మాగ్నీషియం
From Wikipedia, the free encyclopedia
Remove ads
మాగ్నీషియం (ఉచ్చారణ: Mæɡni Ziəm) అనేది ఒక క్షారమృత్తిక లోహం. దీని సంకేతం Mg, దీని పరమాణు సంఖ్య 12, సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి ప్రావారములో ఎనిమిదవ విస్తారమైన మూలకం[5], విశ్వంలో గల అన్ని మూలకాలలో తొమ్మిదవది[6].[7] మెగ్నీషియం మొత్తం భూమిలో నాల్గవ సాధారణ మూలకం (దీనితోపాటు ఇనుము, ఆక్సిజన్,, సిలికాన్ ఉంటాయి). ఒక గ్రహ ద్రవ్యరాశిలో 13%, భూప్రావారంలో అధిక భాగంగా ఉంది.
Remove ads
Remove ads
మౌలిక సమాచారం
మాగ్నీషియం ఒక రసాయనీక మూలకం. ఇదిక్షారమృత్తిక లోహాల సమూహంనకు చెందినది. మూలకాల ఆవర్తన పట్టికలో 2 వ సముదాయం (group, S బ్లాకు,3 వ పెరియడుకు చెందిన మూలక లోహం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 12. మాగ్నీషియం యొక్క సంకేతఅక్షరము Mg.
మూలకం ఆవిర్భావం
విశ్వంలో పుష్కలంగా లభించే మూలకాలలో 9వ మూలకం ఇది. ఇది మొదట భారీ పరిమాణంలో ఉన్నవయస్సు పెరుగుతున్న/ వయస్సు ఉడిగిన (aging ) నక్షత్రాలలో ఏర్పడినది. ఒక కార్బను పరమాణు కేంద్రకానికి మూడు హీలియం (పరమాణు) కేంద్రకాలు చేరడం వలన మాగ్నీషియం జనించింది.ఇలాంటి నక్షత్రాలు సూపర్ నోవాగా విస్పోటం చెందినప్పుడు, విశ్వమంతా చెల్లచెదురుగా నక్షత్రములకునడిమి మధ్యస్థభాగం / మార్గములో ( interstellar medium), మూలక పరమాణువులు విసిరి వెయ్యబడినవి.ఇలా విసరివెయ్యబడిన మూలకపరమాణువులు కొత్తగా ఏర్పడిన నక్షత్రాలలో, గ్రహాలలో, కొత్తనక్షత్ర సమూహంలో చేరిపోయింది. అందువలన ఇది భూమిఉపరితలంలో పుష్కలంగా లభ్యమగుచున్నది.
Remove ads
భౌతిక ధర్మాలు
మాగ్నీషియం బుడిద తెలుపులో ఉండును. తేలికైన లోహం.అల్యూమినియం మూలకం సాంద్రతలో ముడువంతుల్లో, రెండు వంతులు ఉండును;మాగ్నీషియం సాంద్రత 1.738 గ్రాములు/సెం.మీ3 (అల్యూమినియం సాంద్రత:2.6). గాలితో నేరుగా సంపర్కం వలన లోహం ఉపరితలం పై ఆక్సైడుపూత వలన, కొద్దిగా మసకబారి, కాంతిహీనమై (tarnish) ఉండును. గదిఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా నీటితో చర్య జరుపును. ఉష్ణోగ్రత పెరిగే కొలది చర్య చురుకుగా జరుగును.మాగ్నీషియం లోహం, స్థూలతగా/లావుగా ఉన్నదాని కంటే పుడి లేదా పలుచని పట్టిరూపంలో ఉన్నప్పుడు చర్యా శీలత అధికంగా ఉండును. ఆమ్లాలతో (హైడ్రోక్లోరిక్ ఆమ్లం) జరిగే రసాయనిక చర్య ఉష్ణవిమోచన చర్య, చర్యా సమయంలోఉష్ణం విడుదల అగును.. మాగ్నీషియం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య వలన మాగ్నీషియం క్లోరైడ్ +హైడ్రోజన్ వాయువు వెలువడును.పూర్వకాలంలో దీని పౌడరును/, పట్టిలను ఎక్కువ ప్రకాశవంటమైన వెలుగుకై పోటోగ్రపిలో ఫ్లాష్ లైట్‌గా వెలిగించే/మండించేవారు. మండుచున్న సమయంలో 3100౦C వరకు ఉష్ణోగ్రతకలిగి ఉంటుంది.
