Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలోయావత్మాల్ జిల్లా (హిందీ:) ఒకటి. యావత్మాల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది విదర్భ డివిషన్లో ఉంటుంది. .[1]
యావత్మల్ జిల్లా
यवतमाळ जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | అమరావతి డివిజన్ |
ముఖ్య పట్టణం | యావత్మల్ |
మండలాలు | 1.ఆరని, 2.ఉమర్ ఖేడ్, 3.కలంబ్, 4.en:Pandharkawada/kelapur, 5.en:Ghatanji, 6.en:Zari Jamani, 7.en:Darwha, 8.en:Digras, 9.en:Ner, 10.en:Pusad, 11.en:Babhulgaon, 12.en:Mahagaon, 13.en:Maregaon, 14.యావత్మల్, 15.Ralegaon 16.Wani |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. యావత్మల్-వాషిం లోక్సభ నియోజకవర్గం (shared with వాషిం జిల్లా), 2. హింగోలి లోక్సభ నియోజకవర్గం (shared with Hingoli district), 3. చంద్రపూర్ లోక్సభ నియోజకవర్గం (shared with చంద్రపూర్ జిల్లా). |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 13,584 కి.మీ2 (5,245 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 24,60,482 |
• జనసాంద్రత | 180/కి.మీ2 (470/చ. మై.) |
• Urban | 18.60 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.06% |
• లింగ నిష్పత్తి | 942 |
సగటు వార్షిక వర్షపాతం | 1029 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
యావత్మల్ మిగిలిన బేరర్ భూభాగంతో సహా పురాణ కాల సామ్రాజ్యం విదర్భ రాజ్యంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. మహాభారతంలో విదర్భ ప్రస్తావన ఉంది. అశోకచక్రవర్తి పాలనలో (క్రీ.పూ 272-231) బేరర్ భూభాగం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత సా.శ. 2 వ శతాబ్దంలో ఈ ప్రాంతం శాతవాహనుల పాలనలోకి మారింది, 3-6వశతాబ్ధకాలంలో ఒకతక సామ్రాజ్య పాలలోకి మారింది, తరువాత 6-8 శతాబ్దం వరకు చాళుఖ్యులు పాలించారు, 8-10 శతాబ్దంలో రాష్ట్రకూటులు పాలించారు, 10-12 వరకు పశ్చిమ చాళుఖ్యులు పాలించారు, తరువాత యాదవ సామ్రాజ్య పాలలోకి మారింది.
ముస్లిముల పాలన ఆరంభకాలంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ బేరర్ ఈ భూభాగం మీద 14 వ శతాబ్దంలోవిజయం సాధించాడు. 14వ శతాబ్దం మధ్యకాలం తరువాత ఈ భూభాగం బహమనీ సుల్తానుల పాలనలోకి మారింది. 15శతాబ్దం చివరికి బహమనీ సుల్తానేట్ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 1572లో బేరర్ ప్రాంతం నిజాం షాహ్ సుల్తానేట్లో భాగం అయింది. 1595లో బేరర్ ప్రాంతాన్ని నిజాంషాహి ముగల్ సామ్రాజ్యపరం చేసాడు. 18వ శతాబ్దంలో ముగల్ సామ్రాజ్యం పతనం ఆరంభం మొదలైన తరువాత 1772లో నిజాం సుల్తాన్ అసఫ్ షా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
1596 -1597 బేరర్ " అయిన్-కి- అక్బరీ "లో ఉండేది. అహమ్మద్ నగర్ ఒప్పందం తరువాత ముగల్ చక్రవర్తి ఈ భూభాగాన్ని నిజాంషాహికి ఒప్పంగించారు. తరువాత ఈ ప్రాంతం ఇమాద్ షాహి పాలనలోకి మారింది, తరువాత బహ్మనీపాలకుల ఆధీనంలోకి మారింది. ఇది 16 సంకారాలు (రెవెన్యూ డివిషన్లు) గా విభజించబడింది. యావత్మల్ భూభాభాగం అకబర్ సంకారాలు కలాం, మాహుర్గా ఉండేది. అయినప్పటికీ కొన్ని భవనాలు ప్రస్తుత యావత్మల్ భాగంలో ఉండేవి. యావత్మల్ యాత్-లోహరా పేరుతో పరగణా కేంద్ర,గా మారింది. యవాత అనేపేరు కాలక్రమంలో యాత్ గామారింది. యావత్మల్ పట్టణానికి 3 కి.మీ దూరంలో లోహరా గ్రామం ఉంది. మహల్ (పరగణా -పట్టణం) అనేది కాలక్రమంలో మాల్ అయిందని భావిస్తున్నారు. అక్బర్ పాలనలో ఈ ప్రాంత ఆదాయం 10 లచలకంటే అధికమని భావించబడుతుంది.
