Remove ads
ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో లోహార్‌దాగా జిల్లా (హిందీ:लोहरदग्गा जिला) ఒకటి. జిల్లా కేంద్రంగా లోహార్‌దాగా పట్టణం ఉంది. 1983లో రాంచీ జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. 23°30', 23°40' ఉత్తర అక్షాంశాలు, 84°40', 84°50' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఈ జిల్లా వైశాల్యం 1491చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం ఈ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది..[1] ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం.[2]
లోహార్‌దాగా జిల్లా
लोहरदग्गा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | దక్షిణ ఛోటా నాగ్‌పూర్ |
ముఖ్య పట్టణం | లోహార్‌దాగా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | లోహార్‌దాగా |
• శాసనసభ నియోజకవర్గాలు | 1 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,490.80 కి.మీ2 (575.60 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 4,61,738 |
• జనసాంద్రత | 310/కి.మీ2 (800/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.29 % |
• లింగ నిష్పత్తి | 985 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లాలో ప్రజలు అధికంగా వ్యవసాయం, వన్య ఉతపత్తులు, సమాయానుకూలంగా దేశంలోని ఇతర ప్రదేశాలకు వలస పోవడం మీద ఆధారపడి జీవిస్తుంటారు. 80% ప్రజలు వ్యవసాయం మీద ఆధ్హరపడుతుంటారు. జిల్లాలో వరి ప్రధాన పంటగా ఉంది. చిన్న పాటి వ్యవసాయభూములలో పండిస్తున్న భూమిలో పండించబడుతున్న గోధుమ ఆహారధాన్య కొరతను పూర్తిచేస్తుంది. జిల్లా జెంషెడ్పూర్, కొలకత్తా, రూర్కెలా కూరగాయల మార్కెట్‌తో సంబంధం కలిగి ఉంది. జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ ఉన్నప్పటీకీ రహదారి పక్కన ఉన్న గిరిజనేతర ప్రజలు తగినన్ని కూరగాయలను పండించడం లేదు. గ్రామస్థులు పెంపుడు మేకల జంతువులను, కోడి వంటి పక్షులను పెంచుతూ ఉంటారు. జిల్లాకేంద్రంలో " డైరీ చిల్లింగ్ ఫాం " ఉంది. డైరీ పరిశ్రమలో గిరిజనేత్రరులలో కొంతమంది మాత్రమే పనిచేస్తున్నారు.
జిల్లాలో 32-35% భూభాగంలో అరణ్యాలు ఉన్నాయి. కిస్కో, సెంహలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. జిల్లాప్రజల సరాసరి భూమి 1.65 హెక్టార్లు. సరాసరి వ్యవసాయ భూమి 0.28 హెక్టార్లు. సరాసరి నీటిపారుదల వసతి కలిగిన వ్యవసాయ భూమి 13.4%. (0.8% కాలువలు, 7% బావులు, 2% చెరువులు 3.6% లిఫ్ట్ ఇరిగేషన్, ఇతరాలు)
కొండ ప్రాంతాలు కాక మిగిలిన జిల్లా అంతా రహదార్లతో అనుసంధానించబడి ఉంది. అయినప్పటికీ కొంజి కుగ్రామాలు రోడ్డుమార్గానికి దూరంగా ఉన్నాయి. హజారీబాగ్ జిల్లాలో ఉన్న " పత్రతు థర్మల్ పవర్ స్టేషను" ఈ జిల్లాకంతటికీ విద్యుత్తును అందిస్తుంది. 354 గ్రామాలలో 25 గ్రామాలను గ్రామీణ విద్యుత్ సరఫరా పధకం విద్యుదీకరణ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కొరతగా ఉంది. గ్రామీణ ప్రజలు బావులు, గొట్టపు బావుల ద్వారా మంచినీటిని పొందుతున్నారు.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లోహార్‌దాగా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
జిల్లాలో 7 బ్లాకులు ఉన్నాయి: లోహార్‌దాగా, కురు, భందరా, కైరో, కిస్కొ, పెషర్, సెంహ.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 461,738,[1] |
ఇది దాదాపు. | సురినమే దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 549వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 310 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.67%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 985:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.29%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఆస్ట్రియాటిక్ భాషలలో ఒకటైన అసురి భాషను జిల్లాలో 17,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. [5]
జిల్లాలో 318 ప్రాథమిక పాఠశాలలు, 68 మాధ్యమిక పాఠశాలలు, 20 హైస్కూల్స్, ఒక కాలేజ్ ఉన్నాయి.
జిల్లాలో ఒక జిల్లా హాస్పిటల్, 5 ప్రైమరీ హెల్త్ సబ్ - సెంటర్లు, 10 అడిషనల్ హెల్త్ సెంటర్లు, 73 హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.