From Wikipedia, the free encyclopedia
వాషింగ్టన్, డి.సి. (English: Washington, D.C.) పూర్తి పేరు వాషింగ్టన్, కొలంబియా జిల్లా (Washington, District of Columbia; వాషింగ్టన్, డిస్ట్రిక్ (డి) ఆఫ్ కొలంబియా (సి)) అమెరికా సంయుక్త రాష్ట్రా రాజధాని. ఈ పేరు ఆ దేశంలో ఏర్పడిన అమెరికా విప్లవానికి నాయకత్వం పోషించి నడిపించిన సైనిక నాయకుడు జార్జి వాషింగ్టన్ జ్ఞాపకార్థం పెట్టబడింది. అమెరికాలో చాలా నగరాలు వాషింగ్టన్ అని పేరు పెట్టడం వల్లన దీనిని గుర్తించడానికి పూర్వపు పేరైన కొలంబియా జిల్లా ( కొలంబియా జిల్లా ) యొక్క సంక్షిప్త రూపం (DC-డిసి) గా అణిచి పిలుస్తారు. ఈ నగరం కోసం స్థలం జార్జి వాషింగ్టన్ చేత ఎంపిక చేయబడింది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వాషింగ్టన్, డి.సి. | |
---|---|
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా | |
Motto: Justitia Omnibus (Justice for All) | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
సంయుక్త జిల్లా | డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా |
Approved | July 16, 1790 |
Organized | 1801 |
Consolidated | 1871 |
Granted limited self-government | 1973 |
Named for | జార్జి వాషింగ్టన్ |
Government | |
• Mayor | Vincent C. Gray (D) |
• D.C. Council | Kwame R. Brown (D), Chair |
విస్తీర్ణం | |
• ఫెడరల్ డిస్ట్రిక్ట్ | 177.0 కి.మీ2 (68.3 చ. మై) |
• Land | 159.0 కి.మీ2 (61.4 చ. మై) |
• Water | 18.0 కి.మీ2 (6.9 చ. మై) |
Elevation | 0–125 మీ (0–409 అ.) |
జనాభా (2011 estimate) | |
• ఫెడరల్ డిస్ట్రిక్ట్ | 6,17,996 (24th in U.S.) |
• జనసాంద్రత | 3,886/కి.మీ2 (10,065/చ. మై.) |
• Metro | 5.58 million (7th in U.S.) |
• Demonym | Washingtonian |
Time zone | UTC-5 (EST) |
• Summer (DST) | UTC-4 (EDT) |
ZIP code(s) | 20001-20098, 20201-20599 |
ప్రాంతపు కోడ్ | 202 |
Website | www.dc.gov |
వాషింగ్టన్ డి.సి పోటోమాక్ నది ఒడ్డున ఉంది. వర్జీనియా, మేరీల్యాండ్ రాష్ట్రాల నుండి పొందిన స్థలం ద్వారా ఈ నగరం స్థాపించబడింది. అయినప్పటికీ 1847 లో పోటోమాక్ నదికి దక్షిణన వున్న వర్జీనియా చెందిన ప్రాంతాలను వర్జీనియా నుండి అందుకుంది. అవి అర్లింగ్టన్ కౌంటీ & అలెగ్జాండరియా నగరంతో అనుసంధానింపబడి ఉంది. ప్రస్తుతం ఉన్న వాషింగ్టన్ డి.సి మెర్రి లెండ్ రాష్ట్రం నుండి లభించిన స్థలంలోనే ఉంది. పశ్చిమాన వర్జీనియా, తూర్పున, దక్షిణమున, ఉత్తరాన మెర్రి లెండ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
ఫెడరల్ ప్రభుత్వ విభాగాలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అమెరికా రాష్ట్రాల స్థాపణ (OAS), కాంగ్రెస్ అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయశాల వంటి అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి. పలు జాతీయ స్మారక చిహ్నాలకు మ్యూజియంలకు వాషింగ్టన్ పుట్టినిల్లు. ఇవి ప్రధానంగా నేషనల్ మాల్ చుట్టుపక్కల ఉన్నాయి. నగరంలో 176 అంతర్జాతీయ దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. అంతేకాక అనేక అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య సంఘాలు, సేవా సంస్థలు, మధ్యవర్తిత్వ బృందాలు, వృత్తి పరమైన సహకారసంఘాలు ఈ నగరంలోనే ఉన్నాయి.
నగరప్రజల చేత ఎన్నుకొనబడిన మేయర్, 13 మంది సభ్యులు కలిగిన కౌన్సిల్ 1973 నుండి నగర పాలనా నిర్వహణ చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నగరం మీద అలాగే ప్రాంతీయ చట్టవ్యవహారాల మీద ఉన్నతాధికారాలను కలిగి ఉంది. జిల్లాకు ఎన్నుకొనబడని కాంగ్రెస్ ప్రతినిధి ఉంటాడు. కాని సెనేటర్లు ఉండరు. సంయుక్త రాష్ట్రాల 23వ రాజ్యాంగ సవరణ తరువాత 1963 నుండి నగరానికి అధ్యక్షుడి ఎన్నికలో మూడు ఎన్నుకొనగలిగిన ఓట్లు మంజూరు చేయబడ్డాయి.
17వ శతాబ్దంలో మొదటి యురేపియన్లు ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆల్గొంక్వియన్ మాట్లాడే ప్రజలు నాకోట్చంక్ అని పిలువబడే వారు ఇక్కడ ఉన్న అనకోస్టియా నది పరిసర ప్రాంతంలో నివసించినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ ఆల్గొంక్వియన్ ప్రజలు అత్యధికంగా ఇక్కడ నుండి 18వ శతాబ్దంలో ఇక్కడి నుండి వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. జేమ్స్ మేడ్సన్ తన వ్యాసం ఫెడరలిస్ట్ నంబర్ 43 లో కొత్త ఫెడరల్ ప్రభుత్వం తన స్వీయ రక్షణ కొరకు దేశరాజధాని మీద తగినంత అధికారం స్వంతం చేసుకోవలసిన అవసరం ఉంది అని సూచించాడు. ఐదు సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ సభ్యులు ఫిలడెల్ఫియా,పెన్సిల్వేనియాలో సమావేశంలో ఉన్న సమయంలో జీతభత్యాలు లేని సైకుల బృందం చేత నిర్భంధించబడ్డారు. పెంసిల్వేనియా తిరుగుబాటుగా గుర్తించబడిన ఈ సంఘటన 1883లో జరిగింది. ఈ సంఘటన జాతీయ ప్రభుత్వం తన రక్షణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తెలియజేసింది.
సంయుక్తరాష్ట్రాల రాజ్యంగం ఆర్టికల్ వన్, సెక్షన్ ఎయిట్ 10 చదరపు మైళ్ళకు మించకుండా ఒక జిల్లాను స్థాపించడానికి అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ అనుమతితో కొన్ని ప్రత్యేక రాష్ట్రాల అంగీకారంతో స్థాపించబడిన ఈ జిల్లా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగ వ్యవస్థలో ఒక స్థానం అయింది. అయినప్పటికీ రాజ్యాంగం ఒక ప్రత్యేక ప్రదేశాన్ని రాజధానికి సూచించ లేదు. మేడిసన్, అలెగ్జాండర్, హామిల్టన్, జెఫర్సన్ కలిసి 1779లో ఒక రాజీకి వచ్చి జెఫర్సన్ ఫెడరల్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాకు ఉన్న తిరుగుబాటు యుద్ధ ౠణాలను రద్దుచేయాలని ప్రతిగా తాము దక్షిణ సంయుక్తరాష్ట్రంలో రాజధానికి కావలసిన ప్రదేశం ఇవ్వాలని నిర్ణయించారు.
1790 జూలై 9 కాంగ్రెస్ పొటోమేక్ నదీతీరాన రాజధాని నగరాన్ని నిర్మించడానికి అనుమతిస్తూ రెసిడెన్స్ చట్టాన్ని వెలువరించింది. నగర నిర్మాణానికి అవసరమైన ప్రదేశాన్ని అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చేత నిర్ణయించబడింది. అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఈ శాననాన్ని అమలుకు తీసుకువచ్చే శాసనం మీద జూలై 16 తేదీన సంతకం చేసాడు. నగర రూపకల్పనకు అవసరమైన భూమిని మేరీల్యాండ్ వర్జీనియా చందాగా ఇచ్చింది. రాజధాని జిల్లా మొదటి స్థాయిలో ఒక్కోవైపు 10 చదరపు మైళ్ళ భూమిలో మొదలైంది. అంటే మొత్తం 100 చదరపు మైళ్ళు.
ఈ భూమిలో ముందుగా రెండు ఒపాందాలు జరిగి ఉన్నాయి. మేరీలాండులో ఉన్న జార్జ్ ఫోర్ట్ 1775లో నిర్మించబడింది. అలెగ్జాండ్రియా, వర్జీనియా 1949లో స్థాపించబడ్డాయి. 1971-92 ఆండ్ర్యూ ఎలికాట్ ఆఫ్రికన్ అమెరికన్ జ్యోతిష్కుడైన బెంజిమిన్ బన్నేకర్తో కలసి ఫెడరల్ జిల్లా సరిహద్దులను పరిశీలించి సరిహద్దు రాళ్ళను ప్రతి మైలుకు వేయించాడు. అనేక మైలురాళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి.
జార్ఝ్ టౌన్‌కు తూర్పుగా పొటోమేక్ నదికి ఉత్తర తీరంలో 1791 సెప్టెంబరు 9 తేదీన ఒక కొత్త ఫెడరల్ నగరం నిర్మించబడింది. అధ్యక్షుడు వాషింగ్టన్‌ను గౌరవిస్తూ రాజధాని నగర నిర్మాణాలను ముగ్గురు కమీషనర్లు పర్యవేక్షించారు. ఫెడరల్ జిల్లాకు ఆ సమయంలో సంయుక్తరాష్ట్రాలకు సాధారణంగా వాడుకలో ఉన్న కొలంబియా అనే పేరును ఫెడరల్ జిల్లాకు పెట్టారు. 1800 నవంబరు 17 న కాంగ్రెస్ తన మొదటి సమావేశాన్ని వాషింగ్టన్లో జరిపారు.
