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
50 | ఆకాశరామన్న | నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
51 | ఆకాశరామన్న | నీకోసం ఏమైనా ఐపోని నా నాట్యం నా గానం నా సర్వం నీకే వశమోయీ | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
52 | ఆకాశరామన్న | మంచిగా నిధిని కాజేయ కాచుకున్నకొంగ గజదొంగ (పద్యం) | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1965 |
53 | ఆకాశరామన్న | ముత్యమంటి చిన్నదాని మొగలిరేకు వన్నెదాని మొగమాటం | ఎస్.జానకి బృందం | ఎస్.పి.కోదండపాణి | 1965 |
54 | శ్రీమతి | మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ | పిఠాపురం, స్వర్ణలత | ఎస్.పి.కోదండపాణి | 1966 |
55 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | ఆవోరెమియ్యా దేఖోరెజియ్యా జరా ఠైరో | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1966 |
56 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | ఇలాగే ఇలాగే ఉండనీ హృదయములే పరవశమై | పి.సుశీల,ఘంటసాల | ఎస్.పి.కోదండపాణి | 1966 |
57 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | ఓ పిల్లా నీ మనసేమన్నది బ్రతుకంతా నవ్వాలంటూ | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1966 |
58 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | చూశావా నాన్న కను మూశావా నాన్నా నిన్న నమ్మిన | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1966 |
59 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | దారికాచి వీలుచూచి కాచు | పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి, పిఠాపురం, మాధవపెద్ది | ఎస్.పి.కోదండపాణి | 1966 |
60 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | దొరలా తిరుగుతూ దొరకని దొంగలు మనలో | పిఠాపురం, మాధవపెద్ది | ఎస్.పి.కోదండపాణి | 1966 |
61 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | పందొమ్మిదొందల యాభై మోడల్ అమ్మాయీ | ఎస్.జానకి, ఘంటసాల | ఎస్.పి.కోదండపాణి | 1966 |
62 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | యైరా ఎంకన్న దొర | ఎస్.జానకి,శీర్గాళి గోవిందరాజన్,పిఠాపురం,పట్టాభి | ఎస్.పి.కోదండపాణి | 1966 |
63 | లోగుట్టు పెరుమాళ్ళకెరుక | ఓ బంగారు పంజరంలో చిక్కావే | పి.బి.శ్రీనివాస్,మాధవపెద్ది బృందం | ఎస్.పి.కోదండపాణి | 1966 |
64 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | ఆకారమిచ్చిన ఆశిల్పి సూరన్నతలపగా (పద్యం) | పిఠాపురం | ఎస్.పి.కోదండపాణి | 1967 |
65 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | ఓ ఏమి ఈ వింత మొహం ఏమి | కె.రఘురామయ్య,పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఎస్.పి.కోదండపాణి | 1967 |
66 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | ఓహో అందాల చిలకుంది అందర్ని రమ్మంది కులికీ పలికింది | ఎస్.జానకి | ఎస్.పి.కోదండపాణి | 1967 |
67 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | చఱ్ఱున చఱ్ఱు చఱ్ఱుమని సాగిలి కోయగ పుట్టెనంట (పద్యం) | పిఠాపురం | ఎస్.పి.కోదండపాణి | 1967 |
68 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | నీవే నీవే నా దైవము నీవే నీవే నా భాగ్యము | పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1967 |
69 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | భోగిని యోగిచేయు సురభోగములు చవిచూసి (పద్యం) | మాధవపెద్ది | ఎస్.పి.కోదండపాణి | 1967 |
70 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | మంగిడీలు మంగిడీలు ఓ పూలభామ సిన్నారి సిలకమ్మ | పిఠాపురం,పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1967 |
71 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | విశ్వమ్ము కంటెను విపులమైనది ఏది (సంవాద పద్యాలు ) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1967 |
72 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | వెన్నెల ఉందీ వేడిమి ఉందీ మరులు రేగెను నాలోన | కే.జే. యేసుదాస్, పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి | 1967 |
73 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు కరుణతో నినుసదా (పద్యం) | కె. రఘురామయ్య | ఎస్.పి.కోదండపాణి | 1967 |
74 | శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న | సెబితే శానా ఉంది యింటే ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా | టి.ఎం. సౌందర్ రాజన్ | ఎస్.పి.కోదండపాణి | 1967 |
