భక్త తుకారాం
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
భక్త తుకారాం (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, శివాజీ గణేశన్, నాగభూషణం, కాంచన, ధూళిపాళ, సాక్షి రంగారావు, జి. రామకృష్ణ, భాను ప్రకాష్ |
సంగీతం | పి.ఆదినారాయణరావు |
నిర్మాణ సంస్థ | అంజలి పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథాస్థానం మహారాష్ట్రలో దేహూ గ్రామం. కథాకాలం పదిహేడవ శతాబ్దపు తొలి అర్థం. భక్తి ఉద్యమ కాలం.
తుకారాం పాండురంగడికి మహాభక్తుడు. భార్య ఇద్దరు బిడ్డలతో సంసారి. భక్తునిగా అతని గుర్తింపు, గొప్ప భక్తునిగా చెప్పుకుంటూ ఇద్దరు శిష్యులతో గ్రామాన్ని మోసం చేస్తున్న కుంభోజీ (?) కి ఇబ్బంది కలిగిస్తుంది. తుకారాం ప్రాభవన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అతనిపై వేశ్యను ప్రయోగిస్తాడు. ఆమె తుకారాం భక్తురాలిగా మారిపోతుంది. శూద్రుడైన తుకారాం వ్రాసిన అభంగాలు హైందవ సంప్రదాయానికి విరుద్ధమని వాటిని నాశనం చేయాలని పీఠాధిపతితో చెప్పిస్తాడు కుంభోజి. ఎంతో శ్రమతో కూర్చిన అభంగాలు నీటిపాలు కావటంతో కలత చెందిన తుకారాం నది ఒడ్డునే నిద్ఫ్రాహారాలు మాని ఉండి పోతాడు. దివ్య శక్తి అభంగాలలు తిరిగి ప్రసాదించగా ఆనందపరవశుడౌతాడు. తుకారాం పట్ల నిర్దయగా ఉన్న పీఠాధిపతి సైతం తుకారాం భక్తిని తెలుసుకుంటాడు. కుంభోజి ఆలయంలోని పాండురంగని విగ్రహాన్ని నూతిలో పడవేసి, సూద్రుడైన తుకారాం చర్యల్ని భరించలేని పాండురంగడు గుడి నుండి వెళ్ళిపోయాడని ప్రచారం చేస్తాడు. అదే విషయాన్ని శివాజీ మహారాజుకు ఫిర్యాదు చేస్తాడు. ఇదివరలో తుకారాం గురించి విన్న శివాజీ అతనికి కానుకలు పంపగా తుకారాం తిరస్కరించి ఉన్నాడు. అతణ్ణి పరిశీలించే దృష్టితో శివాజీ ఫిర్యాదును విచారించే నిమిత్తం తుకారాం దగ్గరకు వస్తాడు. శివాజీ చూస్తుండగానే పాండురంగని విగ్రహం తిరిగి ఆలయంలో ప్రత్యక్షం ఔతుంది. ఈ లోపులో కుంభోజీ అందించిన సమాచారంతో, శివాజీ శత్రువులు అసన్నధంగా ఉన్న శివాజీను చుట్టుముట్టుతారు. తుకారాం కోరిక మేరకు పామ్దురంగడు అనేక శివాజీ మూర్తులుగా శత్రువుల్ని తుదముట్టిస్తాడు. శివాజీ తుకారాం భక్తి తత్పరతకు పరవశుడై తనను శిష్యునిగా స్వీకరించమంటాడు. క్షాత్రమున్నవారు రాజ్యాన్ని రక్షించాలని శివాజీకి తెలియజేస్తాడు.
సంసారిగా ఉంటూ, తన కర్తవ్యాలన్నిటినీ నెరవేరుస్తూనే, అధ్యాత్మికతను కూడా కొనసాగించడం, తుకారాం ప్రత్యేకత అని మహావిష్ణువు లక్ష్మికి తెలియజేసి అతని కోసం గరుడ వాహనాన్ని పంపి తన వాద్దకు రప్పించుకుంటాడు.
చిత్రంలో సింహభాగం హంపీ నగరం,తుంగభద్ర నదీ పరిసరాల్లో చిత్రీకరించబడింది.అనేక ఫ్రేముల్లో హంపీ విరూపాక్ష దేవాలయం కాన వస్తుంది.పండరిపురంలోని ఆలయానికి,విరూపాక్ష ఆలయానికి వాస్తు రీత్యా చాలా వ్యత్యాసంఉంది.
నటి శ్రీదేవి తుకారాం కూతురిగా కనిపిస్తుంది. లవకుశలో నటించిన నాగరాజు మహావిష్ణువుగా నటించారు. గాయకుడు వి.రామకృష్ణ, ఘంటశాల అనారోగ్య కారణంగా ఈ చిత్రంలో పాటలు పాడే అవకాశం పొందారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్వతహాగా వామపక్ష భావాలు కలిగినవాడు. ఆస్తికత్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు ఉంటాయి. ఉదా: పీఠాధిపతితో తుకారాం సంభాషణ.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
సరిసరి వగలు తెలిసెర గడుసరి | పి.ఆదినారాయణ రావు | పి.సుశీల | |
కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం | పి.ఆదినారాయణ రావు | బాలు | |
ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా | ఆత్రేయ | పి.ఆదినారాయణ రావు | ఘంటసాల |
కరుణామయా దేవా | పి.ఆదినారాయణ రావు | వి.రామకృష్ణ | |
పడవెళ్ళీ పోతుందిరా | పి.ఆదినారాయణ రావు | వి.రామకృష్ణ | |
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో అది మధురమధుర మధురమౌ ఓంకారమో | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పి.ఆదినారాయణ రావు | ఘంటసాల |
భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు | వీటూరి | పి.ఆదినారాయణ రావు | ఘంటసాల |
పిలుపు వినగలేవా నీగుడికి తిరిగిరావా | వీటూరి? | పి.ఆదినారాయణ రావు | జి. రామకృష్ణ |
పూజకు వేళాయెరా | వీటూరి(?) | పి.ఆదినారాయణ రావు | సుశీల,ఘంటసాల |
రంగని సేవ చేయుచు (పద్యం) వీటూరి.ఘంటసాల.
వనిత కవితయు వలచి రావలెనే (పద్యం) వీటూరి . ఘంటసాల.
వన్నె తరగని వజ్రాలు వీటూరీ . ఘంటసాల .
చిందులు వేయకురా . ఘంటసాల...
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.