1801లో కాంగ్రెస్ ఆర్గానిక్ చట్టం అమలులోకి తీసుకువచ్చిన తరువాత జిల్లా, పూర్తి భూభాగం ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. నగర పాలనలోకి చేర్చని మిగిలిన భూభాగాన్ని పోటోమేక్ నదికి తూర్పున వాషింగ్టన్ పడమరన అలెంగ్జాండ్రియా అనే రెండు కౌంటీలుగా చేసారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇక్కడ నివసించే పౌరులను మేరీల్యాండ్ లేక వర్జీనియా వాసులుగా పరిగణించ లేదు.
1814 ఆగస్టు 24-25న బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్ పేరుతో ఒక దాడి జరిగింది. 1812 యుద్ధంలో బ్రిటిష్ సైన్యం రాజధాని మీద దండెత్తింది. ఈ దాడిలో రాజధాని, ఖజానా, వైట్‌హౌస్ నిప్పంట్టించి కాలచబడ్డాయి. అతిత్వరగా అనేక ప్రభుత్వ భవనాలు దగ్ధం అయ్యాయి. అయినప్పటికీ ఆసమయంలో రాజధాని నగరం అధికంగా నిర్మాణదశలో ఉన్నది నగరాన్ని 1868 వరకూ నగరాన్ని ప్రస్తుత స్థితికి తీసుకురాలేక పోయారు.
1830 అలెగ్జాండ్రియా నుండి తీసుకున్న జిల్లాలోని దక్షిణభాగం ఆర్థికపతనాన్ని చవి చూసింది. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కొంతకారణం అయితే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు కాంగ్రెస్‌లో ఉన్న బానిసత్వవాణిజ్య వ్యతిరేకులు (అబాలిషనిస్టులు) జిల్లాలో బానిసత్వానికి ముగింపు తీసుకు వస్తారని భయాందోళనకు గురికావడం కూడా అందుకు మరొక కారణం. అలెగ్జాండ్రియా వాసులు వర్జీనియా నుండి పొందిన భూభాగాన్ని తిరిగి తీసుకొమ్మని అభ్యర్ధన చేసారు. ఈ ప్రక్రియను రిస్టోరేషన్ (తిరిగి ఇచ్చివేయడం) అని వర్ణించబడింది.
రాష్ట్ర శాసనసభ 1846లో భూములను తిరిగి అలెగ్జాండ్రియాకు ఇచ్చి వేయడానికి అనుకూలంగా 1846 జూలై 9న ఓటు వేసారు. వర్జీనియా నుండి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. అందువలన ప్రస్తుత నగరం పూర్తిగా మేరీల్యాండ్‌కు చెందినదే. బానిస వ్యాపారానికి అనుకూలురైన అలెగ్జాండ్రియా వాసుల భయాన్ని నిర్ధారణ చేస్తూ 1850లో జిల్లానుండి బానిసవ్యాపారం పూర్తిగా తీసివేయబడింది.
1861లో ఉప్పొంగిన అమెరికన్ అంతర్యుద్ధం జిల్లా జనసంఖ్యను గుర్తించతగినంతగా పెంచింది. ఫెడరల్ ప్రభుత్వ విస్తరణ సమయంలో స్వతంత్రం పొందిన బానిసలు ప్రవాహంలా జిల్లాలోకి ప్రవేశించారు. 1862లో ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కాంపెంసేటెడ్ ఎమాంసిపేషన్ చట్టం మీద సంతకం చేసాడు. ఇందు వలన జిల్లాలో బానిసత్వానికి ఒక ముగింపు వచ్చి 3,100 మంది బానిసత్వం నుండి విముక్తి ప్రకటనకు 9 మాసాలకు ముందుగా విముక్తులు అయ్యారు. 1868 లో కాంగ్రెస్ ఆఫ్రికన్ అమెరికన్ పురుషులకు పురపాలక వ్యవస్థలో ఓటు వేయడానికి హక్కును ఇచ్చారు.
1870 నాటికి నగర నివాసుల సంఖ్య ముందున్న 132,000 నుండి 75% అభివృద్ధి చెందింది. నగరాభివృద్ధి ఒక వైపు జరుగుతున్నా వాషింగ్టన్ రహదార్లు ఇంకా దుమ్ము కమ్ముకుని పారిశుద్ధ లోపంతో మిగిలి పోయాయి. కొంత మంది కాంగ్రెస్ వారు రాజధానిని మరికొంత పడమరగా మార్చాలని ప్రతిపాదించాౠ కాని అధ్యక్షుడు ఉలిస్సెస్ ఎస్.గ్రాంట్ అటువంటి ప్రతిపాదనలను నిరాకరించాడు. 1871లో కాంగ్రెస్ ఆర్గానిక్ చట్టం అమలుకు తీసుకు వచ్చిన తరువాత వాషింగ్టన్, జార్జ్ టౌన్ వ్యక్తిగత అధికార పత్రాలు రద్దు మొత్తం కొలంబియా జిల్లాలో కొత్త ప్రభుత్వ భూభాగం లభించింది. అధ్యక్షుడు గ్రాంట్ అలెగ్జాండర్ రొబే షిప్పర్డ్ను గవర్నర్‌గా నియమించాడు. షిప్పర్డ్ చేపట్టిన బృహత్తర ప్రణాళికలు నగరాన్ని ఆధునిక స్థితికి తీసుకు వచ్చాయి. అయినప్పటికీ చివరకు జిల్లా ప్రభుత్వం దివాలా స్థితికి చేరుకుంది. 1874లో కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వానికి ప్రత్యామ్నానంగా ముగ్గురు సభ్యులు కలిగిన బోర్డ్ ఆఫ్ కమీషనర్లతో ప్రభుత్వాన్ని మార్చి వేసింది. 1888 లో మొదటి మోటర్ బిగించిన కార్లు వీధులలో సంచరిస్తూ వాషింగ్టన్ సరిహద్దుల వరకు అభివృద్ధి కొనసాగింది. తరువాత దశాబ్ధాలలో వాషింగ్టన్ నగరప్రణాళికలు జిల్లా మొత్తం విస్తరింపజేసారు. 1895 నాటికి జార్జ్‌టౌన్ వాషింగ్టన్ నగరంతో కలిసిపోయింది. అయినప్పటికీ నగరంలో నివాసగృహాల పరిస్థితి హీనస్థితిలో ఉండడమే కాక ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయాయి.వాషింగ్టన్ దేశంలో నగరప్రణాళికలు దిగజారిన మొదటి నగరంగా గుర్తించబడింది. ఫలితంగా 1900 ఆరంభంలో నగర సౌందర్య ఉద్యమం తలెత్తింది. 1930లో కొత్త ఒప్పందం ఫలితంగా ఫెడరల్ నగర అభివృద్ధికి నిధులను అభివృద్ధిచేయడంతో వాషింగ్టన్ నగరంలో కొత్త ప్రభుత్వ భవనాలు, స్మారకచిహ్నాలు, మ్యూజియాలు నిర్మించబడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రభుత్వ చర్యలను మరింత వృద్ధి చేసింది. రాజధానిలో ఉద్యోగుల సంఖ్య మరింత పెరగసాగింది. 1950 నాటికి జిల్లా జ్స్నాభా 802,178 చేరుకుంది.
1961 సంయుక్త రాష్ట్రాల 23వ రాజ్యాంగ సవరణ జరిగిన తరువాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక్స్లలో పాల్గొనడానికి ఈ జిల్లాకు మూడు ఓట్లు మంజూరు అయ్యాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ జిల్లా నుండి రాజ్యాంగ ప్రతినిధి ఎన్నిక చేయబడ లేదు.
సివిల్ రైట్స్ లీడర్ డి.ఆర్ మార్టిన్ లూథర్ కింగ్ 1968 ఏప్రిల్ 4వ తేదీన హత్య చేయబడిన తరువాత దోపీడీదారులు జిల్లాలో విజృంభించారు. ప్రధానంగా యు స్ట్రీట్, 7 వ వీధి, హెచ్ స్ట్రీట్ కారిడార్లు మొదలైన ప్రదేశాలలో నల్లజాతీయుల నివాసాలు, వాణిజ్య కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని ఈ దోపిడీలు జరిగాయి. దోపిడీ దారులు మూడు రోజులు విజృంభించిన తరువాత చివరకు 13,600 ఫెడరల్ ట్రూపుల సహాయంతో దాడులను ముగింపుకు తీసుకువచ్చారు. ఈ దాడులలో అనేక షాపులు, భవనాలు అగ్నికి ఆహుతి అయ్యయి. 1990 వరకు పునర్నిర్మాణం జరగ లేదు.
1973 లో కాంగ్రెస్ కొలంబియా జిల్లాలో హోంరూల్ చట్టాన్ని అమలుకు తీసుకు వచ్చింది. ఈ చట్టం ద్వారా కొలంబియా జిల్లాకు మేయర్, 13 సభ్యుల కౌంసిల్ ఎన్నికకు అధికారం లభించింది.
2001 సెప్టెంబరు 11 టెర్రరిస్టులు అమెరికన్ ఎయిర్ లైన్ 77 విమానాన్ని హైజాక్ చేసి దానిని వర్జీనియా లోని అర్లింగ్టన్ లో ఉన్న పెంటగన్ మీద మోదేలా చేసారు. ప్రయాణీకులు హైజాకర్ల నుండి విమానన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించకుండా ఉంటే యునైటెడ్ ఎయిర్ లైంస్ 93 విమానం వాషింగ్టన్ డి.సిని లక్ష్యంగా చేసుకుని ఉండేది లేదని భావించబడింది. ఈ విమానం హైజాకర్ల నుండి ప్రయాణీకులు అదుపులోకి తీసుకోవడం ప్రయత్నించే సమయంలో పెంసిల్వేనియాలో పడిపోయింది.
వాషింగ్టన్, DC, సంయుక్త రాష్ట్రాల తూర్పు తీరంలో యొక్క మధ్య అట్లాంటిక్ ప్రాంతంలో ఉంది. కొలంబియా జిల్లా భూములను తిరిగి ఇచ్చిన సమయంలో నగరం మొత్తం వైశాల్యం 68.3 చదరపు మైళ్ళు. దీనిలో 61.4 చదరపు మైళ్ళు భూభాగం, 6.9 చదరపు మైళ్ళు జల భాగం. ఈ జిల్లా సరిహద్దులలో మోంట్గోమేరీ కౌంటీ, ఈశాన్యంలో మేరీల్యాండ్, ప్రింస్ జార్జ్ కౌంటీ, తూర్పు మేరీల్యాండ్, అర్లింగ్టన్, అలెగ్జాండ్రియా దక్షిణం, పడమరలో ఉన్నాయి.