75 | చిక్కడు దొరకడు | కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో | పి.సుశీల | టి.వి.రాజు | 1967 |
76 | రాజయోగం | ఈ సమయం ఏమిటో ఈ మైకం వనకీ చిలిపితనం | పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి | సత్యం | 1968 |
77 | రాజయోగం | ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం | 1968 |
78 | రాజయోగం | కాదులే కల కాదులే ఔనులే నిజమౌనులే | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం | 1968 |
79 | రాజయోగం | తాళం వేయాలి లోకం ఊగాలి కవ్వించే నా ఆటలో నా రూపులో | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం | 1968 |
80 | రాజయోగం | నచ్చినవాడు మనసిచ్చినవాడు నీ చెంతచేరి లాలిస్తే | ఎస్.జానకి,లత | సత్యం | 1968 |
81 | రాజయోగం | రావోయి నిన్నే పిలిచాను నీకై వేచాను యుగయుగాల | లత | సత్యం | 1968 |
82 | రాజయోగం | లక్ష్మీమహీతదనురూపా నిజానుభావా నీలాది దివ్య (శ్లోకం) | పి.సుశీల | సత్యం | 1968 |
83 | రాజయోగం | సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా రారా | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం | 1968 |
84 | వీర పూజ | కొనుమా సరాగమాల నిలిచేను నీదు మ్రోల | పి.సుశీల, ఘంటసాల | ఘంటసాల | 1968 |
85 | వీర పూజ | ఠింగు బటాణీ చెయ్యవె బోణీ కొత్త రకం సరుకు | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి | ఘంటసాల | 1968 |
86 | వీర పూజ | ప్రియమైన ప్రేమ పూజారి పెనుచీకటైన నా ఆలయాన | పి.సుశీల | ఘంటసాల | 1968 |
87 | కదలడు వదలడు | ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారం | ఘంటసాల బృందం | టి.వి.రాజు | 1969 |
88 | కదలడు వదలడు | బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా సౌఖ్యమేనా | ఘంటసాల, పి.సుశీల | టి.వి.రాజు | 1969 |
89 | సప్తస్వరాలు | జయ జయ మహా రుద్ర ( దండకం ) | ఎ.వి.ఎన్.మూర్తి బృందం | టి.వి.రాజు | 1969 |
90 | సప్తస్వరాలు | యదుబాల శ్రితజనపాల దరిశనమీవయ గోపాల | ఘంటసాల బృందం | టి.వి.రాజు | 1969 |
91 | సప్తస్వరాలు | సా సకల ధర్మాలలో ( సంవాద పద్యాలు) | విజయలక్ష్మి కన్నారావు, ఘంటసాల | టి.వి.రాజు | 1969 |
92 | సప్తస్వరాలు | హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జేజేలు | పి.బి.శ్రీనివాస్, ఘంటసాల | టి.వి.రాజు | 1969 |
93 | రాజసింహ | అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | సత్యం | 1969 |
94 | రాజసింహ | ఏటేట జాతరచేసి ఏడుపుట్ల కుంభం పోసి | మాధవపెద్ది, రఘురాం,మూర్తి బృందం | సత్యం | 1969 |
95 | రాజసింహ | ఓ సింకిరిబంకిరి సిన్నోడా ఓ వంకర టింకర వన్నెకాడా | స్వర్ణలత బృందం | సత్యం | 1969 |
96 | రాజసింహ | కోరికల గువ్వ మొహాల మువ్వ బంగారుగవ్వ రంగేళి రవ్వ | ఎస్.జానకి | సత్యం | 1969 |
97 | రాజసింహ | నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | సత్యం | 1969 |
98 | రాజసింహ | నిదుర కన్నెలు నీతో ఆటాడే వేళ నీతల్లి పాడేరా కన్నీటి జోల | ఎస్.జానకి | సత్యం | 1969 |
99 | శ్రీరామకథ | ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి కూడె నీ బుద్ధిశాలి (పద్యం) | ఘంటసాల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
100 | శ్రీరామకథ | ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఎస్.పి. కోదండపాణి | 1969 |
101 | శ్రీరామకథ | జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) | ఘంటసాల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
102 | శ్రీరామకథ | టింగురంగా | పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,పద్మనాభం,రామకృష్ణ | ఎస్.పి. కోదండపాణి | 1969 |
103 | శ్రీరామకథ | మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి | ఘంటసాల,పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
104 | శ్రీరామకథ | రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల | పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
105 | శ్రీరామకథ | శౌరిపై గల నాప్రేమ సత్యమేని కలను సైతము అన్యుల (పద్యం) | పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
106 | శ్రీరామకథ | సర్వకళాసారము నాట్యము నయన మనోహరము | పి.సుశీల, ఎస్.జానకి, లహరి | ఎస్.పి. కోదండపాణి | 1969 |
107 | శ్రీరామకథ | ఓం మదనాయ శృంగార సదనాయ (శ్లోకం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ఎస్.పి. కోదండపాణి | 1969 |
108 | శ్రీరామకథ | చక్కనివాడు మాధవుడు చల్లని కన్నులవాడు (పద్యం) | పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
