Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ లోని జిల్లాలలో'వార్ధా' జిల్లా (హిందీ:वर्धा जिल्हा) ఒకటి. వార్ధా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,300,774. నగరాలలో వివసిస్తున్న వారి శాతం 26.28%.
వార్థా జిల్లా
वर्धा जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాగపూర్ |
ముఖ్య పట్టణం | వార్ధా |
మండలాలు | 1. Wardha, 2. Deoli, 3. Seloo, 4. Arvi, 5. Ashti, 6. Karanja, 7. Hinganghat, 8. Samudrapur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | వార్థా |
• శాసనసభ నియోజకవర్గాలు | Wardha, Deoli, Arvi, Hinganghat |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,310 కి.మీ2 (2,440 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,00,774 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (530/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 78.37% |
• లింగ నిష్పత్తి | 946.1:1000 (Female:Male) |
ప్రధాన రహదార్లు | NH7 |
సగటు వార్షిక వర్షపాతం | 1062.8 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
వార్ధా చరిత్ర చారిత్రక పూర్వం నాటిది. ఇండియన్ నేచురల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇది సరైన ఆధారం. వార్ధా జిల్లాలోని సింధి రైల్వే స్టేషను వద్ద ఆస్ట్రిక్ ఎగ్- షెల్ కనుగొనబడింది. జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు, ఒకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి ఒకతక సామ్రాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది. వతకా పాలకులు సా.శ. 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సామ్రాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది.
తరువాత వార్ధాను చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, దేవగిరికి చెందిన సెయునా యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, బేరర్‌కు చెందిన ముస్లిం పాలకులు, గోండులు, మరాఠీలు పాలించారు. గోండు పాలకుడు రాజా బులంద్ షాహా, బోంస్లే పాలకుడు రఘూజీ మధ్యయుగంలో పాలించిన పాలకులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 1850 నాటికి వార్ధా (అప్పుడు నాగపూర్‌లో భాగంగా ఉండేది) బ్రిటిష్ పాలకుల వశం అయింది. వారు వార్ధాను సెంట్రల్ ప్రోవింస్‌లో విలీనం చేసారు. సేవాగ్రామానికి వార్ధా సహోదర గ్రామంగా ఉండేది. ఇవి రెండు భారతస్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉండేది. 1934 భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి వార్ధాలోని మాహాత్మాగాంధి ఆశ్రమం కేంద్రంగా ఉంది.
1862లో వార్ధా నాగపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత పాలనా సౌలభ్యం కొరకు ఇది నాగపూర్ జిల్లా నుండి విభజించబడింది. పుల్గావ్ సమీపంలోని కవాథా వార్ధా జిల్లా కేంద్రంగా ఉంది. 1866లో జిల్లా కేంద్రం పాలక్వాడి గ్రామానికి మార్చబడింది. ప్రస్తుతం ఇది వార్ధానగరంలో భాగంగా మారింది. వార్ధా జిల్లాలో ఆచార్య వినోభాభావే జన్మించి నివసించిన పవనార్ గ్రామం ఉంది.
సమీపకాలంలో వార్ధా రైతుల ఆత్మహత్య కారణంగా వార్తలలో ప్రధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల కొరత, పంట సరిగా అందక, కరువు కారణంగా అప్పులు చెల్లించలేక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రధాన వార్తలలో చోటు చేసుకుంది. తరువాత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్ధాను సందర్శించి పరిస్థితి అవగాహన చేదుకుని ఆర్థిక సాయం ప్రకటించాడు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,300,774,[1] |
ఇది దాదాపు. | మొరోషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 377 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 205 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 4.8%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 946:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 87.22%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
'లోక్ సభ సీటు'
'మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు'
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.