1853 ఈ ప్రాంతం బేరర్ ప్రాంతంతో బ్రిటిష్ ఆధీనంలోకి మారింది. తరువాత బేరర్ తూర్పు, పడమరులుగా విభజించబడింది. యావత్మల్ ప్రాంతం తూర్పు బేరర్ ప్రాంత్ంలో ఉండేది. 1864లో యావత్మల్ మరికొన్ని తాలూకాలతో బ్రిటిష్ సామాంతరాజ్యం అయిన నిజాం ఆఫ్ హైదరాబాదు పాలనలో ఉండేది.
యావత్మల్ జిల్లా ఉత్తర సరిహద్దులో అమరావతి జిల్లా, ఈశాన్య సరిహద్దులో వార్ధా జిల్లా, తూర్పు సరిహద్దులో చంద్రాపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాందేడ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో హింగోలి జిల్లా, పశ్చిమ సరిహద్దులో వాశిమ్ జిల్లా ఉన్నాయి.
జిల్లాలో ప్రధానంగా గోధుమ పంట అధికంగా పండించబడుతుంది. జిల్లాలో ప్రవహిస్తున్ననదులలో వార్ధా నది, పెంగంగా నది ప్రధానమైనవి. జిల్లాలో ప్రవహిస్తున్న ఏకైక నది వార్ధా నదిలో కొంతభాగం ప్రయాణం చేయడానికి అనువుగా ఉంది. వార్ధా నదికి ఉపనదులు బెంబ్లా, నిర్గుడా నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఆదన్ నది కూడా ప్రధానమైనదిగా భావించబడుతుంది.
యావత్మల్ జిల్లాలోని పదహారు తాలుకాలు ఉన్నాయి :
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,775,457,[2] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | ఉల్టాహ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 141వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 204 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.9%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 947:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 80.7%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
2001 గణాంకాల అనుసరించి జిల్లాలో హిందువులు 81%, బౌద్ధులు 9%, ముస్లిం 8%.
జిల్లాలో ఇండో -ఆర్యన్ భాషలలో ఒకటైన అంద్ భాష 1,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[4] మరాఠీభాష జిల్లాలో ప్రధానంగా వాడుకలో ఉంది. ఇతరంగా ఉర్దు, హిందీ, తెలి, గుజరాతీ సింధీ, బంజరి, గోండి, కొలమి భాషలు వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయంగా బేరర్ భాష వాచికభాషగా వాడుకలో ఉంది.
జిల్లాలో జొవర్, పత్తి పంటలు పండించబడుతున్నాయి. జిల్లా నుండి పత్తి, టేకు ప్రధానంగా ఎగుమతి చేయబడుతున్నాయి.అదనంగా నిమ్మకాయలు, ఆరంజ్ కాయలు, వుడెన్ ఫర్నీచర్ జిల్లా నుండి ఎగుమతి ఔతున్నాయి.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో యావత్మల్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[5]
జాతీయ రహదారి 7 జిల్లా గుండా పయనిస్తుంది.
1991 గణాంకాలను అనుసరించి జిల్లాలో హిందువులు 81%, అనిమిస్టులు 13%, ముస్లిములు 5% ఉన్నారు. అదనంగా 2568 మంది జైనులు, 209 మంది క్రైస్తవులు ఉన్నారు. అన్ని మతాల ప్రజలు ఐకమత్యంతో జీవిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.