భాగ్యచక్రం
From Wikipedia, the free encyclopedia
Remove ads
From Wikipedia, the free encyclopedia
భాగ్యచక్రము కె.వి.రెడ్డి నిర్మాతగా జయంతి పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తెలుగు చలనచిత్రం. నందమూరి తారకరామారావు, బి . సరోజాదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
భాగ్యచక్రం (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జయంతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నరేంద్రపురి ప్రభువు ధర్మపాలుడు (లింగమూర్తి). ఆ రాజ్యంపై ఆశలు పెంచుకున్న పాముల మాంత్రికుడు సిద్దయోగి (రాజనాల) తన చెల్లెలు నాగమ్మ (బాలసరస్వతి)ను మహారాణిని చేయాలనే తలంపుతో రాకుమారిపై సర్ప ప్రయోగంచేసి, ఆ పాప బతకాలంటే తన సోదరిని వివాహం చేసుకోవాలని, మహారాజుకు షరతుపెడతాడు. ఆ విధంగా నాగమ్మ మహారాణి కావటం, రాజనాల, కామకళిక ద్వారా మహారాజును మార్చివేసి, రాకుమారి పాపను, పిండారిలచే చంపించ ప్రయత్నించి, అధికారం చేజిక్కించుకొని స్వామిరాజు పేరుతో పాలన సాగిస్తూ అన్యాయాలు, అక్రమాలు చేస్తుంటాడు. యువరాణి పాపను అడవిలో గజదొంగ గంద్రగోళి (ముక్కామల) కాపాడి పెంచి పెద్దచేస్తాడు. నాగమ్మకు పుట్టిన కుమార్తె యువరాణి చిత్రవతి (గీతాంజలి)గా పెరిగి పెద్దదవుతుంది. ఆమెను ఉదయగిరి యువరాజు విక్రమ్ (యన్.టి.రామారావు)కిచ్చి వివాహం చేయాలని నాగమ్మ, స్వామిరాజు ఆశిస్తారు. విక్రముడు అంతకు మునుపే అడవిలో యువరాణి పాప వనజ (బి.సరోజాదేవి)ను కలుసుకోవటం ఇరువురూ ఒకరినొకరు ప్రేమించుకోవటం జరుగుతుంది. తల్లి (ఋష్యేంద్రమణి) కోరికపై విక్రముడు, స్నేహితుడు మిత్రలాభం (పద్మనాభం)ను యువరాజుగా, తాను మారువేషంలో ఆషాడభూతి పేరుతో నరేంద్రపురి వెళ్ళి, అక్కడ బందీయైన వనజను, మతిచలించిన, మహారాజు రక్షించి, స్వామిరాజాను అంతంచేయటం చిత్రావతికి మిత్రలాభంకు, విక్రమ్‌కు, వనజకు, మహారాజు చేతులమీదుగా వివాహం జరగటంతో చిత్రం ముగుస్తుంది[1].
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆశ నిరాశను చేసితివా, రావా చెలియా రాలేవా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
నీవు లేక నిముషమైనా నిలువజాలనే - నీవే కాదా ప్రేమ నాలో విరియజేసినది | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
వాన కాదు వాన కాదు వరదా రాజా - పూల వాన కురియాలి వరదా రాజా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
కుండకాదు కుండ కాదు చినదానా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
నీతోటి వేగలేను పోపోరా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
అవతారమెత్తి నావా స్వామిరాజా | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది బృందం |
మన స్వామి నామం పాడుడి | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | మాధవపెద్ది, పిఠాపురం |
రాజకుమారి- బల్ సుకుమారి | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పిఠాపురం, స్వర్ణలత |
తాళలేని తాపమాయే సామీ నా సామీ | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు (పద్యం) | పింగళి నాగేంద్రరావు | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.