ఘటకేసర్ మండలం

తెలంగాణ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

ఘటకేసర్ మండలం

ఘట్‌కేసర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] దీని పరిపాలనా కేంద్రం ఘటకేసర్ పట్టణం

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.4494°N 78.6853°E /, రాష్ట్రం ...
ఘటకేసర్ మండలం
  మండలం  
అక్షాంశరేఖాంశాలు: 17.4494°N 78.6853°E / 17.4494; 78.6853
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండల కేంద్రం ఘటకేసర్
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 122 km² (47.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,88,380
 - పురుషులు 97,329
 - స్త్రీలు 91,051
అక్షరాస్యత (2011)
 - మొత్తం 70.57%
 - పురుషులు 80.25%
 - స్త్రీలు 60.17%
పిన్‌కోడ్ {{{pincode}}}
మూసివేయి
Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 122 చ.కి.మీ. కాగా, జనాభా 74,712. జనాభాలో పురుషులు 39,028 కాగా, స్త్రీల సంఖ్య 35,684. మండలంలో 17,075 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు

  1. ఘటకేసర్

ఘటకేసర్ చౌరస్తాలో సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 09న ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గౌడ్ ఆవిష్కరించారు.[4]

మండల జనాభా

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,88,380 - పురుషులు 97,329 - స్త్రీలు 91,051

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఘటకేసర్
  2. పోచారం
  3. ఇస్మాయిల్‌ఖాన్‌గూడ
  4. పడమటిసాయిగూడ
  5. యమ్నాంపేట్
  6. అన్నోజీగూడ
  7. కచ్వానిసింగారం
  8. ముటవల్లిగూడ
  9. ప్రతాపసింగారం
  10. కొర్రేముల్
  11. కొండాపూర్
  12. ఔషాపూర్
  13. అంకుషాపూర్
  14. మాధారం
  15. ఏదులాబాద్
  16. మర్రిపల్లిగూడ
  17. నారెపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.