రసాయన ధర్మాలు
మాగ్నీషియం త్వరగా మండే స్వభావమున్న లోహం.ముఖ్యంగా పుడిగా లేదా పలుచని పట్టి/పేలికల రూపంలో ఉన్నప్పుడు. కాని మాగ్నీషియం ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు అంత త్వరగా దహనం చెందడు. కాని ఒకసారి మండటం మొదలైయ్యాక, ఆర్పడం కష్టం.దహన సమయంలో ఇది నైట్రోజన్ (మాగ్నీషియం నైట్రైడ్ ఏర్పడును) కార్బను డై ఆక్సైడ్ (మాగ్నీషియం ఆక్సైడ్ +కార్బన్ ఏర్పడును, నీటితో చర్యను కొనసాగించును.ఈ కారణం వలననే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులలో దీనిని వాడారు. గాలితో మండుతున్నప్పుడు అతినీలలోహిత కిరణయుతమైన, ప్రకాశవంతమైన తెల్లనికాంతిని వెదజల్లును.
థెర్మిట్ వెల్డింగ్ విధానంలో ఉపయోగించు అల్యూమినియం, ను ఐరన్ ఆక్సైడ్‌లను మండించి కరగించుటకై, మొదటగా మండుటకై కావలసిన ఉష్ణోగ్రత అందుంచుటకై మాగ్నీషియం పట్టినిమీశ్రమధాతువులో ఉంచి మండించెదరు.
Remove ads
లభ్యత
భూమిలో అతిసాధారణంగా లభించే నాల్గవ మూలకం మాగ్నీషియం (ఇనుము, ఆక్సిజను,, సిలికాన్ ల తరువాత).భూగ్రహం యొక్క భారంలో 13% వరకు మాగ్నీషియం ఉన్నది, ముఖ్యంగా భూమి ఆవరణలో. అలాగే సోడియం,, క్లోరిన్ తరువాత అత్యధికంగా నీటిలో కరిగిఉన్నమూడో మూలకము. మాగ్నీషియం సహజంగా ఇతర మూలకాలతో కలిసి, +2 ఆక్సిడేసను స్థాయికలిగి లభిస్తుంది.ఇతర మూలకాలతో కాకుండాగా ఈ మూలకాన్నివిడిగా సృష్టించవచ్చు, కాని అది చాలా క్రియాశీలముగా ఉండును.. అందుచే దీనిని ప్రకాశవంతమైన జ్వాలలను ఏర్పరచు పదార్థాలలో కలిపి ఉపయోగించెదరు.
భూఉపరితలం మీద సమృద్ధిగా లభించే మూలకాలలో మాగ్నీషియం 8 వది. ఇది మాగ్నేసైట్, డోలోమైట్,, ఇతర ఖనిజాలలో పెద్దనిల్వలుగా లభించును. ఖనిజజలాలలో కుడా ఉంది. దాదాపు 60 ఖనిజాలలో మాగ్నీషియం ఉనికిని గుర్తించారు. అయితే ఆర్థికపరమైన, వ్యాపారాత్మక ప్రయోజనదృష్టితో చూసిన డోలోమైట్, మాగ్నేసైట్ .బృసైట్, కార్నలైట్, టాల్క్, ఒలివైన్ అనే ఖనిజాలు ముఖ్యమైనవి. మాగ్నీషియం అయాన్ +2 అనునది సముద్ర జలాలో సోడియం తరువాత పుష్కలంగా కనిపించే రెండవ మూలకం
Remove ads
ఉత్పత్తి విధానం
ప్రస్తుతం మాగ్నీషియాన్ని విద్యుద్వివిశ్లేషణ పద్ధతిలో మాగ్నీషియం లవణాల గాఢద్రవణం నుండి ఉత్పత్తి చేస్తున్నారు.మానవుని దేహంలో ఉండే మూలకాలలో, బరువు. రిత్యా అధికంగా లభించే 11 వ మూలకం.ఈ మూలకం యొక్క అయానులు అన్నిరకాల జీవకణలలో అవసరం.
సముద్ర జలం నుండి మాగ్నీషియం
సముద్ర జలానుండి మాగ్నీషియాన్ని ఉత్పత్తిచేయుటకై, కాల్షియం హైడ్రోక్సైడ్ (Ca (OH) 2ను సముద్ర జలానికి కలిపి చర్య జరుగునట్లు చెయ్యడం వలన మాగ్నీషియం హైడ్రోక్సైడ్ (బృనైట్) ఏర్పడును. ఇది నీటిలో కరుగని కారణం చే అవక్షేపముగా ఏర్పడును
MgC2 + Ca (OH) 2 → Mg (OH) 2 + CaCl2
ఇలా వేరుచేసిన మాగ్నీషియం హైడ్రోక్సైడ్ను, హైడ్రోక్లోరిక్ ఆమ్లం చే చర్య నొందించుట వలన మాగ్నీషియం క్లోరైడ్ +నీరు ఏర్పడును.
megnisham is a metal
Remove ads
మూలాలు
యితర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads