భారతదేశంలో స్వయంప్రతిపత్తి గల ప్రాంతాలు From Wikipedia, the free encyclopedia
భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ స్వయంప్రతిపత్త పరిపాలనా విభాగాల ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది, వీటికి ఆయా రాష్ట్రాలలో స్వయంప్రతిపత్తి ఇవ్వబడింది. [1] ఈ స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్ళలో లడఖ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్లో ఒకటి తప్ప మిగతావన్నీ ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. ప్రస్తుతం, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలలో ఆరవ షెడ్యూల్ [2] ప్రకారం 10 స్వయంప్రతిపత్త మండళ్ళు ఏర్పడగా, మిగిలినవి ఇతర చట్టాల ద్వారా ఏర్పడ్డాయి.
భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం, స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా మండళ్ళు కింది అంశాలకు సంబంధించి చట్టాలు, నియమాలు, నిబంధనలను రూపొందించవచ్చు:[1]
5 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించే కేసులు, అది కూడా ఇరు పక్షాలూ షెడ్యూల్డ్ తెగల సభ్యులైతే ఆ కేసులను విచారించడానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారాలు స్వయంప్రతిపత్త జిల్లా మండళ్ళకు ఉన్నాయి.[1]
పాఠశాలలు, రహదారుల నిర్వహణ వగైరాల కోసం భవనాలు, భూమి, జంతువులు, వాహనాలు, పడవలు, ఆ ప్రాంతంలోకి వస్తువుల ప్రవేశం, రోడ్లు, పడవలు, వంతెనలు, ఉపాధి, ఆదాయంపై పన్ను, సాధారణ పన్నులు, రుసుములు, సుంకాలు విధించే అధికారాలు స్వయం ప్రతిపత్త జిల్లా మండళ్ళకు ఉన్నాయి: [1]
భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు అనుగుణంగా ఉన్న స్వయంప్రతిపత్త జిల్లా మండళ్ళను బొద్దుగా చూపించాం
క్ర.సం | రాష్ట్రం | స్వయంప్రతిపత్త మండలి | ముఖ్య కార్యాలయం | ఏర్పాటు | గత ఎన్నికలు | ముఖ్య కార్యనిర్వాహక సభ్యులు | ముఖ్య కార్యనిర్వాహక సభ్యుని పార్టీ | ప్రస్తుత పార్టీల
స్థితి |
---|---|---|---|---|---|---|---|---|
1 | అస్సాం | బోడోలాండ్ ప్రాదేశిక మండలి | కోక్రఝార్ | 2003 | 2020 | Pramod Boro | UPPL(NEDA) | Total-40
Opp:- BPF-12 |
2 | నార్త్ కచార్ హిల్స్ స్వయంప్రతిపత్త మండలి | హాఫ్లాంగ్ | 1951 | 2019 | Debolal Gorlosa | BJP
(NEDA) |
Total-28
Govt:- BJP-25 | |
3 | కార్బి ఆంగ్లాంగ్ స్వయంప్రతిపత్త మండలి | దిఫు | 1952 | 2022 | Tuliram Ronghang | BJP
(NEDA) |
Total-26
Govt:- BJP-26 Opp:- 0 | |
4 | తివా స్వయంప్రతిపత్త మండలి | మోరిగావ్ | 1995 | 2020 | Jiban Chandra Konwar | BJP
(NEDA) |
Total-36
Govt:- BJP-33 AGP-2 Opp:- INC-1 | |
5 | మిసింగ్ స్వయంప్రతిపత్త మండలి | ధేమాజి | 1995 | 2019 | Ranoj Pegu | SGS | Total-35
Govt:- SGS-29 BJP-5 Opp:- IND-1 | |
6 | రభా హసోంగ్ స్వయంప్రతిపత్త మండలి | దుధ్నోల్ | 1995 | 2019 | Tankeswar Rabha | BJP
(NEDA) |
Total-36
Govt:- BJP+RHJMC-34 Opp:- INC-1 AGP-1 | |
7 | సోనొవాల్ కచారి స్వయంప్రతిపత్త మండలి | దిబ్రూగఢ్ | 2005 | 2019 | Dipu ranjan Markari | BJP
(NEDA) |
Total-26
Govt:- BJP-20 Opp:- INC-5 IND-1 | |
8 | తెంగల్ కచారి స్వయంప్రతిపత్త మండలి | టిటాబర్ | 2005 | 2022 | Kumud Ch Kachari | BJP
