Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలోఅమరావతి జిల్లా (మరాఠీ:अमरावती जिल्हा) ఒకటి. అమరావతి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది బీరారు ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు "ఉమరావతి". మహారాష్ట్రులు ఇలానే వ్రాస్తారు. అయితే ఆంగ్లంలో ఎవరో వ్రాసిన పొరపాటు వలన "Amaraoti" లేదా "అమరావతి" అవే పేరు వాడుకలోకి వచ్చింది. ఈ జిల్లా 20°32' నుండి 21°46' ఉత్తర అక్షాంశం 76°37' నుండి 78°27' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 12,235 చ.కి.మీ.
జిల్లా ఉత్తర సరిహద్దులో మధ్యప్రదేశ్ రాస్ట్రానికి చెందిన బేతుల జిల్లా, ఈశాన్య సరిహద్దులో నాగపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో వార్ధా జిల్లా, దక్షిణ సరిహద్దులో యావత్మల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో వాశిమ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో అకోలా జిల్లా, బుల్ఢానా జిల్లాలు ఉన్నాయి.
1853లో నిజాం ఆఫ్ హైదరాబాదు ఒప్పందం తరువాత అమరావతి జిల్లా ప్రాంతం బ్రిటిష్ ఇండియా లోని బేరర్ ప్రొవింస్‌లో భాగంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతం రెండు జిల్లాలుగా విభజించబడింది. ప్రస్తుత అమరావతి జిల్లా ప్రాంతం ఉత్తర బేరర్ జిల్లాలో భాగంగా మారింది. జిల్లా కేద్రంగా బుధానా ఉండేది. పునర్విభజన తరువాత ఈ ప్రాంతం తూర్పు బేరర్ జిల్లాకు మార్చబడింది. అప్పుడి జిల్లా కేంద్రగా అమరావతి ఉండేది. 1864 యావత్మల్ జిల్లా (ఆగ్నేయ బేరర్ జిల్లా తరువాత వన్ జిల్లా) విభజించబడింది. ఆగస్టు మాసంలో ఎలిచ్‌పూర్ జిల్లా విభజించబడింది. 1903లో బేర భూభాగం అంతా 6 జిల్లాలుగా విభజించబడింది. 1905 ఈ ప్రాంతం కొత్తాగా రూపొందించబడిన సెంట్రల్ ప్రొవింస్, బేరర్ లో భాగం అయింది.1956 అమరావతి జిల్లా బాంబే జిల్లాలో భాగంగా మారింది. 1960లో ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగంగా మారింది.[1][2]
జిల్లాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అమరావతి జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
అమరావతి జిల్లాలో మిరపకాయలు అధికంగా పండించబడుతున్నాయి[4] అంజంగొన్, అంచల్పూర్ లలో తమలపాకులు, ఆరజ్, అరటి పండ్లు అధికంగా పండించబడుతున్నాయి. వరుద్, మొర్షి, చంద్పూర్ బజార్, అచల్పూర్ లలో నగపూర్ ఆరంజ్ అఫ్హికంగా పండించబడుతున్నాయి.
జిల్లా తూర్పు సరిహద్దులో వార్ధానది ప్రవహిస్తుంది. జిల్లా తూర్పు భూభాగంలో వార్ధానది వాటర్‌షెడ్ ఉంది. జిల్లా ఆగ్నేయభూభాగంలో పూర్ణానది సంగమిస్తుంది. ఈశాన్యభూభాగంలో తపతి నది సంగమిస్తుంది. జిల్లాలో ప్రవహిస్తున్న ఇతర నదులలో చంద్రభాగా నది, షహనూర్ నది ప్రధానమైనవి.
పూర్ణానది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సప్తపురా పర్వతశ్రేణిలో బేతుల్ జిల్లాలోని భైంస్దేహి వద్ద ఆరంభం ఔతుంది. 50 కి.మీ పొడవున దక్షిణం, ఆగ్నేయంలో ప్రవహించిన తరువాత అమరావతి జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత పూర్ణానది జీల్లాను రెండుభాగాలుగా విడదీస్తూ ఆగ్నేయ దిశ వైపు ప్రయాణిస్తుంది. అల్చాపూర్ తాలూకాలో ప్రవహించి తరువాత అమరావతి, దర్యాపూర్ తాలూకాల మధ్య సరిహాదుగా ప్రవహిస్తుంది. తరువాత పడమర దిశకు తిరిగి జిల్లా సరిహద్దుగా మారి జలగావ్ జిల్లాలోని ముక్తినగర్ వద్ద తపతి నదిలో సంగమిస్తుంది.పూర్ణానది ఎడమ తీరంలో పూర్ణానది ఉపనది పెధి సంగమిస్తుంది. కుడి తీరంలో ఉపనది అర్నా, మరొక చిన్ననది బొధి సంగమిస్తాయి. పూర్ణా నదిలో ప్రవహిస్తున్న చంధ్రభాగా నది జిల్లా నైరుతీ భాగంలో ప్రవహించి పూర్ణానదిలో ప్రవహిస్తుంది. చంధ్రభాగా నదికి భులేశ్వరి నుండి నీరు పుష్కలంగా వచ్చి చేరుతుంది. పశ్చిమ ప్రాంతంలో పూర్ణా నదిలో మరొక ఉపనది బోర్ధి సంగమిస్తుంది. [5]
జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి : అమరావతి, దర్యాపూర్, అంచల్పూర్, మోర్షి, ధర్ని, చందరూర్ జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి :
అచల్పుర్, పరత్వద, అంజంగవన్, చందుర్ రైల్వే, ధమంగఒన్ రైల్వే, అంబద (మొర్షి), దార, వరుద్, మొర్షి, షెందుర్జన ఘాట్, చందుర్బజర్, దర్యపుర్, నంద్‌గావ్, ఖందెష్వర్, బడ్నేర, ధర్ని, తివస, అష్త్గావ్
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,887,826,[8] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[9] |
అమెరికాలోని. | అర్కాంసాస్ నగర జనసంఖ్యకు సమం.[10] |
640 భారతదేశ జిల్లాలలో. | 131 వ స్థానంలో ఉంది.[8] |
1చ.కి.మీ జనసాంద్రత. | 237 .[8] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 10.77%.[8] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 947:1000 [8] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 88.23%.[8] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో భాలే భాష 9000 మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.