Remove ads
ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
రాంచీ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. జార్ఖండ్ రాష్ట్ర రాజధానీ నగరమైన రాంచీ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా 1899 లో ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం, జార్ఖండ్ లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా.[1]
Ranchi | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో రాంచీ జిల్లా ఒకటి.[2] బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (BRGF) నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాలలో ఇది ఒకటి.[2]
సంవత్సరం | జనాభా | ±% |
---|---|---|
1901 | 4,77,249 | — |
1911 | 5,57,488 | +16.8% |
1921 | 5,36,346 | −3.8% |
1931 | 6,29,863 | +17.4% |
1941 | 6,73,376 | +6.9% |
1951 | 7,48,050 | +11.1% |
1961 | 8,94,921 | +19.6% |
1971 | 11,64,661 | +30.1% |
1981 | 14,89,303 | +27.9% |
1991 | 18,27,718 | +22.7% |
2001 | 23,50,245 | +28.6% |
2011 | 29,14,253 | +24.0% |
2011 జనాభా లెక్కల ప్రకారం రాంచీ జిల్లా జనాభా 29,14,253.[3] ఇది జమైకా దేశ జనాభాకు సమానం.[4] అమెరికా లోని అర్కాన్సాస్ రాష్ట్ర జనాభాకు సమానం.[5] జనాభా పరంగా భారతదేశపు జిల్లాల్లో 130 వ స్థానంలో ఉంది.[3] జనసాంద్రత 557/చ.కి.మీ.[3] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 23.9%.[3] రాంచీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు.[3] జిల్లాలో అక్షరాస్యత 77.13%.[3]
రాంచీ జిల్లాలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం జనాభాలో 5.2% కాగా, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 35.8% ఉన్నారు.
2011 భారత జనగణన సమయంలో, జిల్లాలోని 30.23% జనాభా సాద్రి, 28.08% హిందీ, 11.88% కుర్మలి, 8.55% ఉర్దూ, 7.52% కురుఖ్, 4.79% సంతాలి, 4.70% ముండారి, 2.51% బెంగాలీ, 2.17 % భోజ్‌పురి, 1.17% మగహి తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[6]
రాంచీ జిల్లాలో అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి. రాంచీ సగటు అక్షరాస్యత 77.13% (2011 జనాభా లెక్కల ప్రకారం). ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.63%, స్త్రీల అక్షరాస్యత 68.2%. రాంచీలో ఉన్న కొన్ని ప్రముఖ పాఠశాలలు లయోలా కాన్వెంట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జవహర్ విద్యా మందిర్, కైరాలి స్కూల్, సెయింట్‌సేవియర్స్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్, బిషప్ వెస్ట్‌కాట్.
జిల్లాలో ఉన్న కొన్ని ఉన్నత విద్యా సంస్థలు:
రాంచీ జిల్లాలో 18 బ్లాకులున్నాయి.[7] రాంచీ జిల్లాలోని బ్లాకుల జాబితా ఇది:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.