(NEDA) |
Total-22
Govt:- BJP-14 AGP-3 Opp:- INC-4 IND-1 | |
9 | దేవ్రీ స్వయంప్రతిపత్త మండలి | నారాయణ్‌పూర్ | 2005 | 2022 | Madhav Deori | BJP
(NEDA) |
Total-22
Govt:- BJP-11 AGP-1 Opp:- IND-8 INC-2 | |
10 | మొరాన్ స్వయంప్రతిపత్త మండలి | తిన్సుకియా | 2020 | – | Dipon Moran | |||
11 | Matak స్వయంప్రతిపత్త మండలి | Chring Gaon | 2020 | – | ||||
12 | బోడో కచారి సంక్షేమ స్వయంప్రతిపత్త మండలి | సిమెన్ చపోరి | 2020 | – | Mihiniswar Basumatary | |||
13 | కమ్తాపూర్ స్వయంప్రతిపత్త మండలి | అభయపురి | 2020 | – | Gokul Barman | |||
14 | లడఖ్ | లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, కార్గిల్ | కార్గిల్ | 2003 | 2023 | Mohammad Jaffer Akhone | Jammu & Kashmir National Conference | Total-30
Govt:- Jammu & Kashmir National Conference-10 Indian National Congress-8 Opp:- IND-5 BJP-3 |
15 | లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లేహ్ | లేహ్ | 1995 | 2020 | Tashi Gyalson | Bhartiya Janata Party | Total-30
Govt:- Bhartiya Janata Party-16 Opp:- INC-9 IND-1 | |
16 | మణిపూర్ | చందేల్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | చందేల్ | 1971[4] | 2015 | Ksh. Siddharth, MCS | ||
17 | చురచంద్‌పూర్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | చురచంద్‌పూర్ | 1971[4] | 2015 | Lalthazam, MCS | |||
18 | సదర్ హిల్స్ | కాంగ్పోక్పి | 1971[4] | 2015 | James Doujapao Haokip, MCS | |||
19 | ఉత్తర మణిపూర్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | సేనాపతి | 1971[4] | 2015 | H L Jain, MCS | |||
20 | తమెంగ్లాంగ్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | తమెంగ్లాంగ్ | 1971[4] | 2015 | Ningreingam Leisan[5] | |||
21 | ఉఖ్రుల్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | ఉఖ్రుల్ | 1971[4] | 2015 | David Kashungnao, MCS | |||
22 | మేఘాలయ | గారో హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | తురా | 1973 | 2021 | Benedick R Marak | NPP
(NEDA) |
Total-29
Govt:- National People's Party (India)-11 BJP-2 Garo National Council-1 IND-3 Opp:- AITC-12 |
23 | జైంతియా హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | జోవై | 1973 | 2019 | T Shiwat | National People's Party (India)
(NEDA) |
Total-29
Govt:- NPP-12 UDP-10 Opp:- INC-4 AITC-3 | |
24 | ఖాసీ హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | షిల్లాంగ్ | 1973 | 2019 | Titosstarwell Chyne | National People's Party (India)(NEDA) | Total-29
Govt:- NPP-7 UDP-6 HSPDP-2 PDF-1 Opp:- INC-10 Oth:- AITC-3 | |
25 | మిజోరం | చక్మా స్వయంప్రతిపత్త జిల్లా మండలి | కమలానగర్ | 1972 | 2023 | Rasik Mohan Chakma | MNF | Total-20
Govt:- MNF-12 Opp:- INC-6 BJP-1 |
26 | లాయ్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి | లాంగ్త్లాయ్ | 1972 | 2020 | V. Zirsanga | MNF | Total-25
Govt:- MNF-20 Opp:- IND-3 BJP-1 INC-1 | |