109 | శ్రీరామకథ | యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టిస్తతో మన: (శ్లోకం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
110 | శ్రీరామకథ | రాగమయం అనురాగమయం యీ జగమే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
111 | శ్రీరామకథ | శృంగార రస సందోహమ్ శ్రితకల్ప మహీరుహుమ్ (శ్లోకం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల | ఎస్.పి. కోదండపాణి | 1969 |
112 | పగసాధిస్తా | ఈబిగువు ఈ తగవు కొత్తది కాదయ్యా మగువల మనసు | పి.సుశీల | సత్యం | 1970 |
113 | పిల్లా? పిడుగా? | జమ్మాలకిడి జమ్మా ఇది గుమ్మాలకిడి గుమ్మా | ఎల్. ఆర్. ఈశ్వరి | సత్యం | 1972 |
114 | మావూరి మొనగాళ్ళు | పెగ్గు వేసుకో నిగ్గు చూసుకో మత్తులోనే మజా చేసుకో | ఎల్. ఆర్. ఈశ్వరి | సత్యం | 1972 |
115 | మావూరి మొనగాళ్ళు | వెలిగించు క్రాంతి జ్యోతి పలికించు విరహగీతి | పి.సుశీల | సత్యం | 1972 |
116 | మావూరి మొనగాళ్ళు | హై నా జిలిబిలి తళుకుల పొంకం హే కావాలా | ఎల్. ఆర్. ఈశ్వరి | సత్యం | 1972 |
117 | భక్త తుకారాం | చిందులు వేయకురా శ్రీరంగ నీతులు చెప్పకురా తెలిసి | ఘంటసాల బృందం | పి.ఆదినారాయణ రావు | 1973 |
118 | భక్త తుకారాం | బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే | ఘంటసాల | పి.ఆదినారాయణ రావు | 1973 |
119 | భక్త తుకారాం | రంగని సేవ జేయుచు విరాగిగా నుండెడు విప్రదాసు (పద్యం) | ఘంటసాల | పి.ఆదినారాయణ రావు | 1973 |
120 | భక్త తుకారాం | వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు పన్ని (పద్యం) | ఘంటసాల | పి.ఆదినారాయణ రావు | 1973 |
121 | భక్త తుకారాం | వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని రతనాలు (పద్యం) | ఘంటసాల | పి.ఆదినారాయణ రావు | 1973 |
122 | ఇదాలోకం | గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు | ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి | చక్రవర్తి | 1973 |
123 | గుండెలు తీసిన మొనగాడు | ఆరని జ్వాలా నా తాపము సుడిగాలి జోల నా గానమూ | ఎస్.జానకి | చక్రవర్తి | 1974 |
124 | మన్మథలీల | కుశలమేనా కుర్రదానా నీ హృదయం శాంతించెనా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | చక్రవర్తి | 1976 |
125 | మన్మథలీల | ఫట్ ఫట్ ఛట్ ఛట్ నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడూ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చక్రవర్తి | 1976 |
126 | మన్మథలీల | మన్మధలీలా మధురము కాదా మనస్సునరేపే తీయని బాధ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చక్రవర్తి | 1976 |
127 | మన్మథలీల | హల్లో మైడియర్ రాంగ్ నెంబర్ గొంతుకే వింటే ఎంత మధురం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి | చక్రవర్తి | 1976 |
128 | యమగోల | గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు | పి.సుశీల | చక్రవర్తి | 1977 |
129 | వయసు పిలిచింది | మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే.. | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఇళయరాజా | 1978 |
130 | మల్లెపూవు | చక చక సాగే చక్కని బుల్లెమ్మ మిస మిసలాడే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | చక్రవర్తి | 1978 |
131 | మల్లెపూవు | నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా | వాణి జయరాం బృందం | చక్రవర్తి | 1978 |
132 | దేవదాసు మళ్ళీ పుట్టాడు | దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చక్రవర్తి | 1978 |
133 | చిరంజీవి రాంబాబు | అమ్మ అన్నమాట కమ్మనైన పాట | పి.సుశీల | జె.వి.రాఘవులు | 1978 |
134 | చిరంజీవి రాంబాబు | ఏడనో పుట్టింది ఏడనో తిరిగింది ఏడనో కలిసింది గోదారి | జె.వి.రాఘవులు | జె.వి.రాఘవులు | 1978 |
135 | చిరంజీవి రాంబాబు | నీనామమెంతో మధురము కాదా పావనమైనది నీ గాధా | పి.సుశీల | జె.వి.రాఘవులు | 1978 |
136 | ఎర్ర గులాబీలు | ఎదలో తొలి వలపే విరహం జత కలిసే, మధురం ఆ తలుపే నీ పిలుపే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | ఇళయరాజా | 1979 |
137 | అమర గీతం | నెలరాజా! పరుగిడకు.. చెలి వేచే నా కొరకూ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఇళయరాజా | 1979 |
138 | పట్నం పిల్ల | పయనించే చిరుగాలి నా చెలి సన్నిధికే చేరి నా పిలుపే వినిపించాలి | చక్రవర్తి | 1980 | |
139 | జగద్గురు ఆది శంకరాచార్య | త్రిపుర సుందరీ,దర్శన లహరీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వి.దక్షిణామూర్తి, జె.వి.రాఘవులు | 1981 |
140. విజయం మనదే . ఏలుకొరా
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.