Remove ads
తెలంగాణలోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | మేడ్చల్ |
మండలాలు | 15 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 (మల్కాజ్‌గిరి) |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,084 కి.మీ2 (419 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,40,073 |
• జనసాంద్రత | 2,300/కి.మీ2 (5,800/చ. మై.) |
• Urban | 22,30,245 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.49 |
• లింగ నిష్పత్తి | 957 |
Vehicle registration | TS–08 [1] |
ప్రధాన రహదార్లు | 3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు |
Website | అధికారిక జాలస్థలి |
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్‌గిరి, కీసర), 14 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా పరిపాలనా కేంద్రం షామీర్‌పేట్.[3] షామీర్‌పేట్ మండలం, అంతయపల్లి గ్రామంలో నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను 2022 ఆగస్టు 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4]
కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ, బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, దుండిగల్‌లోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్, మైసమ్మగూడలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ, సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, శామీర్‌పేటలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉన్నాయి.
జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
జిల్లాలో మొత్తం 13 పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఉన్నాయి.వాటిలో 10 పురపాలక సంఘాలు కాగా, 3 నగరపాలక సంస్థలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.