ది పోటోమేక్ నది జిల్లా సరిహద్దుగా ఉటుంది. ఈ నదికి అనకోస్టియా, రాక్ క్రీక్ అనే రెండు ప్రధాన ఉపనదులున్నాయి. ఒకప్పుడు నేషనల్ మాల్ గుండా ప్రవహించిన టైబర్ క్రీక్ 1870 నుండి పైన పూర్తిగా కప్పివేయబడింది. ది క్రీక్ జలాలు వాంషింగ్టన్ సిటీ కెనాల్ కు జలాలను అందిస్తుంది. ఈ కాలువ నగరం గుండా ప్రవహించి 1815-1850 వరకు అనకోస్తా నదిని చేరుతుండేది.
వాషింగ్టన్ ఉపఉష్ణమండల ఆర్ద్ర భూభాగంలో ఉంది. అలాగే నాలుగు విభిన్న వాతావరణ కాలాలను చవి చూస్తుంది. జిల్లా వాతావరణం మధ్య అట్లాంటిక్ వాతావరణం కలిగి ఉంటుంది. డౌన్ టౌన్ సమీపంలో ఉన్న భూభాగాన్ని వృక్ష అభివృద్ధి 8ఎ అనూకూల భూభాగంలో ఉంది. నగరంలో మిగిలిన భూభాగం 7బి భూభాగంలో ఉంది. వసంతకాలం, హేమంతకాలం నులి వెచ్చగా ఉంటుంది. సంవత్సర 15.5 అంగుళాల హిమపాతంతో డిసెంబరు మధ్య కాలం నుండి ఫిబ్రవరి మధ్య కాలం వరకు సుమారు 38 ° ఫారెంహీట్ ఉష్ణోగ్రతతో శీతాకాలం కొనసాగుతుంది. తేమ, వేడి మిశ్రిత వాతావరణం కలిగిన వేసవి కాలంలో సుమారు 79.8 ° ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. వేడి తేమ మిశ్రిత వేసవి వాతావరణం నగరానికి తరచుగా ఉరుములతో కూడిన వర్షాలు, అప్పుడప్పుడూ సుడిగాలులులను తీసుకువస్తుంది. దాదాపు 4-6 సంవత్సరాలకు ఒకసారి నగరానికి మంచు తాకిడి కలిగిస్తుంది. మిక్కిలి భయంకరమైన మంచితుఫానును " నార్ ఈస్టర్స్ " అని పిలుస్తుంటారు. తరచుగా యు.ఎస్ తూర్పు భూభాగం ఈ తాకిడికి గురి ఔతుంది. వేసవి చివరి భాగంలో, హేమంతం ఆరంభంలో అప్పుడప్పుడూ నగరానికి హరికేన్ తుఫాన్ల తాకిడి కూడా సంభవం. అయినప్పటికీ అవి తరచుగా వాషింగ్టన్ నగరాన్ని చేరుకునే సమయానికి అవి బలహీన పడుతుంటాయి. పోటోమాక్ నది వరదలు అత్యధిక అలలు, తుఫాను కారణంగా,, ప్రవాహం వంటి సమస్యలు కలిగిస్తుంది. ఈ వరదలు అప్పుడప్పుడూ జార్జ్ టౌన్ ఆస్తులకు నష్టాన్ని కలిగిస్తుంది.
1930 జూలై 20,, 1918 ఆగస్టు 6 న, అత్యధిక ఉష్ణోగ్రత 106 °F (41 °C) 1899 ఫిబ్రవరి 11 న, మహా మంచు తుఫాను సమయంలో నమోదుకాబడిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు -15 °F (-26 °C).
1791లో వాషింగ్టన్ డి.సి నగర నిర్మాణ రూపకల్పన చేయబడింది. అధ్యక్షుడు వాషింగ్టన్ పెర్రీ (పీటర్), చార్లెస్, ఫ్రెంచ్ ఆర్కిటెక్, నగర నిర్మాణ రూపకల్పకుడు అయిన ఎల్ ఎన్ ఫాన్ట్ తో ముగ్గురు సభ్యులు కలిగిన కమిషన్ ఏర్పాటు చేసాడు. ఎల్ ఎన్ ఫాన్ట్ వెడల్పైన వీధులు, అవెన్యూలు అలాగే టోటలను వేయడానికి తగినంత ఖళీ ప్రదేశాలతో నగర నిర్మాణానికి రూపకల్పన చేసాడు. ఆయన తన డిజైన్ పారిస్, అమ్‌స్టర్ డాం, కార్ల్ స్రుహి లను నగర నిర్మాణానికి మాదిరిగా ఎంచుకున్నాడు. 1788లో తోమస్ జెఫర్సన్ ద్వారా మిలన్ ను పిలిపించాడు. ఎల్ ఎన్ ఫాన్ట్ డిజైన్ లో తోటలతో కూడిన గ్రాండ్ అవెన్యూను సుమారు ఒక మైలు పొడవు, 400 మీటర్ల వెడల్పు ఉడాలని ముందుగా ఊహించాడు. అక్కడే ప్రస్తుతం నేషనల్ మాల్ ఉంది.
1792లో అధ్యక్షుడు వాషింగ్టన్ తాను నియమించిన ముగ్గురు సభ్యుల కమిషన్ తో తీవ్రమైన విభేదాలు తలెత్తిన కారణంగా ఎల్ ఎన్ ఫాన్ట్ ను బాధ్యత నుండి తొలగించాడు. నిర్మాణ పనులకు ముందు ఎల్ ఎన్ ఫాన్ట్ తో ప్రదేశాన్ని పరిశీలించిన ఆండ్ర్యూ ఎలికాట్ ఆ డిజైన్ పూర్తి చేసే శ్రమతో కూడిన బాధ్యత చేపట్టాడు. ఎలికాట్ మొదటి రూపకల్పనను పునఃపరిశీలన చేసాడు. కొన్ని వీధుల రూపకల్పనలో మార్పులు జరిగినా ఇప్పటికీ ఎల్ ఎన్ ఫాన్ట్ కే ప్రశంశలు అందుతున్నాయి.
1900 నాటికి ఎల్ ఎన్ ఫాన్ట్ ఊహించిన అత్యున్నత జాతీయ రాజధాని మురికి వాడల అభివృద్ధి అడ్డదిడ్డంగా పెరిగిన భవనాలు అంతే కాక నేషనల్ మాల్ వద్ద ఉన్న రైమార్గం, స్టేషను కారణంగా దూళిదూసరితంగా మారింది. కాంగ్రెస్ ప్రత్యేక కమిటీని నగరాన్ని సౌందర్యవంతం చేయడానికి నియమించింది. కేపిటల్ గ్రౌండ్స్, నేషనల్ మాల్ వద్ద పూలతోటలు వేయడం, మురికివాడలను తొలగించడం, నగరమంతా పూలతోటలను అభివృద్ధిచేయడం వంటి ప్రణాళికలతో 1901లో ప్రారంభించిన ఈ ప్రణాళిక మెక్‌మిల్లన్ ప్లాన్ గా గుర్తింపు పొందింది. ఈ ప్రణాళిక ఎల్ ఎన్ ఫాన్ట్ తయారు చేసిన డిజైనును సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంది.
చట్ట ప్రకారం, వాషింగ్టన్ యొక్క స్కైలైన్ తక్కువ, క్రమరహితంగా ఉంది. మొదటి డి.సి బిల్డింగ్ నిబంధనలు అనుసరించి 1894లో 12 అంతస్తుల కారియో అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది. 1910లో భవననిర్మాణ చట్టం సవరించబడిన తరువాత పక్కన ఉన్న వీధులకంటే వెడల్పులో మించకుండా 20 అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతి లభించింది. చట్టానుంతితో పని లేకుండా ప్రజల విశ్వాసం ప్రాతిపదికగా వాషింగ్టన్ నగర భవనాలు 555 అడుగుల కంటే అధికంగా నిర్మించబడలేదు. వాషింగ్టన్ మోన్యుమెంట్ ఎత్తు 50 అడుగులు. జిల్లా ఎత్తైన నిర్మాణంగా అది మిగిలి పోయింది. నగర నాయకులు నగరంలోని నివాసగృహాల కొరత వాహన రద్దీ కారణంగా ఎత్తు పరిమితిని విమర్శిస్తూ వస్తున్నారు. జిల్లా వాస్తుపరంగా నాలుగు విభాగాలుగా విభజించబడింది. వాయవ్యం, ఈశాన్యం, ఆగ్నేయం, నరుతి అని యు.ఎస్ నగరపాలనా శైలిలో విభజించబడింది. రహదార్లన్ని క్లుప్తాక్షరాలతో పేర్కొనబడుతూ, నివాసగృహాలు బ్లాకులుగా గుర్తించబడుతున్నాయి. అధికమైన వీధులు తూర్పు పడమరలుగా విభజింజించి నిర్మించబడ్డాయి.
వాషింగ్టన్ నగరం ఉత్తరందిశలో బౌండరీ స్ట్రీట్ (1890 నుండి ఇది ఫ్లోరిడా అవెన్యూ) సరిహద్దుగా ఉంది. పడమర సరిహద్దులో రాక్ క్రీక్ సరిహద్దుగా ఉంది, అవకోస్టియా నది తూర్పు సరిహద్దుగా ఉంది. వీలైన ప్రదేశాలలో వాషింగ్టన్ వీధులు పొడిగించబడ్డాయి. 1895లో వాషింగ్టన్ వీధుల ప్వేర్లు మార్చబడ్డాయి. యు.ఎస్ రాజధాని వెంట ఉన్న పెంసిల్ వేనియా అవెన్యూ, వాషింగ్టన్ 297 విదేశీ దౌత్య కార్యాలయాలకు ఆతిథ్యం కల్పిస్తుంది. మసాచ్యూట్ అవెన్యూ దౌత్యకార్యాలయ వరుసగా అభివర్ణించబడుతుంది.
