నాగారం పురపాలకసంఘం
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ From Wikipedia, the free encyclopedia
నాగారం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] నాగారం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
నాగారం పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17.5100271°N 78.5944718°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి |
మండలం | కీసర |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 17.29 km² (6.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 25,521 |
- పురుషుల సంఖ్య | 13,206 |
- స్త్రీల సంఖ్య | 12,318 |
- గృహాల సంఖ్య | 16,824 |
పిన్ కోడ్ - 500083 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నాగారం, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
నాగారం 17.29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.485°N 78.609°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 25521 మంది కాగా, అందులో 13206 మంది పురుషులు, 12318 మంది మహిళలు ఉన్నారు. 16824 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
Seamless Wikipedia browsing. On steroids.