అంజలీ పిక్చర్స్

From Wikipedia, the free encyclopedia

అంజలీ పిక్చర్స్

అంజలీ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు, అతని భార్య సినిమా నటి అంజలీదేవి.[1] వీరి సంతానం పేరిన స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్ పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు. అంజలీదేవి తన భర్త ఆదినారాయణరావుతో కలసి సొంత నిర్మాణ సంస్థ 'అంజలీ పిక్చర్స్'ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించింది. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం  వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. [2]

త్వరిత వాస్తవాలు పరిశ్రమ, స్థాపకుడు ...
అంజలీ పిక్చర్స్
పరిశ్రమఎంటర్‌టైన్‌మెంట్
స్థాపకుడుపి.ఆదినారాయణరావు
అంజలీదేవి
ప్రధాన కార్యాలయం
భారతదేశం
ఉత్పత్తులుసినిమాలు
సేవలుసినిమా ప్రొడక్షన్
మూసివేయి
Thumb
అంజలీ పిక్చర్స్ నిర్మించిన మేటి చిత్రం అనార్కలి పోస్టర్.

తొలుత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు ‘మాయలమారి/ మాయక్కారి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాడు. తరువాత 1951లో తన భార్య అంజలీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించాఫు. తరువాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించాడు.[3]

1953 లో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా పరదేశి ను నిర్మించారు. తరువాత 1955లో "అనార్కలి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు.[4]

నిర్మించిన సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.