27 | మారా స్వయంప్రతిపత్త జిల్లా మండలి | సియాహా | 1972 | 2022 | M Laikaw | BJP | Total-25
Govt: BJP -16 Opp:- INC - 4 MNF - 5 | |
28 | త్రిపుర | త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్త జిల్లా మండలి | ఖుముల్వింగ్ | 1982 | 2021 | Purna Chandra Jamatia | TIPRA | Total-30
Govt:- TIPRA-18 IND-1 Opp:- BJP-9 |
29 | పశ్చిమ బెంగాల్ | గోర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన | డార్జిలింగ్ | 2012 | 2022 | Anit Thapa | BGPM | Govt:- BGPM-27 AITC-5 IND-3
Opp:- HP-8 IND-2 |
స్ | ||
---|---|---|
పార్టీ | ఇసిఐ గుర్తింపు [6] | |
ఎకెఆర్ఎస్యూ (K) | ఆల్ కోచ్-రాజబంశీ స్టూడెంట్స్ యూనియన్ | ఎన్/ఎ |
ఏఐటీసీ | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ | రాష్ట్ర పార్టీ |
ఏజీపీ | అసోమ్ గణ పరిషత్ | రాష్ట్ర పార్టీ |
బీజేపీ | భారతీయ జనతా పార్టీ | జాతీయ పార్టీ |
బిపిఎఫ్ | బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ | రాష్ట్ర పార్టీ |
జీఎన్సీ | గారో నేషనల్ కౌన్సిల్ | నమోదైన గుర్తింపు లేని పార్టీ |
జీఎస్పీ | గణ సురక్ష పార్టీ | నమోదైన గుర్తింపు లేని పార్టీ |
హెచ్ఎస్పీడీపీ | హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | రాష్ట్ర పార్టీ |
ఐఎన్సి | భారత జాతీయ కాంగ్రెస్ | జాతీయ పార్టీ |
జేకేఎన్సీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | రాష్ట్ర పార్టీ |
కేఏడీఎఫ్ | కర్బి ఆంగ్లాంగ్ డెమోక్రటిక్ ఫోరం | ఎన్/ఎ |
ఎంఎన్ఎఫ్ | మిజో నేషనల్ ఫ్రంట్ | రాష్ట్ర పార్టీ |
ఎన్పీపీ | నేషనల్ పీపుల్స్ పార్టీ | జాతీయ పార్టీ |
పిడిఎఫ్ | పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | రాష్ట్ర పార్టీ |
ఆర్హెచ్జెఎంసి | రాభా హసోంగ్ జాయింట్ మూవ్మెంట్ కమిటీ | ఎన్/ఎ |
ఎస్జీఎస్ | సమ్మిలితా గణ శక్తి | నమోదైన గుర్తింపు లేని పార్టీ |
టిప్రి | స్వదేశీ ప్రగతిశీల ప్రాంతీయ కూటమి | రాష్ట్ర పార్టీ |
యుడిపి | యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ) | రాష్ట్ర పార్టీ |
యుపిపిఎల్ | యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ | రాష్ట్ర పార్టీ |
నార్త్ సెంటినెల్ ద్వీపం కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవుల ద్వీపాల్లో ఉంది. ఇది సెంటినెలీస్ ప్రజలకు నిలయం. వీరు మిగతా ప్రపంచంతో ఇంకా పరిచయమే కాని ప్రజలు. వారు ఇతర వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. ఆధునిక నాగరికత పొడ తాకని జాతి అది.
సెంటినెలీస్ జీవనశైలి లేదా ఆవాసాలతో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని అండమాన్, నికోబార్ ప్రభుత్వం చెప్పింది.[7] 2004 డిసెంబరు సునామీ ప్రభావంతో ద్వీపం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, భారత ప్రభుత్వ హెలికాప్టరు వారిలో చాలా మందిని గమనించి, వారు జీవించే ఉన్నట్లు నిర్ధారించింది. సెంటినెలీస్ ప్రజలు గాలిస్తున్న హెలికాప్టరుపై బాణాలు వేసారు.
అధికారికంగా ఎలాంటి ఒప్పందమూ లేనప్పటికీ, వారి సమాజంతో ఏమాత్రం జోక్యం చేసుకోని అధికారిక విధానం కారణంగా ఈ ద్వీపానికి స్వయంప్రతిపత్తి వచ్చినట్లైంది.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.