వాషింగ్టన్ వాస్తు శైలి వివిధరీతులను ప్రతిబింబిస్తూ అతి గొప్పగా ఉంటుంది. కొలంబియా జిల్లాలో ఉన్న అమెరికన్ ఇంస్టిట్యూట్‌లో 10లో 6 భవనాలు 2007లో అమెరికన్ అభిమాన వాస్తు శైలిగా పేర్కొనబడ్డాయి. అవి వరుసగా వైట్ హౌస్, ది వాషింగ్టన్ నేషనల్ కాథడ్రల్, తోమస్ జెఫర్సన్ మెమోరియల్, సంయుక్తరాష్ట్ర రాజధాని, ది లింకన్ మెమోరియల్, వియత్నాం వెటరన్ మెమోరియల్. ది నియోక్లాసికల్, జార్జియన్, గోతిక్, మోడరన్ ఆర్కిటెక్చురల్ స్టైల్ మొదలైనవి ఆ ఆరు భవనాలలో ప్రత్యేకంగా ఉంటాయి. గుర్తించతగిన ఇతర శైలి భవనాలలో ఈసెంహోవర్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయ భవనాలు మొదలైనవి ఉన్నాయి.
వాషింగ్టన్ డౌంటౌన్ కు దూరంగా నిర్మాణ శైలి ఇంకా విభిన్నంగా ఉంటుంది. చారిత్రామక భవనాలు క్వీన్ అవెన్యూలో నిర్మించబడ్డాయి. చాటిస్క్వీ, రిచర్డ్సన్ రోమనిస్క్వీ, జార్జియన్ రివైవల్, బీక్స్-ఆర్ట్స్, విభిన్నమైన విక్టోరియన్ శైలి నిర్మాణాలు. అంతర్య్ద్ధం తరువాత నిర్మించబడిన వరుస భవనాలు విక్టోరియన్ శైలిలో నిర్మించబడ్డాయి. 1765లో జార్జ్ టౌన్ ఓల్డ్ స్టోన్ భవనం నిర్మించబడింది. ఈ భవనం నగరంలో పురాతన శైలిలో నిర్మించబడిన భవనంగా గుర్తించబడింది. 1789లో స్థాపించబడిన జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం రోమంస్క్యూ, గోతిక్ రివైవల్ ఆర్కిటెక్చర్ కలయికలతో ని9ర్మించబడింది. 3.1 మిలియన్ల చదరపు అడుగుల రోనాల్డ్ రీగన్ భవనం జిల్లాలో అతి పెద్ద భవనంగా గుర్తించబడింది.
2011లో యు.ఎస్ సెనస్ బ్యూరో గణాంకాలను అనుసరించి జిల్లా జనాభా 617,996. 2010 కంటే ఇది 27% అధికం. జనాభా గత అర్ధ శతాబ్దంలో కొనసాగిన క్షీణదశ అనంతరం 2000 నుండి ఈ అభివృద్ధి దిశలో కొనసాగింది. 2010లో ఈ నగరజనాభా యు.ఎస్ లో 24వ స్థానంలో ఉంది. 2009 జాబితా అనుసరించి శివారుప్రాంతం నుండి వస్తున్న ఉద్యోగుల కారణంగా ఈ జిల్లా పగటివేళలో ఒక మిలియన్ కంటే అధికంగా ఉంటుందని అంచనా వేయబడుతుంది. ఈది ఒక రాష్ట్రంగా పరిగణించబడితే ఈ జనాభా 50వ స్థానంలో ఉంటుంది.
2010లో 5.6 మిలియన్ల జన సంఖ్యతో జిల్లా, పరిసర శివారు ప్రాంతాలతో కలిసి వైశాల్యంలో మహానగర ప్రాంతం ఏడవ మహానగరంగా పరిగణించబడుతుంది. వాషింగ్టన్ ప్రాంతం బాల్టిమోర్, దాని శివారు ప్రాంతాలతో కలిపి 2010లో జనాభా 8.5 మిలియన్లు. ఇది సంయుక్త గణాంకాల సంఖ్యలో 4వ స్థానంలో ఉంది.
2010 జనాభాగణాంకాలను అనుసరించి వాషింఘ్టన్ జనాభాలో ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 57.7%, శ్వేతజాతీయుల (హిస్పానికులు కాని వారు) శాతం 38.%, ఆశియన్ల శాతం 3.5%, స్థానిక అమెరికన్ల శాతం 0.3%. ఇతర జాతీయులు 4.1% వీరిలో రడు లేక అధికం జాతులకు చెందిన వారి శాతం 9.1%.
వాషింగ్టన్ నగరస్థాపన జరిగిన నాటి నుండి నగరంలో ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య గుర్తించత తగినంతగా ఉంది. 1800, 1940 మధ్య కాలంలో ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 30% ఉంటూ వచ్చింది. 1970 నాటికి ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య 70%కి చేరింది. అయినప్పటికీ అప్పటి నుండి ఆఫ్రికన్ అమెరికన్లు శివారు ప్రాంతాలకు తరలి వెళ్ళిన కారణంగా వారి సంఖ్య క్షీణించసాగింది. 2000-2010 నుండి హిస్పానిక్ జాతి సంఖ్యలో 31.4% అలాగే నల్లజాతీయుల సంఖ్య 11.5%లో క్షీణత కొనసాగింది. డి.సి వాసులలో 17% 18 సంవత్సరాల కంటే లోపు వయసు వారు. యు.ఎస్ సరాసరి సంఖ్యలో 24% తక్కువ. అయినప్టికీ 34 వయసు వారి సంఖ్యలో దేశం 50 రాష్ట్రాలలో కనిష్ఠ స్థానంలో ఉంది. 2010 గణాంకాలను అనుసరించి 81,734 విదేశీయులు వాషింగ్టన్ లో నివసిస్తున్నారని అంచనా. వీరిలో అధికులు ఇ ఎల్ శాల్వడోర్, వియత్నాం, ఎథియోపియాఉన్నారు. శాల్వడోర్ వారు అధికంగా మౌంట్ ప్లసెంట్ పరిసరాలలో నివసిస్తున్నారు.
2010 గణాంకాలను అనుసరించి నగరంలో లెస్బియన్లు, గేలు కలిసి 4,822 జంటలు ఉన్నారని అంచనా. మొత్తం కుటుంబాలలో వీరు 2% ఉన్నారు. 2009 లెబియన్, గే ఫంస్కృఇతి ప్రజల వివాహాలకు చట్ట పూర్వక అనుమతి లభించింది. 2010 మార్చి నుండి జిల్లాలో ఈ తరహా వివాహాలకు అనుమతి పత్రం లభించడం ప్రారంభం అయింది.
2007 నివేదికలు నగరవాసులలో మూడవ వంతు ప్రజలు అక్షరాస్యులని తెలియజేస్తుంది. జాతీయంగా ఈ సంఖ్య ఐదవ వంతు ఉంది. ధారాళంగా ఆంగ్లభాషలో సంభాషించ లేని విదేశీయులు కూడా ఈ పరిగణలోకి వస్తారు. 2006లో డి.సి వాసులలో 50% 4 సంవత్సరాల పట్టబధ్రత పుచ్చుకున్నారు. డి.సి వాసుల తలసరి ఆదాయం 55,755 అమెరికన్ డాలర్లు. యు.ఎస్ 50 రాష్ట్రాల తలసరి ఆదాయం కంటే ఇది అధికం. 2005 నాటికి నరంలో 19% ప్రజలు దారిద్యరేఖకు దిగువన ఉన్నారు.ఇది దేశంలో మిసిసిపి తరువాతి స్థానం. 2008 జాబితాలను అనుసరించి బాప్టిస్టుల సంఖ్య 28%, రోమన్ కాథలిక్కుల లేక ఇఅత్ర క్రైస్తవ సంస్థలకు చెందిన వారి సంఖ్య 31%. ఇతర మతాలకు చెందిన వారి సంఖ్య 8%, ఏ మతానికి చెందనివారు 18%. డి.సి వాసులలో 90% ప్రజలు ఆరోగ్యబీమా రక్షణ కలిగి ఉన్నారు. ఇది దేశంలో 2వ స్థానం. తక్కువ వేతనం పొందుతున్న వారికి నగర పాలనా భాగంగా ఆరోగ్యబీమా రక్షణ కల్పించడం ఇందుకు ఒక కారణం. 2009 నివేదికలు నగరంలో 3% ప్రజలు ఎయ్డ్స్ వ్యాధి పీడితులని తెలియజేస్తున్నాయి. ఇందు వలన జనరలైజ్డ్, సర్వ్ పేరుతో యు.ఎస్ కేంద్రాలు వ్యాధి నిరోధకం, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలను చేపట్టింది.
వాషింగ్టన్ డి.సి నగరంలోని నేరాలు పేదరికం, మాదకద్రవ్యాల వాడకం, నేరబృందాల మీద ఆధారపడి ఉంది. 2010 గణాంకాలు నగరంలోని 5% బ్లాకులు నగరంలోని నేరాలలో నాలుగవవంతు నేరాలలో భాగం అయ్యాయి. సమీపంలో ఉన్న సంపన్నత కలిగిన వాయవ్య వాషింగ్టన్ సహజంగా సురక్షితమైనది. అయినప్పటికీ నగరంలోని తూర్పు భాగంలో నేరాలు అధికంగా నమోదు ఔతున్నాయి. ఇక్కడ నివసిస్తున్నా 60,000 మంది పాత నేరస్థులన్నది విదితం.
1990 లో తరచుగా వాషింగ్టన్ "హత్యల రాజధాని "గా వర్ణించబడింది. 1991లో నగరంలో 449 హత్యలు నమోదయ్యాయి. 2011 నాటికి వాషింగ్టన్ సంవత్సర హత్యల సంఖ్య తగ్గు ముఖం పట్టి 108 సంఖ్యకు చేరింది. 1963 నుండి ఇదే అతి తక్కువ సంఖ్య. కొలంబియా హైట్స్, లోగన్ సర్కిల్ సురక్షితమైనవిగా భావించబడుతుంది. అయినప్పటికీ దోపిడీలు, దొంగతనాలు ఈ ప్రాంతంలో అధికంగానే ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా ఉన్న సంపన్నులు, రాత్రి జీవితం ఇందుకు కారణమని భావించబడుతుంది. ఉత్తర, తూర్పు డౌన్ టౌన్ ప్రాంతాలలో ఆస్తి నేరాలు, దొంగతనాలు అధికంగా ఉన్నాయి. ఆస్తి, హింస నేరాలు 1990 మధ్యభాగం నుండి అధికం అయ్యాయి..
కొలంబియా
వాషింగ్టన్ వృత్తిపరమైన, వ్యాపారపరమైన ఉద్యోలను అభివృద్ధి అవకాశాలు కలిగిస్తున్న వైవిధ్యమున్న ఆర్థిక పరిస్థితులు కలిగిన నగరం. 2010 గణాంకాలను అనుసరించి ఉత్పత్తి 103.3 బిలియన్ల అమెరికన్ డాలర్లు. యు.ఎస్ 50 రాష్ట్రాలలలో ఆర్థికపరంగా వాషింగ్టన్ 34వ స్థానంలో ఉంది. 2010 వాషింగ్టన్ మహానగర ఉత్పత్తి 425 బిలియన్ల అమెరికన్ డాలర్లు. సంయుక్త రాష్ట్రాలలో ఆర్థిక పరంగా వాషింగ్టన్ మహానగరం 4వ స్థానంలో ఉంది. 2011 జూన్ వాషింగ్టన్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో నిరుద్యోగుల శాతం 6.2%. దేశంలోని 49 మహానగర ప్రాంతాలలో ఇది రెండవ కనిష్ఠ స్థాయి. అదే సమయంలో కొలంబియా జిల్లా నిరుద్యోగుల శాతం 8.8%.
2012 వాషింగ్టన్ డి.సి లోని 29% ఉద్యోగాలను ఫెడరల్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ కారణంగా దేశఆర్ధిక సంక్షోభ సమయంలో కూడా నగరం ఆర్థిక సంక్షోభంలో పడకుండా కాఒపాడబడింది. న్యాయపరమైన సంస్థలు, స్వతంత్ర ఒప్పందదారులు, సేవాసంస్థలు, లాబీయింగ్ సంస్థలు, వాణిజ్య సంఘాలు, పారిశ్రామిక వ్యాపార సంఘాలు, వృత్తి సంఘాలు డి.సి లేక పరిసర ప్రాంతాలలో వారి ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి. వాషింగ్టన్లో దాదాపు 200 విదేశీ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే ప్రపంచ బ్యాంకు, ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్, ది ఇంటర్ -అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంకు, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. 2008లో ది ఫారిన్ డిప్లోమేటిక్ కార్ప్స్ ఇన్ వాషింగ్టన్ 10,000 ఉద్యోగాలను కల్పించింది. ఇందు కొరకు 400 మిలియన్ల అమెరికన్ డాలర్లను వెచ్చిస్తుంది.
జిల్లాలో ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం లేని పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రత్యేకంగా విద్య, ఆర్థికం, ప్రభుత్వ విధానాలు, సైంటిఫిక్ పరిశోధనలు వంటి సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ, జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ హాస్పిటల్ సెంటర్, చిల్డ్రంస్ నేషనల్ మెడికల్ సెంటర్, హౌవార్డ్ విశ్వవిద్యాలయం వంటి అత్యుత్తమ ప్రభుత్వేతర సంస్థలు 2009లో అత్యధికంగా ఉద్యోగాలను కల్పించాయి. 2011 గణాంకాలు 500 అత్యుత్తమ సంస్థలలో నాలుగు సంస్థల ప్రధాన కార్యాలయాలు జిల్లాలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.
జాతీయ మాల్ వాషింగ్టన్ డౌన్ టౌన్ లోని పెద్ద ఉద్యానవనము. ఇది లింకన్ మెమోరియల్, సంయుక్త రాష్ట్రాల కాపిటల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ చాలా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ఉత్సవాలు, అధ్యక్షుని ప్రారంభోత్సవాలు, సంగీతోత్సవాలకు ఇది ఒక వేదిక. దీనిలోనే వాషింగ్టన్ స్మారక చిహ్నం, జఫర్సన్ పియర్ ఈ ఉద్యానవన కేంద్రానికి సమీపంలో వైట్ హౌస్ (శ్వేతభవనం) నానికి దక్షిణంగా ఉంటుంది. ఉంది. రెండవ ప్రపంచ యుద్ధపు జాతీయ స్మారక చిహ్నం లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ తూర్పుతీరంలో ఉంది. ది కొరియన్ వెటరన్స్ మెమోరియల్, ది వెటరంస్ మెమోరియల్ కూడా ఇక్కడ ఉన్నాయి.
ఈ మాల్‌కు సరిగ్గా దక్షిణంలో టైడల్ బేసిన్ రిజర్వాయర్ పక్కన జపాన్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన చెర్రీబ్లోసం చెట్లు వరిసలుగా ఉంటాయి. ది ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ మెమోరియల్, జెఫెర్సన్ మెమోరియల్, మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్ మెమోరియల్,, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా వార్ మెమోరియల్ మొదలైనవి టైడల్ బేసిన్ రిజర్వాయరు చుట్టూ ఉంటాయి.
ది నేషనల్ అర్చివ్స్ లో స్వాతంత్ర్య ప్రకటనలతో కూడిన అమెరికన్ చరిత్ర, సంయుక్తరాజ్యాల రాంజ్యాంగరమైనవి, హక్కుల శాసనాలను గురించిన వేలకొలది పాత దస్తావేజులను భద్రపరుస్తుంటారు. కేపిటల్ హిల్స్ మీద ఉన్న మూడు భవనాలలో లైబ్రెరీ ఆఫ్ కాంగ్రెస్ లో 147 మిలియన్ల పుస్తకాలను సేకరించి భద్రపరిచి ఉంచారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయ సమూహం. 1935లో సంయుక్త రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం (యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ ) నిర్మాణం పూర్తి అయింది. అంతకు ముందు ఈ న్యాయస్థానం ఓల్డ్ సెనేట్ చాంబర్ ఆఫ్ ది కేపిటల్ లో జరుగుతూ ఉండేది.
కాంగ్రెస్ నిధి సహాయంతో నడుస్తున్న విద్యాసంస్థ ది స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ 1846 అధికమైన ప్రభుత్వ మ్యూజియంలను ప్రదర్శనశాలలను నిర్వహిస్తుంది. ఇది ప్రజలకు ఎటువంటి రుసుము లేకుండా తమ సేకరణలను సందర్శించే అవకాశం కలిగిస్తుంది. 2010లో స్మిత్సోనియన్ ప్రదర్శనశాలలలో అత్యధికులు సందర్శించే ప్రదర్శనశాలలలో నేషనల్ మాల్ మీద ఉన్న నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం ఒకటి. మాల్ మీద ఉన్న స్మిత్సోనియన్ మ్యూజియాలు ప్రదర్శనశాలలు నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ది నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ ఆర్ట్, ది నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ, ది నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఇండియన్. ఆసియన్ కళలు, సంస్కృతిని ప్రదర్శించే ది శాక్లర్ అండ్ ఫ్రీయర్ ప్రదర్శనశాలలు, ది స్కల్ప్చర్ గార్డెన్, ది ఆర్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్, ది డిల్లన్ రిప్లై సెంటర్, స్మిత్సోనియన్ ఈంస్టిట్యూషన్ బిల్డింగ్ (దీనిని కేస్టిల్ అంటారు). ఇది ఇంస్టిట్యూషన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.
ది స్మిత్సోనియన్ ఆర్ట్ మ్యూజియం, నేషనల్ పోర్ట్రైట్ గ్యాలరీ వాషింగ్టన్ చైనాటౌన్ సమీపంలో ఓల్డ్ పేటెంట్ బిల్డింగులో ఉన్నాయి. ది రెన్ విక్ గ్యాలరీ స్మిత్సోనియన్ అమెరికన్ ఆర్ట్ మ్యూజియంలో ఒక భాగంగా ఉన్నప్పటికీ వైట్ హౌస్ సమీపంలో ప్రత్యేకమైన భవనంలో ఉంది. ఇతర స్మిత్సోనియన్ మ్యూజియాలు ప్రదర్శనశాలలు వాషింగ్టన్ ఈశాన్యంలో ఉన్నది అనకోస్టియా కమ్యూనిటీ మ్యూజియం, యూనియన్ స్టేషను సమీపంలో ఉన్న ది నేషనల్ పోస్టల్ మ్యూజియం, వుడ్లీ పార్క్ వద్ద ఉన్న నేషనల్ జూ.
కేపిటల్ సమీపంలో నేషనల్ మాల్ మీద ఉన్న ది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అమెరికన్, యురేపియన్ కళాఖండాలను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనశాల, అందులోని సేకరణలు స్మిత్సోనియన్ ఇంస్టిట్యూషన్ లో భాగం కాదు అవి అన్నీ యు.ఎస్ ప్రభుత్వానికి స్వంతం. జ్యుడీషియల్ స్క్వేర్ సమీపంలో మునుపు పెన్షన్ బిల్డింగ్ లో ప్రస్తుత ది నేషనల్ బిల్డింగ్ మ్యూజియంగా మార్చబడింది. ఈ మ్యూజియానికి ప్రభుత్వం నిధిసహకారం అందిస్తూ ప్రైవేట్ ఇంస్టిట్యూషన్ గా పనిచేసేలా సహకరిస్తున్నారు. ఇక్కడ ఇక్కడ నిర్మాణకళ, నగరనిర్మాణం, రూపకల్పన ప్రదర్శించబడుతున్నాయి.
కొలంబియా జిల్లాలో పలు ప్రభుత్వేతర మ్యూజియాలు ఉన్నాయి. అవి విస్తారమైన సేకరణలు కలిగి ఉన్న వాటిని ప్రజలకు ప్రదర్శనకు అనుమతిస్తున్నారు. వీటిలో నేషనల్ మ్యూజియం ఆఫ్ వుమన్ ఇణ్ది ఆర్ట్, ది కోకోరన్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ దీనిని వాషింగ్టన్ లో అతి పెద్దదిగా భావిస్తున్నారు. డపోంట్ సర్కిల్ లో ఉన్న ఫిలిప్స్ కలెక్షన్ ఇది సంయుక్త రాష్ట్రాలలో మొదటి ఆధునిక కళా ప్రదర్శనలు చేస్తున్న మ్యూజియం. వాంషింగ్టన్ లో ఉన్న ఇతర ప్రభుత్వేతర న్యూసియం, ది స్ట్రీట్ మ్యూజియం ఫౌండేషన్, ది ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం, ది నేషనల్ జియోగ్రఫిక్ సిసైటీ మ్యుజియం, ది మరియన్ కోష్ లాండ్ సైన్సు మ్యూజియం, నేషనల్ మాల్ నిర్వహిస్తున్న మ్యూజియాలకు సమీపంలో ఉన్న ది యునైటెడ్ స్టేట్స్ స్టేట్స్ హోలోకస్ట్ మెమోరియల్ మ్యూజియం, హోలోకస్ట్ కు సంబంధించిన డాక్యుమెంటేషన్, ఆర్టిఫాక్ట్స్ మొదలైనవి.
వాషింగ్టన్ డి.సి కళలకు దేశీయ కేంద్రం. ది జాన్ ఎఫ్.కెనడీ నేషనల్ సింఫోనీ ఆర్కెస్ట్రా, ది వాషింగ్టన్ నేషనల్ ఒపేరా, వాషింగ్టన్ బ్యాలెట్ లను ప్రదర్శిస్తుంటారు. సంయుక్త రాష్ట్రాల సాంస్కృతిక జీవితం గురించిన ప్రదర్శనలో పాల్గొన్న వారిలో ఉన్నతమైన నటన ప్రదర్శించిన వారికి కెన్నడీ సెంటర్ ప్రతి సంవత్సరం అవార్డులను ఇస్తుంది. అధ్యక్షుడు అబ్రహాంలింకన్ హత్యచేయబడిన ప్రదేశమైన ది హిస్టారిక్ ఫోర్డ్స్ దియేటర్ ప్రదర్శనలకు అలాగే మ్యూజియం గానూ పనిని కొనసాగిస్తుంది.
1798లో కేపిటల్ హిల్ సమీపంలో మేరిన్ బర్రాక్ స్థాపించబడింది. దేశంలో ఇది పురాతన సంగీత వృత్తి కళాకారుల సంస్థ. అమెరికన్ మార్చి సంగీత కూర్పరి అయిన జాన్ ఫిలిప్ సౌస మేరిన్ బాండ్ ను 1880 నుండి 1892 వరకు నడిపించాడు. వాషింగ్టన్ నేవీ యార్డ్ వద్ద 1925లో స్థాపించబడిన ది యునైటెడ్ నేవీ బ్యాండ్ అధికారిక సంఘటనలు, బహిరంగ సంగీత ప్రద్ర్శనలు నగరమంతా ప్రదర్శిస్తుంది.
వాషింగ్టన్ శక్తివంతమైన దియేటర్ సంప్రదాయం కలిగి ఉంది. 1950లో స్థాపించబడిన అరేనా స్టేజ్ దేశీయమైన గుర్తింపును పొందడమేగాక దియేటర్ స్వాతంత్ర్యోద్యమాన్ని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు అది షేక్స్ఫియర్ దియేటర్ కంపెనీ, వూలీ మమ్మూత్ దియేటర్ కంపెనీ, స్టూడియో దియేటరలను కలిగి నుండి. 2010 నగరంలో సౌత్ వెస్ట్ వాటర్ ఫ్రంట్ ప్రదేశంలో కొత్తగా పునరుద్ధరణ చేయబడిన భవనంలో అరేనా స్టేజ్ సరికొత్తగా అవతరించింది. కొలంబియా హైట్స్ వద్ద చారిత్రామకమైన టివోలి దియేటర్ లో గాలా హిస్పానిక్ దియేటర్ 1976లో స్థాపించబడింది. లాటినో కళాప్రదర్శనలకు ఇది దేశీయకేంద్రం.
నగరానికి వాయవ్యంలో ఉన్న ది యు స్ట్రీట్ కారిడార్ (వాషింగ్టన్స్ బ్లాక్ బ్రాడ్వేగా గుర్తించబడుతుంది) లో హోవార్డ్ దియేటర్, బొహిమియన్ కేవర్న్స్, లింకన్ దియేటర్ సంస్థలు ఉన్నాయి. అక్కడ వాషింగ్టన్ -నేటివ్ డ్యూక్ ఎల్లింగ్టన్, జాన్ కాల్ట్రేన్, మైల్స్ డేవిస్ వంటి సంగీత పౌరాణికాలు ప్రదర్శించబడతాయి. గో-గో, ఏ పోస్ట్-ఫంక్, పర్కషన్-డ్రైవన్ ఫ్లేవర్ వంటివి 1970 చివరిదశలో డి.సి బ్యాండ్ నాయకుడు బ్రున్ ప్రతిభతో ప్రజాదరణ పొందాయి.
సంయుక్త రాష్ట్రాలలో ఇండీ సంస్కృతి, సంగీతానికి ఈ జిల్లా ప్రధాన కేంద్రంగా విలసిల్లుతుంది. జాన్ మెకే చేత ది లేబెల్ డిస్కార్డ్ రికార్డ్స్ రూపకల్పన చేయబడింది. 1980లో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన స్వతంత్ర లేబెల్ అయినప్పట్కీ ఇది 1990 రాక్ వలన ఇది నెనుకబడింది. ఆధునిక ప్రత్యామ్న్యాయ ఇండీ సంగీతం ది కేట్, 9-30 క్లబ్ తరహా సంగీతాలు యు స్ట్రీట్ ప్రాంతంలో ప్రజాదరణ పొందాయి.
నాలుగు ప్రధానమైన వృత్తిపరమైన పురుషుల క్రీడలు జట్లు, ఒక ప్రధాన వృత్తిపరమైన మహిళల జట్టు జట్టు ఊన్న యునైటెడ్ స్టేట్స్ లో 12 నగరాల్లో వాషింగ్టన్ ఒకటి. వాషింగ్టన్ విజార్డ్స్ (నేషనల్ బాస్కెట్ బాల్ అసోసేషన్), ది వాషింగ్టన్ కాపిటల్స్ (నేషనల్ హాకీ లీగ్), వాషింగ్టన్ మిస్తిక్స్ (విమెన్ ' స్ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసేషన్), చైనా టౌన్ ళొ ఉన్న ప్లే ఎట్ ది వర్జిన్ సెంటర్, 2008లో డి.సి ఆగ్నేయంలో ప్రారంభించిన నేషనల్ ' స్ పార్క్ మొదలైన క్రీడలు వాషింగ్టన్లో ఉన్నాయి. ది వాషింగ్టన్ నేషనల్స్ (మేజర్ లీగ్ బేస్ బాల్ కు ) వాషింగ్టన్ పుట్టిల్లు. ఆర్ ఎఫ్ కే స్టేడియం వద్ద డి.సి యునైటెడ్ క్రీడలు నిర్వహిస్తారు. ది వాషింగ్టన్ రెడ్ స్కింస్ (నేషనల్ ఫుట్ బాల్ లీగ్) క్రీడలు మేరీలాండ్ లోని లాండోవర్ లోని ఫెడెక్స్ ఫీల్డ్ లో నిర్వహిస్తారు.
ప్రస్తుత డి.సి జట్లు కలిసి 10 ప్రొఫెషనల్ లోగ్ చాంపియన్ షిప్స్ గెలిచారు. ది వాషింగ్టన్ రెడ్ స్కింస్ జట్టు ఐదు చాంపియన్ షిప్స్ గెలిచారు. డి.సి యునైటెడ్ జట్టు నాలుగు చాంపియన్ షిప్స్ గెలిచింది. వాషింగ్టన్ విజార్డ్స్ జట్టు ఒక చాంపియన్ షిప్ గెలిచింది.
ఇతర వృత్తి, అర్ధ వృత్తి పరమైన జట్లు: ది వాషింగ్టన్ కేస్టిల్స్ (వరల్డ్ టీం టెన్నిస్), వాషింగ్టన్ డి.సి స్లేయర్స్ (అమెరికన్ నేషనల్ రగ్బీ లీగ్), ది బాల్టిమోర్ వాషింగ్టన్ ఈగిల్స్ (యు.ఎస్.ఎ.ఎఫ్.ఎల్), ది డి.సి దివాస్ (ఇండిపెండెంట్ విమెన్ ' స్ ఫుట్ బాల్ లీగ్), ది పోటోమాక్ అథ్లెటిక్ క్లబ్ ఆర్ ఎఫ్ సి (రగ్బీ సూపర్ లీగ్), రాక్ క్రీక్ పార్క్ వద్ద ఉన్న ది విలియం ఫిట్జర్లాండ్ టెన్నిస్ సెంటర్ లీగ్ మేసింస్ టెన్నిస్ క్లాసిక్ క్రీడలకు ఆతిధ్యం ఇస్తుంది. వాషింగ్టన్ రెండు ప్రధాన మారతాన్ క్రీడలకు పుట్టిల్లు: ది మేరిన్ కార్ప్స్ మారథాన్ 1976 లో ప్రారంభించిన దీనిని కొన్ని సార్లు పీపుల్స్ మారథాన్ అని పిలుస్తుంటారు. ఈ మారథాన్ పాల్గొన్న వారికి బహుమతి ధనం ఇవ్వదు.
జిల్లలోని నాలుగు ఎన్ సి ఎ ఎ జట్లలో ఒకటి మాత్రం అధికంగా ప్రజాదరణ పొందింది. 2008 నుండి వర్జిన్ సెంటర్ లో ఆడే ది జార్జ్ టౌన్ హోయాస్ బాస్కెట్ బాల్ టీం అధికంగా ఫప్రజాదరణ పొందింది. ఆర్ ఎఫ్ కే స్టేడియం వద్ద జిల్లా ఆన్యుయెల్ కాలేజ్ ఫుట్‌బాల్ బౌల్ గేంకు ఆతిధ్యం ఇస్తుంది. ప్రస్తుతం దీనిని మిలటరీ బౌల్ అని పిలుస్తున్నారు. మేరీలాండ్ లోని బెత్సెడా వద్ద కాంకాస్ట్ నెట్ పేరున్న ప్రాంతీయ క్రీడా దూరదర్శన్ ప్రసారాలు డి.సి నుండి ప్రసరించబడుతుంటాయి.
జాతీయ, అంతర్జాతీయ మాధ్యమానికి వాషింగ్టన్ ప్రధాన వేదిక. అత్యంత పురాతనమైనది వాషింగ్టన్ వాసులు అధికంగా చదువుతున్నది అయిన వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక 1877 లో స్థాపించబడింది. వాటర్ గేట్ స్కేండల్ వెలుగులోకి తీసుకురావడం, జాతీయ అంతర్జాతీయ రాజకీయాలనరజల మధ్యకు తీసుకు వెళ్ళడంలో ప్రజలలో అత్యధిక గుర్తింపు పొందింది. 2011 లో ది పోస్ట్ అని ప్రజాదరణ పొందిన ఈ పత్రిక పాఠకుల సంఖ్యలో 6వ స్థానంలో ఉంది.
ది వాషింగ్టన్ పోస్ట్ సంస్థ ది ఎక్స్ ప్రెస్ అని పిలువబడే ఒక ఉచిత పత్రిక ప్రచురిస్తుంది. ఈ పత్రికలో సంక్షిప్త వార్తలు, క్రీడలు, వినోదం అలాగే స్పానిష్ భాషా పుటలు ఉంటాయి. ప్రాంతీయ దినపత్రికలు వాషింగ్టన్ టైంస్, వాషింగ్టన్ ఎగ్జామినర్ అలాగే ఆల్టర్నేటివ్ వారపత్రిక వాషింగ్టన్ సిటీ పేపర్ కూడా వాషింగ్టన్ ప్రాంతంలో చాలినంత మంది పాఠకులను కలిగి ఉంది.
కొన్ని సాధారణ, ప్రత్యేక పత్రికలు పరిసర, సాంస్కృతిక వార్తలను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని వరుసగా ది వాషింగ్టన్ బ్లేడ్, మెట్రో వారపత్రిక మొదలైనవి. ఇవి ఎల్ జి బి టి సమస్యలు అందిస్తున్నాయి. నల్లజాతీయుల గురించిన వార్తలను అధికంగా అందిస్తున్న ది వాషింగ్టన్ ఇంఫార్మర్, వాషింగ్టన్ అఫ్రో అమెరికంస్ అనే పత్రికలు. పరిసర ప్రాంత వర్తలకు ప్రాధాన్యం ఇస్తున్న కంగ్రెషనల్ క్వార్టర్లీ, ది బిల్, పొలిటికో, అండ్ రోల్ కాల్ న్యూస్ పేపర్ కాంగ్రెస్, ఫెడరల్ ప్రభుత్వ రాజకీయ ప్రచురణలు అందిస్తున్నాయి. వాషింగ్టన్ మిగిలిన ప్రచురణలు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, పొలిటికల్ ప్రచురణలు అందిస్తున్న న్యూ రిపబ్లిక్, వాషింగ్టన్ మాసపత్రికలు.
ది వాషింగ్టన్ మెట్రో పాలిటన్ ఏరియా యు.ఎస్ లో దూరదర్శన్ మార్కెట్ లో దేశంలో 9వ స్థానంలో ఉంది. పలు ంఆధ్యమ సంస్థలు, టెలివిజన్ చానల్ నగరంలో వారి ప్రధాన కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. బ్లాక్ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ (BET);; రేడియో వన్; నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్; స్మిత్సోనియన్ నెట్వర్క్స్ నేషనల్ పబ్లిక్ రేడియో (NPR); ప్రయాణం ఛానల్ (చెవీ చేజ్, మేరీల్యాండ్ లో); Discov C-SPAN సహా
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగ చట్టం ఆర్టికల్ ఒకటి సెక్షన్ ఎనిమిది యు.ఎస్ కాంగ్రెస్ కు నగర న్యాయవ్యవస్థ నిర్వహణా (ఎగ్జిక్యూటివ్ జ్యూరిడిక్షన్) అధికారాన్ని మంజూర్ చేసింది. 1973 హోం రూల్ చట్టం అమలుకు వచ్చే వరకు ఈ జిల్లా ప్రాంతీయ ప్రభుత్వం ఎన్నిక చేయబడ లేదు. ఈ చట్టం క్సంగ్రెస్ కు మేయర్ ను ఎన్నుకోవడానికి అధికారంఇచ్చింది. ప్రస్తుతం కొలంబియా 13 వ కౌంసిల్ సభ్యుడు వింసెంట్ సి.గ్రే మేయర్ గా ఎన్నిక అయ్యాడు. కౌంసిల్ చేసిన చట్టంలో మార్పులు తీసుకోవడానికి అవసరమైన జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ హక్కులు తమ ఆధీనంలోనే ఉంచుకుంది.
నగరంలోని ప్రతి ఎనుమిది వార్డులు ఒక కౌంసిల్ సభ్యుని ఎన్నుకుంటారు. నగరవాసులంతా కలసి 4 ప్రతిమిధినిధులను ఎన్నుకుంటారు. కౌంసిల్ చైర్ ను ఇలాగే ఎన్నుకుంటున్నారు. నగరంలో 37 మంది అడ్వైసరీ నైబర్ హుడు కమీషంస్ (ఎ ఎన్ సి ) సభ్యులను చిన్న సమీప ప్రాంతాల వాసుల చేత ఎన్నుకొనబడతారు. ఎ ఎన్ సి సభ్యులు మేయర్ కు ప్రజా సమస్యల అవగాహన కలగజేస్తారు. ప్రజా ప్రతినిధులు వారి సలహాలను శ్రద్ధగా ఆలోచనకు తీసుకుంటారు.
కాంగ్రెస్ తప్పక అంగీకారం తెలియజేయవలసిన ప్రణాళిక, ప్రాంతీయ పన్నులు మేయర్, కౌంసిల్ నిర్ణయిస్తారు. పన్ను చెల్లించనవసరం లేని ఆస్తులు, అశక్తత గురించి అకౌట్బిలిటీ ఆఫీసర్లు నిర్ణయించి నగర ప్రణాళిక తయారు చేస్తారు. మొత్తం నగర ప్రణాళిక 470 మిలియన్లు, 1 బిలియన్ మధ్య ఉంటుంది.వైద్య, చటట్టం అమలు కొరకు ఫెడరల్ ప్రభుత్వం అదనంగా నిధుల మంజూరు చేస్తుంది. అయినప్పటికీ విశ్లేషకులు ఆ నిధుల మంజూరు ప్రణాళికా లోటును భర్తీ చేయలేవని భావించబడుతుంది.
నగర ప్రాంతీయ ప్రభుత్వం ప్రత్యేకంగా మేయరాలిటీ ఆఫ్ మారియన్ బెర్రీ నిర్వహణాలోపం, వ్యర్ధమైన ఖర్చులు గురించి విమర్శించాడు. 1989 ఆయన పాలనా కాలంలో ది వాషింగ్టన్ మంత్లీ మాగజిన్ " అమెరికాలో చాలా అధ్వానమైన ప్రభుత్వం " అని వాషింగ్టన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. బెర్రీ నాలుగవ సారి ప్రభుత్వంలో 1995 లో కాంగ్రెస్ అన్ని ముంసిపాలిటీల ఖర్చుల పర్యవేక్షణ కొరకు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా ఫైనాంషియల్ బోర్డ్ ను నియమించింది. 1998 మేయర్ ఆంతోనీ విలియంస్ ఎన్నికలలో విజయం సాధించి కొంత కాలం వరకు నగర పునర్నిర్మాణం, ప్రణాళిక మిగులు మీద దృష్టిని సారించాడు. 2001 నాటికి ఈ జిల్లా తిరిగి ఆర్థికంకా బలపడింది. వాషింగ్టన్ డి.సి అన్ని ఫెడరల్ శలవు దినాలను ప్రకటిస్తూ జిల్లాలో బానిసత్వం ముగింపు రోజు అయిన ఏప్రిల్ 16 ను విముక్తి దినంగా జరుపుకుంటుంది. 1938 నుండి వాషింగ్టన్ డి.సి జంఢా దినానిని స్వీకరించింది.
ఈ జిల్లా యు.ఎస్ రాష్ట్రం కనుక కాంగ్రెస్ కొరకు ప్రతినిధిని ఎన్నిక చేయకుండా నాన్ - వోటింగ్ ప్రతినిధిని ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కు పంపుతుంది. ప్రస్తుతం ఎలీనర్ హోంస్ నార్టన్ ప్రతినిధిగా బాధ్యత చేపట్టాడు. ఆయన చర్చలలో పాల్గొనడం, చట్టం అమలు వంటి బాధ్యతలను నిర్వహించినా హౌస్ ఫ్లోరుకు ఓటు మాత్రం వెయ్యడు. ఈ జిల్లాకు యునైటెడ్ స్టేట్ సెనేట్ ప్రతినిధి ఉండడు. మిగిలిన యు.ఎస్ యూనియన్ ప్రదేశాలు నాన్-ఓటింగ్ ప్రతినిధులు కలిగిన ప్యూరిటో రికో లేక గ్వాం మాదిరి కాకుండా డి.సి వాసులులకు ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన అన్ని పన్నులు వర్తిస్తాయి. 2011 ఆర్థిక సంవత్సరంలో నగరవాసులు, వ్యాపారులు కలిసి 19.6 బిలియన్ ఫెడరల్ పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. 2011 19 రాష్ట్రాలలో డి.సి వాసులు అత్యధికంగా పన్నులు చెల్లించారు.
2005 ఎన్నికల ఫలితాలు మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే కొలంబియా జిల్లా కాంగ్రెస్ లో ప్రతినిధిత్వం వహిస్తుందని 78% అమెరికన్ ప్రజలు తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రజలను జాగృతం చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఈ విషయమై సేవాసంఘాలు ఉద్యం కూడా చేపట్టాయి. నగర అనధికార లక్ష్యం ఓటు లేని ప్రతినిధిత్వం కలిగి పన్నులు చెల్లించడం, డి.సి పేరిట వాహన అనుమతి పత్రాలు వంటివి చర్చినీయాంశాలు అయ్యాయి. డి.సి ఓటింగ్ హక్కుల కొరకు దేశవ్యాప్తంగా అనుకూల స్పందన లభించింది. వివిధ ఎన్నికలు 82% అమెరికన్లు డి.సి వాసులకు రాజ్యాంగ ప్రతినిధిని ఎన్నిక చేసే అధికారం ఉన్నదని విఅద్వసించారు. కొలంబియా రాజ్యాంగ ప్ర్రభుత్వ ఎన్నిక పరమైన హక్కు కొరకు సాగిన ఉద్యమం విజయమంతం కాలేదు.
డి.సి ఓటింగ్ హక్కును ఎదిరించే వారు రాజ్యాంగ ప్రతినిధులు రాష్ట్రాల నుండి మాత్రమే ఎన్నిక చేయబడాలని తీర్మానించారు. వారు ఒక ప్రత్యేక నగరమైన డి.సికి రాష్ట్ర హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్దమని దేశం అంతటికీ ప్రతినిధిత్వం వహించవలసిన రాజధాని నగరం ఈ హక్కును కల్పించడంతో సమస్యలకు కారణం ఔతుందని భావించారు.
కొలంబియా జిల్లా ప్రభుత్వ పాఠశాలలు (డి.సి.పి.ఎస్) నగరంలోని 123 పాఠశాలలను నిర్వహిస్తుంటారు. 2009 వరకు 39 సంవత్సరాల నుండి డి.సి.పి.ఎస్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 2010-2011 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 46,191 మంది విద్యార్థులకు ప్రవేశార్హత కల్పించారు. దేశంలో తక్కువ నాణ్యత కలిగిన విద్యను అందిస్తున్న మిగిలిన పాఠశాలల కంటే డి.సి పాఠశాలలు పాఠశాలల భవననిర్మాణ నాణ్యతలోను అలాగే విద్యార్థుల సాధన లోనూ ప్రథమ స్థాయిలో ఉన్నాయి. మేయర్ ఆడ్రియన్ ఫెంటీస్ నిర్వహణలో పాఠశాలలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాఠశాలల నిలుపుదల, టీచర్ల మార్పు, ప్రిసిపాల్స్ తీసివేయడం అలాగే ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం వంటి మార్పులు జరిగాయి.
ది డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బోర్డ్ నగరంలో 52 ప్రభుత్వ చార్టర్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సాంస్ఖృతిక ప్రభుత్వ ఫాఠశాలల విధానం, ప్రభుత్వ నిధిసహాయ పాఠశాలలో నియామకం అభివృద్ధి పరచడం వంటివి జరిగాయి. 2010లో డి.సి చార్టర్ స్కూళ్ళలో 32,000 మందిని చేర్చుకున్నారు. ముందటి సంవత్సరం కంటే ఇది 9% అధికం. జిలాలో 92 ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. 2008 ఈ పాఠశాలలు 18,000 మంది విద్యార్థులను చ్చేర్చుకున్నారు. కొలంబియా జిల్లా ప్రభుత్వ గ్రంథాలయం 25 సమీప ప్రాంతాలలో లాండ్ మార్క్, మార్టిన్ లూథర్ కింగ్, జె.ఆర్ మెమోరియల్ వంటి ప్రదేశాలతో సహా గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు.
ప్రైవేట్ యాజమాన్య విశ్వవిద్యాలయాలు వరుసగా అమెరికన్ యూనివర్సిటీ, ది కేథలిక్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా (సి యు ఎ, గల్లాడెట్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ (జి.డబ్ల్యూ), జార్జ్ టౌన్ యూనివర్శిటీ, హావార్డ్ యూనివర్శిటీ, జోంస్ హాప్కింస్ యూనివర్శిటీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ అడ్వాంస్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ ఎ ఐ ఏశ్) మొదలైనవి. ది కార్కొరన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ప్రత్యేక కళా శిక్షణ, ఇతర ఉన్నత విద్యా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇవి దూర, వయోజన విద్యా వసతులు అందజేస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యా వసతులు అందిస్తున్న ప్రభుత్వ కళాశాల ది యూనివర్శిటీ ఆఫ్ ది డిస్టిక్ ఆఫ్ కొలంబియా (యు.డి.సి). మేరీలాండ్ లోని బెథెస్డా వద్ద ఉన్న నేషనల్ ఇంస్టిట్యూట్ అఫ్ హెల్త్ అలాగే వాషింగ్టన్ హాస్పిటల్ సెంటర్ జిల్లాలో వైద్య పరిశోధనా శిక్షణా కేంద్రం జిల్లకు ప్రత్యేక గుర్తింపు సాధించింది. అదనంగా నగరం జార్జ్ టౌన్ లో జార్జ్ వాషింగ్టన్ వద్ద ఉన్న మెడికల్ స్కూల్స్, అసోసియేటెడ్ టీచింగ్ హాస్పిటల్, హావార్డ్ యూనివర్శిటీ ఉన్నాయి.
2010 గణంకాలు వాషింటన్ డి.సి నగర ఉద్యోగులు ఒక సంవత్సరానికి 70 గంటలు కాలం వాహన రద్దీలో తమ కాలాన్ని గడుపుతున్నారని భావిస్తున్నారు. ఈ విషయంలో ఈ నగం అత్యధికంగా వాహన రద్దీ సమస్యలను ఎదుర్కొంటున్న చికాగో నగరాన్ని పోలి ఉంటుంది. 37% వాషింటన్ డి.సి ప్రయాణీకులు ప్రభుత్వ వాహనాలలో తాము పని చేసే ప్రదేశాలకు చేరుకుంటారు. ఈ వాడుకం ఈ నగరాన్ని దేశంలో 2 వ శ్రేణిలో నిలిచేలా చేసింది. అదనంగా 12% ఉద్యోగులు కాలినడకన తాము పని చేసే ప్రదేశాలకు చేరుకుంటారు. 6% ఉద్యోగులు కార్లలో ప్రయాణించి తాము పని చేసే ప్రదేశాలకు చేరుకుంటారు. 3% ఉద్యోగులు బైసైకిల్ ద్వారా తాము పని చేసే ప్రదేశాలకు చేరుకుంటారు. కాలినడకన ఉద్యోగ తాము పని చేసే ప్రదేశాలకు చేరుకునే అధ్యయనాలు ఈ నగరాన్ని నడకకు అనుకూలమైన నగరాలలో 7 వ శ్రేణిలో నిలిపింది. 80% ఉద్యోగులు కారు అవసరం లేని నగర పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నారు.
నగరంలో పార్క్ మార్గాలు, వీధులు, అవెన్యూలు కలిపి 1,500 మైళ్ళ పొడవు ఉంటాయి. 1960 నుండి నగరానికి మధ్యగా ఎటువంటి రహదార్లు నిర్మించబడ లేదు. దేశంలోని ఫ్రధాన రహదారి ఈస్ట్ కోస్ట్ 95 నగరన్ని చుట్టి కాపిటల్ బెల్ట్ వేగా నిర్మించబడింది. ఇంటర్ స్టేట్ 66, ఇంటర్ స్టేట్ 395 రహదార్లు నగరంలో ప్రవేశించగానే తమ గమ్యాని పూర్తి చేస్తాయి.
ది వాషింగ్టన్ మెట్రో పాలిటన్ ఏరియా అధారిటీ వి.ఎం.ఎ.టి.ఎ ది వాషింగ్టన్ మెట్రో, దిసిటీ రాపిడ్ ట్రాంసిస్ట్ సిస్టం అలాగే మెట్రో బసులను నిర్వహిస్తుంది. రెండు వ్యవస్థలు నగరం, పరిసర ప్రాంతాలకు ప్రయాణ వసతులు కలుగజేస్తున్నాయి. ప్రస్తుతం 86 స్టేషన్లను కలిగి ఉండి 106.3 మైళ్ళ పొడవు ఉన్న మెట్రో 1976 మార్చి 27 న ప్రారంభించబడింది. వారానికి ఒక మిలియన్ సర్వీసులను అందిస్తున్న మెట్రో దేశంలో రద్దీలో 2 వ స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ కారిడార్, ఆసెల్ ఎల్స్ ప్రెస్ రైళ్ళ్ సదరన్ టెర్మినల్ కూడా ఇదే. పనిరోజులలో వారానికి మెట్రో బసులలో 400,000 మంది ప్రయాణిస్తుంటారు. దేశంలో ఈ బసు వ్యవస్థ 6 వ స్థానంలో ఉంది. వాణిజ్య, మధ్య ప్రాంతాలను కలుపుతూ నగరం తమ స్వంత డి.సి సర్కులర్ బస్ వ్యవస్థను నర్వహిస్తుంది.
యూనియన్ స్టేషను ఆంట్రక్ ప్రాణీకుల రైళ్ళకు, వాషింగ్టన్ మెట్రో రైళ్ళకు ప్రధాన కేంద్రంగా ఉపకరిస్తుంది. సుమారు ఒక రోజుకు 70,000 ప్రజలు ప్రయాణిస్తున్న యూనియన్ స్టేషను నగరంలో ప్రధాన స్టేషనుగా సేవలు అందిస్తుంది. సంవత్సరానికి 4.6 మిలియన్ ప్రయాణీకులు కలిగి ఉన్న ఆంట్రక్ రైళ్ళకు ఇది రెడవ రద్దీ అయిన స్టేషను. మేరీలాండ్ ఎం ఎ ఆర్ సి, వర్జీనియా వి.ఆర్.సి ప్రయాణీకుల రైళ్ళు, మెట్రో బసుల సర్వీసులు యూనియన్ స్టేషను, రెడ్ వరకు పొడిగించబడ్డాయి. 2011 లో జరిగిన పునరుద్ధరణ వాషింగ్టన్ ఇంటర్ సిటీ బస్ ట్రాంసిస్ట్ కేంద్రంగా మారింది.
నగరంలో మూడు విమానాశ్రయాలు నగరవాసులకు వాయు ప్రయాణ సేవలు అందిస్తున్నాయి. అవి వరుసగా వాషింగ్టన్ డౌన్ టౌన్ లో అర్లింగ్టన్ వద్ద ఉన్న పోటోమాక్ నదీ తీరంలో నిర్మించబడిన రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్ట్, వర్జీనియా, ప్రైమరీ హాండిల్స్ డొమెస్టిక్ ఫైట్స్. నగరానికి 26.3 మైళ్ళ దూరంలో ఉన్న ఫెయిర్ ఫాక్స్, వర్జీనియా లోని ల్యూడౌన్ కౌంటీల మధ్య ఉన్న వాషింగ్టన్ డల్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరానికి ఈశాన్యంలో మేరీలాండ్ లోని అన్నే అరుండేల్ కౌంటీలో ఉన్న 31.7 మైళ్ళ దూరంలో ఉన్న బాల్టిమోర్ - వాషింగ్టన్ ఇంటర్నేషనల్ తర్ గుడ్ మార్షల్ ఎయిర్ పోర్ట్.
2030 నాటికి నగర ప్రయాణీకులు 32% పెరుగుతారని ఊహించి నగరంలో, నగర ప్రాంతాలకు ప్రయాణ వసతులు కల్పించగలిగిన స్టీర్ కార్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆరంభం అయ్యయి. వాషింగ్టన్, డాలస్ విమానాశ్రయం కలుపుతూ అదనంగా మెట్రో మార్గాల నిర్మాణ సనాహాలు ఆరంభం అయాయి. రీజనల్ కాపిటల్ బైక్ షేర్ కార్యక్రమాలకు నగరం ఒక భాగంగా ఉంది. 1,670 బై సైకిల్స్, 175 స్టేషన్లు కలిగిన ఈ వ్యవస్థ 2010 లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం దేశంలో అతిపెద్ద బైక్ షేరింగ్ వ్యవస్థగా భావించబడుతుంది. నగర ప్రణాళికలో భాగంగా ప్రస్తుతానికి 16 కిలోమీటర్ల లైన్ వేయబడింది. ఈ లైన్ ఇంకా పొడిగించే యోచన కూడా ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.